breaking news
bill
-
దోపిడీకి నిలువుటద్దం!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో శాశ్వత సచివాలయం టవర్లకు అద్దాలను అమర్చే పనులకు ఏకంగా రూ.2,455.22 కోట్ల వ్యయంతో టెండర్లు పిలవడం విస్తుగొలుపుతోంది. కేవలం ఐదు బిల్డింగ్‌ల అద్దాల కోసం ఇంత భారీగా ప్రజా ధనాన్ని వెచ్చిస్తున్నారంటే కేవలం ప్రభుత్వ పెద్దలు దండుకునేందుకేనని స్పష్టమవుతోంది. తొలుత అంచనా వ్యయం రూ.1,901.71 కోట్లు కాగా, దానిని ఏకంగా రూ.2,455.22 కోట్లకు పెంచడం వెనుక ముఖ్య నేత కమీషన్ల బాగోతమేనని ఇంజనీరింగ్ వర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.అంచనా వ్యయంలోనే రూ.553.51 కోట్లు కొట్టేసే స్కెచ్ కనిపిస్తుండగా, మొత్తం వ్యయంలో నుంచి ఇంకెంత నొక్కేస్తారోనని సర్వత్రా చర్చ సాగుతోంది. సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) అధికారులు అందించిన సమాచారం ఆధారంగా జీఎస్టీ వంటి అన్ని పన్నులతో కలిపి అద్దాలు అమర్చే పనులకు చదరపు మీటరుకు రూ.80,892గా ధరను బీవోసీఈ (బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజినీర్స్) ఖరారు చేసింది. ఐదు టవర్లకు 2,35,092.75 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అద్దాలు బిగించాలి.ఈ లెక్కన వాటి అంచనా వ్యయం రూ.1,901.71 కోట్లే. కానీ.. ఆ పనులకు రూ.2,455.22 కోట్ల వ్యయంతో మూడు ప్యాకేజీల కింద ఏజీఐసీఎల్ (అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్) టెండర్లు పిలిచింది. కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థకు పనులు కట్టబెట్టి, పెంచిన అంచనా వ్యయాన్ని కమీషన్‌గా వసూలు చేసుకోవడానికి ముఖ్య నేత ఎత్తు వేశారని ఇంజినీరింగ్ నిపుణులు ఆరోపిస్తున్నారు. 15 నెలల్లో పూర్తి చేయాలని షరతు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో భాగంగా శాశ్వత సచివాలయం పేరుతో ఐదు టవర్ల నిర్మాణ పనులను చంద్రబాబు ప్రభుత్వం చేపట్టింది. డయా గ్రిడ్ విధానంలో 39 అంతస్తులతో నిర్మిస్తున్న నాలుగు టవర్లు.. 49 అంతస్తులతో నిర్మిస్తున్న మరో టవర్‌కు అద్దాలను అమర్చడం (గ్లాస్, క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కాలమ్ క్లాడింగ్, స్కైలైట్), ఫొటో వోల్టాయిక్ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు, బిల్డింగ్ మెయింటెనెన్స్ యూనిట్ (బీఎంయూ)లు ఏర్పాటు చేసే పనులకు ఏజీఐసీఎల్ ద్వారా మూడు ప్యాకేజీల కింద టెండర్లు పిలిచింది.ఈ పనులకు జీఏడీ టవర్‌కు రూ.522.15 కోట్లు (అంచనా వ్యయం రూ.442.06 కోట్లు+రూ.80.09 కోట్లు జీఎస్టీ రీయింబర్స్).. 1, 2 టవర్లకు రూ.1073.82 కోట్లు (అంచనా వ్యయం రూ.909.88 కోట్లు+రూ.163.94 కోట్లు జీఎస్టీ రీయింబర్స్).. 3, 4 టవర్లకు రూ.859.25 కోట్లు (అంచనా వ్యయం రూ.727.45 కోట్లు+ రూ.131.79 కోట్లు జీఎస్టీ రీయింబర్స్) వెరసి రూ.2,455.22 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచింది. బిడ్ల దాఖలుకు ఈనెల 26 తుది గడువు. అదే రోజున సాంకేతిక బిడ్, ఆ తర్వాత ఆరి్థక బిడ్‌ను తెరిచి.. తక్కువ ధరకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన సంస్థకు పనులు అప్పగించనుంది. ఈ పనులను దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ 15 నెలల్లో వాటిని పూర్తి చేసి.. మరో 13 ఏళ్లు వాటిని నిర్వహించాలని ఏజీఐసీఎల్ షరతు విధించింది. ఎస్ఎస్ఆర్ బుట్టదాఖలు ళీ శాశ్వత సచివాలయం ఐదు టవర్లను డయాగ్రిడ్ వి«ధానంలో నిర్మిస్తున్నారు. ఈ టవర్లకు నలువైపులా అద్దాలు అమర్చుతారు. అందులో భాగంగా టవర్లకు గ్లాసింగ్, క్లాడింగ్ (అత్యధిక ఉష్ణోగ్రతను, శబ్ద కాలుష్యాన్ని తట్టుకునే డబుల్–గ్లేజ్డ్ అద్దాలను అమర్చడం).. క్రౌన్, అట్రియం (భవ నాల పైభాగంలో ఉండే శిఖరం నిర్మాణం, విశాలమైన గ్లాస్–రూఫ్ సెంట్రల్ అట్రియమ్)..కానోపి, స్కైలైట్ (ప్రధాన ప్రవేశ ద్వారాల వద్ద టెన్షన్–రాడ్ స్టీల్ కానోపిలు, సహజ వెలుతురు కోసం స్కై లైట్లు).. పీవీ ప్యానెల్స్ (భవనం వెలుపల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తిచేసే పర్యావరణ అనుకూల ఐజీబీసీ ప్లాటినమ్ గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాల ప్యానెళ్లు), బీఎమ్యూ (ఎత్తైన టవర్ల గ్లాస్‌ను శుభ్రం చేయడానికి, నిర్వహించడానికి ఉపయోగించే ఆటోమేటెడ్, రూఫ్–మౌంటెడ్ టెలిస్కోపిక్ క్రేన్ సిస్టమ్స్ ఏర్పాటు) పనులు చేయాలి. ⇒ ఈ పనులకు అంచనా వ్యయం రూపొందించడానికి ఇప్పటిదాకా ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్లు)ను ప్రభుత్వం ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో ఆ పనులకు ఎస్‌ఎస్‌ఆర్‌ను ఖరారు చేయడంలో భాగంగా సీఆర్డీఏ.. ఆ పనులు చేసే అనుభవం ఉన్న సంస్థల నుంచి కొటేషన్లు ఆహా్వనించింది. ముంబైకి చెందిన ఆల్మెక్ ఫెసాడ్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్‌కు చెందిన టీమ్ వర్క్ గ్లా్లస్ అండ్ అల్యూమినియమ్, బెంగళూరుకు చెందిన ఇంటెర్ని ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు సీఆర్డీఏకు కొటేషన్లు ఇచ్చాయి. ⇒ అందులో ఆల్మెక్ ఫెసాడ్ సంస్థ తక్కువ ధరకు కోట్ చేసినట్లు సీఆర్డీఏ పేర్కొంది. శాశ్వత సచివాలయం ఐదు టవర్లకు డిజైన్లు రూపొందించిన ఫోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థే.. చైనాలో షెన్జెన్లోని మర్చంట్స్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ భవనాలను డిజైన్ చేసింది. ఆ భవనాలకు అద్దాలు అమర్చడానికి చేసిన వ్యయాన్ని.. ఆల్మెక్ ఫెసాడ్ కొటేషన్లో పేర్కొన్న ధరను పరిగణలోకి తీసుకుని.. గ్లాసింగ్, క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కానోపి, స్కైలైట్, పీవీ ప్యానెల్స్, బీఎంయూ వంటి పనులకూ జీఎస్టీతో కలిపి చదరపు అడుగుకు సగటున రూ.80,892గా బీవోసీఈ ఖరారు చేసింది. ⇒ ఐదు టవర్లలోనూ అన్ని రకాల అద్దాలు అమర్చే పనుల విస్తీర్ణం 2,35,092.75 చదరపు మీటర్లుగా లెక్కకట్టింది. పనుల అంచనా వ్యయం జీఎస్టీతో కలిపి రూ.1,901.71 కోట్లే.. కానీ రూ.2,455.22 కోట్ల వ్యయంతో ఏజీఐసీఎల్ టెండర్లు పిలిచింది. అంటే అద్దాలు అమర్చేందుకు చ.మీ. ధర రూ.1,04,436.22 కావడం గమనార్హం. అంటే.. బీవోసీఈ ఖరారు చేసిన ఎస్‌ఎస్‌ఆర్‌ను బుట్టదాఖలు చేసినట్లు స్పష్టమవుతోంది. చదరపు అడుగు రూ.20,439.58 ⇒ టవర్ల డిజైన్ల పనులను రూ.401.54 కోట్లకు ఫోస్టర్ పార్టనర్స్–హాఫీజ్ కాంట్రాక్టర్, జెనిసిస్ ప్లానర్స్‌కు అప్పగించారు. తాజాగా అద్దాలు అమర్చే పనులను రూ.2,540 కోట్లతో చేపట్టారు. దాంతో శాశ్వత సచివాలయ టవర్ల నిర్మాణ వ్యయం రూ.9,612.85 కోట్లకు చేరుకుంది. ఇక అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(ఏజీసీ) పేరుతో సచివాలయం టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మిస్తున్న 1,575 ఎకరాల లేఅవుట్లో రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాల పనులను రూ.1,057.62 కోట్లతో చేపట్టింది. దీన్ని కూడా కలుపుకుంటే.. సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయం రూ.10,670.47 కోట్లకు చేరుకుంది. ఈ లెక్కన నిర్మాణ వ్యయం ఇప్పటికే చ.అ. రూ. 20,439.58కు చేరుకున్నట్లు స్పష్టమవుతోంది. ⇒ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహా నగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలు, ఇటాలియన్ మార్బుల్స్‌తో నిర్మాణ వ్యయం చ.అ.కు రూ.4 వేల నుంచి రూ.4,500కు మించడం లేదని నిపుణులు చెబుతున్నారు. అంటే.. శాశ్వత సచివాలయం కాంట్రాక్టు పనుల్లో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయన్నది స్పష్టమవుతోందని ఆరోపిస్తున్నారు. సంప్రదాయ పద్ధతిలో నిర్మించినా.. డయాగ్రిడ్ విధానంలో నిర్మించినా, నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదంటున్నారు. డయాగ్రిడ్ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ వ్యయం తగ్గుతుందని చెబుతున్నారు. అయినా శాశ్వత సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయం నానాటికీ పెరుగుతుండటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జాయింట్ వెంచర్లకు నో.. సబ్ కాంట్రాక్టుకు 50 శాతం ఇచ్చుకోవచ్చట!⇒ సచివాలయం టవర్లకు అద్దాలను అమర్చే పనుల టెండర్లలో బిడ్లు దాఖలు చేసేందుకు ఏజీఐసీఎల్ పెట్టిన నిబంధనలు చూసి ఇంజినీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జాయింట్ వెంచర్లు బిడ్లు దాఖలుకు అర్హతలేదని నిబంధన పెట్టింది. ⇒ కానీ.. టెండర్లో పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ ఏజీఐసీఎల్ చీఫ్ ఇంజినీర్ అనుమతితో 50 శాతం పనులను సబ్ కాంట్రాక్టర్‌కు ఇచ్చుకోవచ్చని వెసులుబాటు కల్పించింది. పరస్పర విరుద్ధమైన ఈ నిబంధనల వెనుక లోగుట్టు ముఖ్యనేతకే ఎరుక. ఎవరు ఎక్కువ కమీషన్ ఇస్తే, వారికి పనులు అప్పగించడానికే ఇలాంటి నిబంధనలు పెట్టారంటూ నిపుణులు ఆరోపిస్తున్నారు. ⇒ జాయింట్ వెంచర్లకు టెండర్లో పాల్గొనేందుకు అర్హత కల్పిస్తే.. ఆ పనులు చేసే అనుభవం ఉన్న రెండు మూడు సంస్థలు కలిసి జట్టుగా ఏర్పడి బిడ్లు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు అధిక సంస్థలు పోటీపడితే.. అంచనా విలువ కంటే తక్కువ ధరకే కోట్ చేస్తూ బిడ్లు దాఖలవుతాయి. అదే జరిగితే తమకు అధికంగా కమీషన్ ఇచ్చేందుకు ముందుకొచ్చిన సంస్థకు ఆ పనులు దక్కే అవకాశం ఉండదు. అందుకే ముఖ్యనేత సూచన మేరకు పరస్పర విరుద్ధమైన నిబంధనలు పెట్టారంటున్నారు. -
కిరణ్ రిజిజు, రాహుల్ మధ్య ముదిరిన వార్
సాక్షి, ఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మధ్య ఎక్స్ వేదికగా మాటల యుద్ధం నడిచింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఆయన రాహుల్‌ను సవాల్ చేశారు. దీనికి రాహుల్ గాంధీ కౌంటర్ ఇస్తూ, మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఇదివరకే కాంగ్రెస్ ఆమోదం తెలిపిందని దాన్ని డీలిమిటేషన్‌తో ఎందుకు అనవసరంగా ముడిపెడుతున్నారని రాహుల్ కౌంటరిచ్చారు.అసలే ఏమైందంటేకిరణ్ రిజిజు తన ఎక్స్ ఖాతాలో మహిళలకు మరింత భావప్రకటన స్వేచ్ఛ ఉండాలని రాహుల్ గాంధీ మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత (LoP) రాహుల్ గాంధీ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది “ఇది కాంగ్రెస్ నుంచి వచ్చిన సానుకూల సందేశంలా కనిపిస్తోంది. మహిళల విషయంలో రాహుల్ గాంధీ ఆలోచనా విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది” అని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ఇవ్వాలని కూడా ఆయన కోరారు.రాహుల్ గాంధీ కౌంటర్కిరణ్ రిజిజు చేసిన ఈ పోస్ట్‌కు రెండు గంటలు కూడా గడవకముందే రాహుల్ గాంధీ నుంచి సమాధానం వచ్చింది. 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు కాంగ్రెస్ మద్దతుతో పార్లమెంట్లో ఆమోదం పొందింది అనే విషయం కేంద్రమంత్రికి గుర్తు చేశారు.“ఈ బిల్లు ఇప్పటికే ఏకగ్రీవంగా, కాంగ్రెస్ పూర్తి మద్దతుతో ఆమోదించబడింది. అయితే మూడు సంవత్సరాలు గడిచినా ఇది ఎందుకు అమలు కాలేదు? ఇప్పుడు దీన్ని డీలిమిటేషన్‌తో ఎందుకు అనవసరంగా ముడిపెట్టాలని మీరు కోరుకుంటున్నారు?” అని ఆయన ప్రశ్నించారు.2023లో ఆమోదమైన చట్టాన్ని ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని కేంద్రాన్ని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.మహిళా కోటా, డీలిమిటేషన్ అంశంమహిళా రిజర్వేషన్ బిల్లు లేదా ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ 2023లో లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదించబడింది. లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల్లో కూడా 33 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్ చేయడం ఈ చట్టం లక్ష్యం. అయితే 2023లో ఆమోదించిన చట్టం అమలును భవిష్యత్తులో నిర్వహించే జనగణనతో ముడిపెట్టింది. దీంతో పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియతో ముడిపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం కారణంగా ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రతిపాదిత డీలిమిటేషన్ ప్రక్రియలో లోక్‌సభ మొత్తం సీట్ల సంఖ్యను ప్రస్తుత 543 నుంచి 850కి పెంచే అవకాశం ఉంది. అందులో 33 శాతం అంటే 273 సీట్లు మహిళలకు రిజర్వ్ చేయబడతాయి.గొడవ ఎందుకు?2011 జనగణన ఆధారంగా జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాల కంటే జనాభా పెరుగుదల ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు అన్యాయంగా ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని ప్రతిపక్ష పార్టీలు వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్‌లో జరిగిన ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఇప్పుడు వర్షాకాల సమావేశాల్లో ఈ చట్టాన్ని ఆమోదింపజేయడానికి ప్రభుత్వం మరోసారి ప్రయత్నిస్తోంది.కాగా ఈ అంశమై కిరణ్ రిజిజు ఆగస్టు 5న రాహుల్ గాంధీతో 50 నిమిషాల పాటు చర్చలు జరిపారు. మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం ఆమోదయోగ్యం కాదని రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి రిజిజుకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 6న కూడా రిజిజు ఫోన్ ద్వారా రాహుల్ గాంధీని సంప్రదించినట్లు సమాచారం. ఈసారి కాంగ్రెస్ ఈ అంశంపై అంతర్గతంగా చర్చించడంతో పాటు, తన ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలతో సైతం చర్చించి, అనంతరం తమ వైఖరిని తెలియజేస్తుందని రాహుల్ చెప్పినట్లు తెలుస్తోంది. -
ఇకనుంచి యూపీఐ చెల్లింపులపై చార్జీలు... సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
-
UPI యూజర్స్ కు బిగ్ షాక్..? ఇక బాదుడే బాదుడు
-
కీచక పాలనలో కీలక బిల్లు డ్రాప్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళల భద్రత తమకు ఏమాత్రం పట్టదని చంద్రబాబు ప్రభుత్వం నిరూపించుకుంది. మహిళల భద్రత కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన చరిత్రాత్మకమైన ‘దిశ’ బిల్లును ఉపసంహరించుకోవడం ద్వారా చంద్రబాబు సర్కారు తన నైజాన్ని బయటపెట్టుకుంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు, వేధింపులు పెచ్చుమీరిపోయాయి.చంద్రబాబు కూటమిలో చిన్న కార్యకర్త నుంచి పెద్ద నేతల వరకు అనేక మంది మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారు. నిత్యం అనేక మంది కూటమి కీచకుల బారిన పడుతున్నా ప్రభుత్వానికి పట్టడంలేదు. చివరకు ఓ ఎన్నారై మహిళను చంద్రబాబు కేబినెట్లోని మంత్రే వేధించారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల భద్రత కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన దిశ బిల్లును చట్టంగా మార్పించాల్సింది పోయి.. చంద్రబాబు ప్రభుత్వం దానిని ఉపసంహరించుకోవడంపై రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు. మహిళల భద్రత కోసం వైఎస్ జగన్ విప్లవాత్మక చర్యలు రాష్ట్రంలోని మహిళల భద్రత కోసం దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చేయని రీతిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా ‘ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు’ను తెచ్చారు. మహిళలకు ఇది ప్రత్యేక రక్షణ కవచంలా నిలిచింది. ఇందులో భాగంగా ఆపదలో ఉన్న మహిళలు, బాలికల రక్షణ కోసం దిశ యాప్‌ను రూపొందించారు. ఫోన్లో దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ప్రమాదంలో ఉన్నప్పుడు ఫోన్‌ను అటూ ఇటూ ఊపితే చాలు.. ఎస్‌వోఎస్ ద్వారా పోలీస్ స్టేషన్‌కు సమాచారం వెళ్లి 15 నుంచి 20 నిమిషాల్లోగా పోలీసులు బాధిత మహిళ ఉన్న ప్రదేశానికి వెళ్లి ఆమెను రక్షించే వారు. దిశ యాప్‌ను 1.5 కోట్ల మంది వారి ఫోన్లలో డౌన్లోడ్ చేసుకున్నారు. దిశ యాప్, ఎస్ఓఎస్ కాల్స్ ఆధారంగా భారీగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మహిళలపై వేధింపులు, గృహ హింస, అత్యాచారం, పోక్సో, కిడ్నాప్, ఈవ్‌టీజింగ్, హత్యాయత్నం వంటి కేసులు ఇందులో ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నుంచి నేరస్తుడి అరెస్టు, ఫోరెన్సిక్ నివేదిక, చార్జిïÙట్ నుంచి ప్రత్యేక కోర్టులో శిక్ష వరకు నిరంతర పర్యవేక్షణ వ్యవస్థతో నిరి్మంచిన సమగ్ర మహిళా భద్రతా వ్యవస్థ దిశ బిల్లు. మహిళలకు ప్రమాదకరంగా గుర్తించిన ప్రాంతాల్లో 24 గంటలూ పెట్రోలింగ్ కోసం 900 ద్విచక్ర వాహనాలు, 163 నాలుగు చక్రాల వాహనాలను అందించారు. 19 మంది ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించారు. 12 ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు. పోక్సో కేసుల కోసం మరో 13 ప్రత్యేక కోర్టులను గుర్తించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్లను నియమించారు. ఈ చర్యలతో మహిళలపై నేరాల దర్యాప్తు సమయం కూడా 156 రోజుల నుంచి 28 రోజులకు తగ్గించారు. 2017లో మహిళలపై నేరాల దర్యాప్తు పూర్తి చేయడానికి సగటున 156 రోజులు పట్టేది. 2021 నాటికి ఇది 67 రోజులకు, 2022లో 28 రోజులకు తగ్గింది. అత్యాచారం, పోక్సో కేసుల్లో 60 రోజుల్లో పూర్తి చేసిన దర్యాప్తులు 2019లో 14.15 శాతం కాగా, ఇది 2020లో 41.7 శాతం, 2021లో 92.21 శాతం, 2022లో 95.18 శాతానికి పెరిగాయి. లైంగిక నేరాల దర్యాప్తులో దేశ సగటు 40 శాతం కాగా ఏపీ 92.21 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. 2019–2022 మధ్య నమోదైన అత్యాచారం – హత్య కేసుల్లో 60 శాతం నిందితులను 48 గంటల్లోనే అరెస్టు చేశారు. గతంలో ఇలాంటి కేసుల్లో అరెస్టుకు సగటున 43 రోజులు పట్టగా, దిశ కాలంలో 8 రోజులకు తగ్గింది. త్వరగా అరెస్టు చేయడం ద్వారా నిందితులు తప్పించుకునే అవకాశాన్ని తగ్గించారు. దేశానికే దిశా నిర్దేశం చేసేలా జగన్ తెచ్చిన ఈ విప్లవాత్మక బిల్లుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. 19 అవార్డులు కూడా లభించాయి. 2024లో చంద్రబాబు సర్కారు రాగానే మహిళల భద్రతను ప్రశ్నార్ధకం చేసింది. దిశ బిలు్లకు కేంద్రం ఆమోదం రాలేదనే సాకుతో దిశ యాప్, పోలీస్ స్టేషన్లు, హెల్ప్‌డెస్‌్క, ఫోరెన్సిక్ వ్యవస్థ, ప్రత్యేక కోర్టులు, పెట్రోలింగ్, దర్యాప్తు పర్యవేక్షణ వంటి మొత్తం వ్యవస్థకు పాతరేసింది. రమ్య హత్య కేసులో మరణ శిక్ష దిశ వ్యవస్థ ఎంత వేగంగా పనిచేస్తుందో గుంటూరులో జరిగిన రమ్య హత్య కేసు ఓ ఉదాహరణ. ఈ కేసులో నిందితుడిని 48 గంటల్లో అరెస్టు చేసి, 7 రోజుల్లో చార్జిïÙట్ దాఖలు చేశారు. విచారణను వేగంగా పూర్తి చేయడంతో నిందితుడికి మరణశిక్ష పడింది. 2019 డిసెంబర్ నుంచి 2022 ఏప్రిల్ వరకు 214 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి. వీటిలో ముగ్గురికి మరణించే వరకు జీవిత ఖైదు, 19 మందికి జీవిత ఖైదు, పలువురికి 20 ఏళ్లు, 10 ఏళ్లు తదితర శిక్షలు విధించారు. ‘దిశ’ ఉపసంహరణతో మహిళల భద్రత ప్రశ్నార్థకంమాజీ మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఆర్కే రోజా సాక్షి, అమరావతి: ‘దిశ’ ఉపసంహరణ మహిళా భద్రతకు బ్లాక్ డే అని, వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం దిశను రద్దు చేయడంతో మహిళల భద్రత ప్రశ్న్రా్థకంగా మారిందని మాజీ మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఆర్కే రోజాలు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు గురువారం వారు వేర్వేరు ప్రకటనల్లో చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ తప్పుడు నిర్ణయంతో మహిళలపై దారుణాలకు ప్రభుత్వమే వత్తాసు పలికినట్లయిందన్నారు. కేవలం జగన్ చేసిన మంచి పని మిగిలి ఉండకూడదనే దురుద్దేశంతోనే దిశను రద్దు చేసిందన్నారు. వెంటనే వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రులు డిమాండ్ చేశారు. మహిళల భద్రతను సమాధి చేసే చీకటి నిర్ణయం ‘దిశ’ను తొలగించడం అంటే కేవలం ఒక బిల్లును ఉపసంహరించడం కాదు చంద్రబాబు గారూ.. మీరు ఇచ్చిన మహిళలకు భద్రత, చిన్నారులకు రక్షణ, బాధితులకు త్వరిత న్యాయం అనే హామీని వెనక్కి తీసుకున్నట్టే. మహిళల భద్రతను సమాధి చేసే ఈ చీకటి నిర్ణయమిది. తక్షణమే మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. – పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఉపముఖ్యమంత్రి దిశ వ్యవస్థ వల్ల మహిళలకు జరిగిన నష్టం ఏమిటో చంద్రబాబు చెప్పాలి దిశ వ్యవస్థ వల్ల మహిళలకు జరిగిన నష్టం ఏమిటో ఒక్క ఉదాహరణ అయినా చెప్పగలరా చంద్రబాబూ? నష్టం లేకపోతే మహిళలకు అదనపు రక్షణ కల్పించే వ్యవస్థను ఎందుకు ఉపసంహరించుకుంటున్నారు? మహిళలు, చిన్నారులపై అత్యంత తీవ్రమైన నేరాల్లో 21 రోజుల్లో దర్యాప్తు ప్రక్రియ పూర్తిచేయాలన్న లక్ష్యం తప్పా? మహిళ చేతిలోని భద్రత ఆయుధాన్ని నిరీ్వర్యం చేస్తున్న మీరు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. – మాజీ మంత్రి విడదల రజినిమహిళల భద్రతకు పెను విఘాతమే మహిళలు, చిన్నారులకు దిశ రూపంలో ఉన్న రక్షణ కవచాన్ని చంద్రబాబు ప్రభుత్వం తొలగించడం దుర్మార్గం. కేబినెట్ తీసుకున్న ఈ చీకటి నిర్ణయం మహిళల భద్రతకు పెను విఘాతమే. – జి. తనూజా రాణి, ఎంపీ చంద్రబాబు క్షమాపణ చెప్పాలి ఒక మహిళా హోం మంత్రిగా అనిత దిశ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సింది పోయి, దాన్ని తొలగించే నిర్ణయాన్ని సమర్థించడం దురదృష్టకరం. మహిళల నమ్మకాన్ని దెబ్బ తీసిన హోం మంత్రి అనిత వెంటనే రాజీనామా చేయాలి. మహిళల భద్రతను రాజకీయాలకు బలి చేసినందుకు చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. – కాకాణి పూజిత, వైఎస్సార్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రక్షణ కవచాన్ని తొలగించడం దుర్మార్గంమహిళలకు రక్షణ కల్పించాల్సిన కేబినెట్ వారి రక్షణ కవచాన్ని తొలగించడం దుర్మార్గం. మహిళల భద్రత కోసం దేశంలోని ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచిన ‘దిశ‘ మోడల్‌ను ఏపీ ప్రభుత్వమే తొలగించడం సిగ్గుచేటు. – చింతా అనూరాధ, మాజీ ఎంపీ మహిళల విశ్వాసానికి పాతర వైఎస్ జగన్ మహిళల రక్షణ కోసం దిశ వ్యవస్థను నిర్మించారు. ఆ వ్యవస్థనే వెనక్కి తీసుకెళ్లడం చంద్రబాబుకు మహిళల భద్ర పట్టదనడానికి నిదర్శనం. మహిళల విశ్వాసాన్ని కేబినెట్ నిర్ణయంతో తుడిచి పెట్టేస్తున్న చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. – వరదు కల్యాణి, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు -
యాంటీ పేపర్ లీక్ బిల్లు.. రాష్ట్రపతి ఆమోదం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటి పేపర్ లీక్ బిల్లు చట్టంగా మారింది. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ పాస్ అయిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపింది. దీంతో యాంటి పేపర్ లీక్ చట్టంగా మారింది. తాజాగా రాష్ట్రపతి ఆమోదంతో కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.ఇటీవల దేశంలో ‘నీట్’ (NEET) వంటి ప్రధాన పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీల నేపథ్యంలో పరీక్షా వ్యవస్థపై ప్రజల్లో, విద్యార్థుల్లో నమ్మకాన్ని పెంచేందుకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ప్రశ్నపత్రాల లీకేజీలు, మోసపూరిత చర్యలకు పాల్పడే దోషులకు కనీసం 5 ఏళ్ల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.రూ. 10 కోట్ల వరకు జరిమానా: వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే అక్రమార్కులకు రూ. 10 కోట్ల వరకు భారీ జరిమానా విధించేలా నిబంధనలు చేర్చారు. అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే సదరు నిందితులు లేదా సంస్థల ఆస్తులను జప్తు చేసే అధికారం కూడా ఈ బిల్లు కల్పిస్తుంది.పరీక్షలు నిర్వహించే ఏజెన్సీలు తప్పు చేస్తే రూ.5 కోట్ల వరకు జరిమానా విధించడంతో పాటు, ఆయా సంస్థలను 8 ఏళ్ల పాటు బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు.పేపర్ లీక్ కేసులను వేగంగా తేల్చడానికి ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తారు. కేసు దర్యాప్తును 2 నెలల్లోగా (60 రోజులు) పూర్తి చేయాలి. చార్జ్‌షీట్ దాఖలు చేసిన 3 నెలల లోపే కోర్టులు తీర్పును వెలువరించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా జరిగే ఇటువంటి పరీక్షల మోసాలను విచారించడానికి కేంద్రం ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను రంగంలోకి దించుతుంది. ఈ చట్టం దేశంలోని అన్ని ప్రధాన కేంద్ర నియామక, ప్రవేశ పరీక్షలకు వర్తిస్తుంది. ఈ కొత్త బిల్లులో దాదాపు 15 రకాల చట్టవిరుద్ధమైన చర్యలను నేరాలుగా గుర్తించారు.క్వశ్చన్ పేపర్లు లేదా ఆన్సర్ కీ లీక్ చేయడం.ఓఎంఆర్ షీట్లను ట్యాంపరింగ్ చేయడం.నకిలీ అడ్మిట్ కార్డులు సృష్టించడం లేదా ఫేక్ వెబ్సైట్లు నడపడం.ఒకరి బదులు మరొకరు పరీక్ష రాయడం కంప్యూటర్ నెట్‌వర్క్‌లను హ్యాక్ చేయడం వంటి అంశాలునన్నాయి. -
వందేమాతరంపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: పార్లమెంటులో ఇటీవల ఆమోదం పొందిన వందేమాతరం బిల్లుపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వందేమాతరాన్ని జాతీయగీతంగా ప్రకటించే అంశంలో అప్పటి రాష్ట్రపతి ఒక పెద్ద తప్పు చేశారని తాను భావిస్తున్నట్లు తెలిపారు. వందేమాతరం దేవదేవతల ఆరాధనతో ముడిపడి ఉంటుందని. ఆయన ఎలాంటి అధికారిక తీర్మానం లేకుండానే దానిని 'జాతీయ గీతం'గా ప్రకటించారాని దాని కోసం ఒక తీర్మానం చేయాల్సిందన్నారు.వందేమాతరానికి చట్టపరమైన రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన 'ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ (అమెండ్మెంట్) బిల్లు, 2026' ఇటీవలే ఉభయసభల్లో ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఈ బిల్లు చట్టరూపం దాల్చనుంది. వందేమాతరం ఆలపించకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, లేదా దాని గానానికి భంగం కలిగించడం, లేదా అవమానించడం వంటి చర్యలను క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. అయితే తాజాగా ఈ బిల్లుపై అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు వ్యక్తం చేశారు.అసదుద్దీన్ మాట్లాడుతూ "మీరు 'జన గణ మన' పాడినప్పుడు, దానిలో మీకు ఏమి కనిపిస్తుంది? మీకు ఈ దేశం, దాని ప్రజలు కనిపిస్తారు. మీరు 'వందేమాతరం' పాడినప్పుడు, అది దేవదేవతల ఆరాధనతో ముడిపడి ఉంటుంది. ఇప్పుడు, దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన ఆ 'ముజాహిదీన్-ఎ-ఆజాదీ' (స్వాతంత్ర్య సమరయోధుల) గురించి మీరేం చెబుతారు? 'జన గణ మన' ప్రజల కోసం వ్రాయబడింది. 1950లో రాజేంద్ర ప్రసాద్ ఒక పెద్ద తప్పు చేశారని నేను నమ్ముతున్నాను. ఆయన ఎలాంటి అధికారిక తీర్మానం లేకుండానే దానిని 'జాతీయ గీతం'గా ప్రకటించారు, కానీ దాని కోసం ఒక తీర్మానం ఆమోదించి ఉండాల్సింది. 'జాతీయ గీతం' నిర్వచనం ఎక్కడా ఇవ్వబడలేదు. (కేంద్ర ప్రభుత్వం) రాజ్యాంగంలోని 25, 26, 29 అధికరణలను ఉల్లంఘిస్తున్నారు." అని అన్నారు. -
ట్రంప్‌కు షాకిచ్చిన డెమెుక్రాట్స్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు వెంటే చాలు మెుదటగా గుర్తుకొచ్చేది వలసదారులపై ఆయన చేసే ఆగడాలే.. ఎంతో కాలంగా అమెరికా అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న వారిని ఏదో నెపంతో దేశం నుంచి గెంటేయాలని వలసదారులను ఇబ్బంది పెట్టేలా ఎన్నో కఠిన చట్టాలు ప్రవేశ పెట్టారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌కు ఝలక్ ఇచ్చేలా (H-1B) వీసాదారులకు సులభంగా గ్రీన్ కార్డ్ లభించేలా డెమొక్రాటిక్ సెనేటర్ అలెక్స్ పడిల్లా ఈ సరికొత్త బిల్లును ప్రవేశపెట్టారు.ఈ నూతన బిల్లు ప్రకారం "ది రెన్యూయింగ్ ఇమ్మిగ్రేషన్ ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇమ్మిగ్రేషన్ యాక్ట్ ఆఫ్ 1929" దీని ప్రకారం.. అమెరికాలో కనీసం ఏడేళ్లపాటు నిరంతరం నివసిస్తున్న వలసదారులు శాశ్వత నివాస హోదా (లాఫుల్ పర్మనెంట్ రెసిడెంట్ స్టేటస్) కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది.1986 తర్వాత ఇప్పటివరకు ఎటువంటి మార్పులు చేయని వలస చట్టాన్ని ఈ ప్రతిపాదన ఆధునీకరిస్తుందని, దీనివల్ల 8 మిలియన్ల మందికి పైగా ప్రయోజనం చేకూరుతుందని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా సెనేటర్ అలెక్స్ మాట్లాడుతూ "కష్టపడి పనిచేసే వలసదారులపై ట్రంప్ యంత్రాంగం అనుసరిస్తున్న క్రూరమైన విధానాలను తిప్పికొట్టడానికి నేను ఒక సంవత్సరం క్రితం ఈ బిల్లును ప్రవేశపెట్టాను. అప్పటి నుంచి అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న భయానక విధానాలు మరింత పెరిగాయి. ఈ దేశంలో తమ జీవితాలను నిర్మించుకున్నప్పటికీ కుటుంబాలు నిరంతరం అనిశ్చితిలోనే జీవిస్తున్నాయి. ప్రతిరోజూ మన ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి తోడ్పడుతున్న మిలియన్ల కొద్దీ దీర్ఘకాలిక నివాసితులను కాంగ్రెస్ విస్మరించకూడదు. మన వలస చట్టాలను ఆధునీకరించి, చట్టబద్ధమైన శాశ్వత నివాసానికి సరైన మార్గాన్ని సృష్టించాల్సిన సమయం ఆసన్నమైంది."అని అన్నారు.భారతీయ నిపుణులకు ప్రయోజనంభారతీయ నిపుణులు హెచ్-1బీ వీసాదారుల్లో పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ పరిమితుల కారణంగా వీరు శాశ్వత నివాసం కోసం చాలా కాలం పాటు నిరీక్షించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రతిపాదన భారతీయులకు చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.చట్ట రూపం దాల్చడం కష్టమే?అయితే ఈ బిల్లు చట్టం రూపం దాల్చడం దాదాపు అసాధ్యం ఎందుకంటే ఈ బిల్లు అక్కడి సెనేట్, ప్రతినిధుల సభ రెండింటిలోనూ ఆమోదం పొందాలి. అనంతరం ఆబిల్లు చివరకు అమెరికా అధ్యక్షుడి వద్దకు వెళ్తుంది. అధ్యక్షుడు దానిపై సంతకం చేస్తే అది అధికారిక చట్టం (Law) అవుతుంది. అయితే, రిపబ్లిక్ సభ్యులు దీనికి వ్యతిరేకంగా పనిచేస్తున్నందున ప్రస్తుతానికి ఈ బిల్లు ఆమోదం పొందడం ఎంతమాత్రం సాధ్యం కాదనే చెప్పుకోవచ్చు. -
ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో నేడు (మంగళవారం) ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్షాల ఆందోళనల మధ్య మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చకు సహకరించాలని లోక్‌సభ స్పీకర్ కోరగా, విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌పై చర్చకు విపక్షాలు పట్టుపట్టాయి. ఇదే పరిస్థితి రాజ్యసభలోనూ తలెత్తడంతో ఉభయ సభలు వాయిదా పడ్దాయి. కాగా పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలను అరికట్టేందుకు ఉద్దేశించిన ‘పబ్లిక్ పరీక్షల (అక్రమాల నిరోధక) సవరణ బిల్లు, 2026’ను లోక్‌సభలో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు చర్చించి ఆమోదించనున్నారు. మరోవైపు రాజ్యసభలో ‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి (సవరణ) బిల్లు, 2026’ను ప్రవేశపెట్టనుండగా, ‘జాతీయ గౌరవానికి భంగం వాటిల్లకుండా నిరోధించే (సవరణ) బిల్లు, 2026’ను ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నారు.లోక్‌సభ జాబితా ప్రకారం.. దేశవ్యాప్తంగా కలకలం రేపిన పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాలను కఠినంగా శిక్షించేందుకు 2024 చట్టాన్ని మరింత బలోపేతం చేసే ఈ సవరణ బిల్లును సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సభలో ప్రవేశపెట్టి ఆమోదం కోరనున్నారు. ఈ దిగువ సభలో ప్రశ్నోత్తరాల సమయం తర్వాత, కేంద్ర మంత్రులు పత్రాలను సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ స్టాండింగ్ కమిటీ నివేదికల సమర్పణ, పార్లమెంటరీ కమిటీ సిఫారసుల అమలుపై ప్రకటనలు ఉంటాయి. గౌహతి ఎయిమ్స్ పాలకమండలికి లోక్‌సభ సభ్యుడి ఎన్నిక కోసం తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టనున్నారు.మరోవైపు రాజ్యసభలో.. 2006 నాటి ఎంఎస్ఎంఈ అభివృద్ధి చట్టాన్ని సవరించేందుకు ఉద్దేశించిన ‘ఎంఎస్ఎంఈ అభివృద్ధి (సవరణ) బిల్లు, 2026’ను కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ ప్రవేశపెట్టనున్నారు. అలాగే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘జాతీయ గౌరవానికి భంగం వాటిల్లకుండా నిరోధించే (సవరణ) బిల్లు, 2026’ను పరిశీలన, ఆమోదం కోసం సభ ముందుకు తీసుకురానున్నారు. -
‘ఒక్క పెళ్లి చేసుకున్న వారే రాష్ట్రంలో ఉంటారు’
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నివసించాలంటే కేవలం ఒక్క వివాహం మాత్రమే చేసుకుని ఉండాలన్నారు. ఈ మేరకు త్వరలో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ అమలులోకి తెచ్చే యత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పౌరులందరికీ ఒకే రకమైన చట్టం ఉండేలా చేయడమే దీని ఉద్దేశమని పేర్కొన్నారు.రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) బిల్లును ప్రవేశపెడుతుందని, "ఒకే వివాహం చేసుకున్న వారికి మాత్రమే రాష్ట్రంలో నివసించే చట్టపరమైన హక్కు ఉంటుంది" అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నొక్కి చెప్పారు.కట్నీ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో మోహన్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే అధిపతి, ఒకే జెండా ఉండాల్సినప్పుడు, హిందువులకు, ముస్లింలకు వేర్వేరు చట్టాలు ఎందుకు ఉండాలి? అందరికీ ఒకే చట్టం ఉండాలి. రామ్‌కు ఒకే వివాహం చేసుకునే అవకాశం ఉన్నప్పుడు, రహీమ్‌కు రెండు, మూడు లేదా నాలుగు వివాహాలు ఎందుకు ఉండాలి? మన ముస్లిం సోదరీమణులు కూడా మన సోదరీమణులే. ప్రతిపాదిత ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) ప్రకారం, ఒకే వివాహం చేసుకున్న వ్యక్తికి మాత్రమే మధ్యప్రదేశ్‌లో నివసించే చట్టపరమైన హక్కు ఉంటుంది," అని తేల్చిచెప్పారు.రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) బిల్లును ప్రవేశపెడుతుందని ఆ ప్రాతిపాదిత చట్టం ఏకరీతి న్యాయ వ్యవస్థను అందిస్తుందని, తక్షణ ట్రిపుల్ తలాక్ యుగం ముగిసిందని పేర్కొన్నారు.కాగా భారతదేశంలో యూసీసీని చట్టబద్ధం చేసి, విజయవంతంగా అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. 2024 లోనే అసెంబ్లీలో బిల్లు పాస్ అవ్వగా, 2025 జనవరి 27 నుండి ఈ చట్టం అధికారికంగా అమలులోకి వచ్చింది. వివాహాలు, విడాకులు, ఆస్తి హక్కులు, సహజీవనం వంటి అంశాలపై ఇక్కడ అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. -
హెర్నియా ఆపరేషన్‌కి రూ. 11 లక్షలా? నెటిజన్లు గగ్గోలు
సాక్షి,ముంబై: ఇప్పటిదాకామనం అమెరికా వైద్య ఖర్చులు గురించిన కథనాలు చదివాం. ఇపుడు మన దేశంలోనే ఒక మామూలు ఆపరేషన్ కోసం ఏకంగా రూ. 11.04 లక్షల బిల్లు గురించి తెలుసుకుంటూ ఔరా అనాల్సిందే. భారతదేశంలోని మెట్రో నగరాల్లో సామాన్యుడికి వైద్యం ఎంత భారంగా మారుతుందో, అలాగే మెడికల్ బిల్లింగ్ విధానంలో పారదర్శకత ఎంత అవసరమో స్పష్టం చేస్తోంది. ముంబైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో సాధారణ హెర్నియా శస్త్రచికిత్స (Hernia Surgery) చేయించుకున్న ఒక రోగికి ఏకంగా రూ. 11.04 లక్షల బిల్లు రావడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. 'నిఖిల్ ఝా' అనే ఎక్స్ యూజర్ షేర్ చేసిన వివరాల ప్రకారం ఫాలోవర్ ఒకరు ముంబైలో 'ఇంగువినల్ హెర్నియా' సర్జరీ చేయించుకున్నారని అంటూ దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇతర వివరాలను పంచుకున్నారు. కేవలం నాలుగు రోజులు(జూలై 6 నుంచి 10 వరకు)ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్‌గా ఉన్నారు. ఈ ఆపరేషన్ కోసం ఆసుపత్రి బిల్లు అక్షరాలా రూ. 11,04,100. ఇందులో ఇన్సూరెన్స్ సెటిల్మెంట్: రూ. 4,64,000 మాత్రమే క్లెయిమ్ వచ్చింది. దీంతో అవాక్కవ్వడం వారి వంతైంది.ఒక చిన్న హెర్నియా సర్జరీకే ఇంత ఖర్చయితే, పెద్ద పెద్ద సర్జరీల పరిస్థితి ఏంటి? ముంబైలో ఆసుపత్రిలో చేరడం నేరమా? అంటూ ప్రశ్నించారు. నాణ్యమైన వైద్యం కేవలం ధనవంతులకు మాత్రమేనా? అటూ నిఖిల్ ఝా సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్ A follower messaged us yesterday about their hernia surgery at a top Mumbai hospital.The total cost=11.04LYes, 11.04L for a hernia surgery,We were shocked and stunned by the cost,If this is the cost for a small hernia surgery,What will be the cost for bigger surgeries?… pic.twitter.com/RUfAOy5UVL— Nikhil Jha (@NIKHILLJHA) July 15, 2026నెటిజన్లు ఏమన్నారంటే? ఈ పోస్ట్‌పై నెటిజన్లు, వైద్యులు రకరకాలుగా స్పందించారను. ఒక వైద్యుడు స్పందిస్తూ, "హెర్నియా సర్జరీకి రూ. 11 లక్షలా? ఇందులో ఏమైనా హెలికాప్టర్ పికప్ అండ్ డ్రాప్ సౌకర్యం కూడా ఉందా?" అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సూరత్‌లో రూ. 1.5 లక్షలకే అయ్యే ఈ సర్జరీకి, ముంబైలో రూ. 11 లక్షలు వసూలు చేయడంపై ఒకరు మండిపడ్డారు. మెట్రో నగరాల్లో పెరిగిపోతున్న వైద్య ఖర్చుల వల్ల అందరి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కేవలం ఈ ఒక్క మెసేజ్ చూసి నిర్ధారణకు రాలేమని, రోగికి ఏ రకమైన రూమ్ కేటగిరీ ఇచ్చారు? ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చి ఐసీయూలో ఉంచారా? వంటి వివరాలు 'డిశ్చార్జ్ సమ్మరీ' ,'ఆపరేషన్ నోట్స్' చూస్తేనే క్లారిటీ వస్తుందని మరికొందరు అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: 18 ఏళ్ల ఎన్ఆర్ఐ జీవితం నుంచి : మెటా టెకీ ఎమోషనల్ పోస్ట్ వైరల్ -
70 ఏళ్ల బల్దియా చట్టానికి గుడ్‌బై
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలనలో కీలక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏడు దశాబ్దాలుగా అమల్లో ఉన్న జీహెచ్ఎంసీ చట్టం–1955 స్థానంలో ‘ది కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ను తీసుకొచ్చేందుకు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును ప్రజల ముందుంచి, జూలై 24 వరకు ప్రజాభిప్రాయాలు, సూచనలు స్వీకరించనున్నట్టు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివద్ధి (ఎంఏయూడీ) శాఖ ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (హెచ్ఎంసీ) చట్టం 1955లో రూపొందించబడిందని, గత 70 ఏళ్లలో హైదరాబాద్ మహానగరం విస్తారంగా అభివృద్ధి చెందడంతో ఆ చట్టంలోని అనేక నిబంధనలు ప్రస్తుత కాలానికి, వేగంగా విస్తరిస్తున్న మహానగర అవసరాలకు సరిపోవడం లేదని ప్రభుత్వం పేర్కొంది. అందుకే కొత్త బిల్లును రూపొందించినట్టు వెల్లడించింది. కొత్త బిల్లులో ప్రధాన అంశాలు ఇలా.... సమగ్ర పాలన–సమన్వయ యంత్రాంగం ప్రస్తుతం హైదరాబాద్‌లో వివిధ సేవల కోసం వేర్వేరు ప్రభుత్వ శాఖలు (ఉదాహరణకు: జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖ, పోలీస్, మెట్రో రైల్, హెచ్ఎండీఏ) విడివిడిగా పనిచేస్తున్నాయి. దీనివల్ల ఒక శాఖ రోడ్డు వేస్తే, మరో శాఖ పైప్‌లైన్ కోసం తవ్వడం లాంటి సమన్వయ లోపాలు కనిపిస్తుంటాయి. కొత్త బిల్లు ద్వారా ‘హోల్ఆఫ్ గవర్నమెంట్’విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీని ప్రకారం కోర్ అర్బన్ రీజియన్న్లోని అన్ని ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీలు ఒకే గొడుగు కిందకు వస్తాయి. దీనివల్ల ప్రభుత్వ నిధులు వృథా కావు, పనుల్లో జాప్యం తగ్గుతుంది. పౌరుల సులభతర జీవనంనగర పౌరులు చిన్నచిన్న పనుల కోసం (భవన నిర్మాణ అనుమతులు, జనన/మరణ ధ్రువీకరణ పత్రాలు, వివిధ రకాల ఫిర్యాదులు) ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులను తొలగించడం. పౌర సేవలన్నింటినీ ’సిటిజన్–సెంట్రిక్’(ప్రజల కేంద్రంగా) మార్చడం. తద్వారా ఆధునిక సాంకేతికత, డిజిటలైజేషన్ సహాయంతో సేవల లభ్యతను మరింత సరళీకరిస్తారు. పౌరులకు సేవలు వేగంగా, పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా నేరుగా అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. పర్యావరణ స్థిరత్వం–నెట్ జీరో విజన్ వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ వల్ల కాలుష్యం, ఉష్ణోగ్రతలు పెరగడం, వరదల వల్ల పర్యావరణ సవాళ్లు ఎదురవుతున్నాయి. భవిష్యత్ తరాలకు సురక్షితమైన నగరాన్ని అందించేందుకు గ్రీన్ ఎనర్జీ వినియోగం పెంచడం, వ్యర్థాల సమర్థవంతమైన నిర్వహణ, పచ్చదనాన్ని పెంపొందించడం, కర్బన ఉద్గారాలను తగ్గించడం ద్వారా పర్యావరణ హితమైన పట్టణ వ్యవస్థలను నిర్మిస్తారు. మెరుగైన ప్రజారోగ్య వ్యవస్థలుఒక మహానగరం ఎంత అభివృద్ధి చెందినా, అక్కడి ప్రజల ఆరోగ్యం సురక్షితంగా ఉన్నప్పుడే ఆ అభివృద్ధికి సార్థకత ఉంటుంది. అంటువ్యాధుల నివారణ, పారిశుధ్యం ఇందులో భాగం. నూతన విధానంలో భాగంగా ఒకే రకమైన అత్యంత బలీయమైన ప్రజారోగ్య వ్యవస్థలను ఏర్పాటు చేయడం. ఇందుకు పారిశుధ్య నిర్వహణను ఆధునీకరించడం, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, కల్తీ నియంత్రణ, తక్షణ ఆరోగ్య సేవల బలోపేతం. సులభతర వాణిజ్యం–వ్యాపార అనుకూలతహైదరాబాద్ అంతర్జాతీయంగా పెట్టుబడులకు, వ్యాపారాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఇందుకుగాను పట్టణ పరిపాలన, అనుమతుల ప్రక్రియలో జాతీయ, అంతర్జాతీయ అత్యుత్తమ విధానాలను అవలంబించడం. తద్వారా వ్యాపారాలు, స్టార్టప్‌లు, పరిశ్రమల స్థాపనకు అవసరమైన మున్సిపల్ అనుమతులను సింగిల్ విండో విధానంలో వేగంగా ఇవ్వడం. దీనివల్ల నగరానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయి, ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. బిల్లులోని ముఖ్యమైన ఈ అంశాల ద్వారా హైదరాబాద్‌లోని కోర్ అర్బన్ ప్రాంతాలను కేవలం కాంక్రీట్ జంగిల్లా కాకుండా, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన ’లివబుల్ గ్లోబల్‌సిటీ’గా మార్చడానికి బలమైన పునాది పడుతుందని అధికారులు అంటున్నారు. ప్రజల సూచనలకు ప్రభుత్వం ఆహ్వానం చట్టాల రూపకల్పనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈ బిల్లును ప్రజా సంప్రదింపుల కోసం అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వం తెలిపింది. పౌరులు తమ అభిప్రాయాలు, సూచనలను ఆన్లైన్ ద్వారా ( https://ghmc.gov.in/categoryWise InsertReport.aspx ) సమర్పించొచ్చని పేర్కొంది. మూడు కార్పొరేషన్ల వెబ్సైట్లలో ముసాయిదా బిల్లును అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. రాతపూర్వకంగా కూడా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ, సచివాలయం, హైదరాబాద్‌కు తమ సూచనలను పంపొచ్చని ప్రభుత్వం వెల్లడించింది. ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించే ప్రక్రియ జూలై 24, 2026 వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది. -
సువేందు దూకుడు.. బెంగాల్లో ‘యోగీ’ స్టయిల్ గుండా బిల్లు!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో వ్యవస్థీకృత నేరాలు, హింసాత్మక అల్లర్లపై ఉక్కుపాదం మోపేందుకు ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రవేశపెట్టిన కఠిన చట్టాల తరహాలోనే, రాష్టంలో ‘పశ్చిమ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ-సోషల్ యాక్టివిటీస్ బిల్, 2026’ను ప్రవేశపెట్టనున్నారు. శాంతిభద్రతలను పూర్తిగా అదుపులోకి తెచ్చే లక్ష్యంతో రూపొందించిన ఈ బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.యోగీ మార్క్.. ఆస్తుల రికవరీఈ ప్రతిపాదిత చట్టంలో అత్యంత కీలకమైన అంశం ఆస్తుల నష్టం రికవరీ నిబంధన. ఉత్తరప్రదేశ్ తరహాలోనే బెంగాల్లో కూడా ఇకపై నిరసనలు, ఊరేగింపులు లేదా అల్లర్ల పేరుతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తే ఊరుకునేది లేదు. హింసకు కారణమైన వారి నుంచే ఆ నష్టాన్ని పైసలతో సహా వసూలు చేసేందుకు ఈ బిల్లు ప్రభుత్వానికి సర్వాధికారాలు కల్పిస్తుంది. దీంతోపాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీలు, గుండాలను నిర్దేశిత ప్రాంతాల నుండి బహిష్కరించే కఠిన నిబంధనను కూడా ఇందులో చేర్చారు.ముందస్తు అరెస్టులు.. పెరగనున్న పవర్స్నేరాలు జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం మాత్రమే కాకుండా, ముందస్తుగానే అసాంఘిక శక్తులను అడ్డుకునేందుకు 'ప్రివెంటివ్ డిటెన్షన్' (ముందస్తు నిర్బంధం) నిబంధనను ప్రవేశపెడుతున్నారు. సమాజంలో అలజడులు సృష్టించే అవకాశం ఉన్నట్లు అనుమానం వస్తే చాలు, వారిని ముందస్తుగా అరెస్టు చేయవచ్చు. ఇది గత నేరాలకు శిక్ష కాదని, భవిష్యత్తులో అల్లర్లను ఆపేందుకేనని ప్రభుత్వం చెబుతోంది. దీనికి తోడుగా పోలీసులకు తనిఖీలు (సెర్చ్), ఆస్తుల జప్తు (సీజర్) విషయంలో మరింత విస్తృతమైన అధికారాలను ఈ చట్టం కల్పించనుంది.హక్కుల రక్షణ.. రానున్న సవాళ్లుఅయితే ఈ ముందస్తు నిర్బంధాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు బిల్లులో కొన్ని రక్షణలు కూడా కల్పించారు. ప్రతి నిర్బంధ ఉత్తర్వును ఒక ఉన్నత స్థాయి ‘అడ్వైజరీ బోర్డు’ సమీక్షిస్తుంది. అరెస్ట్ అయిన వారికి తమ వాదనను వినిపించుకునే హక్కు ఉంటుంది. ప్రజా ప్రయోజనాలకు భంగం కలగనంత వరకు అరెస్టయిన వ్యక్తికి కారణాలను వెల్లడిస్తారు. ఈ బిల్లు పౌర హక్కులకు, చట్టపరమైన ప్రక్రియకు విఘాతం కలిగిస్తుందంటూ విపక్షాలు, విమర్శకులు ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. -
రికార్డు సృష్టించనున్న ట్రంప్.. నోట్లపై
వాషింగ్టన్ డీసీ: డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత పలు వివాదాస్పద నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకోనున్నారు. అమెరికా $250 నోటుపై ట్రంప్ చిత్రం ముద్రించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో కరెన్సీ నోట్లపై జీవించి ఉన్న వ్యక్తి చిత్రాన్ని ముద్రించడాన్ని నిషేధించే నిబంధన ఉంది. అయితే ట్రంప్ ప్రభుత్వం ఆ నిబంధనను మార్చే యత్నం చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ చిత్రాన్ని కలిగిన 250 డాలర్ల నోటును జారీ చేయడానికి అక్కడి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభం చేసింది. ఒకవేళ ఈ చట్టం ఆమోదం పొందితే కొత్త నోటును ముద్రించడం ప్రారంభం అవుతుంది. ఒకవేళ ఇదే ఆమోదం పొందితే 50 ఏళ్లకు పైగా కాలంలో అమెరికా నోటుపై కనిపించిన తొలి సజీవ వ్యక్తి ట్రంప్ అవుతారు.2026లో యునైటెడ్ స్టేట్స్ తన 250వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుందని ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ సాధించిన విజయాలను సూచిస్తూ ఈ నోటును జారీ చేస్తామని తెలిపారు. కాగా ఈ నోటు ప్రాథమిక డిజైన్‌ను చూసిన డొనాల్డ్ ట్రంప్ స్వయంగా చూసి, దానికి కొన్ని మార్పులు సూచించారని అక్కడి అధికారులు పేర్కొన్నారు.160 ఏళ్ల చట్టం మార్చాలి 1866లో కాంగ్రెస్ చేసిన చట్టం ప్రకారం, కేవలం మరణించిన ప్రముఖుల ఫోటోలను మాత్రమే డాలర్లపై ముద్రిస్తారు. జీవించి ఉన్న ఏ వ్యక్తి ఫోటోను కూడా కరెన్సీ నోట్లపై ముద్రించకూడదు. ఒకవేళ అలా చేయాలంటే ఈ నిబంధనను ఖచ్చితంగా మార్చాల్సి ఉంటుంది. దీంతో ట్రంప్ ఫోటో వేయడానికి వీలుగా చట్టాన్ని సవరించాలంటూ రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు ఒక బిల్లును ప్రవేశపెట్టారు. అయితే, ప్రతిపక్ష డెమొక్రాట్లు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.కాగా అమెరికా కరెన్సీ చరిత్రలో మొదటిసారిగా ఒక అధ్యక్షుడి పదవికాలంలోనే తన సంతకం నోట్లపై రాబోతోంది. $100 నోట్లతో పాటు ఇతర డాలర్ నోట్లపై డోనాల్డ్ ట్రంప్ సంతకాన్ని ముద్రించడానికి ట్రెజరీ శాఖ అనుమతించింది. ఈ నోట్ల ముద్రణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. -
యుద్ధం రద్దు?. అమెరికా సెనెట్‌లో నెగ్గిన బిల్లు
వాషింగ్టన్, డీసీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఊహించిన ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌తో యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన తీర్మానం 50-47 ఓట్లతో నెగ్గింది. దీంతో ఇరాన్‌తో యుద్ధం విషయంలో కాంగ్రెస్ ట్రంప్‌పై పై చేయి సాధించింది. అయితే ఇది చట్టంగా మారడానికి ఇంకా అనేక దశలు దాటాల్సి ఉంది.ఇరాన్‌తో యుద్ధం ట్రంప్ పాలిట శాపంగా మారింది. ఈ తొందరపాటు నిర్ణయంతో ఇంటా, బయిటా ట్రంప్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. టెహ్రాన్‌పై దాడితో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తి అనేక దేశాలు ట్రంప్‌ను విమర్శిస్తుండగా.. మరోవైపు స్వంత దేశంలోనూ యుద్ధానికి వ్యతిరేకంగా తీర్మాణం ప్రవేశపెట్టారు.ఇరాన్‌పై యుద్ధం ఆపే ప్రతిపాదనను వర్జీనియా డెమెక్రట్స్ సెనేటర్ టిమ్ కెయిన్ ప్రవేశపెట్టారు. ఈ తీర్మాణానికి అనుకూలంగా 50 ఓట్లు రాగా వ్యతిరేకంగా 47 ఓట్లు వచ్చాయి. అయితే ఈ ఓటింగ్‌లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందిన నలుగురు సభ్యులు సైతం ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయడం విశేషం. మరో ముగ్గురు సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనలేదు. దీంతో ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మాణం అమెరికన్ కాంగ్రెస్‌లో నెగ్గింది.అయితే ఇది కేవలం ప్రారంభదశ మాత్రమే ఇది పూర్తిస్థాయిలో అమలులోకి రావాలంటే సెనేట్‌లో ఓటింగ్ జరగాలి అనంతరం రిపబ్లికన్ల అధిక్యం ఉన్న ప్రతినిధుల సభలోనూ నెగ్గాలి అయినప్పటికీ అధ్యక్షుడు తన విచక్షణ అధికారాలను ఉపయోగించి వీటో చేసి దీనిని ఆపవచ్చు. ఒకవేళ వీటోని ఆపాలని అమెరికా కాంగ్రెస్ అనుకుంటే సెనెట్, ప్రతినిధుల సభ రెండింటిలోనూ 2/3 వంతు మెజార్టీతో నెగ్గాల్సి ఉంటుంది. అప్పుడు ఇరాన్‌పై యుద్ధాన్ని నియంత్రించేలా చట్టం చేయవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యంలా కనిపిస్తోంది.అమెరికా చట్టం ఏం చెబుతుంది.అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు కాంగ్రెస్ ఆమోదం లేకుండా కేవలం 60 రోజులు మాత్రమే సైనిక చర్యలను ప్రారంభించగలరు. ఆ తర్వాత, ఆయన యుద్ధాన్ని ముగించడమో, కాంగ్రెస్ అనుమతి కోరడమో, లేదా దళాల సురక్షిత ఉపసంహరణను నిర్ధారించడానికి అదనంగా 30 రోజులు అభ్యర్థించడమో చేయాలి. అయితే ప్రస్తుతం సీజ్ ఫైర్ నడుస్తోన్న నేపథ్యంలో ట్రంప్ ఈ చట్టం ఇరాన్ యుద్ధానికి వర్తించదని పేర్కొన్నారు. ఏదైమైనా ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మాణం అమెరికా కాంగ్రెస్‌లో నెగ్గడం ప్రతిపక్షాలు అతిపెద్ద విజయంగా భావిస్తున్నాయి. -
జనగణన పూర్తి కాకుండానే డీలిమిటేషన్ బిల్లు.. దక్షిణాదికి జరిగే నష్టం ఇదే!
-
చరిత్ర సృష్టిద్దాం.. మద్దతివ్వండి: మోదీ
ఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు తగిన ప్రాతినిథ్యం కల్పించాల్సిన సమయం వచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పార్లమెంటులో చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ నడుస్తోన్న వేళ ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. పార్లమెంటు తీసుకునే ఈ నిర్ణయం కోసం యావత్ మహిళా లోకం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోందన్నారు. మహిళల మనోభావాలను ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతీయకూడదని అందరం కలిసి చరిత్ర సృష్టిద్దామని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు.మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం బీజేపీ తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఓటింగ్‌కు ముందు కీలక నేతలతో భేటీ అయ్యారు. బిల్లు ఆమోదం పొందేలా సీనియర్ మంత్రులతో మంతనాలు జరుపుతున్నారు. అదే విధంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విపక్షాలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాజకీయ లబ్ధికోసమే ఈ బిల్లు తీసుకవచ్చారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆరోపించారు. డీలిమిటేషన్ అనేది నిరంతరం ప్రక్రియని మహిళా రిజర్వేషన్లకు డీలిమిటేషన్‌తో లింకు పెట్టారని ఆరోపించారు. ఇక తమిళనాడు డీఎంకే సైతం ఇదివరకే డీలిమిటేషన్‌కు తమ పార్టీ వ్యతిరేకమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన సమావేశాలకు వారు నల్లదుస్తులు ధరించి హాజరయ్యారు. రాజ్యాంగ సవరణ బిల్లులకు పార్లమెంటులో మూడింట, రెండో వంతు మెజార్టీ అవసరముంటుంది. అనగా 360 మంది ఎంపీల మద్దతు అవసరం కాగా ప్రస్తుతం ఎన్డీఏ బలం 294 దీంతో ఇంకా 64 మంది ఎంపీల మద్దతు అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏం జరుగతుందా అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది. -
డీలిమిటేషన్ దంగల్‌కు రంగం సిద్ధం... మహిళా బిల్లుపై లోక్‌సభలో నేడే ఓటింగ్
-
జగన్ వస్తాడని బాబుకు అర్థమైంది.. అందుకే చట్టబద్ధత బిల్లు
-
అమరావతి బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రపదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు–2026 గురువారం రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. బిల్లుకు బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్, బీఆర్ఎస్, బీజేడీ, ఆప్, జేడీయూ సహా పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. రెండు గంటల చర్చ అనంతరం ఈ బిల్లుకు సభ మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లోనూ బిల్లుకు ఆమోదం దక్కినట్లయింది. లోక్‌సభలో బుధవారం ఆమోదం పొందిన బిల్లును గురువారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాలు ముగిశాక ప్రవేశపెట్టారు. బిల్లుపై మొత్తం 19 మంది ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. ప్రస్తుత రూపంలో ఉన్న బిల్లులో అనేక అంశాలపై స్పష్టత లేదంటూ, బిల్లును వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ సభ నుంచి వాకౌట్ చేసింది. వాడుకొని వదిలేయడం బీజేపీకి అలవాటన్న విపక్షాలు... బిల్లుపై మాట్లాడిన అన్ని పార్టీలు ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం అందించే సాయం, ఎప్పటిలోగా నిర్మాణం పూర్తి చేస్తాయో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశాయి. రాజధానికి భూములిచ్చిన రైతులను ఆదుకునే ప్రక్రియ, పరిహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటన చేయాలని కోరాయి. తన అవసరానికి ప్రాంతీయ పార్టీలను వాడుకొని వదిలేయడం బీజేపీకి అలవాటని, వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించాయి. విభజన జరిగి పదేళ్లయినా ఇంతవరకు ఏపీ, తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్రం విఫలమైందని, కడప స్టీల్ ప్లాంట్, తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పూర్తి చేయలేదని ఎంపీలు పేర్కొన్నారు. ఈ దృష్ట్యా అమరావతిని ఎప్పటిలోగా పూర్తి చేస్తారో కేంద్రం నిర్దిష్ట కాలపరిమితిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. తృణమూల్ ఎంపీ మహ్మద్ నదీముల్ హక్ మాట్లాడుతూ, ‘బిహార్‌లో జేడీయూ నితీశ్‌కుమార్‌కు, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేకి ఏమి జరుగుతుందో చూస్తున్నారు. వాడుకొని వదిలేయడం (యూజ్ అండ్ త్రో పాలసీ) బీజేపీ విధానం. కావున టీడీపీ అప్రమత్తంగా ఉండాలి’ అని సూచించారు. ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ మాట్లాడుతూ, ‘కేంద్రంలోని బీజేపీ వైఎస్సార్సీపీకి మూడు రాజధానులు చేయమని ప్రోత్సహించింది.అమరావతిని రాజధాని చేయమని టీడీపీకి చెబుతోంది. బీజేపీతో జాగ్రత్త..చాలా పార్టీలను మోసం చేసిన చరిత్ర బీజేపీకి ఉంది. కావున జాగ్రత్త’ అంటూ హితవు పలికారు. బీజేడీ తరఫున మాట్లాడిన నిరంజన్ బిషీ..పోలవరంతో ఒడిశాలో ముంపుపై సమగ్ర అధ్యయనం జరగాలని, నిరాశ్రయులకు సరైన పరిహారం ఇచ్చేలా చూడాలని కోరారు. ఇక ప్రస్తుత రూపంలో ఉన్న బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. ‘అమరావతిని మేమెన్నడూ వ్యతిరేకించలేదు. కానీ ఇప్పటికే 50వేల ఎకరాలు రైతుల నుంచి సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్క శాశ్వత భవనాన్ని నిర్మించలేదు. అలాంటి రాజధానిని ఎప్పటిలోగా పూర్తి చేస్తారు. నిర్మాణం పూర్తయ్యేందుకు అవసరమయ్యే రూ.2లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారన్న దానిపై స్పష్టత లేదు’ అని వైఎస్సార్సీపీ తరఫున మాట్లాడిన పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్రపతి పరిశీలనకు బిల్లు..బిల్లుపై చర్చ ముగిసిన అనంతరం మంత్రి నిత్యానంద్ రాయ్ సభకు బిల్లు వివరాలు వెల్లడించారు. అనంతరం బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఉభయ సభల్లోనూ బిల్లుకు ఆమోదం లభించడంతో తదుపరి ఆమోదానికి బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు. -
ఇజ్రాయెల్‌లో కీలక బిల్లు ఆమోదం.. అలా చేస్తే ఉరిశిక్షే?
ఇజ్రాయెల్ పార్లమెంటు (నాసాట్) పాలస్తీనా నేరస్థులను శిక్షించే కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ చట్టం కింద ఇజ్రాయెల్ పౌరుల హత్యలో లేదా ఉగ్రవాద కార్యకలాపాలలో పాలస్తీనియన్లు పాల్గొంటే వారికి నేరుగా ఉరిశిక్ష విధించబడుతుంది.ఇజ్రాయెల్‌లోని కొన్ని గ్రూపులు చాలా కాలంగా ఈ బిల్లు కోసం డిమాండ్ చేస్తున్నాయి. ఎట్టకేలకు పార్లమెంటులో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. దీనిప్రకారం పాలస్తీనాకు చెందిన వ్యక్తులు తీవ్రమైన నేరాలకు న్యాయమూర్తులు ఏకాభిప్రాయం లేకుండా కూడా మరణశిక్షను ప్రకటించగలరు. అప్పీల్ చేసే హక్కు ఉండదు. శిక్ష విధించిన 90 రోజుల్లో ఉరితీయబడతాడు. ఈ చట్టం జాతీయవాద లేదా తీవ్రవాద కారణాలకు వర్తిస్తుంది. అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మరణ శిక్షను జీవిత ఖైదు విధించే హక్కు కూడా కోర్టులకు ఉంటుంది.కాగా మానవ హక్కుల సంఘాలు ఈ బిల్లును జాతిపరంగా వివక్షతగా పేర్కొన్నాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్ మానవ హక్కుల, పౌర సమాజ సంస్థలు ఈ చట్టం పాలస్తీనియన్లపై జాతి హింసను ప్రోత్సహిస్తున్నాయని నిరసన తెలుపుతూ ఈ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. కాగా ఇన్ని సంవత్సరాల ఇజ్రాయెల్ చరిత్రలో కేవలం రెండుసార్లు మాత్రమే ఆ ధేశంలోమరణశిక్ష విధించబడింది. -
తల్లిదండ్రులకు తోడుగా..
సాక్షి, హైదరాబాద్: ‘బాధ్యతా రహితంగా వ్యవహరించే కొడుకులను నియంత్రించడంతో పాటు తల్లిదండ్రుల్లో విశ్వాసం పెంచేందుకే సామాజిక బాధ్యతగా.. ‘తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం, పర్యవేక్షణ బిల్లు’తీసుకువచ్చాం. తల్లిదండ్రులకు ఈ చట్టం ఒక మంత్రదండం. తల్లిదండ్రులను చూసుకోని వారిని సమాజం బహిష్కరించాలి. అలాంటి వారిని చట్టపరిధిలోకి తెచ్చి దారిలో పెట్టడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.అయితే దీనితోనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని కాదు.. వృద్ధ తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించేందుకే మా ప్రయత్నం. ఏ తల్లిదండ్రులు అనాథలుగా ఉండకూడదు, చివరిరోజుల్లో ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో ఈ బిల్లును తెస్తున్నాం..’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆదివారం అసెంబ్లీలో ఈ బిల్లు’పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాధ్యత, భావోద్వేగంతో.. ‘పురాణాలలో శ్రవణ కుమారుడి కథ మాతృ పితృ భక్తికి అద్దం పడితే..అత్యంత విలాసవంతమైన జీవితం గడిపిన రేమండ్స్ మాజీ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మభూషణ్ అవార్డు గ్రహీత విజయ్‌పథ్ సింఘానియా చివరకు కొడుకు చేసిన ద్రోహంతో అనామకుడిగా తనువు చాలించాల్సి వచ్చింది. పిల్లలకు సర్వస్వం ఇచ్చి పెద్ద తప్పు చేశానంటూ.. తన ఆత్మకథ ‘యాన్ ఇన్‌కంప్లీట్ లైఫ్’పుస్తకంలో సింఘానియా తన చేదు అనుభవాలను వివరించారు. కొందరు ప్రజాప్రతినిధులు సైతం ఇదే రకమైన ధోరణితో ఉన్నారు. ఒక మాజీమంత్రి తండ్రి సైతం ఇదే విధంగా సరిగా చూసుకోని పరిస్థితుల్లో క్యాన్సర్‌తో చనిపోయారు. భవిష్యత్తులో తల్లిదండ్రులకు ఆ పరిస్థితి రావొద్దనే ప్రభుత్వం.. బాధ్యత, భావోద్వేగంతో ఈ బిల్లును తీసుకువచ్చింది. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. తల్లిదండ్రులను సంతానంలో ఎవరో ఒకరు చూసుకునేవారు. కానీ ఇప్పుడు మేం ఇద్దరం మాకు ఒక్కరన్న పరిస్థితి వచ్చింది. వృద్ధ తల్లిదండ్రులకు రక్షణ మనిషి బంధాలు, అనుబంధాలను మర్చిపోయి చివరికి పేగు బంధాలను కూడా విస్మరించి భౌతిక సుఖాలు, ఆర్థిక ప్రయోజనాలు, సంపద కోసం పాకులాటల్లో మునిగిపోయాడు. బతికున్నప్పుడు గుప్పెడు మెతుకులు పెట్టని బిడ్డలు, చనిపోయాక ఆస్తుల కోసం కొట్లాడుకోవడం అత్యంత విషాదకరం. తల్లిదండ్రులపై ఒకవేళ కూతురికి ప్రేమ ఉన్నా పెళ్లి తర్వాత వారిని చూసుకోలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం మహిళలు, చిన్నారులను కాపాడేలా ఎన్నో చట్టాలు ఉన్నాయి. పిల్లలు తమ తల్లిదండ్రులను చూసుకోవడం చట్టబద్ధ బాధ్యత అని చెబుతూ ఇప్పటికే చట్టాలున్నా సమాజంలో తల్లిదండ్రుల సంరక్షణ విషయంలో జరుగుతోన్న వివక్ష, నిర్లక్ష్యం గమనిస్తూనే ఉన్నాం. ఈ విధంగా నిర్లక్ష్యానికి గురవుతున్న తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని పెంచేందుకు తీసుకువచ్చిన ఈ బిల్లుకు సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలి. తల్లిదండ్రుల పట్ల భక్తి లేనివారికి భయం కలిగించేందుకే ఈ చట్టం తెచ్చాం. వృద్ధ తల్లిదండ్రులకు రక్షణ కల్పించే దిశగా ఇది ఒక కీలక అడుగు అవుతుంది..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ‘అమ్మా.. నీకు వందనం’ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ఈ బిల్లు పెట్టాల్సి రావడం దురదృష్టకరమన్నారు. సమాజం మారాలని, విలువలు పెరగాలని ఆకాంక్షించారు. కన్నబిడ్డలు నిర్ల క్ష్యం చేసిన ఓ ముస్లిం మహిళను తాను చేరదీసి అనాథా శ్రమంలో చేర్చిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ఎంతో మానవత్వంతో ఆలోచించి ఈ బిల్లును ప్రవేశపెట్టిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే ఆదినారాయణ అన్నారు. ఈ సందర్భంగా ‘అమ్మా.. నీకు వందనమే..’అనే పాట ఎమ్మెల్యే పాడారు. గతంలో కుటుంబ అనుబంధాలు చాటిచెప్పే సినిమాలు వచ్చేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఎమ్మె ల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను భయపెట్టే స్థితిలో కొందరు కొడుకులు, కోడళ్లు ఉన్నారన్నారు. బిల్లుకు ఎమ్మెల్యేలు పాయల్‌శంకర్, జాఫర్ హుస్సేన్ మద్దతు తెలిపారు. చర్చ అనంతరం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ సమాజంలో ఏ కుటుంబంలోనూ తల్లిదండ్రులు అనాథలుగా మిగిలిపోకూడదన్న సంకల్పంతోనే ప్రభుత్వం తల్లిదండ్రుల రక్షణ కోసం చట్టం తీసుకొస్తుందని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు చెప్పారు. శాసనసభలో మంత్రి @minister_adluri గారు ప్రవేశపెట్టిన “తెలంగాణ ఎంప్లాయిస్ అకౌంటబిలిటీ, మానిటరింగ్ ఆఫ్… pic.twitter.com/F1JJLwwWsp— Telangana CMO (@TelanganaCMO) March 29, 2026 -
డ్రైవింగ్ లైసెన్స్‌కు 30 రోజుల గ్రేస్ పీరియడ్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టానికి పలు సవరణలను ప్రతిపాదించింది. డ్రైవింగ్ లైసెన్సును గడువు ముగిసిన తర్వాత 30 రోజుల వరకు అమల్లో ఉన్నట్లు పరిగణించడం వంటివి అందులో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన జన్ విశ్వాస్(అమెండ్మెంట్ ఆఫ్ ప్రొవిజన్స్)బిల్లు–2026ను వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మొత్తం 23 శాఖల పరిధిలోని 79 కేంద్ర చట్టాలకు సంబంధించిన 784 నిబంధనల సవరణ ప్రతిపాదనలున్నాయి. ఇందులో మోటారు వాహనాల చట్టంలోని పలు నిబంధనల సడలింపు, చట్టపరమైన సందిగ్ధతను తొలగించేందుకు ఉద్దేశించిన 20 సవరణలున్నాయని మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు. వాహన రిజిస్ట్రేషన్లను రాష్ట్రంలో ఎక్కడైనా చేయించుకునేందుకు, డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత దరఖాస్తు చేసుకుంటే, పునరుద్ధరించిన తేదీ నుంచి అమలులోకి వచ్చేలా చేయడం వంటివి ఉన్నాయన్నారు. అదేవిధంగా, డ్రైవింగ్ లైసెన్సు గడువు ముగిసిన 30 రోజుల వరకు అమలయ్యేందుకు వీలు కల్పించామన్నారు. వాహన రిజిస్ట్రేషన్ రద్దు కోసం దరఖాస్తు చేసుకునే గడువును 30 రోజులకు పెంచాలని, బీమా సర్టిఫికెట్ బదిలీపై సంబంధిత బీమా సంస్థకు సమాచారం ఇచ్చే గడువును కూడా 30 రోజులకు పెంచాలని ప్రతిపాదించామన్నారు. హిట్–అండ్–రన్ కేసుల్లో పరిహారానికి సంబంధించిన ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే, రూ. లక్ష నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా విధించేందుకు వీలుంటుందని తెలిపారు. -
విద్వేషంపై ఉక్కుపాదం!
సాక్షి, హైదరాబాద్: సమాజంలో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ విద్వేష పూరిత ప్రసంగాలు, విద్వేష పూరిత నేరాల నిరోధక బిల్లు (తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు, 2026)కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో మత సామరస్యానికి భంగం కలిగించేలా చేసే పోస్టులు, అల్లర్లు.. ఘర్షణలను ప్రేరేపించేలా చేసే ప్రసంగాలను కట్టడి చేసేందుకు ఈ బిల్లును రూపొందించారు.కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు సైతం ఇదే తరహా బిల్లును శాసనసభలో ఆమోదించి గవర్నర్ ఆమోదం కోసం పంపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ బిల్లును బీజేపీ వ్యతిరేకించింది. దీంతో గవర్నర్ దాన్ని రాష్ట్రపతి పరిశీలనకు పంపించారు. హేట్ స్పీచ్ బిల్లుకు ఆమోదం తెలపడంతో పాటు.. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం సాయంత్రం శాసనసభ కమిటీ హాల్లో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.వర్సిటీల్లో కుల వివక్ష నియంత్రణకు..విద్యాలయాల్లో కుల వివక్షను నియంత్రించేందుకు ఉద్దేశించిన రోహిత్ వేముల చట్టం విధివిధానాల రూపకల్పనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా వ్యవహరించనున్నారు. గిగ్ వర్కర్స్కు భద్రత గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల సంక్షేమం, భద్రత కోసం రూపొందించిన ‘తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్) యాక్ట్ – 2026’ బిల్లును కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే రాష్ట్రంలోని దాదాపు 4.2 లక్షల మంది గిగ్ వర్కర్స్, ప్లాట్‌ఫామ్ బేస్డ్ వర్కర్లకు ప్రయోజనం కలగనుంది. కొత్త బిల్లు ప్రకారం వర్కర్స్ రిజిస్ట్రేషన్‌తో పాటు సంక్షేమ బోర్డు, నిధి ఏర్పాటు చేస్తారు. గిగ్ వర్కర్లకు చట్టబద్ధమైన గుర్తింపు, సామాజిక భద్రత లభించడంతో పాటు బోర్డు ఏర్పాటు ద్వారా వారి హక్కులకు రక్షణ లభిస్తుంది. గతంలో మంత్రివర్గం ఆమోదించిన బిల్లును ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన సోషల్ సెక్యూరిటీ కోడ్‌కు అనుగుణంగా స్వల్ప మార్పులతో కేబినెట్ ఆమోదించింది.మెట్రో స్వాధీనం చర్యలు వేగవంతంహైదరాబాద్ నగరంలో ప్రస్తుతమున్న 69 కిలోమీటర్ల మెట్రో రైలు వ్యవస్థను ఎల్ అండ్ టీ కంపెనీ నుంచి స్వాధీనం చేసుకునే చర్యలు వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వం తరఫున నిధుల చెల్లింపులు, లావాదేవీలు నిర్వర్తించే బాధ్యతను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌కు అప్పగించింది. హెచ్ఎంఆర్ఎల్ను నోడల్ ఏజెన్సీగా నియమించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టంతెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యాయవాదులపై జరుగుతున్న దాడుల ఘటనలను కట్టడి చేసేందుకు, వారికి రక్షణ కల్పించేందుకు ఈ బిల్లు రూపొందించారు. గతంలో అడ్వకేట్ వామనరావు దంపతుల హత్య నేపథ్యంలో న్యాయవాదులకు రక్షణ, తగిన భద్రత కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది.కులగణనపై కమిటీ నివేదికకు ఆమోదంరాష్ట్రంలో చేపట్టిన కులగణనను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఈ నివేదిక తయారు చేసింది. సామాజిక న్యాయం, అన్ని వర్గాల సాధికారత లక్ష్యంగా దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. 2024 నవంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు సామాజిక, ఆర్థిక, కుల సర్వేను నిర్వహించింది. కాగా నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించే బాధ్యతను కేబినెట్ సబ్ కమిటీకి ప్రభుత్వం అప్పగించింది.తల్లిదండ్రులకు భరోసా..వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆదరించని ప్రజా ప్రతి నిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల వేతనాల నుంచి 15 శాతం లేదా రూ.10 వేలు.. ఏది తక్కువైతే ఆ మొత్తం వేత నాల నుంచి పరిహరించి తల్లిదండ్రులకు అందజేసే తల్లిదండ్రులకు మద్దతు బిల్లును మంత్రివర్గం ఆమోదించింది. -
తెలంగాణా వ్యాపారుల కోసం “జీరో ఎక్సెస్ బిల్” ఉద్యమం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో వ్యాపారాలు అధిక విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితులు రాకుండా అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌కు చెందిన టెక్నాలజీ సంస్థ భారత్ స్మార్ట్ సర్వీసెస్ “ఉగాది 2026 జీరో ఎక్సెస్ బిల్ తెలంగాణ ఉద్యమం”ను చెర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో ప్రారంభించింది.ముఖ్యంగా పవర్ ఫ్యాక్టర్ (PF), డిమాండ్ ప్రవర్తన, లీడ్–లాగ్ పరిస్థితులు వంటి అంశాలు అధిక విద్యుత్ బిల్లులకు ఎలా కారణమవుతాయో అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కోరల్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (భారత్ స్మార్ట్ సర్వీసెస్) సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సికిందర్ రెడ్డి తండ్రా మాట్లాడుతూ, రోజుకు కేవలం ఒక నిమిషం సమయం కేటాయించి విద్యుత్ వినియోగాన్ని పరిశీలిస్తే అధిక బిల్లులను నివారించ వచ్చన్నారు. LT వినియోగదారుల కోసం lead unblocking గడువు మార్చి 31, 2026 వరకు పొడిగించామని, కాబట్టి kVAh ఆధారంగా బిల్లు చెల్లించే వినియోగదారులు వెంటనే తమ బిల్లులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంస్థ సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని సంస్థ తెలిపింది. -
హెచ్1బీ వీసాలను రద్దు చేయాలి
న్యూయార్క్/వాషింగ్టన్: విదేశీ కార్మీకులకు చట్టపర ఉపాధి కర్మిస్తున్న హెచ్–1బీ వీసా కార్యక్రమాన్ని శాశ్వతంగా రద్దుచేయాలని కోరుతూ అధికార రిపబ్లికన్ పార్టీ నేత ఒకరు అమెరికా దిగువసభలో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఒకవేళ చట్టంగా మారితే అమెరికాలో స్థిరపడాలనుకునే లక్షలాది మంది భారతీయుల కల శాశ్వతంగా చెదిరిపోవడం ఖాయం. ఫ్లోరిడా రాష్ట్రంలోని 17వ కాంగ్రెషనల్ జిల్లా నుంచి ఆరేళ్లుగా దిగువ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ నేత గ్రెగ్ స్టూబ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. స్థానికుల ఉద్యోగాలను విదేశీయులు కొల్లగొడుతున్నారనే అర్థం స్ఫురించేలా ఈ బిల్లుకు ‘ఎండింగ్ ఎక్స్ప్లోటేటివ్ ఇంపోర్టెడ్ లేబర్ ఎగ్జెంప్షన్స్ (ఎక్సైల్) యాక్ట్’అని పేరుపెట్టారు.‘‘అమెరికా చట్టాలను బడా కార్పొరేషన్లు అవహేళన చేస్తున్నాయి. తక్కువ వేతనాలకు దొరికే విదేశీ కార్మికులను అమెరికాలోకి దిగుమతి చేస్తున్నాయి. విదేశాల నుంచి కార్మీకులను దిగుమతి చేసుకునే ఈ సంస్కృతికి చరమగీతం పాడుదాం. హెచ్–1బీ వీసా కార్యక్రమం కారణంగా మన కార్మీకులు, యువతకు ఎలాంటి ఉపాధీ లభించట్లేదు. మన కార్మీక శక్తి ప్రయోజనాలను పణంగా పెట్టి బడా కార్పొరేషన్లు విదేశీయులకు ఉద్యోగాలిస్తున్నాయి. పౌరసత్వం లేని విదేశీయులకు లాభం చేకూరుస్తూ అమెరికన్ల కలలను కల్లలు చేస్తూంటే చూస్తూ ఊరుకోవద్దు. అందుకే ఎక్సైల్ బిల్లు తెచ్చా. ఈ మేరకు అమెరికాకు వలసలు, గుర్తింపు చట్టంలో మార్పులు తెద్దాం. ఇకనైనా అమెరికన్ కార్మికులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి’’అని స్టూబ్ అన్నారు. -
టోకనైజేషన్ బిల్లు కోసం పార్లమెంట్లో డిమాండ్
ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) ఎంపీ రాఘవ్ చద్దా ఇటీవల పార్లమెంట్లో టోకనైజేషన్ బిల్లు గురించి చేసిన ప్రతిపాదన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సామాన్యులకు కూడా భారీ పెట్టుబడుల ఫలాలను అందించేలా ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో అసలు టోకనైజేషన్ అంటే ఏమిటి, దాని వల్ల కలిగే ప్రయోజనాలేమిటో చూద్దాం.టోకనైజేషన్ అంటే ఏమిటి?సాధారణ భాషలో చెప్పాలంటే.. ఒక భారీ ఆస్తిని (ఉదాహరణకు ఒక పెద్ద కమర్షియల్ బిల్డింగ్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్) చిన్న చిన్న డిజిటల్ భాగాలుగా విభజించడాన్నే టోకనైజేషన్ అంటారు. ఈ ఒక్కో భాగాన్ని టోకెన్ అని పిలుస్తారు.ఉదాహరణకు ఒక హైవే ప్రాజెక్ట్ విలువ వందల కోట్లు అనుకుందాం. అందులో సామాన్యులు పెట్టుబడి పెట్టలేరు. కానీ, దాన్ని కోటి టోకెన్లుగా విభజిస్తే.. ఒక్కో టోకెన్ ధర కేవలం వంద రూపాయల్లోనే ఉండవచ్చు. ఇలా సామాన్యులు సైతం ఆ ప్రాజెక్టులో భాగస్వాములు కావచ్చు.ఈ బిల్లును ఎందుకు ప్రతిపాదించారు?ప్రస్తుతం రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కేవలం బిలియనీర్లు లేదా పెద్ద సంస్థలకు మాత్రమే పరిమితమయ్యాయి. మధ్యతరగతి ప్రజలు కేవలం బ్యాంక్ ఎఫ్డీలు లేదా మ్యూచువల్ ఫండ్స్‌కే పరిమితం అవుతున్నారు. ఈ బిల్లు వస్తే సామాన్యులు కూడా భారీ ఆస్తుల్లో వాటాలను కొనుగోలు చేసి అధిక లాభాలను పొందవచ్చని ఎంపీ చెప్పారు.విదేశీ మూలధనంసింగపూర్, యూఏఈ, అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికే ఇటువంటి చట్టాలు ఉన్నాయి. భారత్‌లో కూడా స్పష్టమైన చట్టపరమైన నిబంధనలు ఉంటే అంతర్జాతీయ పెట్టుబడులు భారత్‌కు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు.మధ్యతరగతికి మేలుమధ్యతరగతి ప్రజలు తమ పొదుపు మొత్తాన్ని కేవలం తక్కువ వడ్డీ వచ్చే బ్యాంక్ సేవింగ్స్ ఖాతాల్లో ఉంచుతున్నారు. టోకనైజేషన్ ద్వారా వారికి రియల్ ఎస్టేట్, గోల్డ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో చిన్న మొత్తాలతోనే పెట్టుబడి పెట్టే అవకాశం దక్కుతుంది.ప్రయోజనాలుసాధారణంగా ఒక ఇల్లు లేదా భూమి అమ్మాలంటే చాలా సమయం పడుతుంది. కానీ డిజిటల్ టోకెన్లను షేర్ మార్కెట్ తరహాలోనే సులభంగా, త్వరగా విక్రయించుకోవచ్చు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, రిజిస్ట్రేషన్ గొడవలు లేకుండా నేరుగా బ్లాక్‌చెయిన్ ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. దీనివల్ల ప్రతి లావాదేవీ పక్కాగా రికార్డ్ అవుతుంది. మోసాలకు తావుండదు. ఒకేసారి లక్షల రూపాయలు పెట్టక్కర్లేదు. కేవలం రూ.500 లేదా రూ.1000తో కూడా ఆస్తిలో భాగస్వామ్యం పొందవచ్చు. లాభాలను పంచుకోవచ్చు.ప్రస్తుతానికి ఇది ప్రతిపాదన మాత్రమే. ప్రభుత్వం దీనిపై ఇంకా అధికారికంగా ఎటువంటి ముసాయిదాను విడుదల చేయలేదు. అయితే ఇప్పటికే భారత రిజర్వ్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డుల భద్రత కోసం ‘కార్డ్ టోకనైజేషన్’ విధానాన్ని అమలు చేస్తోంది. దానికంటే విస్తృతమైన అసెట్ టోకనైజేషన్(ఆస్తుల టోకనైజేషన్) కోసం ప్రత్యేక చట్టం కావాలని ఎంపీ కోరుతున్నారు.ఇదీ చదవండి: ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ క్యూఆర్ కోడ్ బోర్డులు -
‘శాంతి’తో సంచలనం.. ఇక భారత ‘అణు శక్తి’ ప్రైవేటీకరణ!
న్యూఢిల్లీ: భారతదేశ ఇంధన రంగంలో చారిత్రక అధ్యాయం మొదలు కాబోతోంది. దశాబ్దాలుగా ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉన్న అణుశక్తి రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి తెరతీస్తూ ప్రభుత్వం లోక్‌సభలో 'శాంతి' (SHANTI - Sustainable Harnessing and Advancement of Nuclear Energy for Transforming India) బిల్లు- 2025ను ప్రవేశపెట్టింది. 1962 నాటి పాత చట్టాలను రద్దు చేస్తూ, తీసుకువచ్చిన ఈ బిల్లు, భారతదేశాన్ని గ్లోబల్ న్యూక్లియర్ హబ్‌గా మార్చే దిశగా వేసిన తొలి అడుగు.ప్రైవేట్ కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ఈ బిల్లులోని అత్యంత కీలకమైన మార్పు ఏమిటంటే, ఇకపై టాటా పవర్, అదానీ పవర్, రిలయన్స్ వంటి భారతీయ ప్రైవేట్ సంస్థలు సొంతంగా అణు విద్యుత్ ప్లాంట్లను నిర్మించుకోవచ్చు.. నిర్వహించుకోవచ్చు. ఇప్పటివరకు ఈ అధికారం కేవలం ప్రభుత్వ సంస్థలైన ఎన్పీసీఐఎల్ వంటి వాటికే పరిమితమై ఉండగా, కొత్త చట్టం ద్వారా ప్రైవేట్ రంగం కూడా ఇందుకోసం లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది. అయితే, భద్రత దృష్ట్యా విదేశీ సంస్థల నియంత్రణలో ఉన్న కంపెనీలకు మాత్రం ఈ అనుమతి ఉండదు.విదేశీ పెట్టుబడులకు అడ్డంకులు తొలగింపుగతంలో విదేశీ సరఫరాదారులు భారతదేశంలో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు వెనుకడుగు వేసేవారు. దానికి ప్రధాన కారణం 'న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్, 2010'. ఏదైనా ప్రమాదం జరిగితే పరికరాల సరఫరాదారులపై కూడా బాధ్యత ఉండేది. అయితే ఈ ‘శాంతి’ బిల్లు ఈ అడ్డంకిని తొలగించింది. ఇకపై అణు ఘటనలకు బాధ్యత కేవలం ఆపరేటర్లకే పరిమితం అవుతుంది. సరఫరాదారులకు మినహాయింపు ఉంటుంది. ఇది వెస్టింగ్‌హౌస్, రోసాటమ్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు భారతీయ సంస్థలతో చేతులు కలపడానికి మార్గం సుగమం చేస్తుంది.భద్రత.. కఠిన నిబంధనలుఅణుశక్తి నియంత్రణ బోర్డు (ఏఈఆర్బీ)కి ఈ బిల్లు చట్టబద్ధమైన హోదాను కల్పించింది. ఫలితంగా భద్రతా పర్యవేక్షణ మరింత బలోపేతం అవుతుంది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే చిన్న తప్పులకు రూ. 5 లక్షల నుండి తీవ్రమైన నేరాలకు రూ. ఒక కోటి వరకు జరిమానాలు విధిస్తారు. అలాగే అణు ప్రమాదాల బాధ్యతను అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 300 మిలియన్ల ప్రత్యేక డ్రాయింగ్ హక్కులకు (ఎస్‌డీఆర్‌లకు)పరిమితం చేస్తూ, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా 'అణుశక్తి పరిష్కార సలహా మండలి'ని ఏర్పాటు చేయనున్నారు.2047 నాటికి 100 గిగావాట్ల లక్ష్యంప్రస్తుతం భారతదేశ అణు విద్యుత్ సామర్థ్యం కేవలం 8.2 గిగావాట్లు మాత్రమే. అయితే 2047 నాటికి దీనిని 100 గిగావాట్లకు పెంచాలని, 2070 నాటికి 'నెట్ జీరో' ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం విద్యుత్ ఉత్పత్తికే కాకుండా, అణు శాస్త్రంలో ఆవిష్కరణలు, రవాణా, ఇంధన నిల్వ తదితర అంశాలలో కూడా ప్రైవేట్ రంగాన్ని భాగస్వామ్యం చేయడం ద్వారా బిలియన్ల డాలర్ల పెట్టుబడులు దేశంలోకి రానున్నాయి. ఇది కూడా చదవండి: Bengal SIR list: ఎన్ని లక్షల పేర్లు తొలగించారంటే.. -
వైద్య సిబ్బందిపై దాడి చేస్తే.. ఇక అంతే?
"వైద్యో నారాయణ హరి" అంటే ప్రాణం పోసే వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం. అయితే వాస్తవం కూడా అదే ఎందుకంటే ఒక వ్యక్తికి ప్రాణం పోయడం కంటే గొప్ప విషయం ప్రపంచంలో మరోకటి ఉండదు. అయితే అంతటి ప్రాముఖ్యత కలిగిన డాక్టర్లకు ఇతర వైద్య సిబ్బందికి సరైన భద్రత కల్పించడం కూడా ప్రభుత్వాల బాధ్యతే. అందుకే వైద్య సిబ్బంది భద్రతపై రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు.ఒక వ్యక్తికి ఆరోగ్యం విలువ తెలిసేది వారు అనారోగ్యం పాలయినప్పుడే అంటారు. ఎందుకంటే అన్నింటిని మించిన సంపద ఆరోగ్యమే అదే లేకుంటే ఎంత సంపద, అధికారం,పరివారం ఇలాంటివి ఎన్ని ఉన్నా అవి వృథానే. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడంతో పాటు వారి ప్రాణాలనే కాపాడే వైద్యులను సంఘంలో ఏంతో గౌరవంతో చూస్తారు. అయితే కొన్నికొన్ని సందర్భాలలో తమ వారికి ఏదైనా హాని కలిందనో, లేదా ఇతరాత్రా కారణాలతో వైద్యులతో పాటు ఇతరాత్ర సిబ్బందిపై కొంతమంది దాడులకు పాల్పడుతుంటారు. ఆస్పత్రుల ఆస్తులను ధ్వంసం చేస్తుంటారు. ఆగ్రహంతో క్షణికావేశంలో వైద్యసిబ్బందిపై దాడి చేయడంతో డాక్టర్లు సైతం తమ విధి నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని కొన్ని సార్లు డాక్లర్లు సైతం తాము వైద్యం చేయమని ధర్నాలకు దిగుతున్నారు. వైద్యసిబ్బందిపై దాడి చేసేవారిని కఠినంగా శిక్షించేలా చట్టాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు.ఇటీవల ఎన్సీపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ ఫౌజియా ఖాన్ "సెంట్రల్ ప్రోటెక్షన్ ఆఫ్ హెల్త్ వర్కర్స్ అండ్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిల్ -2025" పేరుతో రాజ్యసభలో బిల్లు ప్రవేశ పెట్టారు. 1.వైద్యసిబ్బందిపై దాడులు 6నెలల నుంచి 5 సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ.50 వేల నుంచి రూ. 5లక్షల వరకూ జరిమానా 2.తీవ్ర దాడులకు పాల్పడితే 3 నుంచి 10 సంవత్సరాల జైలుశిక్ష రూ. 2 నుంచి 10 లక్షల జరిమానా. 3.ఆసుపత్రులపై దాడిని తీవ్రనేరాలుగా పరిగణించాలి.పై శిక్షలను చట్టంలో పేర్కొన్నారు. ఈ నేరాలను కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్‌గా పరిగణించాలని తెలిపారు.2025లో డాక్టర్లపై జరిగిన దాడి ఘటనలు.1ఇటీవల కోల్‌కతాలో ఒక యువ డాక్టర్‌పై హత్యాచారం చేసి చంపిన సంగతి తెలిసిందే.2.హౌరాలో మహిళ డాక్టర్‌పై రోగి బంధువులు తీవ్రంగా దాడి చేసి అత్యాచారం చేశారు.3. మహారాష్ట్ర సతారాలో యువవైద్యురాలిపై లైంగిక దాడి ఆరోపణలు చేయడంతో ఆమె ఆత్మహాత్య చేసుకుంది.4. ఢిల్లీ ఏయిమ్స్‌లో రోగి బంధువులు డాక్టర్లపై దాడి చేశారు.భారత్‌లో దాదాపు 75 శాతం మంది తమ విధి నిర్వహణలో ఏదో సందర్భంలో దాడికి గురయ్యారని సర్వేలు తెలుపుతున్నాయి. ఇవే కాకుండా అధికారికంగా రికార్టుల్లోకి ఎక్కకుండా మరెన్నో ఘటనలు జరుగుతున్నాయి.ET-హెల్త్‌కేర్ సర్వేఈ సంస్థ సెప్టెంబర్‌లో ఎస్ఎన్ మెడికల్ కాలేజ్ జోధ్‌పూర్‌లోని 658మంది డాక్టర్లపై అధ్యయనం చేసింది. ఇందులో 60 శాతానికి పైగా డాక్టర్లు ఏదో ఒక రకమైన హింస ఎదుర్కొంటున్నట్లు తేలింది. అంతేకాకుండా అందులో 3శాతంకు పైగా డాక్టర్లపై శారీరక దాడులు జరిగినట్లు సర్వేలో వెల్లడైంది. అయితే డాక్టర్లపై దాడుల నియంత్రించడానికి గతంలోనూ దేశవ్యాప్తంగా చట్టాలు తేవడానికి ప్రయత్నాలు జరిగాయి. కాని అవి అమలులోకి నోచుకోలేదు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక మైన ఒక చట్టం తేవాలని భావిస్త్నున్నారు.తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో వైద్యులపై దాడికి ప్రత్యేక చట్టాలున్నాయి. అయితే వాటి అమలు విధానంలో లోపాలతో అవి సరైన కార్యరూపం దాల్చడం లేదు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒకే చట్టం రూపకల్పణ చేయాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. -
చంద్రబాబుకు కేంద్రం ఝలక్.. అమరావతి బిల్లు వెనక్కి..
-
చంద్రబాబుకు బిగ్ షాక్.. అమరావతి ఆగినట్టే!
-
‘అమరావతి బిల్లు’ వెనక్కి!
సాక్షి, న్యూఢిల్లీ: ‘అమరావతి’ని ఏపీ రాజధానిగా గుర్తించడానికి ఇబ్బందులు ఎదురయ్యాయా.. కేంద్రం ఏమైనా మెలిక పెడుతోందా.. నిధుల ప్రశ్న తలెత్తుతోందా.. వీటన్నింటికీ రాజకీయ విశ్లేషకులు ‘అవును’ అని సమాధానమిస్తున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే సీఎం చంద్రబాబుకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చిందంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 2014 నుంచి ఏపీ రాజధానిగా ‘అమరావతి’ని గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం పంపిన సిఫార్సులను కేంద్రం వెనక్కు పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2014 నుంచి అమరావతిని రాజధానిగా గుర్తిస్తే చట్టపరమైన సమస్యలు వస్తాయని కేంద్రం పేర్కొన్నట్లు తెలుస్తోంది. 2024ను పరిగణనలోకి తీసుకుంటే నిధులు ఖర్చు చేసిన విషయంపై న్యాయ పరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉందని చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో సహేతుకమైన సూచనలతో మరోసారి నోటిఫికేషన్‌తో రావాలని కేంద్రం ఏపీ పంపిన నోటిఫికేషన్‌ను వెనక్కు పంపిందని అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. నోటిఫికేషన్ ఫైల్ వెనక్కు రావడంతో న్యాయ పరమైన చిక్కులను తొలగించుకునే పనిలో ప్రభుత్వం ఉన్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. అన్నట్లు మారింది. రాజధానిపై కేంద్రం ప్రశ్నలురాజధాని బిల్లుపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ‘అమరావతి’కి చట్టబద్దత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సులు పంపింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే ‘అమరావతి’ని రాజధానిగా గుర్తించాలని చంద్రబాబు సర్కార్ కేంద్రాన్ని కోరింది. ‘పదేళ్ల పాటు ఏపీ, తెలంగాణకు ‘హైదరాబాద్’ రాజధానిగా ఉంది కదా? ఇటువంటి సమయంలో అప్పటి నుంచి ఎలా నోటిఫై చేస్తారని బాబు ప్రభుత్వాన్ని కేంద్రం ప్రశ్నించినట్లు సమాచారం. ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం–2014’లో ఈ అంశాన్ని పొందుపరిచిన విషయాన్ని కేంద్రం గుర్తు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇది సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తేల్చి చెప్పినట్లుగా సమాచారం. 2024 నుంచి రాజధానిగా ‘అమరావతి’కి చట్టబద్దత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, దీనిపై కూడా కేంద్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాగా, విభజన చట్టంలోని సెక్షన్ 5లో రాజధానికి సంబంధించిన అంశాలను కేంద్రం పొందు పరిచింది. ఇందులోని సబ్ సెక్షన్ 2లో.. ‘విభజన తర్వాత పదేళ్ల వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఏపీకి ‘కొత్త రాజధాని’ ఏర్పాటవుతుంది’ అని తెలిపింది. దీంతో పాటు ఏపీ కొత్త రాజధానికి కేంద్రం ఆర్థిక సహకారం కూడా ఉంటుందని సబ్ సెక్షన్ 3లో కేంద్రం పేర్కొంది. నోటిఫికేషన్ వెనక్కు?ఈ సందర్భంగా న్యాయ, చట్టపరమైన చిక్కులను అధిగవిుంచే సూచనలతో రావాలని నోటిఫికేషన్‌ను కేంద్రం వెనక్కు పంపినట్లు ఢిల్లీ వర్గాల ద్వారా తెలిసింది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్5(2)లో ‘అమరావతి’ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేర్చాలన్న సవరణకు కేంద్రం ఆమోదిస్తుందని ప్రభుత్వం ఆశ పడింది. కేంద్రం ఆమోదించి, వెంటనే ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశ పెట్టనున్నట్లు ఇటీవల కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీడియా ముఖంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సులపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేయడం, న్యాయ పరమైన చిక్కులు లేకుండా సజావుగా ఉంటే బిల్లు ఆమోదం పొందుతుందని కేంద్రం సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే రాజధాని బిల్లుకు ఆమోదం లభిస్తుందని ఆశపడ్డ కూటమి నేతలకు చేదు అనుభవం ఎదురైందని చెప్పొచ్చు. ఈ అంశంపై ‘సాక్షి’ ఇద్దరు ఎంపీలను ఆరా తీయగా.. సమయం వచ్చినప్పుడు పార్లమెంట్ ముందుకు వస్తుందంటూ సమాధానమిచ్చారు. ఇదిలా ఉండగా, ఈ విషయమై ఎలా ముందుకు వెళితే బావుంటుందో సూచించాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంత మంది న్యాయ నిపుణుల సలహా కోరినట్లు తెలిసింది. -
అణుశక్తి బిల్లు.. గేమ్ చేంజర్ అయ్యేనా?
నేటి(సోమవారం) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజున కేంద్ర ప్రభుత్వం దేశ ఇంధన రంగాన్ని సమూలంగా మార్చగల కీలక చట్టాన్ని ప్రవేశపెట్టనుంది. అదే అణుశక్తి బిల్లు- 2025. ఈ చారిత్రక బిల్లు ముఖ్య ఉద్దేశ్యం అణుశక్తి రంగాన్ని మొదటిసారిగా ప్రైవేట్ కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో తెరవడం. తద్వారా దేశంలో క్లీన్ ఎనర్జీ సామర్థ్యం పెంపొందుతుందని, శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.విధానపరమైన అంతరానికి చెక్ఈ బిల్లులోని అత్యంత కీలక అంశం.. అణు విద్యుత్ ప్లాంట్లకు టారిఫ్‌ల (సుంకాల)పై తగిన నిర్ణయం తీసుకోవడం. ఇప్పటివరకు అణు రంగంలో ప్రైవేట్ పెట్టుబడిని పరిమితం చేసేలా విధానపరమైన అంతరం ఎదురవుతోంది. సరైన టారిఫ్ రెగ్యులేషన్ విధానాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, ప్రభుత్వం దేశీయ ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆకర్షించాలని, వారికి లాభదాయకతను కల్పించాలని చూస్తోంది. అంతేకాకుండా ఈ బిల్లు ఆమోదం పొందితే ఇది విదేశీ టెక్నాలజీ ప్రొవైడర్లకు భారతదేశ అణు ప్రాజెక్టులలో ప్రవేశాన్ని సులభతరం చేస్తుంది. అలాగే ఫ్రాన్స్, రష్యా, అమెరికా తదితర దేశాల సాయంతో భారతదేశ అణు సామర్థ్యం బలోపేతం కానుంది.ఇప్పటివరకు న్యూక్లియస్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) ఆధిపత్యంలో ఉన్న అణుశక్తి రంగాన్ని ప్రైవేటీకరించడం ద్వారా భారతదేశ అణు విద్యుత్ సామర్థ్యం మరింతగా పెరగనుంది. బిల్లులో ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ప్రైవేట్ రంగ ప్రవేశం: ఈ బిల్లు దేశంలోని ప్రైవేట్ కంపెనీలు నేరుగా అణు విద్యుత్ ఉత్పత్తిలో పెట్టుబడి పెట్టడానికి మొదటిసారిగా అనుమతినిస్తుంది.టారిఫ్ రెగ్యులేషన్: అణు విద్యుత్ ప్లాంట్లకు సుంకాల (టారిఫ్) నిర్ణయాన్ని పరిష్కరించడానికి ఈ బిల్లు ఒక విధానాన్ని ప్రవేశపెడుతుంది. ఇది పెట్టుబడిదారుల లాభదాయకతను, వినియోగదారుల స్థోమతను సమతుల్యం చేయడానికి దోహదపడుతుంది.టెక్నాలజీ యాక్సెస్: బిల్లు ఆమోదం పొందిన తర్వాత విదేశీ టెక్నాలజీ ప్రొవైడర్లు భారతదేశ అణు ప్రాజెక్టులలో ప్రవేశించడం మరింత సులభం అవుతుంది.వికసిత భారత్ : భారత ప్రభుత్వం ఈ సంస్కరణను ‘వికసిత భారత్’ దార్శనికతలో భాగంగా చూస్తున్నది. క్లీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని పెంచడం, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా ఈ బిల్లు ప్రవేశపెడుతున్నారు.ఎదురయ్యే సవాళ్లుఅయితే ఈ సంస్కరణ పలు సవాళ్లను లేవనెత్తనుంది. విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి ఈ బిల్లు దోహదపడనున్నటప్పటికీ భద్రత, ప్రమాద బాధ్యతల ఆందోళనలు కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే అణు కార్యకలాపాలలో కఠిన నియంత్రణ, పర్యవేక్షణ అత్యవసరం. మరోవైపు కొన్ని ప్రాంతాలలో అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతను ప్రభుత్వం చల్లార్చాల్సి ఉంటుంది. కాగా ప్రస్తుత శీతాకాల సమావేశాలు డిసెంబర్ ఒకటి నుంచి 19వరకూ జరగనున్నాయి. అణు బిల్లుతో పాటు, చండీగఢ్ కోసం రాజ్యాంగ సవరణ, ఉన్నత విద్యలో సంస్కరణలు సహా 10 ప్రతిపాదిత చట్టాలను ప్రభుత్వం జాబితా చేసింది. అయితే ప్రతిపక్షం ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (సర్), జాతీయ భద్రత, పర్యావరణ ఆందోళనలు తదితర అంశాలపై చర్చను లేవనెత్తాలని భావిస్తున్నాయి. ఏదిఏమైనప్పటికీ అణుశక్తి బిల్లు- 2025 భారతదేశ ఇంధన భవిష్యత్తుకు ఒక చారిత్రక మలుపు కానుంది. ఇది కూడా చదవండి: AIDS Day: హెచ్ఐవీ నయం అవుతుందా? తాజా పరిశోధనల్లో.. -
‘ఎప్స్టీన్ ఫైళ్లు'.. ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ రహస్య ఫైళ్లను బహిరంగంగా విడుదల చేయాలంటూ న్యాయ శాఖను ఆదేశించే బిల్లుపై సంతకం చేసినట్లు ప్రకటించారు. రాజకీయ ఒత్తిడికి తలొగ్గి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తన సోషల్ మీడియా పోస్ట్‌లో ఆయన.. ‘మా అద్భుతమైన విజయాల నుండి దృష్టి మరల్చేందుకు ‘ఎప్స్టీన్ ఫైళ్లు' అంశాన్ని డెమొక్రాట్లు ఉపయోగించుకున్నారు’ అని ఆరోపించారు.‘ఎన్డీటీవీ’ అందించిన కథనంలోని వివరాల ప్రకారం ఈ బిల్లు ‘ఎప్స్టీన్ ఫైళ్లు పారదర్శకత చట్టం’ పేరుతో కాంగ్రెస్‌లో ద్వైపాక్షిక మద్దతు పొందింది. మంగళవారం హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌లో 427-1 ఓట్ల భారీ తేడాతో ఈ బిల్లు ఆమోదం పొందడం విశేషం. ట్రంప్ వ్యతిరేకత తర్వాత కూడా రిపబ్లికన్లతో సహా మెజారిటీ చట్టసభ సభ్యులు ఈ పారదర్శకతకు మద్దతు తెలిపారు. ఈ పరిణామం ఎప్స్టీన్ బాధితులకు, ఈ కేసులోని నిజానిజాలు తెలుసుకోవాలని కోరుకుంటున్న ప్రజలకు ఉపశమనం కలిగింది.ఈ చట్టం ప్రకారం.. న్యాయ శాఖ (డీఓజే) ఎప్స్టీన్కు సంబంధించిన అన్ని ఫైళ్లు, కమ్యూనికేషన్లను 30 రోజుల్లోపు విడుదల చేయవలసి ఉంటుంది. 2019లో ఫెడరల్ జైలులో ఎప్ స్టీన్ మరణంపై జరిగిన దర్యాప్తుకు సంబంధించిన సమాచారాన్ని కూడా బహిర్గతం చేయాలని ఈ బిల్లు కోరుతోంది. ఎప్స్టీన్ జైలులో ఆత్మహత్య చేసుకున్నప్పటికీ, అతని మరణంపై అనేక సందేహాలు, కుట్ర కోణాలు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ ప్రకటన కీలకంగా మారింది. అయితే ఈ బిల్లులో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. కొనసాగుతున్న ఫెడరల్ దర్యాప్తుల కోసం ఎప్స్టీన్ బాధితులకు సంబంధించిన కొన్ని సవరణలను (Redactions) చేయడానికి ఈ చట్టం అనుమతిస్తుంది. అంటే రాజకీయంగా ఎంతటి సున్నితమైన లేదా ఇబ్బందికరమైన సమాచారం ఉన్నా, అది తప్పనిసరిగా బహిర్గతం చేయవలసి ఉంటుంది. త్వరలోనే ఎప్స్టీన్ ఫైళ్లు వెల్లడి కానుండటంతో, దీనిలో ఏయే ప్రముఖుల పేర్లు బయటపడతాయో అనే ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది.ఇది కూడా చదవండి: ‘ఏడ్చినా.. పట్టించుకోను’.. టీచర్ వేధింపులకు విద్యార్థి బలి -
Tamil Nadu: హిందీ హోర్డింగులు, సినిమాలపై నిషేధం!
చెన్నై: త్రిభాషా సూత్రంపై తమిళనాట కేంద్ర ప్రభుత్వంతో విభేదాలు కొనసాగుతున్న తరుణంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో హిందీ ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు నడుంబిగించింది. ఈ మేరకు తమిళనాడు అసెంబ్లీలో కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి.న్యాయ నిపుణులతో అత్యవసర సమావేశంఇండియా టుడే వెల్లడించిన వివరాల ప్రకారం తమిళానాడు అంతటా హిందీ బోర్డులు, హోర్డింగ్‌లు, హిందీ సినిమాలు, హిందీ పాటల ప్రదర్శనను త్వరలో నిలిపివేయనున్నారు. ఈ ప్రతిపాదిత చట్టంపై ఇప్పటికే న్యాయ నిపుణులతో అత్యవసర సమావేశం కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. దీనిని చూస్తుంటే త్రిభాషా సూత్రం అమలుపై కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం మధ్య నెలకొన్న విభేదాలు మరింత తీవ్రం అయ్యేలా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో హిందీ భాషను నిషేధించే లక్ష్యంతో అసెంబ్లీలో ఒక బిల్లును త్వరలోనే ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రతిపాదిత చట్టం రూపకల్పనలోని న్యాయపరమైన అంశాలపై చర్చించేందుకు న్యాయ నిపుణులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు సమావేశమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి.హిందీని రుద్దడానికి వ్యతిరేకంగా..ఈ బిల్లును భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని డీఎంకేతో సహా అనేక రాజకీయ పార్టీలు గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. దీనిని అడ్డుకోవడంలో భాగంగానే డీఎంకే ప్రభుత్వం చట్టపరమైన చర్యలకు సిద్ధం అవుతున్నదని సమాచారం. హిందీ భాషను రుద్దడానికి వ్యతిరేకంగా శాసనసభ ఇటీవల ఒక కీలక తీర్మానాన్ని ఆమోదించింది. పార్లమెంటరీ కమిటీ నివేదికలోని సిఫారసులను అమలు చేయవద్దని ఆ తీర్మానంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.తమిళ భాషను కాపాడటమే లక్ష్యంగా..ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతూ, రాష్ట్రపతికి పార్లమెంటరీ కమిటీ నివేదించిన సిఫారసులు తమిళం సహా ఇతర రాష్ట్రాల భాషలకు, వాటిని మాట్లాడే ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. అప్పట్లో ప్రధాని నెహ్రూ ఇచ్చిన హామీ ప్రకారం హిందీయేతర రాష్ట్రాలు కోరుకునేంత వరకు ఆంగ్లం అధికారిక భాషగా కొనసాగుతుందని తెలిపారన్నారు. ఈ తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది. ప్రతిపాదిత బిల్లులోని వివరాల ప్రకారం బహిరంగ ప్రదర్శనలలో అంటే హోర్డింగులు, బోర్డులు, వినోద ప్రదర్శనలు, సినిమాలు పాటలు ఈ తరహా మాధ్యమాలలో హిందీ వాడకాన్ని నిషేధించనున్నారు. ఈ బిల్లు రాజ్యాంగానికి అనుగుణంగా ఉంటుందని, తమిళ భాష గుర్తింపును కాపాడటమే లక్ష్యంగా బిల్లును రూపొందించనట్లు అధికారులు తెలిపారు. -
Cow Cess: ఇదేందయ్యా ఇది.. ఇది మేం చూడలే!
పన్నులు కట్టే విషయంలో ఎంతో శ్రద్ధ కనబరిచే భారతీయులు.. వాటి విషయంలో కాస్త తేడా వచ్చినా సరే అగ్గి మీద గుగ్గిలం అయిపోతుంటారు. సోషల్ మీడియాలో తరచూ జరిగే డిస్కషన్లే అందుకు నిదర్శనం. అయితే బార్లో మందు తాగిన ఓ వ్యక్తికి.. బిల్లును తీక్షణంగా చూసే సరికి దిమ్మ తిరిగిపోయింది. అందులో 20 శాతం ఆవు పన్ను(Cow Cess) వేశారంటూ లబోదిబోమన్నాడు. ఇది ఎక్కడో కాదు మన దేశంలోనే జరిగింది. దీంతో కొంపదీసి ఇలాంటి ఓ కొత్త ట్యాక్స్ వచ్చిందా? అని మందుబాబులు తెగ ఫీలైపోతున్నారు. రాజస్థాన్ జైపూర్ పార్క్ ప్లాజాలో ఉన్న ఓ బార్కి వెళ్లాడు ఓ వ్యక్తి. ఆరు బీర్లు, ఫుల్‌గా స్టఫ్ ఆర్డర్ ఇచ్చాడు. వీటి విలువ రూ.2,650లే. అయితే జీఎస్టీలతో కలిపి మొత్తం రూ.3,262 అయ్యింది. అందులో 20 శాతం అంటే.. రూ.90 కౌ సెస్ అని ఉండడం చూసి ఆ వ్యక్తి కంగుతిన్నాడు. ఇదేందయ్యా ఇది.. అంటూ నెట్లో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది. ఆ పన్నుపై తీవ్రస్థాయిలో చర్చ నడిచింది. అయితే.. ఆ తాగుబోతు రాజస్థాన్‌కు కొత్తేమోనంటూ కొందరు కౌంటర్లు ఇస్తున్నారు. ఎందుకంటే.. రాజస్థాన్‌లో ఇదేం కొత్త వ్యవహారం కాదట. గత ఏడేళ్లుగా జరుగుతున్నదేనని ప్రభుత్వ వర్గాలు, ఇటు హోటల్ వాళ్లు ఈ వైరల్ బిల్లుపై స్పష్టత ఇచ్చారు. సదరు బార్ మేనేజర్ నిఖిల్ ప్రేమ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. రాజస్థాన్‌లో గో సంరక్షణ కోసం ఏడేళ్ల కిందటే ఈ పన్ను తీసుకొచ్చారని తెలిపారు. అయితే చాలా వరకు బార్ అండ్ హోటల్స్ దీనిని సర్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తుంటాయని, తాము మాత్రం కౌ సెస్ అని పేర్కొనడమే ఇప్పుడు ఈ చర్చకు దారి తీసిందని అంటున్నాడాయన. అంతేకాదు.. ప్రభుత్వ పోర్టల్స్‌లోనూ ఆ పేరుతోనే తాము వచ్చిన సొమ్మును జమ చేస్తామని తెలిపారు. అలాగే.. లిక్కర్ సేల్స్ వ్యాట్ మీద మాత్రమే ఈ పన్ను వసూలు చేస్తామని, ఆహార పదార్థాలపై జీఎస్టీ మాత్రమే ఉందని స్పష్టత ఇచ్చాడాయన. ఇదిలా ఉంటే.. ఇటు రెవెన్యూ సెక్రటరీ ఒకరు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే.. 2018 జూన్ 22న వసుంధర రాజే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుల చేసింది. రాజస్థాన్ వాట్ యాక్ట్ 2003 ప్రకారం.. బార్లలో అన్ని రకాల లిక్కర్ పైనా 20 శాతం ఆవుల సంరక్షణ పేరిట సర్ చార్జ్ వసూలు చేస్తారు. ఆ సొమ్ము గోరక్షణ నిధికి చేరుతుంది. అక్కడి నుంచి గో సంరక్షణ కేంద్రాలకు పంపించి వాటి నిర్వాహణ కోసం వెచ్చిస్తారు. ఆ తర్వాత అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం కూడా దానిని కొనసాగించింది.ఇదిలా ఉంటే రాజస్థాన్ ప్రభుత్వం ఆవుల సంరక్షణ కోసం ఏటా సుమరు రూ. 2000 కోట్లకు పైగా గ్రాంట్లు, సబ్సిడీల రూపంలో ఖర్చు చేస్తోంది. ఇందులో రూ. 600 కోట్లకు పైగా నేరుగా గోశాలలకు వెళ్తుంది. అయితే, ఆ మొత్తం ఖర్చు కేవలం 'కౌ సెస్' ద్వారా సమకూరదు. అదనంగా ప్రభుత్వ గ్రాంట్లు, బడ్జెట్ కేటాయింపుల రూపంలోనూ వెళ్తాయని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
భోజనం బిల్లు కట్టమంటే..ఇద్దరిపై లారీ ఎక్కించేశాడు!
శ్రీకాకుంళం జిల్లా, కంచిలిలో భోజనం బిల్లు చెల్లించాలని కోరిన హోటల్ యజమాని పట్ల ఓ లారీ డ్రైవర్ సైకోలా ప్రవర్తించాడు. లారీ ఎక్కించేసి దారుణంగా హతమార్చాడు. ఇదేంటని అడ్డుకున్న మరో వ్యక్తిని సైతం లారీతో తొక్కించి చంపేశాడు. ఈ ఘోరమైన ఘటన కంచిలి మండలం జలంత్రకోట గ్రామ కూడలి సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జాతీయ రహదారిపై సరుకులు రవాణా చేసే క్రమంలో జార్ఖండ్ నుంచి విశాఖపట్నంకు బయలుదేరిన కంటైనర్ లారీ బుధవారం రాత్రి కంచిలి మండలం జలంత్రకోట గ్రామ కూడలిలో జాతీయ రహదారి పక్కన దాబా హోటల్ వద్ద ఆగింది. డ్రైవర్ ఎబ్రార్ ఖాన్ భోజనం చేసి అక్కడే మద్యం తాగాడు. భోజనం బిల్లు రూ.200 చెల్లించాలని హోటల్ యజమాని ఎం.డి.అయూబ్(56) కోరగా అందుకు నిరాకరించాడు. గొడవపడి లారీ తీసుకొని వెళ్లిపోతుండగా యజమాని అడ్డుకున్నాడు. దీంతో అతన్ని ఢీకొట్టి పైనుంచి లారీ తీసుకెళ్లిపోయాడు. ఆ హోటల్‌కు రోజువారీ పాలు ఇచ్చి తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్న మధుపురం గ్రామానికి చెందిన పాల వ్యాపారి డొక్కర దండాసి(71) తాను నడుపుతున్న టీవీఎస్ ఎక్సెల్ వాహనంతో అడ్డుకున్నాడు. ఆయన్ను కూడా లారీతో తొక్కేసి పారి పోయాడు. ఈ ఘటనలో యజమాని, పాల వ్యాపారి అక్కడికక్కడే మృతిచెందారు. హోటల్ సిబ్బంది, స్థానికులు వెంబడించి బూరగాం వద్ద లారీని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మృతదేహాలకు సోంపేట ప్రభుత్వాసుపత్రిలో గురువారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించారు. వలస కుటుంబంలో విషాదం.. హోటల్ యజమాని ఎం.డి. అయూబ్ పదిహేనేళ్ల జార్ఖండ్ రాష్ట్రం చత్గల్ జిల్లా సత్గాం నుంచి 15 ఏళ్ల కిందట వలసవచ్చాడు. భార్య నసీమా బేగం, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
పంచాయతీరాజ్ బిల్లుకు కేటీఆర్ ఆమోదం
-
కళ్లు బైర్లు కమ్మేలా.. ఈ ‘ఇటుకలు’ చాలా కాస్ట్లీ గురూ..!
మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలో ఓ గ్రామం వార్తల్లో నిలిచింది. ఇటుకలు కొనుగోలుకు సంబంధించిన బిల్లు చూస్తే షాక్ కొట్టినంత పనైంది. బుధ్హర్ బ్లాక్ పరిధిలోని భటియా గ్రామంలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. ఆ గ్రామ పరిధిలో ఓ అంగన్వాడీ భవనం ప్రహరీ గోడ కోసం ఇటుకను కొనుగోలు చేశారు. మొత్తం 2500 ఇటుకలను కొనుగోలు చేయగా, బిల్లును రూ.1.25 లక్షలకు ఫైనల్ చేశారు. అంటే ఒక్కో ఇటుక ఖరీదు రూ.50 పడిందన్నమాట.ఈ రేటు సాధారణ ధర కంటే పది రెట్లు ఎక్కువ.. రూ. 1.25 లక్షల బిల్లుపై గ్రామ సర్పంచ్‌తో పాటు పంచాయతీ సెక్రటరీ కూడా సంతకం చేసి ఆమోదించారు. అనంతరం బిల్లులు మంజూరు చేసుకున్నారు. కాగా, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ స్థానిక యువత, గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. దీనిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ ఇటుకల కొనుగోలు బిల్లు పెరిబహారా గ్రామానికి చెందిన చేతన్ ప్రసాద్ కుష్వాహా పేరు మీద ఉంది. ఈ ఇటుకలను పటేరా టోలాలోని అంగన్వాడీ భవనం ప్రహరీ గోడ నిర్మాణానికి సరఫరా చేసినట్లు బిల్లులో పేర్కొన్నారు. షాడోల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ కేదార్ సింగ్ ఈ వ్యవహారంలో ఏదో తేడా ఉందని అంగీకరించారు. ఇలాంటి బిల్లులు నిర్లక్ష్యం వల్ల జరిగాయా లేక ఉద్దేశపూర్వక మోసమా అని తెలుసుకోవడానికి, క్లస్టర్ స్థాయి అధికారులను రోజుకు 10-12 పంచాయతీలను తనిఖీ చేయాలని అధికారులు ఆదేశించారు.ఇలాంటి సంఘటనలు కొత్తేమీ కాదు. కొన్ని రోజుల క్రితం కుద్రి గ్రామ పంచాయతీ రెండు పేజీల ఫోటో కాపీల కోసం రూ. 4,000 మంజూరు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే, మధ్యప్రదేశ్‌లోని శాధోల్ జిల్లాలో ఉండే చిన్న గ్రామం భడ్‌వాహీ. వాన నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ‘జల్ గంగ సంవర్ధన్’ పేరుతో ఒక కార్యక్రమం చేపట్టింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్, ఎస్డీఎం, పంచాయతీ కార్యదర్శి తదితరులు హాజరయ్యారు. అంతా కలిపి 24 మంది మాత్రమే. కానీ బిల్లు మాత్రం రూ..85 వేలు అయినట్లు పెట్టారు.వీళ్లంతా కలిసి ప్రజాధనం దోచేస్తున్నారు అనుకున్నారో ఏమో.. గుర్తు తెలియని వ్యక్తులు ఈ బిల్లును కాస్తా సోషల్ మీడియాలో పడేశారు. ఇంకేముంది.. ఒక్కపట్టున వైరల్ అయిపోయింది అది. గంట టైమ్‌లో ఈ 24 మంది అధికారులు కూర్చుని 14 కిలోల బాదాం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష తిన్నారట. ఇది చాలదన్నట్టు 30 కిలోల స్నాక్స్, కాఫీ/టీల కోసం ఆరు లీటర్ల పాలు.. ఐదు కిలోల చక్కెర వాడామని బిల్లులో పెట్టారు. -
పెద్దల కోసం పేదల భూములు... ‘నాలా’ చట్టం రద్దుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలపడంపై సర్వత్రా ఆందోళన
-
ఆన్లైన్ గేమింగ్‌పై నిషేధాస్త్రం
న్యూఢిల్లీ: దేశంలో జనం జేబులను గుల్లచేస్తూ, వారి ప్రాణాలను బలి తీసుకున్న ఆన్లైన్ గేమ్‌లకు చెక్‌పెట్టే దిశగా అత్యంత కీలకమైన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. డబ్బుతో ముడిపడి ఉన్న ఆన్లైన్ గేమ్‌లను నిర్వహించినా లేక ప్రోత్సహించినా లేక ప్రచారం చేసినా జైలుశిక్ష లేదా భారీ జరిమానా.. కొన్నిసార్లు జైలుశిక్షతోపాటు జరిమానా కూడా విధించేలా ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు–2025’ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది.ఆన్లైన్ మనీ గేమింగ్‌పై ఉక్కుపాదం మోపుతూ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించడంతో, చర్చ లేకుండానే ఈ బిల్లు మూజువాణి ఓటుతో సభలో ఆమోదం పొందింది. బిల్లును ఇక రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ కూడా ఆమోదం పొందితే రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారుతుంది. ఎన్నో కుటుంబాలు నాశనం: స్పీకర్ ఆన్లైన్ మనీ గేమింగ్ యువతకు వ్యసనంగా మారిందని, వారు ఆర్థికంగా నష్టపోతున్నారని, అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణన్ ఆందోళన వ్యక్తంచేశారు. ఆన్లైన్ గేమింగ్ బిల్లుపై ఆయన లోక్‌సభలో కొద్దిసేపు మాట్లాడారు. డబ్బుతో ప్రమేయం లేని ఈ–స్పోర్ట్స్, ఆన్లైన్ సోషల్ గేమింగ్‌ను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోందని, ఇందుకోసం ఒక అథారిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఆన్లైన్ మనీ గేమింగ్ యాప్‌ల వల్ల యువత నష్టపోవడంతోపాటు మనీ లాండరింగ్, ఆర్థిక నేరాలు, మోసాలు సైతం జరుగుతున్నాయని గుర్తుచేశారు.యాప్‌ల ద్వారా ఉగ్రవాద సంస్థలకు నిధులు అందుతాయని తెలిపారు. దీనిపై చర్చలో పాల్గొనాలని ప్రతిపక్ష సభ్యులను కోరగా, వారు వినిపించుకోలేదు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ... ప్రమాదకరమైన ఆన్లైన్ ఆటల వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయని, యువత భవిష్యత్తు దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆన్లైన్ గేమ్‌లపై ప్రభుత్వం నిషేధం విధించాలని గతంలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయని అన్నారు. ఎస్ఐఆర్ చర్చించాలని పట్టుబడుతూ విపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండడంతో స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేశారు. ఇండియాలో ఆన్లైన్ మనీ గేమ్‌ల వల్ల ప్రతిఏటా 45 కోట్ల మంది దాదాపు రూ.20,000 కోట్లు నష్టపోతున్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఏమిటీ బిల్లు? ⇒ అన్ని రకాల ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్(సట్టా, పోకర్, రమ్మీ, కార్డ్ గేమ్స్)తోపాటు ఆన్లైన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్, ఆన్లైన్ లాటరీలను నిషేధిస్తూ ఈ బిల్లును తీసుకొచ్చారు. డబ్బులు పెట్టి ఆన్లైన్లో ఆడే క్రీడలపై నిషేధం అమలవుతుంది. ⇒ ఆన్లైన్ గేమ్‌లకు ప్రచారం చేసినవారు కూడా నేరçస్తులే. ఇలాంటి గేమ్‌ల్లో ఒకరి నుంచి మరొకరికి ఆన్లైన్లో నగదు బదిలీలకు వీలు కల్పించిన బ్యాంక్‌లు లేదా ఆర్థిక సంస్థలను సైతం శిక్షిస్తారు. ⇒ఆన్లైన్ గేమ్‌ను ఏ రూపంలో నిర్వహించినా, ప్రోత్సహించినా, ప్రచారం చేసినా నేరమే. అంటే కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా చేసినా నేరంగా పరిగణిస్తారు. సోషల్ మీడియా లేదా పత్రికలు లేదా టీవీల్లో ప్రచారం చేసినా శిక్ష తప్పదు. ⇒ నైపుణ్యం లేదా అదృష్టం(చాయిప్)పై ఆధారపడిన ఏ గేమ్ అయినా నిషిద్ధమే. ⇒ మన దేశంలోనే కాకుండా.. దేశ సరిహద్దుల్లో లేదా విదేశీ గడ్డపై నుంచి గేమ్‌లను నిర్వహించినా దోషులే అవుతారు. ⇒ ఈ బిల్లు ప్రకారం.. ఆన్లైన్ గేమ్‌ల్లో పాల్గొన్నవారిని దోషులుగా కాకుండా బాధితులుగానే పరిగణిస్తారు. ⇒ డబ్బుతో సంబంధం లేదని ఈ–స్పోర్ట్స్, ఎడ్యుకేషనల్ గేమ్స్, సోషల్ గేమ్స్‌కు కొన్ని నియంత్రణలను బిల్లు సూచిస్తోంది. ⇒ సమాజంలో అశాంతి తలెత్తకుండా చూడాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని బిల్లులో పొందుపర్చారు. డిజిటల్ టెక్నాలజీని బాధ్యతాయుతంగా వాడుకొనేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ⇒ డబ్బు ప్రమేయం లేని ఈ–స్పోర్ట్స్ చట్టబద్ధమే అవుతాయి. ఇందుకోసం కేంద్ర క్రీడల శాఖ కొన్ని మార్గదర్శకాలు, ప్రమాణాలు రూపొందించాలని బిల్లులో సూచించారు. విద్యా, సాంస్కృతిక విలువలను పెంపొందించడానికి, నైపుణ్యాభివృద్ధికి, సమాజంలో ప్రజల మధ్య అనుసంధానానికి ఆన్లైన్ సోషల్ గేమ్స్‌ను ప్రోత్సహించవచ్చు. ఈ మేరకు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవాలి. ⇒ ఈ–స్పోర్ట్స్‌కు సంబంధించి శిక్షణ, పరిశోధనలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. ⇒ మానసికోల్లాసం, నైపుణ్యాభివృద్ధి కోసం సోషల్, ఎడ్యుకేషన్ గేమ్స్ ఆడుకోవచ్చు. ⇒ ఆన్లైన్ గేమ్‌లను వర్గీకరించడానికి, రిజిస్టర్ చేసుకోవడానికి రూ.50 కోట్లతో జాతీయ స్థాయిలో గేమింగ్ అథారిటీ ఏర్పాటు చేస్తారు. దీనికి ప్రతిఏటా రూ.20 కోట్లు కేటాయిస్తారు. ఎలాంటి గేమ్ అనేది ఈ అథారిటీ నిర్ణయిస్తుంది. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తుంది. గేమింగ్ సంస్థల అభ్యంతరాలు ఆన్లైన్ మనీ గేమింగ్‌ను నిషేధించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని గేమింగ్ సంస్థలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ఇండియా గేమింగ్ ఫెడరేషన్, ఈ–గేమింగ్ ఫెడరేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ వంటి సంస్థలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశాయి. మన దేశంలో ఆన్లైన్ స్కిల్ గేమింగ్ పరిశ్రమ నానాటికీ వృద్ధి చెందుతోందని, దీని విలువ రూ.2 లక్షల కోట్లకు చేరిందని వెల్లడించాయి.ఈ గేమ్‌లతో ప్రతిఏటా రూ.31,000 కోట్లకుపైగా ఆదాయం వస్తోందని తెలిపాయి. ప్రభుత్వానికి ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారా ఏటా రూ.20,000 కోట్లకుపైగా ఆదాయం లభిస్తోందని గుర్తుచేశాయి. ఈ పరిశ్రమ ప్రతి సంవత్సరం 20 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తోందని, 2028 నాటికి రెండురెట్లు అవుతుందని పేర్కొన్నాయి. అందుకే ఆన్లైన్ గేమ్‌లను నిషేధించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశాయి. శిక్షలేమిటి? ⇒ ఆన్లైన్ గేమ్‌లు నిర్వహిస్తే మూడేళ్ల వరకు జైలుశిక్ష పడుతుంది లేదా రూ.కోటి దాకా జరిమానా చెల్లించాల్సి రావొచ్చు. కొన్ని సార్లు ఈ రెండు శిక్షలూ అనుభవించాలి. ⇒ ఆన్లైన్ మనీ గేమ్‌లకు ప్రచారం చేస్తే రెండేళ్ల దాకా జైలు శిక్ష లేదా రూ.50 లక్షల జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ రెండు శిక్షలూ విధించవచ్చు. ⇒ నగదు బదిలీలకు సహకరిస్తే మూడేళ్ల దాకా జైలుశిక్ష లేదా రూ.కోటి జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో రెండు శిక్ష లూ విధించడానికి ఆస్కారం ఉంటుంది. ⇒ ఆన్లైన్ గేమ్‌లు నిర్వహిస్తూ మళ్లీమళ్లీ దొరికిపోతే 3 నుంచి 5 సంవత్సరాల దాకా జైలుశిక్ష, రూ.2 కోట్ల దాకా జరిమానా తప్పదు. ⇒ నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు న మోదు చేస్తారు. వారెంట్ లేకుండానే నిందితులను అరెస్టు చేయొచ్చు, విచారించవచ్చు. ⇒ ఆన్లైన్ గేమ్‌లకు ప్రచారం కల్పిస్తే సినిమా నటులైనా, క్రికెట్ ఆటగాళ్లయినా, ఇతర ప్రముఖులైనా శిక్ష నుంచి ఎలాంటి మినహాయింపులు ఉండవు. ⇒ ఆన్లైన్ గేమ్‌లను నిషేధించడం వల్ల ప్రభు త్వం కొంత ఆదాయం కోల్పోయే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమాన్ని, సమాజం బాగును దృష్టిలో పెట్టుకొని నిషేధం వైపే మొగ్గు చూపినట్లు సీనియర్ అధికారి చెప్పారు. -
ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఢిల్లీ: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌పై కేంద్రం నిషేధం విధించింది. ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. విపక్షాల నిరసనల మధ్య బిల్లుకు లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది. భారత్‌లో ఆన్లైన్ గేమింగ్‌కు నూకలు చెల్లాయి. నెటిజన్లను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా సర్వనాశనం చేస్తున్న ఈ భూతానికి సమాధి కట్టే దిశగా కేంద్రం కీలక చర్యలకు ఉపక్రమించింది.ఇందులో భాగంగా ఆన్లైన్ మనీ గేమింగ్ సేవలు అందించే ప్లాట్‌ఫాంలపై నిషేధం విధించింది. ఈ మేరకు ఆన్లైన్ ప్రమోషన్, నియంత్రణకు ఉద్దేశించిన ‘రెగ్యులేషన్, ప్రమోషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్’బిల్లుకు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఆన్లైన్ గేమ్ యూజర్లు ఎదుర్కొంటున్న మానసిక ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుంటూ ఈ దిశగా కఠిన చర్యలకు ఉపక్రమించింది.ముఖ్యంగా యూజర్లకు నగదు ప్రోత్సాహకాలను ఎరగా వేస్తున్న గేమింగ్ ప్లాట్‌ఫాంలపై ఉక్కుపాదం మోపనుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం చట్టబద్ధమైన ని యంత్రణ సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఒక ఆన్లైన్ గేమింగ్ నగదు బెట్టింగ్ పరిధిలోకి వస్తుందా, రాదా అన్నది తేల్చే పూర్తి అధికారాలు దానికి కట్టబెట్టనున్నారు.దేశాన్ని పట్టి పీడిస్తున్న నగదు అక్రమ చెలామణీ (మనీ లాండరింగ్), అక్రమ ఆర్థిక లావాదేవీలు, సైబర్ క్రైమ్ వంటి పలు జాఢ్యాలకు ఈ ఆన్లైన్ నగదు బెట్టింగ్‌లు ఊతమిస్తున్నట్టు తేలిన నేపథ్యంలో కఠిన చర్యలకు ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపారు. ఈ బిల్లును ఇవాళ (బుధవారం) లోక్‌సభలో ప్రవేశపెట్టారు.బిల్లులోని కీలకాంశాలు..👉రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్ సంస్థలు, బాధ్యులకు మూడేళ్ల కఠిన జైలు శిక్ష, రూ.కోటి దాకా జరిమానా. పదేపదే ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే ఐదేళ్ల దాకా జైలు శిక్ష పడుతుంది. 👉వాటిని ప్రచారం చేసే వ్యక్తులు, సంస్థలకు రెండేళ్ల దాకా జైలు, రూ.50 లక్షల దాకా జరిమానా 👉ఇలాంటి గేమింగ్ సంబంధిత నిధులను ప్రాసెస్ చేయకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థలపై నిషేధం 👉ఇలాంటి వాటిని ప్రోత్సహించే ప్లాట్‌ఫాంలకు వాణిజ్య ప్రకటనలను కూడా పూర్తిగా నిషేధిస్తారు 👉నమోదు కాని, అక్రమ గేమింగ్ ప్లాట్‌ఫాంలపై ఉక్కుపాదం మోపుతారు 👉ఇ–స్పోర్ట్స్, క్యాండీ క్రష్ వంటి నైపుణ్యాధారిత ఆన్లైన్ గేమ్స్ తదితరాలను ఇతోధికంగా ప్రోత్సహిస్తారు 👉ఇలాంటి గేమ్స్ ఆడేవారిని మాత్రం శిక్షల పరిధి నుంచి తప్పించారు. వారిని బాధితులుగా పరిగణించాలని నిర్ణయించారు -
ఆన్లైన్ గేమింగ్ బిల్లుపై కేంద్ర హోం మంత్రికి లేఖ
రియల్ మనీ గేమ్స్‌పై నిషేధం విధించే విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ భారత ఆన్లైన్ గేమింగ్ సంస్థలు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశాయి. ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు-2025ను బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో ఈమేరకు లేఖ రాయడం గమనార్హం. ఇప్పటికే ఈ బిల్లును కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదించింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న ఈ బిల్లులో ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని నియంత్రించడానికి ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు.ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ (ఏఐజీఎఫ్), ఈ-గేమింగ్ ఫెడరేషన్ (ఈజీఎఫ్), ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫాంటసీ స్పోర్ట్స్ (ఎఫ్ఐఎఫ్ఎస్) సంయుక్తంగా కేంద్రం హోం మంత్రికి ఇచ్చిన వినతిపత్రంలో ఆసక్తికర అంశాలు తెలిపారు. ఆన్లైన్ స్కిల్ గేమింగ్ విభాగం ఒక ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఎకానమీని సృష్టిస్తుందని చెప్పారు. ‘భారతదేశపు డిజిటల్ గేమింగ్ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది యువ పారిశ్రామికవేత్తలు, డెవలపర్లు, నిపుణులు కొత్త ఆన్లైన్ గేమింగ్ బిల్లు వల్ల తీవ్రంగా ప్రభావితం చెందుతారు. ఇందులోని నిషేధ నియమాలు చట్టబద్ధమైన, ఉద్యోగాలను సృష్టించే పరిశ్రమను దెబ్బ తీస్తుంది’ అని తెలిపారు.ప్రస్తుతం ఈ పరిశ్రమ రూ.2 లక్షల కోట్లకు పైగా ఎంటర్ప్రైజ్ వాల్యుయేషన్‌ను, రూ.31,000 కోట్ల వార్షిక ఆదాయం, ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో రూ.20,000 కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూరుస్తోందని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. 20 శాతం సీఏజీఆర్‌తో వృద్ధి చెందుతున్న ఈ రంగం 2028 నాటికి రెట్టింపు అవుతుందని అంచనా. భారతదేశంలో ఆన్లైన్ గేమర్లు 2020లో 36 కోట్ల నుంచి 2024లో 50 కోట్లకు పెరిగారు. జూన్ 2022 వరకు రూ.25,000 కోట్లకు పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆ రంగం ఆకర్షించింది. ఈ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. గేమింగ్, టెక్నాలజీ, డిజిటల్ ఎంటర్టైన్మెంట్లో ప్రపంచానికి నాయకత్వం వహించే అవకాశం భారత్‌కు ఉందని, నిషేధానికి బదులు ప్రగతిశీల నియంత్రణను అవలంబించాలని లేఖలో ప్రభుత్వాన్ని కోరారు.ఇదీ చదవండి: బంగారం ధరలు యూటర్న్!ఈ-స్పోర్ట్స్, ఎడ్యుకేషనల్ గేమ్స్, సోషల్ గేమింగ్‌తో సహా ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని ప్రోత్సహించడానికి, కొన్ని అంశాల్లో నియంత్రించడానికి, వ్యూహాత్మక అభివృద్ధి, నిరంతర పర్యవేక్షణ కోసం ఒక అథారిటీని ఏర్పాటు చేసేలా వీలు కల్పించే బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆన్లైన్ గేమ్స్, ఈ-స్పోర్ట్స్ మధ్య స్పష్టమైన విభజన సూచించేలా బిల్లును రూపొందించారు. నిబంధనల్ని ఉల్లంఘించి ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్నవారికి మూడేళ్ల వరకు జైలుశిక్ష, లేదా రూ.కోటి వరకు జరిమానా, లేదా ఆ రెండూ విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. సంబంధిత అడ్వర్టయిజ్మెంట్లలో భాగం పంచుకున్నవారికి గరిష్ఠంగా రెండేళ్ల జైలుశిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. వీటి ఆర్థిక లావాదేవీల్లో ప్రమేయం ఉన్నవారికీ గరిష్ఠంగా మూడేళ్ల శిక్ష, రూ.కోటి వరకు జరిమానా వేస్తారు. -
ఒకే గోడ.. 4 లీటర్ల పెయింట్.. 233 మంది కార్మికులు
భోపాల్: దేశంలో రకరకాలుగా అక్రమాలు, మోసాలు జరుగుతున్నాయి. కానీ, ఇంతటి విడ్డూరాన్ని ఎన్నడూ చూడలేదంటూ ముక్కున వేలేసుకుంటున్నారు జనం. మధ్యప్రదేశ్‌లోని షహ్డోల్ జిల్లాలో వెలుగుచూసిందీ అంకెల గారడీ. బియోహరి అసెంబ్లీ నియోజకవర్గంలోని సకండి గ్రామ ప్రభుత్వ పాఠశాల గోడకు నాలుగు లీటర్ల రంగు వేసేందుకు ఏకంగా 168 మంది కూలీలు, 65 మంది తాపీ పనివారిని వినియోగించారు. ఇందుకోసం కాంట్రాక్టర్ రూ.1.07 లక్షల బిల్లు చేశాడు. ఎలాంటి పరిశీలనలు లేకుండానే అధికారులు సంతకాలు చేయడం, నగదు డ్రా చేసుకోవడం జరిగిపోయాయి. ఇలాంటిదే మరోటి..నిపనియా గ్రామంలోని స్కూలుకు 10 కిటికీలు, నాలుగు తలుపులకు 20 లీటర్ల రంగు వేసేందుకు 275 మంది కార్మీకులను, 150 మంది తాపీ పనివారిని పెట్టుకున్నారట. వీరికోసం కాంట్రాక్టర్ రూ.2.3 లక్షల మేర బిల్లు కోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు ఓకే చెప్పేశారు. స్కూలు భవనం గోడలపై కనిపించాల్సిన వీరి పనితనం..ఉత్తుత్తి లెక్కలు రాయడంలో రాటుదేలింది. సుధాకర్ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ ఇలాంటి కాకి లెక్కలు చూపి మే 5వ తేదీన బిల్లు చేసింది. ఈ బిల్లును ఏప్రిల్ 4వ తేదీనే స్కూలు ప్రిన్సిపాల్ ఓకే చేసినట్లు రికార్డుల్లో ఉంది. రంగు వేయడానికి ముందు, తర్వాత ఫొటోలను బిల్లులకు జత చేయడం తప్పనిసరి. ఏ ఫొటోలు లేకుండానే ఈ కంపెనీకి బిల్లులు మంజూరైపోవడం మరో ఘనత. బిల్లుల వ్యవహారం సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో నెటిజన్లు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఫూల్ సింగ్ మర్పంచి స్పందిస్తూ... సకండి, నిపనియా స్కూళ్లకు వేసిన రంగుల బిల్లు వ్యవహారం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దర్యాప్తు చేపట్టి, బాధ్యులైన వారిపై చర్యలుతీసుకుంటాం’అంటూ ముక్తసరిగా చెప్పేయడం విశేషం. -
అదే జరిగితే.. రేపే కొత్త పార్టీ పెడతా!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సన్నితుడిగా, రాజకీయ సలహాదారుడిగా వ్యవహరించిన అపర కుబేరుడు ఎలాన్ మస్క్.. ఇప్పుడు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా బ్యూటీఫుల్ బిల్‌పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదొక పిచ్చి ఖర్చు అని, పన్ను చెల్లింపుదారులకు భారంగా మారుతుందని అన్నారాయన. అలాగే పార్టీ ఏర్పాటుపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.వాషింగ్టన్: గతంలో ట్రంప్‌కు మద్దతుగా నిలిచిన మస్క్.. తన ఎక్స్ వేదికగా అదే వ్యక్తి పాలనా విధానాలను వరుస పోస్టులతో తిట్టిపోస్తున్నారు. ట్రంప్ ప్రతిపాదిత బిగ్ బ్యూటీఫుల్ బిల్లుపై మరోసారి స్పందిస్తూ..ఈ బిల్లు సాధారణ అమెరికన్లకు నష్టం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో కొత్త పార్టీ ఏర్పాటుపైనా ఆయన కీలక ప్రకటన చేశారు. ఖర్చులను తగ్గిస్తామని చెప్పిన రిపబ్లికన్ నాయకులు ఇప్పుడు భారీ ఖర్చులకు మద్దతు ఇస్తున్నారు. అమెరికా సెనేట్‌లో ప్రస్తుతం ఓట్ల పోరు కొనసాగుతోంది. రిపబ్లికన్లు ట్రంప్ రెండో పదవీకాలానికి కీలకమైన ఈ బిల్లును ఆమోదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ బిల్లు ఆమోదితమైతే, ప్రజల కోసం నిజంగా పనిచేసే కొత్త రాజకీయ పార్టీ అమెరికా పార్టీని రేపే స్థాపిస్తానంటూ మస్క్ వ్యాఖ్యానించారు. ట్రంప్ కోసం 250 మిలియన్ డాలర్లతో మద్దతు ప్రచారం నిర్వహించిన మస్క్.. ట్రంప్ ప్రతిపాదించిన బిల్లు అమెరికన్లకు తీవ్ర నష్టం చేకూరుస్తుందనే అభిప్రాయం తొలి నుంచి వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లుతో జరిగే పిచ్చి ఖర్చు స్పష్టంగా చూపిస్తోంది. ఇది దేశపు అప్పు పరిమితిని రికార్డు స్థాయిలో ఐదు ట్రిలియన్ డాలర్ల వరకు పెంచుతోంది. ప్రజల గురించి నిజంగా పట్టించుకునే కొత్త రాజకీయ పార్టీ ఏర్పడాల్సిన సమయం వచ్చింది. అంటూ ఎక్స్ ఖతాలో పోస్ట్ చేశారాయన. తద్వారా.. మస్క్ ప్రస్తుత అమెరికా రాజకీయ వ్యవస్థపై తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరిచారు. అమెరికా సెనేట్ ప్రస్తుతం ట్రంప్ ప్రతిపాదించిన "One Big, Beautiful Bill" పై ఓట్ల పోరులో నిమగ్నమై ఉంది. ఈ బిల్లును జూలై 4 స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఆమోదించాలనే లక్ష్యంతో రిపబ్లికన్లు వేగంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలుహౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ గత నెలలో ఈ బిల్లును తక్కువ మెజారిటీతో ఆమోదించింది.ఇప్పుడు సెనేట్ తమ సవరణలతో కూడిన బిల్లును తుది రూపంలోకి తీసుకురావాల్సి ఉంది.ఆ తర్వాత హౌస్ మళ్లీ ఆ సవరణలను ఆమోదించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ బిల్లు చట్టంగా మారేందుకు అధ్యక్షుడి సంతకం కోసం పంపబడుతుంది. ఈ బిల్లులో..సరిహద్దు భద్రత, రక్షణ, శక్తి ఉత్పత్తికి భారీ ఖర్చులు ప్రతిపాదించబడ్డాయి. అయితే ఆరోగ్య సంరక్షణ, పోషకాహార కార్యక్రమాలపై ఖర్చులను తగ్గించనున్నారు.అమెరికా కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం అంచనా ప్రకారం, ఈ బిల్లు వచ్చే దశాబ్దంలో దాదాపు $3.3 ట్రిలియన్ డాలర్ల లోటును కలిగించనుంది. -
మరో దోపిడీకి తెరలేపిన విద్యుత్ శాఖ
విజయవాడ నగరంలో స్క్యూ బ్రిడ్జి సమీపంలో నివసించే లక్ష్మికి ఏపీ సీపీడీసీఎల్ నుంచి ఈ నెల విద్యుత్ బిల్లుతో పాటు అదనపు వినియోగానికి సెక్యూరిటీ డిపాజిట్ (అడిషనల్ కన్జంప్షన్) చెల్లించాలంటూ ఓ నోటీసు వచ్చింది. అది చూసిన లక్ష్మికి గుండె ఆగినంత పనైంది. ఆమె విద్యుత్ సర్వీసు తీసుకున్నప్పుడు రెండు నెలలకు అడ్వాన్స్‌గా రూ.1,600 చెల్లించారు.కానీ.. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకూ వినియోగించిన విద్యుత్ ఆధారంగా రూ.15,132 సెక్యూరిటీ డిపాజిట్ కట్టాల్సి ఉందని, అందులో రూ.1,600 పోనూ మిగిలిన రూ.13,532ను 30 రోజుల్లోగా చెల్లించాలని ఆ నోటీసులో ఉంది. ఇప్పటికిప్పుడు అంత సొమ్ము ఎక్కడి నుంచి తేవాలో తెలియక, ఇదెక్కడి అన్యాయం బాబూ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.‘విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి. మీ విద్యుత్ సర్వీసు లోడ్ క్రమబద్ధీకరణకు చక్కటి అవకాశం వచ్చింది. చెల్లించాల్సిన డిపాజిట్లో 50 శాతం రాయితీ లభిస్తుంది. త్వరపడండి. ఈ అవకాశం కొంతకాలం మాత్రమే’ అంటూ ఇటీవల డిస్కంలు అరకొర ప్రకటనలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే.. క్రమబద్ధికరణ పేరుతో రాష్ట్ర ప్రజల నుంచి డిస్కంలు అడ్డదారిలో మరో దోపిడీకి పాల్పడుతున్నాయి.ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)ని ఏమార్చి, విద్యుత్ వినియోగదారులను మోసం చేసి, రాయితీ పేరుతో అదనపు భారాన్ని మోపుతున్నాయి. ఇప్పటికే రూ.15,485 కోట్ల అదనపు చార్జీల భారంతో విద్యుత్ బిల్లులు రెట్టింపయ్యాయి. వాడిన దానికి మించి వాడని విద్యుత్‌కు కూడా అకారణంగా బిల్లులు చెల్లించాల్సి వస్తోందని జనం గగ్గోలు పెడుతున్నారు.అది చాలదన్నట్టు ఇప్పుడు లోడ్ క్రమబద్ధికరణ, అదనపు వినియోగ సెక్యూరిటీ డిపాజిట్ వంటి పేర్లతో నోటీసులు జారీ చేస్తూ ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారు. విద్యుత్ బిల్లుతో పాటు వస్తున్న ఈ నోటీసులను వినియోగదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. – సాక్షి, అమరావతిఇప్పుడెందుకు గుర్తొచ్చింది?విద్యుత్ సర్వీసు తీసుకునే సమయంలో అధికారులు గతంలో గృహంలో ఉన్న పరికరాల ఆధారంగా కనెక్టెడ్ లోడ్‌ను అంచనా వేసి కాంట్రాక్టెడ్ లోడ్‌ను నిర్ణయించేవారు. ప్రస్తుతం విద్యుత్ బిల్లులో కనెక్టెడ్ లోడ్, కాంట్రాక్టెడ్ లోడ్ వివరాలను చేర్చి, వినియోగదారులు తమ లోడ్‌ను క్రమబద్ధికరించుకోవాలని సూచిస్తున్నారు. కాంట్రాక్టెడ్ లోడ్ కంటే ఎక్కువ వినియోగం ఉంటే.. అదనపు లోడ్ ఆధారంగా చార్జీలు విధిస్తున్నారు. అందులో భాగంగా కాంట్రాక్టెడ్ లోడ్ కంటే ఎక్కువగా వినియోగం ఉన్న వినియోగదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ నోటీసుల్లో అదనపు లోడ్ చార్జీలను చెల్లించాలని లేదా లోడ్‌ను క్రమబద్ధికరించాలని చెబుతున్నారు.జూన్ 30లోగా క్రమబద్ధీకరించుకునే వారికి 50 శాతం రాయితీ ఇస్తామని ఏపీఈఆర్సీ ద్వారా ఓ ఆఫర్‌ను కూడా తీసుకొచ్చారు. దానిని ముందు పెట్టి అవసరమైన వాళ్లకు, అవసరం లేని వాళ్లకు కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పుడు కట్టకపోతే పూర్తి మొత్తం చెల్లించాలని చెబుతున్నారు. ఈ కొత్త చార్జీలు వినియోగదారులకు, ముఖ్యంగా సామాన్యులకు భారంగా మారుతున్నాయి. ఇన్నాళ్లూ లేని చార్జీలు ఇప్పుడు ఆకస్మికంగా విధించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.అసలేమిటీ లోడ్విద్యుత్ లోడ్ భారం అనేది ఒక గృహం, సంస్థలో విద్యుత్ వినియోగానికి అవసరమైన మొత్తం విద్యుత్ అవసరాన్ని సూచిస్తుంది. దీనిని సాధారణంగా కిలోవాట్లలో కొలుస్తారు. ఈ లోడ్ రెండు రకాలుగా విభజిస్తారు. ఒకటి కనెక్టెడ్ లోడ్. అంటే.. ఒక విద్యుత్ సర్విసుకు అనుసంధానంగా ఉన్న ఫ్యాన్లు, లైట్లు, ఏసీలు, టీవీలు వంటి అన్ని పరికరాల మొత్తం విద్యుత్ సామర్థ్యం. రెండవది కాంట్రాక్టెడ్ లోడ్.. అంటే విద్యుత్ సరఫరా సంస్థతో వినియోగదారుడు చేసుకున్న ఒప్పందం ప్రకారం అనుమతించిన గరిష్ట లోడ్. ఉదాహరణకు 2 కిలోవాట్ల కాంట్రాక్టెడ్ లోడ్‌ను ఎంచుకుని అంతకు మించి వినియోగం ఉంటే అదనపు చార్జీలుగానీ, జరిమానా గానీ చెల్లించాల్సి ఉంటుంది.అయితే గృహ విద్యుత్ వినియోగంలో చాలామంది సామాన్య, పేద కుటుంబాలు కేవలం ఫ్యాన్లు, లైట్లు, టీవీ వంటి సాధారణ విద్యుత్ పరికరాలను మాత్రమే ఉపయోగిస్తాయి. వాటి లోడ్ అధికంగా ఉండకపోయినా అదనంగా కట్టాలనడం వల్ల వారిపై ఆరి్థక భారం పడుతుంది. గృహ వినియోగదారులు కిలోవాట్‌కు రూ.2,000 అదనపు లోడ్ చార్జీ, రూ.200 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. ఈ లెక్కన 5 కిలోవాట్లకు నోటీసు ఇస్తే రూ.11 వేలు చెల్లించాలి. ఇందులో లోడ్ చార్జీలపై సగం రాయితీ ఇస్తే రూ.5 వేలు తగ్గుతుంది. మిగతా రూ.6 వేలు నెల రోజుల్లోపు చెల్లించకపోతే సర్వీసు తొలగించి సరఫరా నిలిపివేస్తామని విద్యుత్ శాఖ హెచ్చరిస్తోంది. -
‘బిస్కెట్ డబ్బా’ నుంచే బిగ్ డిబేట్
వెల్లింగ్టన్: అత్యవసర సమయాల్లో అక్కర కొస్తాయని డబ్బును ఇంట్లో అమ్మవాళ్లు పోపుల డబ్బాల్లో దాస్తారు. అదే తరహాలో దేశ భవిష్యత్‌ను నిర్దేశించే ప్రతిపాదిత బిల్లులను న్యూజిలాండ్ పార్లమెంటేరి యన్లు బిస్కెట్ డబ్బాలో పెడతారు. అందులోంచి ఎంపిక చేసిన బిల్లుపైనే చర్చ జరుపుతారు. ఈ వింత సంప్రదాయ న్యూజిలాండ్‌లో 20వ శతాబ్దం నుంచే ఉంది. గురువారం పార్లమెంట్లో బిల్లులపై చర్చ సందర్భంగా మళ్లీ ఆ బిస్కెట్ డబ్బాను తీసుకురావడంతో ఇప్పుడిది చర్చనీయాంశమైంది. సాధారణంగా పార్ల మెంట్ కీలక అజెండాలో ఉన్న బిల్లులను ఈ కుకీ టిన్‌లో వేయరు. గతంలో కొత్త చట్టాలకు సంబంధించి మంత్రులుకాని సభ్యుల నుంచి ఏమైనా ప్రతిపాదనలు వస్తే వాటిల్లో దేనిని చర్చించాలనే మీమాంస మొదలైంది. ఎవరికి వారు తమ ప్రతిపాదనపైనే చర్చ జరపాలని పట్టు బట్టారు. వీటికి ప్రజాస్వామ్యయుతంగా చెక్ పెట్టేందుకే ఈ బిస్కెట్ డబ్బాను తెచ్చారు. 1990 దశకంలో వెల్లింగ్టన్ సిటీలోని ‘డేకా’సంస్థ సరకుల దుకాణం నుంచి పార్లమెంట్ ఉద్యోగి ఒకరు ఈ బిస్కెట్ డబ్బాను తీసుకొచ్చారు. సభ్యుల బిల్లుల సంబంధించిన టోకెన్లను ఈ డబ్బాలో వేస్తారు. వైజ్ఞానిక సందర్శనలో భాగంగా పార్లమెంట్‌కు వచ్చిన విద్యార్థు లు లేదా రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులతో ఈ డబ్బాలోని టోకెన్‌ను లక్కీడిప్ తరహాలో తీయిస్తారు. అలా తీసిన బిల్లుపై మాత్రమే చర్చ జరుపుతారు. న్యూజిలాండ్‌లో కొన్ని కీలక చట్టాలుగా రూపుదాల్చిన కొన్ని ప్రతిపాదిత బిల్లులు సైతం ఇలా బిస్కెట్ డబ్బా నుంచే లక్కీ డిప్లో ఎంపికచేసినవే కావడం విశేషం. వివాహంలో సమానత్వ చట్టం, కారుణ్య మరణాలకు బాటలు వేసిన చట్టాలు ఇలా వచ్చినవే. ‘‘కొత్త డబ్బాను తెచ్చి అందులోని బిస్కెట్లన్నీ తినేస్తాం. తర్వాత ఒకటి, రెండు అంటూ 90 దాకా టోకెన్లు వేస్తాం. అందులో వచ్చిన టోకెన్ నంబర్ ఉన్న ప్రతిపాదిత బిల్లుపైనే చర్చ జరు పుతారు’’అని న్యూజిలాండ్ దిగువసభలో క్లర్క్ అయిన డేవిడ్ విల్సన్ చెప్పారు. -
ప్రైవేట్ స్కూల్స్‌లో ఫీజుల దోపిడీకి చెక్.. చట్టం అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ఢిల్లీ : ప్రైవేట్ స్కూళ్లల్లో అడ్డగోలు ఫీజుల దందాపై చరిత్రలో తొలిసారి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఢిల్లీ స్కూళ్లలో ఫీజులు ఎంత మేరకు ఉండాలనే అంశంపై ప్రభుత్వం విధివిధానాల్ని ఖరారు చేసింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోనుంది.ఫీజుల స్థిరీకరణ,నియంత్రణ బిల్లు- 2025పై ఢిల్లీ కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో పలు స్కూల్స్ ఏకపక్షంగా ఫీజుల పెంచుతున్నారంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఢిల్లీ కేబినెట్ మంగళవారం పాఠశాల ఫీజులను నియంత్రించడానికి చట్టాన్ని ఆమోదించింది. అనంతరం ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మీడియాతో మాట్లాడారు. నా ఆనందానికి అవధుల్లేవు.ఢిల్లీ ప్రభుత్వం ధైర్యమైన నిర్ణయం నిర్ణయం తీసుకుంది. పలు స్కూల్స్ ఏకపక్షంగా ఫీజుల పెంచుతున్నారంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఢిల్లీ కేబినెట్ మంగళవారం పాఠశాల ఫీజులను నియంత్రించడానికి ఒక చట్టాన్ని ఆమోదించింది.📢 Big Reform in Delhi Education!CM Rekha Gupta: “For the first time in history, Delhi Govt has passed a foolproof Bill to regulate fees and set clear guidelines for all 1677 schools — aided, unaided, private, all included.”A bold step toward transparency and fairness in… pic.twitter.com/YzwzSBpLwP— भँ० अजीत सिंह तोमर (@Bhanwar_Ast) April 29, 2025 ఢిల్లీ ప్రభుత్వం చారిత్రాత్మక,సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఫీజుల స్థిరీకరణ,నియంత్రణ బిల్లు- 2025 ముసాయిదా బిల్లును ఈరోజు కేబినెట్ ఆమోదించిందని మీకు చెప్పడానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను’అని అన్నారు.ఢిల్లీలోని 1,677 పాఠశాలలు ఎయిడెడ్, నాన్-ఎయిడెడ్ లేదా ప్రైవేట్ అయినా, ఫీజులకు సంబంధించిన పూర్తి మార్గదర్శకం, విధానాన్ని నిర్ణయిస్తారు. చరిత్రలో మొదటిసారిగా, అటువంటి బిల్లును ప్రభుత్వం రూపొందిస్తోందన్నారు. విద్యా మంత్రి ఆశిష్ సూద్ మాట్లాడుతూ, కొత్త నిబంధనలను అమలు చేయడానికి మూడు కమిటీలను ఏర్పాటు చేస్తామని, పాఠశాల మౌలిక సదుపాయాల ఆధారంగా మూడు సంవత్సరాల పాటు ఫీజులను ప్యానెల్లు నిర్ణయిస్తాయని అన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా నిర్ణయం తీసుకునే ప్రక్రియలో పాల్గొంటారని చెప్పారు. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలోని పలు స్కూళ్లు ఏకపక్షంగా ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ తల్లి దండ్రుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి.ఫిర్యాదులతో పలు పాఠశాలలకు ఢిల్లీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. తన ప్రభుత్వం పారదర్శకత, పిల్లల విద్యా హక్కు రక్షణకు కట్టుబడి ఉందని ఆ సమయంలో సీఎం రేఖా గుప్తా స్పష్టం చేశారు. -
Waqf (Amendment) Bill: నినాదాలతో దద్దరిల్లిన అసెంబ్లీ.. ఎన్సీ ఎమ్మెల్యేల రభస
జమ్మూ: జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో వక్ఫ్ (సవరణ) బిల్లు-2025(Waqf (Amendment) Bill)పై చర్చ రసాభాసకు దారితీసింది. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్ అబ్దుల్ రహీం రాథర్ సోమవారం రెండుసార్లు సభను వాయిదా వేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఎమ్మెల్యేలు వక్ఫ్ (సవరణ) బిల్లు-2025పై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ, సభలో గందరగోళం సృష్టించారు. అయితే ఈ అంశం న్యాయస్థానం విచారణలో ఉందని స్పీకర్ సమాధానమిచ్చారు.12 రోజుల విరామం తర్వాత సోమవారం ఉదయం సభా కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే ఎన్సీ శాసనసభ్యులు వక్ఫ్ (సవరణ) బిల్లు-2025పై చర్చ జరపాలని కోరుతూ లేచి నిలుచున్నారు. గతంలో జీఎస్టీ చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చినప్పుడు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ(Jammu and Kashmir Assembly)లో చర్చ జరిగిందని, ఇప్పుడు ముస్లిం మెజారిటీ ఉన్న జమ్ము కశ్మీర్లో వక్ఫ్ బిల్లుపై చర్చ ఎందుకు జరగకూడదని వారు ప్రశ్నించారు. దీనికి స్పందించిన స్పీకర్ ఈ అంశం దేశంలోని అత్యున్నత న్యాయస్థానం విచారణలో ఉన్నందున చర్చకు అభ్యంతరం తెలిపారు.ఈ నేపధ్యంలో ఎన్సీ ఎమ్మెల్యేలు సభలోని వెల్‌లోకి వచ్చి, నిరసనలు వ్యక్తం చేస్తూ, కాగితాలను చించి, నల్లటి బ్యాడ్జ్‌లను గాలిలో ఊపారు. దీంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి సభా కార్యకలాపాలు ప్రారంభమైనప్పుడు కూడా ఎన్సీ ఎమ్మెల్యేలు బీజేపీ వ్యతిరేక నినాదాలు కొనసాగించారు. తరువాత వారు పోడియంవైపు వచ్చేందుకు ప్రయత్నించగా వారినిమార్షల్స్ అడ్డుకున్నారు.ఇదే సమయంలో బీజేపీ శాసనసభ్యులు దేశ విద్రోహుల ఎజెండా ఇక్కడ నడవదంటూ నినాదాలు చేశారు. నిరసన చేస్తున్న ఎన్సీ ఎమ్మెల్యేలను శాంతించేందుకు స్పీకర్ ప్రయత్నిస్తూ, వారిని తిరిగి వారి సీట్లలో కూర్చోమని కోరారు. ఇంతలో.. తాము వక్ఫ్ బిల్లుపై మాత్రమే చర్చను కోరుకుంటున్నామని, ఇది మా మతంపై జరుగుతున్న దాడి అని ఎన్సీ ఎమ్మెల్యే నజీర్ గురేజీ వ్యాఖ్యానించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, విపక్ష శాసనసభ్యులు సభలో గందరగోళం సృష్టిస్తుండటంతో, స్పీకర్ సభను 20 నిమిషాల పాటు వాయిదా వేశారు.ఇది కూడా చదవండి: మూఢాచారాలతో ప్రసవానికి యత్నం.. గర్భిణి మృతి -
వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన అసదుద్దీన్ ఒవైసీ
సాక్షి, ఢిల్లీ: వక్ఫ్ బిల్లుపై అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వక్ఫ్ సవరణ బిల్లును సుప్రీం కోర్టులో ఆయన సవాల్ చేశారు. వక్ఫ్ బిల్లు చట్ట విరుద్ధమని.. వక్ఫ్ ఆస్తులు లాక్కునే కుట్ర జరుగుతోందంటూ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. ఈ వివాదాస్పద బిల్లు ఆమోదం పొందడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్, ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.కాగా, రెండు రోజుల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ, తీవ్రస్థాయి వాదోపవాదాల అనంతరం వక్ఫ్ (సవరణ) బిల్లు–2025పై పార్లమెంటు ఆమోదముద్ర పడింది. విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్యే లోక్‌సభ బుధవారం ఈ బిల్లును ఆమోదించడం తెలిసిందే. అది గురువారం రాజ్యసభ ఆమోదం కూడా పొందింది. 13 గంటలకు పైగా జరిగిన చర్చ అనంతరం అర్ధరాత్రి ఒంటి గంట దాటాక ఓటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా జరిగింది.దాదాపుగా ప్రతి సవరణపైనా ఓటింగ్‌కు విపక్షాలు పట్టుబట్టాయి. వాటి సవరణలన్నీ వీగిపోయాయి. చివరికి బిల్లు ఆమోదం పొందింది. దానికి అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు పడ్డాయి. వక్ఫ్ బిల్లును కేంద్రం ఇక రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. రాష్ట్రపతి సంతకం అనంతరం అది చట్టంగా రూపుదాల్చుతుంది. వక్ఫ్ బిల్లును లోక్‌సభ 288–232 ఓట్లతో ఆమోదించడం తెలిసిందే. -
లోక్ సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు
-
ఇవాళ పార్లమెంట్ ముందుకు వర్ఫ్ సవరణ బిల్లు
-
నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు... చర్చతోపాటు ఓటింగ్ జరిగే అవకాశం
-
కర్నాటక ముస్లిం కోటా బిల్లుపై రాజ్యసభలో రసాభాస
ఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం(Karnataka Congress government) ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును ఆమోదించడంపై రాజ్యసభలో బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటకలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఆమోదించడాన్ని కేంద్ర మంత్రి నడ్డా,బీజేపీ ఎంపీలు ఖండించారు. కర్ణాటక ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నదంటూ ఆందోళనకు దిగారు.దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు సమాధానం చెప్పాలంటూ రాజ్యసభ(Rajya Sabha)లో జేపీ నడ్డా డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో నెలకొన్న గందరగోళం మధ్య రాజ్యసభను రెండు గంటలకు వాయిదా పడింది. కర్నాటక ప్రభుత్వ టెండర్లలో ముస్లిం కాంట్రాక్టర్లకు నాలుగు శాతం కోటా ఇచ్చేందుకు ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. దీనిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇటువంటి బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టుకు వెళ్తామని కర్నాటక బీజేపీ హెచ్చరించింది.కర్నాటక ట్రాన్స్పరెన్సీ ఇన్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ చట్టంలో సవరణ తీసుకువచ్చి, కేటగిరీ 2బీ కింద రిజర్వేషన్(Reservation) విధానాన్ని అమలు చేయనున్నట్లు సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. కేటగిరీ 2బీలో ముస్లిం కాంట్రాక్టర్లు ఉంటారని ఆయన తెలిపారు. కేటగిరీ వన్‌లో ఎస్సీ, ఎస్టీలు, క్యాటగిరీ 2ఏలో వెనుకబడిన తరగతులు వారు ఉంటారన్నారు. కేటీపీపీ చట్టం కింద ఇకపై ముస్లిం కాంట్రాక్టర్లు సుమారు రెండు కోట్ల మేరకు విలువ కలిగిన ప్రభుత్వ పనులు చేసేందుకు అర్హులు కానున్నారు.ఇది కూడా చదవండి: యోగి సర్కారుకు ఎనిమిదేళ్లు.. యూపీలో సంబరాలు -
త్వరలో ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్ బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో రాష్ట్రంలో ‘ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్’ బిల్లును తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తో ఆయన వేర్వేరుగా భేటీ అయ్యారు. అనంతరం ఎంపిక చేసుకున్న మీడియాతో సీఎం సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఐదేళ్లలో అనేక భూములు కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు. ప్రతి పది కేసుల్లో ఆరు భూ వివాదాలకు సంబంధించినవే అన్నారు. భూముల కంప్యూటరీకరణలో సరైన విధానం లేక సమస్యలు ఎదురవుతున్నట్లు చెప్పారు. ప్రైవేటు భూములను బలవంతంగా 22ఏలో చేర్చారని.. అటవీ భూములను అధికారులతో కలిసి ఆక్రమించారని ఆరోపించారు. గుజరాత్లో ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు విజయవంతంగా అమలవుతోందని, దాని అమలును ఏపీలో కూడా అనుమతించాలని కోరినట్లు చెప్పారు. డీలిమిటేషన్ నిరంతర ప్రక్రియనియోజకవర్గాల పునర్విభజన అనేది నిరంతర ప్రక్రియ అని.. దీనిపై సమయానుకూలంగా స్పందిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో జనాభా నియంత్రణను ప్రోత్సహించానని, ఇప్పుడు జనాభాను పెంచాలనే విషయం అర్థమై పిలుపునిస్తున్నట్లు చెప్పారు.పోలవరం 2027 కల్లా పూర్తిగత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల బకాయిలను వదిలిపెట్టిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలకు తెలిపినట్లు చంద్రబాబు చెప్పారు. రాయలసీమ వంటి కరువు ప్రాంతాలకు నీరందించేందుకు.. సముద్రంలో కలిసే జలాలను వినియోగించుకుంటామని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. పోలవరంను 2027 కల్లా పూర్తి చేస్తామని తెలిపారు. 189 కి.మీ. మేర అమరావతి ఔటర్ఎనిమిది లైన్లతో 189 కి.మీ. మేర అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించినట్లు చంద్రబాబు చెప్పారు. శ్రీశైలం ఆలయం వద్ద ట్రాఫిక్ రద్దీని పరిష్కరించేందుకు రోడ్డును విస్తరించాలని, వినుకొండ–అమరావతి తదితర ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలిపారు. డీపీఆర్‌లు సిద్ధం చేసిన తర్వాత టెండర్లు పిలుస్తామని గడ్కరీ చెప్పారని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి రూ.6.5 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. మిర్చి క్వింటాకు రూ.11,781 మద్దతు ధర ఇచ్చేందుకు కేంద్రం ఒప్పుకొందన్నారు. కాగా, ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అవుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాల సర్దుబాటుకే చంద్రబాబు ఢిల్లీ వచ్చారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. -
తిరగని బతుకు మీటర్!
అనంతపురంలో పని చేస్తున్న మీటర్ రీడర్(Meter reader) డేవిడ్‌కు(పేరు మార్చాం) మూడు నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. ఇలాగైతే కుటుంబ జీవనం సాగించేదెలా? ఇలాగే ఉంటే మరో రెండు నెలలు వేతనాలు కూడా ఇవ్వరు. దీనిపై కాంట్రాక్టర్లతో గట్టిగా మాట్లాడాలి అంటూ వారి వాట్సాప్ గ్రూప్‌లో తన అభిప్రాయాన్ని పోస్టు చేశాడు. వేతనాల కోసం గట్టిగా అడిగితే వారి ఖాతా క్లోజ్ చేసి ఇంటికి పంపేస్తామంటూ కాంట్రాక్టర్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో మీటర్ రీడర్స్(Meter readers) ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకుందాంలే.. ఉన్న ఉద్యోగం పోతే అంతే సంగతులు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అనంతపురం టౌన్: విద్యుత్(Electricity) వినియోగదారులకు ప్రతి నెలా బిల్లును తీసి అందించే మీటర్ రీడర్ల బతుకు మీటర్ మాత్రం తిరగడం లేదు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో రెండు నెలలు, మరి కొన్ని ప్రాంతాల్లో మూడు నెలలు కావొస్తున్నా వేతనాలు మాత్రం అందడం లేదు. కాంట్రాక్టర్లు మాత్రం ప్రతి నెలా తమకు రావాల్సిన బిల్లులను విద్యుత్ సంస్థ నుంచి తీసుకుంటూ మీటర్ రీడర్లకు మాత్రం మొండిచేయి చూపుతున్నారు. వేతనాలపై జీవనం సాగిస్తున్న దాదాపు 220 మంది మీటర్ రీడర్ల బతుకులు అగమ్యగోచరంగా తయారయ్యాయి. వేతనాలు అడిగితే ఉద్యోగం తొలగిస్తారంట.. వేతనాల కోసం అడిగితే తమను ఉద్యోగం నుంచి తొలగిస్తారనే వాయిస్‌ను కాంట్రాక్టర్లు మీటర్ రీడర్లకు పంపారు. దీంతో వారు వేతనాలు ఇవ్వకపోయినా గట్టిగా అడగలేని పరిస్థితి. విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఆరు నెలల క్రితం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 24 ఏరియాలకు స్పాట్ బిల్లింగ్ టెండర్లను విద్యుత్ శాఖ అధికారులు పిలిచారు. 250 మందికి పైగా కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొన్నారు.విద్యుత్ శాఖ(electricity department) అధికారులు ఏక పక్షంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇద్దరు వ్యక్తులకే స్పాట్ బిల్లింగ్ టెండర్లను ఖరారు చేశారు. టెండర్లలో ఎవరు తక్కువకు కోట్ చేశారనే విషయాలను పరిశీలించకుండానే ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల సూచనల మేరకు ఇద్దరు వ్యక్తులకు స్పాట్ బిల్లింగ్ టెండర్లను కట్టబెట్టారని అప్పట్లోనే అప్పటి ఎస్ఈపై విమర్శలు వెల్లువెత్తాయి. కాంట్రాక్ట్ పొంది ఐదు నెలలు కాగా దాదాపు 3 నెలల వేతనం మీటర్ రీడర్స్‌కు పెండింగ్ పెట్టారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పట్టించుకునే వారేరీ?.. మీటర్ రీడర్లకు స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టర్లు మూడు నెలలుగా వేతనాలు ఇవ్వలేదనే విషయాలు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు తెలిసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మీటర్ రీడర్ల అధికారికంగా ఫిర్యాదు చేస్తే అప్పుడు చూద్దాములే అంటూ కాలయాపన చేస్తున్నారన్న విమర్శలున్నాయి. వేతనాలపై లిఖిత పూర్వకంగా కాంట్రాక్టర్లపై ఫిర్యాదు చేస్తే ఉన్న ఉద్యోగం పోతుందనే భయంతో మీటర్ రీడర్లు ఉన్నారు. దీన్ని అసరాగా చేసుకున్న స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ ఉన్నతాధికారులు స్పందించి మీటర్ రీడర్ల వేతనాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.రెండు రోజుల్లో వేతనాలు అందేలా చర్యలు మీటర్ రీడర్లకు మూడు నెలలుగా వేతనాలు అందలేదన్న విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై కాంట్రాక్టర్లతో మాట్లాడి రెండు రోజుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మీటర్ రీడర్లకు వేతనాలు అందించేలా చర్యలు తీసుకుంటాం. ఇక నుంచి ప్రతి నెలా వారి ఖాతాల్లో 5వ తేదీలోగా వేతనాలు జమ చేసేలా చూస్తాం – శేషాద్రి శేఖర్, విద్యుత్ శాఖ ఎస్ఈ, అనంతపురం -
అడ్వకేట్ బిల్లుపై స్టాలిన్ ఫైర్.. కేంద్రానికి వార్నింగ్
చెన్నై: ఇప్పటికే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ)పై ఫైరవుతున్న తమిళనాడు సీఎం స్టాలిన్ తాజాగా అడ్వకేట్ బిల్లుపై కేంద్రాన్ని హెచ్చరించారు. కేంద్రం తీసుకువస్తున్న అడ్వకేట్ బిల్లు న్యాయవాద వృత్తిపై దాడి అని అన్నారు. ఈ మేరకు స్టాలిన్ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.‘బార్ కౌన్సిల్ ఆఫ్ తమిళనాడు,పుదుచ్చేరిని బార్ కౌన్సిల్ ఆఫ్ మద్రాస్‌గా కేంద్రం మార్చాలనుకుంటోంది. తమిళనాడు అనేది కేవలం పేరు కాదు. మా గుర్తింపు. తమిళులపై బీజేపీ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిని తొలగించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే గతంలో ఎన్‌జేఏసీని తీసుకురావడానికి ప్రయత్నించి విఫలమైంది. ఇప్పుడు మళ్లీ అడ్వకేట్ బిల్లు ద్వారా బార్ కౌన్సిళ్లపై పెత్తనం చెలాయించాలనుకుంటోంది. అడ్వకేట్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి’అని స్టాలిన్ డిమాండ్ చేశారు. కాగా, బిల్లుపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసకుంది. ముసాయిదాలో సవరణలు చేయనున్నట్లు ప్రకటించింది. -
వక్ఫ్ బోర్డుపై జేపీసీ నివేదిక.. రాజ్యసభలో గందరగోళం
న్యూఢిల్లీ: ఈరోజు(గురువారం) పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి దశలోని చివరి రోజు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే ఉభయ సభల్లో హంగామా నెలకొంది. రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) నివేదికను బీజేపీ ఎంపి మేధా కులకర్ణి ప్రవేశపెట్టారు. మరోవైపు లోక్‌సభలో ఇదేవిధమైన గందరగోళం నెలకొన్న నేపధ్యంలో సభా కార్యకలాపాలను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.రాజ్యసభలో జేపీసీ నివేదికపై ప్రతిపక్షాల ప్రశ్నలకు కిరణ్ రిజిజు సమాధానమిచ్చారు. తన మంత్రిత్వ శాఖ సభ్యులు జేపీసీ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ప్రతిపక్షాలు నివేదికను చదివి, ఆపై స్పందించాలని ఆయన కోరారు. ప్రశ్నలు లేవనెత్తే వారు కూడా జేపీసీ సభ్యులేనని ఆయన అన్నారు.వక్ఫ్ బిల్లుపై సభలో ప్రవేశపెట్టిన జేపీసీ నివేదికను ప్రతిపక్షం అంగీకరించబోదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. దానిని చర్చ కోసం వెనక్కి పంపాలని ఆయన ఛైర్మన్‌ను అభ్యర్థించారు. వక్ఫ్ బిల్లుపై ఏ పార్టీ అభిప్రాయాన్నీ పరిగణలోకి తీసుకోలేదని ఖర్గే అన్నారు. వక్ఫ్ బోర్డుపై జేపీసీ నివేదికపై రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది.జేపీసీ జనవరి 30న ముసాయిదా నివేదికను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. ఈ నివేదికను 655 పేజీలలో పొందుపరిచారు. 16 మంది సభ్యులు దీనికి అనుకూలంగా ఓటు వేశారు. 11 మంది సభ్యులు వ్యతిరేరించారు. కమిటీలోని ప్రతిపక్ష ఎంపీలు ఈ బిల్లును వ్యతిరేకించారు. కాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు(గురువారం) పార్లమెంటులో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టం-1961ని సరళీకరించడం ద్వారా, ఆదాయపు పన్ను చట్టాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా చేయడమే దీని లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రస్తుత ఆదాయపు పన్ను-1961 కంటే శరళమైనది. అయితే దీనిలో మరిన్ని విభాగాలు, షెడ్యూళ్లు ఉన్నాయి. 622 పేజీల కొత్త బిల్లులో 23 అధ్యాయాలు, 16 షెడ్యూల్లలో 536 విభాగాలు ఉన్నాయి. ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టంలో 298 విభాగాలు, 14 షెడ్యూల్లు ఉన్నాయి. 880 పేజీలు. కాగా పార్లమెంటులో లోక్‌సభ కార్యకలాపాలు ఐదు నిమిషాలు మాత్రమే కొనసాగాయి. ప్రతిపక్షం గందరగోళం సృష్టించడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఇది కూడా చదవండి: మళ్లీ పాక్ సరిహద్దు ఉల్లంఘన.. బుద్ధి చెప్పిన భారత్ -
కొత్త ఆదాయ పన్ను బిల్లులో ‘ట్యాక్స్ ఇయర్’?
పార్లమెంటులో త్వరలో ప్రవేశపెట్టనున్న కొత్త ఆదాయపు పన్ను బిల్లు(New Income Tax Bill) సామాన్యులకు ప్రత్యక్ష పన్ను చట్టాలను సులభతరం చేయడమే లక్ష్యంగా రూపొందించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు. బిల్లులో ప్రతిపాదించిన కీలక మార్పుల్లో ‘ట్యాక్స్ ఇయర్’ ఒకటని సమాచారం. ఈ మార్పువల్ల వ్యాపారుల పన్ను చెల్లింపులను సులభతరం చేసేందుకు వీలవుతుందని భావిస్తున్నారు.టాక్స్ ఇయర్(Tax Year) అంటే ఏమిటి?టాక్స్ ఇయర్ అనేది నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ప్రయోజనాల కోసం ఉపయోగించే 12 నెలల వ్యవధి. కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రకారం ట్యాక్స్ ఇయర్ ఏప్రిల్ 1న ప్రారంభమై మరుసటి ఏడాది మార్చి 31న ముగుస్తుంది. 1961 ఆదాయపు పన్ను చట్టంలో ఉపయోగించిన ‘ప్రివియస్ ఇయర్’, ‘అసెస్మెంట్ ఇయర్(మదింపు సంవత్సరం)’ స్థానంలో ఈ ట్యాక్స్ ఇయర్‌ను వాడనున్నారు.ఇదీ చదవండి: ఎల్ అండ్ టీ చైర్మన్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలుపన్ను చట్టాలను ఎలా సులభతరం చేస్తుంది?స్థిరమైన ట్యాక్స్ ఇయర్‌ను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా పన్ను చెల్లింపుదారులు ఆదాయాన్ని నివేదించడానికి, పన్నులు చెల్లించడానికి నిర్దిష్ట వ్యవధిని కలిగి ఉంటారు. ఇది విభిన్న ఆర్థిక సంవత్సరాలకు వేర్వేరు అసెస్మెంట్ ఇయర్(మదింపు సంవత్సరం-వచ్చే ఆర్థిక సంవత్సరం)లను కలిగి ఉండటం వల్ల తలెత్తే గందరగోళాన్ని తొలగిస్తుంది.పన్ను చెల్లింపుదారులు తమ బాధ్యతలను అర్థం చేసుకోవడానికి సులభమైన, స్పష్టమైన భాషను ఉపయోగించాలని కొత్త బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన కాలం చెల్లిన నిబంధనలు, వివరణలను తొలగించాలని నిర్ణయించారు.పన్ను విధానాలకు సంబంధించి స్పష్టమైన నిర్వచనాలు, క్రమబద్ధమైన విధానాతతో కొత్త పన్ను చట్టాలు వివాదాలు, లిటిగేషన్లను తగ్గిస్తాయని భావిస్తున్నారు. దీనివల్ల మరింత పన్ను వసూలుకు వీలవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పన్నుకు సంబంధించి వివాదాలు తగ్గడం వల్ల న్యాయవ్యవస్థపై భారం తగ్గుతుందని చెబుతున్నారు.తరచూ శాసన పరమైన సవరణలు అవసరం లేకుండా పన్ను పథకాలను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)కి ఎక్కువ అధికారాన్ని ఈ బిల్లు కల్పిస్తుంది. -
కొత్త ఆదాయపు పన్ను బిల్లు వచ్చే వారమే
-
నెల కరెంట్ బిల్ రూ.200 కోట్లు: దెబ్బకు ఫ్యూజులు అవుట్
సాధారణంగా నెలకు కరెంట్ బిల్ ఎంత వస్తుంది? మహా అయితే వేల రూపాయలోనే ఉంటుంది, కదా. కానీ హిమాచల్‌ప్రదేశ్‌లోని ఓ వ్యక్తికి కరెంట్ బిల్ ఏకంగా రూ.200 కోట్ల కంటే ఎక్కువే వచ్చింది. కరెంట్ బిల్ ఏమిటి? రూ.200 కోట్లు ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ కథనం చదివేయాల్సిందే..హిమాచల్‌ప్రదేశ్‌లోని బెహెర్విన్ జట్టన్ గ్రామానికి చెందిన 'లలిత్ ధీమాన్' అనే వ్యాపారవేత్త.. తనకు వచ్చిన ఎలక్ట్రిక్ బిల్ చూసి అవాక్కయ్యాడు. ఎందుకంటే ఆయనకు వచ్చిన కరెంట్ బిల్ ఏకంగా రూ. 2,10,42,08,405. ఇప్పటి వరకు ఇంత కరెంట్ బిల్ బహుశా ఏ ఒక్కరికీ వచ్చి ఉండదు.రూ.2,10,42,08,405 కరెంట్ బిల్ రావడానికి ముందు నెలలో 'లలిత్ ధీమాన్'కు వచ్చిన బిల్లు రూ.2,500 మాత్రమే. భారీ మొత్తంతో కరెంట్ బిల్ రావడంతో అతడు ఫిర్యాదు చేసేందుకు విద్యుత్ బోర్డును సందర్శించాడు. సాంకేతిక లోపం వల్లనే ఈ బిల్లు వచ్చిందని.. విద్యుత్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఆ తరువాత అతనికి సరైన కరెంట్ బిల్ ఇచ్చారు. నిజానికి అతనికి వచ్చిన కరెంట్ బిల్ రూ.4047 మాత్రమే.ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్‌పై ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంక్ ఇదే!సాంకేతిక లోపాల వల్ల భారీ బిల్లులు రావడం ఇదే మొదటి సారి కాదు. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తికి 1,540 రూపాయల కరెంట్ బిల్ వస్తే.. విద్యుత్ శాఖ నుంచి 86 లక్షల రూపాయలకు పైగా బిల్లును స్వీకరించాడు. ఆ తరువాత జరిగిన తప్పిదాన్ని అధికారులు గుర్తించి ఆయనకు సరైన బిల్ ఇచ్చారు. -
‘సాక్షి’కి ఎందుకు చెప్పారు?
సాక్షి, అమరావతి: ‘‘ఏమనుకుంటున్నారు మీరంతా..? కరెంట్ గురించి, బిల్లుల గురించి ‘సాక్షి’ వాళ్లకు ఎందుకు చెప్పారు..? ఎవరు చెప్పమన్నారు..? ఇలా అయితే చాలా ఇబ్బంది పడతారు..! మరోసారి ఇలా ఎవరికైనా చెబితే సహించేది లేదు..!’’ అంటూ విద్యుత్ బిల్లుల బాధితులపై కూటమి నేతలు, అధికార యంత్రాంగం బెదిరింపులకు దిగాయి. ఏమిటీ నిరంకుశం?ఏలూరు జిల్లా మల్కీ మహ్మద్‌పురం (పల్లపూరు)లో విద్యుత్ బిల్లుల బాధితుల వద్దకు మంగళవారం వచ్చిన భీమడోలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(డీఈఈ) గోపాలకృష్ణ, అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) శివాజీ, లైన్మెన్ శేషగిరితో పాటు దాదాపు పది మంది అధికారులు, సిబ్బంది, కూటమి నేతలు వారిపై విరుచుకుపడ్డారు. ‘సాక్షి’తో ఎందుకు మాట్లాడారని గద్దించారు. పింఛన్లు, రేషన్ కార్డులు తీసేస్తామంటూ హెచ్చరించారు. ఇకపై విద్యుత్ బిల్లులు, చార్జీల గురించి ఎక్కడా నోరు విప్పవద్దని తమను బెదిరించినట్లు బాధితులు వెల్లడించారు. ఇకపై తమను వేధింపులకు గురి చేస్తారని వారంతా ఆందోళన చెందుతున్నారు. ఏమిటీ నిరంకుశత్వమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజమే కానీ.. మీరెలా రాసేస్తారు?దీనిపై ఏఈ శివాజీని వివరణ కోరగా.. ‘‘మావైపు తప్పు ఉన్న మాట వాస్తవం.. అయినా మీరు ఎలా రాసేస్తారు?’’ అంటూ ‘సాక్షి’ ప్రతినిధిని సైతం బెదిరించే ధోరణిలో మాట్లాడారు. లైన్ మెన్ శేషగిరికి ప్రతి నెలా విద్యుత్ బిల్లు నిమిత్తం డబ్బులిస్తున్నా తమకు రసీదు ఇవ్వడం లేదని ఎంఎంపురం వాసి పాపమ్మ ‘సాక్షి’కి తెలిపారు. దీన్ని లైన్మెన్ దృష్టికి తేగా రసీదు ఎక్కడో పడేశానంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. గోడు ఆలకించకుండా బెదిరింపులా..!పేదలకు సంక్షేమ పథకాలిచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపుతో తమ నడ్డి విరుస్తుండటంతో హాహాకారాలు చేస్తున్నారు. వారి గోడును తెలుసుకుని వాస్తవాలను ‘సాక్షి’ అందరి దృష్టికి తెస్తోంది. వారి కష్టాలను ‘గ్రౌండ్ రిపోర్ట్’ రూపంలో ప్రచురిస్తోంది. అయితే ఇదంతా ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. కరెంటు చార్జీలు పెంచినా, పేదలకు ఉచిత విద్యుత్‌ను దూరం చేసినా ఎవరూ ప్రశ్నించకూడదనే ధోరణితో పాలకులు వ్యవహరిస్తున్నారు. అనుమతి ప్రకారమే చార్జీలు: ఇంధన శాఖఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతితోనే ఇంధన సర్దుబాటు చార్జీలను వసూలు చేస్తున్నామని రాష్ట్ర ఇంధన శాఖ తెలిపింది. ‘కరెంటు కోత.. చార్జీల మోత’ శీర్షికన మంగళవారం ప్రచురితమైన కథనంపై ఆ శాఖ స్పందించింది. ఎం.ఎం.పురంలో పాచిపని చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తున్న వృద్ధురాలు సిగారపు పాపమ్మకు పాత బకాయిల వల్లే రూ.1,345 విద్యుత్ బిల్లు వచ్చిందని పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల బిల్లుల్లో కొంత, వచ్చే నెల బిల్లుల నుంచి మరికొంత మేర సర్దుబాటు చార్జీలు విధిస్తున్నట్లు వెల్లడించింది. ఏ ఒక్క ఎస్సీ, ఎస్టీ వినియోగదారుడికీ సబ్సిడీ తొలగించలేదని, ఎవరికైనా సబ్సిడీ రాకుంటే సంబంధిత ధృవపత్రాలతో మీసేవలో దరఖాస్తు చేసుకుంటే అర్హతను పరిశీలించి మంజూరు చేస్తామని తెలిపింది. రాష్ట్రంలో డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఎలాంటి లోడ్ రిలీఫ్ అమలు చేయడం లేదని పేర్కొంది. -
భూ భారతి బిల్లుకు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భూ భారతి (రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్) బిల్లు–2024కు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈనెల 18వ తేదీన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై శుక్రవారం సభలో చర్చ జరిగిన అనంతరం బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు.ఈ బిల్లుపై చర్చలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పాలు పంచుకోలేదు. ఈ–ఫార్ములా రేసింగ్ అంశాన్ని సభలో చర్చించాలని శుక్రవారం మొత్తం సభలో పట్టుపట్టిన బీఆర్ఎస్ కీలకమైన ఈ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొనలేదు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి బిల్లును ఇతర పక్షాలైన బీజేపీ, ఎంఐఎం, సీపీఐలు స్వాగతిస్తూనే కొన్ని సవరణలు ప్రతిపాదించాయి. అయితే, ఈ సవరణలను పరిగణనలోకి తీసుకోకుండానే బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. ఆనంద భాష్పాలొస్తున్నాయి.. భూ భారతి బిల్లును అసెంబ్లీ ఆమోదిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించగానే కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షాతిరేకాలు ప్రకటించారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు జూపల్లి కృష్ణారావులతో పాటు కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఐ, బీజేపీ సభ్యులు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలసి అభినందించారు. అంతకుముందు చర్చకు ముగింపుగా మంత్రి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రం నుంచి కీలకమైన ఆర్వోఆర్ చట్టం ప్రవేశపెట్టిన మూడో మంత్రిగా ఈ బిల్లు సభ ఆమోదం పొందినందుకు తన జన్మ ధన్యమైందని, ఆనంద భాష్పాలు వస్తున్నాయని భావోద్వేగానికి గురయ్యారు.వాస్తవానికి, ఈ బిల్లును మంత్రి పొంగులేటి పట్టుపట్టి మరీ ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపజేశారు. సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి స్పీకర్ అనుమతి మేరకు సభలో ప్రవేశపెట్టించిæ శీతాకాల సమావేశాల్లోనే కొత్త ఆర్వోఆర్ చట్టం తీసుకురావాలన్న తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఇక, బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఆఫీసర్స్ గ్యాలరీలో ఉన్న రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, భూచట్టాల నిపుణుడు ఎం.సునీల్‌కుమార్, సీసీఎల్ఏ అసిస్టెంట్ సెక్రటరీ వి. లచ్చిరెడ్డిలను మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందించారు.స్పీకర్‌కు మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యేల ధన్యవాదాలుఅసెంబ్లీలో భూభారతి బిల్లుకు సభ ఆమోదం లభించిన అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలియజేశారు. స్పీకర్ చాంబర్లో ప్రసాద్‌కుమార్‌ను శాలువాతో సన్మానించారు. రాష్ట్ర రైతాంగం, ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా దీనిని ప్రత్యేక శ్రద్ధతో రూపొందించడంపై కృతజ్ఞతలు తెలిపారు. -
ట్రంప్ ప్రతిపాదనల్ని తిరస్కరించిన హౌస్
వాషింగ్టన్: వచ్చే ఏడా ది మార్చి 14 వ రకు ఫెడరల్ ప్రభుత్వ వ్యయంపై ఎన్నికైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకూలురు శుక్రవారం ఉదయం ప్రవేశపెట్టిన ప్రతిపాదనలను ప్రతినిధుల సభ తిరస్కరించింది. రుణ పరిమితి పెంచుతూ చేసిన ప్రతిపాదనల్ని సభలో ప్రవేశపెట్టగానే ఒక్క పెట్టున నిరసనలు చెలరేగాయి. హఠాత్తుగా తీసుకొచ్చిన ప్రతిపాదనల్ని ఆమోదించేది లేదని సభ్యులు ప్రకటించారు. బిల్లు ఆమోదానికి కావాల్సిన మూడింట రెండొంతుల మెజారిటీ లభించలేదు.174–235 ఓట్ల తేడాతో వీగిపోయింది. అయితే, శుక్రవారం అర్ధరాత్రి తుది ప్రయత్నంగా తమ ప్రతిపాదనలను మరోసారి సభలో ప్రవేశపెడతామని స్పీకర్ మైక్ జాన్సన్ ప్రకటించారు. ప్రకృతి విపత్తులకు ఇచ్చే సాయం, రైతులకు ఆర్థిక సాయం కలిపి 110 బిలియన్ డాలర్లను బైడెన్ ప్రభుత్వం వ్యయ బిల్లులో ప్రతిపాదించింది. అయితే, రుణ పరిమితి పెంచితేనే ఓకే చేస్తామని ట్రంప్ అనుకూ లురు అంటున్నారు. శుక్రవారంలోగా ఈ విషయంలో స్పష్టత రాకుంటే ప్రభుత్వ పాలన స్తంభించే ప్రమాదముంది. -
జమిలి ఎన్నికలపై జేపీసీ ఏర్పాటు చేసిన కేంద్రం
-
అతుల్ సుభాష్‌కు బిల్లు నివాళి..!
అతుల్ సుభాష్ అనే టెక్కీ బలవన్మరణం దేశవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టించింది. చట్టాలన్ని ఆడవాళ్లకేనా అనే అంశం కూడా తెరపైకి వచ్చింది. భార్య కుటుంబం పెడుతున్న తప్పుడు కేసులతో ఎంతోమంది అతుల్ సుభాష్ లాంటి భర్తలు వేధింపులకు గురవ్వుతున్నారనే వాదన వినిపిస్తోంది. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన వైవాహిక చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయని బాధిత భర్తలు ఆరోపిస్తున్నారు. చెప్పాలంటే ఆ టెక్కీ మరణం చర్చనీయాంసంగా మారడమే గాక బీటలు వారిపోతున్న వైవాహిక వ్యవస్థ, చట్టంలోని లోసుగులను లేవనెత్తింది. ప్రస్తుతంఈ విషయమే హాట్‌టాపిక్ మారింది. ఈ తరుణంలో ఢిల్లీ రెస్టారెంట్ చెందిన జంబోకింగ్ ఫ్రాంచైజీ ఆ టెక్కీ అతుల్‌కి వినూత్నంగా నివాళి ఆర్పించడం నెట్టింట వైరల్‌గా మారింది. హౌజ్ ఖాస్ అనే గ్రామంలోని జంబోకింగ్ ఫ్రాంచైజీ అవుట్‌లెట్‌కి ఓ వ్యక్తి వెళ్లాడు. అతను అక్కడ తినేసి తిరిగి వెళ్లేటప్పడూ అందుకున్న రసీదు అతడిని ఆకర్షించింది. అందులో "జస్టీస్ ఫర్ అతుల్ సుభాష్ అనే హ్యాష్ ట్యాగ్‌తో అతడి ఆత్మహత్యకు తాము ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. అతని జీవితం అందిరిలానే అత్యంత ముఖ్యమైనది. మీకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం." అని రాసి ఉంది. అతడు వెంటనే ఆ రసీదుని ఫోటో తీసి తన స్నేహితుడికి పంపండంతో రెడ్డిట్‌లో వైరల్‌గా మారింది. ఆ జంబోకింగ్ ఫ్రాంచైజీని స్వామి సమర్థ్ ఫుడ్స్ నడుపుతోంది. అందర్ని కదలించిన ఆ టెక్కీ ఆవేదనను సహృద్భావంతో అర్థం చేసుకుని ఇలా వినూత్నంగా నివాళులర్నించడమే గాక అతడికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ.. అందరికీ అవగాహన కల్పిస్తున్నట్లుగా ఉంది. పైగా అందుకోసం ఇలా రసీదుని ఉపయోగించుకోవడమనేది ప్రశంసనీయం. అంతేగాదు సదరు వ్యక్తి ఈ విషయమై జంబోకింగ్ ఫ్రాంచైజీ యజమానిని ప్రశ్నించగా.. దానికి ఆ వ్యాపారి ప్రతీది వ్యాపారం కాదని తన దైన శైలి బదులిచ్చి అందరి మనసులను గెలుచుకున్నాడు. నెటిజన్లు కూడా.. ఆ వ్యాపారి విశాల హృదయాన్ని ప్రశంసించగా, ఇలా జొమాటా, స్విగ్గీలు కూడా చెయ్యొచు గదా అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: గట్ హెల్త్‌పై దృష్టి పెడదాం..ఆరోగ్యంగా ఉందాం..!) -
లోక్ సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు
-
విపక్షాల వ్యతిరేకత మధ్యే జమిలి బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం
-
‘జమిలి’కి వేళయిందా?!
మొత్తానికి బీజేపీ చిరకాల వాంఛ నెరవేరటంలో తొలి అడుగుపడింది. దేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు ముసాయిదా బిల్లులు మంగళవారం లోక్‌సభలో ప్రవేశించాయి. అందరూ అనుకున్నట్టే ఈ బిల్లులకు విపక్షాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. వచ్చినంత వేగంగా రెండు బిల్లులూ జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు వెళ్లబోతున్నాయి. తరచు జరిగే ఎన్నికల వల్ల పాలనా నిర్వహణలో అస్థిరత నెలకొంటున్నదని, కీలకమైన ప్రాజెక్టుల సాకారంలో అంతులేని జాప్యం చోటుచేసుకుంటున్నదని, ఎన్నికలకు తడిసి మోపెడు వ్యయం అవుతున్నదని ప్రభుత్వ పెద్దలు చాన్నాళ్లుగా వాదిస్తున్నారు. ఎన్నికల నిర్వహణపై స్పష్టత వుంటే పాలన కుంటు పడదని, అధికార యంత్రాంగంపైనా, ఖజానాపైనా భారం తగ్గుతుందని, వోటింగ్ శాతం పెరుగు తుందని వారి వాదన. ఈ విషయమై కేంద్రం మాజీ రాష్ట్రపతి రావ్‌ునాథ్ కోవింద్ నేతృత్వంలో నియమించిన బృందం సైతం పాలకుల వాదనకు అనుకూలంగా సిఫార్సులు చేసింది. జమిలి ఎన్నికల వల్ల సుస్థిరత ఏర్పడి పెట్టుబడులు పెరుగుతాయని, ఆర్థికాభివృద్ధికి వీలవుతుందని, వనరుల కేటాయింపు సమర్థంగా చేయొచ్చని వివరించింది. మతపరమైన ఉద్రిక్తతలు తగ్గి భద్రతా బలగాల వినియోగం పెద్దగా ఉండబోదన్నది ఆ బృందం అభిప్రాయం. జమిలి ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగంలోని 83, 172, 324 అధికరణాలను సవరించాల్సి వుంటుంది. అందుకోసమే ఈ బిల్లుల్ని ప్రవేశపెట్టారు. వోటర్ల జాబితాకు సంబంధించి రాజ్యాంగంలోని 325 అధికరణను సవరించే మరో బిల్లు అవసరమవుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆధ్వర్యంలో లోపరహితమైన జాబితా రూపొంది లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికలు ఏకకాలంలో జరుగుతాయని ప్రభుత్వం చెబుతోంది. అంటే జమిలి కేవలం ఈ రెండు సభలకు సంబంధించిందే. ఈ ఎన్నికలు పూర్తయిన వందరోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలుంటాయి.మొత్తానికి ఎన్నికల జాతర అయిదేళ్లకోసారి మాత్రమే ఉంటుంది. మధ్యలో ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం కుప్పకూలి అసెంబ్లీ ఎన్నికలు తప్పనిసరైతే వాటిని జరుపుతారట. కానీ ఆ కొత్త ప్రభుత్వాల ఆయుష్షు ఆ మిగి లిన సంవత్సరాలకు మాత్రమే పరిమితమవుతుందట. అంటే అయిదేళ్ల కాలానికి ఎన్నికైన ప్రభుత్వం మూడేళ్లకే పతనమైతే... కొత్తగా ఎన్నికలై వచ్చే పాలకులకు కేవలం రెండేళ్లు మాత్రమే పదవీయోగం దక్కుతుందన్నమాట! సారాంశంలో ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ ఆదర్శం కాస్తా అట కెక్కినట్టే అవుతుంది. మరి ఈ బిల్లులు సాధించదల్చుకున్నదేమిటి? ఈ బిల్లులు గట్టెక్కటం అంత సులభమేమీ కాదు. ఏ రాజ్యాంగ సవరణ బిల్లుకైనా మూడింట రెండువంతుల మెజారిటీ తప్పనిసరి. ఆ రకంగా చూస్తే 543 మంది సభ్యులున్న సభలో ఈ బిల్లు లకు మద్దతుగా కనీసం 362 మంది వోటేయాలి. కానీ ఎన్డీయే బలం 293. అంటే మరో 69 మంది మద్దతు అవసరమవుతుంది. రాజ్యసభ వరకూ చూస్తే 163 మంది బిల్లులకు అనుకూలంగా వోటే యాలి. కానీ ఎన్డీయే బలం 121. ఆ తర్వాత రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం కూడా తప్పనిసరి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన చట్టాలు మార్చాలంటే కనీసం సగం అసెంబ్లీలు అందుకు అంగీ కరించాలి. కోవింద్ కమిటీ ముందు 47 రాజకీయ పక్షాలు తమ అభిప్రాయాలు వినిపించాయి. 32 పార్టీలు అనుకూలం కాగా, 15 పార్టీలు ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’కు వ్యతిరేకమని తేలింది. ప్రజాస్వామ్యమంటే కేవలం అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికలు మాత్రమే కాదన్న సంగతి పాలకులు మరిచిపోయి చాన్నాళ్లయింది. ఎన్నికల్లో చెప్పేది ఒకటైతే, గెలిచాక చేసేది మరొకటి.కేంద్రంలో మాత్రమే కాదు... ఏపీలోని ఎన్డీయే పాలన చూసినా ఈ సంగతి ఇట్టే అర్థమవుతుంది. ఏపీలో నదురూ బెదురూ లేకుండా ఇచ్చిన వాగ్దానాలన్నిటికీ ఎగనామం పెట్టారు. ఇక ఎక్కడ ఎన్ని కలు జరిగినా ఈవీఎంలపై అనుమానాలు మొదలవుతున్నాయి. ఏపీలో ఎన్నికలు పూర్తయినవెంటనే ఈసీ ప్రకటించిన ఓట్లకు లెక్కించినప్పుడు అదనంగా మరో పన్నెండున్నర శాతం ఓట్లు వచ్చిచేరాయి. దేశంలో అత్యధిక నియోజకవర్గాల్లో సగటున వెయ్యి ఓట్లు ఇలా అదనంగా చేరినట్టు బయటపడింది. దీనిపై సంజాయిషీ ఇవ్వాలన్న కనీస సంస్కారం ఈసీకి లేకపోగా... ఈవీఎంలలో పోలైన ఓట్లనూ, వీవీ ప్యాట్ స్లిప్‌లనూ సరిపోల్చాలన్న వినతుల్ని బుట్టదాఖలా చేసింది. పైగా అతి తెలివి ప్రదర్శించి డమ్మీ పోలింగ్ నిర్వహణకు దిగింది! ఏపీకి సంబంధించినంతవరకూ అయితే గడువుకు ముందే వీవీ ప్యాట్ స్లిప్‌లను ధ్వంసం చేశారు. ఈవీఎంల డేటా తొలగించారు. ఈ వైపరీ త్యాలపై తామేం చేయాలన్న స్పృహ, వివేకం కేంద్ర పాలకులకు లేకపోగా... ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ లోనే దేశ భవిష్యత్తు సర్వం ఆధారపడి వున్నట్టు భూమ్యాకాశాలు ఏకం చేస్తున్నారు.పైగా ఈ మాదిరి ఎన్నికలు ప్రాంతీయ ఆకాంక్షలనూ, అవసరాలనూ పాతరపెడతాయన్న ఆరోపణలకు సరైన జవాబు లేదు. ఈ విధానం దేశ ఫెడరల్ స్వభావాన్ని దెబ్బతీస్తుందన్న విమ ర్శను బేఖాతరు చేస్తున్నారు. అసలు 140 కోట్ల జనాభా... 30 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతా లున్న దేశాన్నీ... లెక్కకు మిక్కిలివున్న పార్టీలనూ ‘జమిలి’ చట్రంలో బిగించి ఒక్క వోటుకి కుదించాలన్న ప్రతిపాదనే వింతై నది. దానిపై బిల్లులు పెట్టేముందు విస్తృతంగా చర్చించి ఏకాభిప్రాయం సాధించాలన్న కనీస ఇంగితజ్ఞానం కొరవడితే ఎలా? అగ్రరాజ్యమైన అమెరికాలోనే నాలుగేళ్లకోసారి అధ్యక్ష ఎన్నికలు జరుపుతూ, రాష్ట్రాల సెనేట్లకూ, స్థానిక సంస్థలకూ, ప్రతినిధుల సభకూ నిర్ణీత కాలంలో విడివిడిగా ఎన్నికలు నిర్వహిస్తుండగా దాదాపు 97 కోట్లమంది వోటర్లున్న ఈ అతి పెద్ద దేశంలో జమిలికి తహతహలాడటంలోని మర్మమేమిటి? -
జమిలి బిల్లు ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ ఆమోదం
Lok Sabha Session Updatesలోక్‌సభ రేపటికి వాయిదాతిరిగి ప్రారంభమైన లోక్‌సభ లంచ్‌కు ముందు జమిలి బిల్లు ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ ఆమోదంఇక.. జేపీసీ ముందుకు జమిలి బిల్లులు!లోక్‌సభలో జమిలి ప్రవేశపెట్టడానికి ఆమోదంపార్లమెంటరీ సంయుక్త కమిటీ(జేపీసీ) ముందుకు బిల్లులువన్ నేషన్.. వన్ ఎలక్షన్లో భాగంగా 129 రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన బిల్లు కూడాజేపీసీ ద్వారా విస్తృస్థాయి చర్చకు అవకాశంఅతిత్వరలో జేపీసీ ఏర్పాటుజేపీసీ చైర్మన్‌ను ఎంపిక చేయనున్న లోక్‌సభ స్పీకర్సంఖ్యా బలం దృష్ట్యా బీజేపీ నుంచే జేపీసీకి చైర్మన్జేపీసీలో విపక్ష సభ్యులకు కూడా స్థానంసభ్యుల పేర్లను ప్రతిపాదించని తరుణంలో.. సభ్యత్వం కోల్పోయే అవకాశంజమిలి బిల్లు కాపీ కోసం క్లిక్ చేయండి వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదంతీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలుబిల్లు ప్రవేశపెట్టడంపై ఓటింగ్ నిర్వహించిన స్పీకర్ ఓం బిర్లాకొత్త పార్లమెంట్లో ఫస్ట్ డిజిటల్ ఓటింగ్అనుమానాలున్నవాళ్లకు స్లిప్పులు పంచిన సిబ్బందిఅనుకూలంగా 269 ఓట్లు.. వ్యతిరేకంగా 198 ఓట్లులోక్సభ మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా‘జమిలి’ బిల్లుపై ఓటింగ్ అనంతరం 3 గంటలకు వాయిదాపడ్డ లోక్‌సభ ‘జమిలి’ బిల్లు ‘జేపీసీ’కి.. సాధారణ మెజారిటీతో ఓకే అన్న లోక్‌సభ కొత్త పార్లమెంట్ భవనంలో జమిలి బిల్లుపై తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్విపక్షాలు డివిజన్ కోరడంతో ఓటింగ్‌కు అనుమతిచ్చిన స్పీకర్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి, జేపీసీలో చర్చకు పంపేందుకు అనుకూలంగా 269 ఓట్లు బిల్లు ప్రవేశపెట్టడానికి వ్యతిరేకంగా 198 ఓట్లు #WATCH | In a first, E-voting on 'One Nation One Election' Bill underway in Lok Sabha. (Source: Sansad TV) pic.twitter.com/dMRk6UEjeO— ANI (@ANI) December 17, 2024జేపీసీకి జమిలి బిల్లు పంపేందుకు సిద్ధం: అమిత్ షా జమిలి ఎన్నికల బిల్లును జేపీసీ కి పంపేందుకు సిద్ధంఈ బిల్లును జేపీసీకి పంపి విస్తృతంగా చర్చించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారుజేపీసీ నివేదిక తర్వాత మళ్లీ బిల్లు తీసుకువస్తాం లోక్‌సభలోకి జమిలి ఎన్నికల బిల్లు లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టిన న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మేఘ్వాల్ తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేసే చర్య అని మండిపాటు రాజ్యాంగ సవరణకు సంబంధించిన రెండు బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలి రాష్ట్రాల అసెంబ్లీల కాలపరమితి కుదించడం రాజ్యాంగ విరుద్ధం కాంగ్రెస్ ఎంపీ మనీష్‌తివారీ డిమాండ్ జమిలి ఎన్నికల బిల్లుపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఫైర్ జమిలి ఎన్నికలు నియంతృత్వ పాలనకు నాంది అని వ్యాఖ్యబిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటన బిల్లును ఉపసంహరించుకోవాలని టీఎంసీ, డీఎంకే డిమాండ్జమిలి ఎన్నికలు ఎన్నికల సంస్కరణ కాదన్న టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీఈ బిల్లు ఆమోదం పొందితే ఎన్నికల కమిషన్‌కు సర్వాధికారాలు వస్తాయిజమిలి ఎన్నికల బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లేనపుడు బిల్లు ఎలా తెస్తారని ప్రశ్నించిన డీఎంకే జమిలి బిల్లు రాజ్యాంగ విరుద్ధం: ఎంఐఎం అధినేత అసదుద్దీన్జమిలి ఎన్నికలు ఒక లీడర్ ఈగో కోసమే వచ్చిన ఆలోచనరాష్ట్రాల హక్కులను హరిస్తున్నారుబిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాంజమిలి ఎన్నికలకు వైఎస్సార్సీపీ మద్దతులోక్సభలో జమిలి బిల్లులకు టీడీపీ మద్దతుజమిలి ఎన్నికల బిల్లుపై దేశమంతా చర్చ జరగాలి: ఎంపీ రఘునందన్‌రావు గతంలో కూడా నాలుగు సార్లు జమిలి ఎన్నికలు జరిగాయిజమిలి ఎన్నికలతో అధ్యక్ష తరహా పాలన జరగదుఈ బిల్లుకు 31 పార్టీలు మద్దతిస్తున్నాయిఇంకా 15 పార్టీలు మద్దతు ఇవ్వాల్సి ఉందిఏ పార్టీని మేము బుల్డోజ్ చేయంజమిలి ఎన్నికలు దేశ ప్రజల ఆకాంక్షప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాలికాంగ్రెస్ పార్టీ ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలిఇండియా కూటమిలో ఇప్పటికే లుకలుకలు ఉన్నాయివన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు తప్పనిసరిగా పాస్ అవుతుందని నమ్మకం ఉందిఎంపీలకు విప్ జారీ చేసిన కాంగ్రెస్..జమిలి ఎన్నికల బిల్లును లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టనున్నారుఈ సందర్భంగా కాంగ్రెస్ తన ఎంపీలకు విప్ జారీ చేసిందిఎంపీలంతా సభకు హాజరుకావాలని కోరింది సభలోకి వెళ్లేముందే జమిలి ఎన్నికల బిల్లుపై చర్చించే అవకాశం ఉందిసభలోకి రెండు బిల్లులు..జమిలి ఎన్నికల 129వ రాజ్యాంగ (సవరణ) బిల్లు–2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు–2024ను కేంద్రం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు వాటిని ఇవాళ లోక్‌సభ బిజినెస్ జాబితాలో చేర్చారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’కు సంబంధించిన ఈ బిల్లులను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ లోక్‌సభలో ప్రవేశ పెడతారని ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి. అనంతరం విస్తృత సంప్రదింపులకు వీలుగా బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపాల్సిందిగా స్పీకర్‌ను మంత్రి అభ్యర్థించవచ్చని వివరించాయి. ఇందుకు వీలుగా కమిటీకి చైర్మన్, సభ్యులను స్పీకర్ నియమిస్తారు. సంఖ్యాబలం ఆధారంగా పార్టీలకు అందులో స్థానం కల్పిస్తారు. బీజేపీ ఎంపీల్లో ఒకరిని చైర్మన్‌గా ఎంపిక చేయనున్నారు. భాగస్వామ్య పక్షాలందరితో చర్చించిన మీదట కమిటీ 90 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే గడువు పొడిగిస్తారు.20వ తేదీతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నందున జమిలి బిల్లులను మంగళవారమే ప్రవేశపెట్టనున్నట్టు జాతీయ మీడియా కూడా పేర్కొంది.జమిలి ఎన్నికలకు 32 పార్టీలు మద్దతివ్వగా 15 పార్టీలు వ్యతిరేకించినట్టు రామ్‌నాథ్ కోవింద్ కమిటీ వెల్లడించింది. -
జమిలి ఎన్నికల బిల్లు వాయిదా!
-
పార్లమెంట్ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు
-
జమిలి ఎన్నికల బిల్లుపై కేంద్రం కసరత్తు
-
2027లో జమిలి ఎన్నికలు..?
సాక్షి,న్యూఢిల్లీ:జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. 2027లోనే దేశంలో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు బీజేపీ సిద్ధపడిందన్న ప్రచారం జరుగుతోంది. జమిలి ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్లో ఆమోదించాల్సిన బిల్లు కూడా ఇప్పటికే సిద్ధమైందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదించింది. కాగా,ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు సహా పలు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని, జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టబోరని ప్రచారం జరగడం గమనార్హం. -
రిపేర్ బిల్లు చూసి చిర్రెత్తిన కస్టమర్!
స్కూటర్ రిపేర్ వస్తే షోరూమ్ వాళ్లు వేసిన బిల్లు చూసి ఓ కస్టమర్ నిర్ఘాంతపోయాడు. ఆ బిల్లు ఏకంగా ప్రస్తుతం కొత్త స్కూటర్ రేటుతో దాదాపు సమానంగా ఉంది. దాంతో చిర్రెత్తిన ఆ కస్టమర్ స్కూటర్ షోరూమ్ ముందే సుత్తితో స్కూటర్‌ను పగలగొట్టాడు. ఆ స్కూటర్ షోరూమ్‌కు రిపేర్ కోసం వచ్చిన ఇతర కస్టమర్లు చుట్టూ చేరి సుత్తితో బాదే కస్టమర్ చర్యలకు మద్దతుగా నిలిచారు. ఈమేరకు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రిపేర్ కోసం ఓ కస్టమర్ షోరూమ్‌ను సంప్రదించాడు. రిపేర్ పూర్తయ్యాక బిల్లు చూసిన తాను షాక్‌కు గురయ్యాడు. ఏకంగా రూ.90,000 బిల్లు చేసినట్లు గుర్తించాడు. దాంతో కోపంతో ఆ షోరూమ్ ముందే స్కూటర్‌ను సుత్తితో పగలగొట్టాడు. రిపేర్ బిల్లులకు సంబంధించి సరైన నిబంధనలు పాటించడం లేదని ఇతర కస్టమర్లు తన చర్యను సమర్థించారు. ఈమేరకు తీసిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్‌గా మారింది.Furious Ola Electric customer smashes scooter with hammer after allegedly receiving ₹90,000 bill from showroom. pic.twitter.com/c6lYSKSUf7— Gems (@gemsofbabus_) November 24, 2024ఇదీ చదవండి: అదానీకి యూఎస్ ఎస్ఈసీ సమన్లుఓలా స్కూటర్లకు సంబంధించి ఇటీవల ఫిర్యాదులు పెరుగుతున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఓలా కస్టమర్ల నుంచి 10,644 ఫిర్యాదులు వచ్చినట్లు, వాటిని పరిష్కరించాలనేలా సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) గతంలో సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కంపెనీ సర్వీసుకు సంబంధించి ఇటీవల కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య సామాజిక మాధ్యమాలు వేదికగా వివాదం నెలకొంది. కంపెనీ సర్వీసు సరిగా లేదని పేర్కొంటూ సర్వీస్ సెంటర్ ముందు పోగైన ఓలా ఎలక్ట్రిక్ వాహనాల ఫొటోను కమ్రా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంతో వివాదం మొదలైంది. దీనిపై భవిష్ స్పందించిన తీరుపై నెటిజన్ల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. -
లోకాయుక్త బిల్లు.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త చట్టానికి సవరణలు తీసుకొస్తూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతిపాదనలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగాలేవని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్‌రావు అభిప్రాయపడ్డారు. సీఎం పేరుతో మంత్రి నారా లోకేశ్ లోకాయుక్త చట్ట సవరణ బిల్లు ఆమోదం కోసం శుక్రవారం ‘మండలి’లో ప్రవేశపెట్టగా, దానిపై కొద్దిసేపు చర్చ జరిగింది. బిల్లులో సవరణలపై లోకేశ్ వివరిస్తూ.. లోకాయుక్త, సభ్యుల నియామక కమిటీలో సీఎం చైర్మన్‌గా, అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు, హోంమంత్రి లేదా సీఎం నామినేట్ చేసే మంత్రి సభ్యులుగా ఉంటారని.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత లేనిపక్షంలో మిగతా నలుగురు సభ్యులతో లోకాయుక్త కమిటీ సమావేశం ఏర్పాటుకు ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. దీనిపై లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ జోడు గుర్రాల్లా వెళ్లాలని ఓ రాజనీతిశాస్త్ర అధ్యాపకుడిగా నేను భావిస్తున్నా. బిల్లు సారాంశం నాకు అర్థమైనంత వరకు.. ప్రతిపక్ష నాయకుడు లేరు కాబట్టి ఆయనను మినహాయిస్తూ, మిగిలిన నలుగురితో చేయాలని అనుకుంటున్నట్లుగా ఉంది. నిజానికి.. ప్రతిపక్ష నాయకుడు లేకపోయినా, ప్రతిపక్షం ఉంది. ప్రతిపక్షం నుంచి ఎవరైనా ఒక సభ్యుడు ఉండేలా కమిటీ ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. దానికి ప్రతిపక్ష హోదా అక్కరలేదు. ప్రతిపక్ష పార్టీ అక్కడ ఉంది. ఆ పార్టీని ఎవరో ఒక సభ్యుడిని నామినేట్ చేయమని అడగొచ్చు. మీ ప్రతిపాదనలు ప్రజాస్వామ్య స్పిరిట్ కాదు’ అంటూ మాట్లాడారు. ఈ సమయంలో పలువురు టీడీపీ సభ్యులు పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయగా.. లక్ష్మణరావు స్పందిస్తూ.. ‘వాదనలు చేయాలంటే చాలా చెయ్యొచ్చు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రం చెబుతున్నా. ఆచరిస్తే ఆచరించండి లేకపోతే లేద’ని తెలిపారు.ప్రజాస్వామ్యయుతంగానే ముందుకు..లక్ష్మణరావు చేసిన సూచనపై లోకేశ్ స్పందిస్తూ.. ‘ప్రతిపక్ష నేత లేనిపక్షంలో అని బిల్లులో పేర్కొన్నాం.. అంతేగానీ ఏమీ తీసివేయడంలేదు. ఆయన లేనిపక్షంలో నలుగురుతో జరుగుతుందని మాత్రమే బిల్లులో పేర్కొన్నాం’.. అని చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగానే లోకాయుక్తను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందన్నారు. మాజీ సీఎం జగన్ రెండు సమావేశాల నుంచి సభకు రాని పరిస్థితి అని.. అన్నీ పరిగణనలోకి తీసుకునే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. చర్చ అనంతరం, సభ మూజువాణితో బిల్లు ఆమోదం పొందినట్లు మండలి చైర్మన్ ప్రకటించారు.మరో ఏడు బిల్లులు కూడా.. జ్యుడీషియల్ ప్రివ్యూకు రద్దుఇప్పటికే అసెంబ్లీ ఆమోదం పొందిన లాండ్ గ్రాబింగ్ సవరణ బిల్లు, పీడీ యాక్ట్ సవరణ బిల్లు, దేవదాయశాఖ పాలక మండలి కమిటీ అదనపు సభ్యుల నియామకం సవరణ బిల్లు, జ్యుడీషియల్ ప్రివ్యూకు సంబంధించిన బిల్లులతో పాటు మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లు, వ్యాట్ చట్ట సవరణ బిల్లులు కూడా శుక్రవారం మండలిలో ఆమోదం పొందాయి. -
ఆ రాష్ట్రంలో యువతుల వివాహ వయస్సు పెంపు
దేశంలో యువతుల వివాహ వయస్సు 18గా ఉంది. అంటే వారికి చట్టప్రకారం 18 ఏళ్లు నిండిన తర్వాతనే వివాహం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సవరించింది.హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 21 ఏళ్ల వయస్సు వచ్చాకనే ఆడపిల్లలకు వివాహం చేయాలనే నిబంధనను తీసుకురానుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర అసెంబ్లీ తాజాగా యువతుల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ రూపొందించిన బిల్లుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర అసెంబ్లీ బాల్య వివాహాల నిషేధాన్ని (హిమాచల్ ప్రదేశ్ సవరణ బిల్లు 2024) వాయిస్ ఓటు ద్వారా ఆమోదించింది.ఈ సందర్భంగా మహిళా సాధికారత శాఖ మంత్రి ధని రామ్ షాండిల్ మాట్లాడుతూ బాల్య వివాహాలను నిషేధించేందుకు బాల్య వివాహ చట్టం 2006ను రూపొందించామని తెలిపారు. లింగ సమానత్వం, ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు కల్పించేందుకు యువతుల కనీస వివాహ వయస్సును పెంచాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. చిన్న వయస్సులోనే గర్భం దాల్చడం ఆడపిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందన్నారు. రాష్ట్రంలో బాల్య వివాహ చట్టం 2006, సంబంధిత చట్టాలను సవరించి, బాలికల కనీస వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదన చేశామని మంత్రి తెలిపారు. -
దారికొచ్చిన ఎన్డీయే సర్కారు!
అలవాటైన పద్ధతిలో వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఎన్డీయే ప్రభుత్వానికి కాసేపటికే తత్వం బోధపడినట్టుంది. విపక్షాల నుంచి ప్రతిఘటన ఎదురుకావటంతో దాన్ని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపటానికి అంగీకరించింది. కారణమేదైనా అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు జేపీసీకి లేదా సెలెక్ట్ కమిటీకి పంపటం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక సంప్రదాయం. కానీ ఎన్డీయే అధికారంలోకి వచ్చాక కేవలం రెండు సంద ర్భాల్లో మాత్రమే పాటించింది. పదేళ్లనాడు గద్దెనెక్కగానే అంతకు కొన్ని నెలలముందు అమల్లోకొచ్చిన భూసేకరణ చట్టం పీకనొక్కుతూ ఆదరా బాదరాగా ఆర్డినెన్స్ తీసుకురావటం ఎవరూ మరిచిపోరు. విపక్షాలు అభ్యంతరం చెబుతున్నా ఆనాడు చెవికెక్కలేదు. ఆర్డినెన్స్ మురిగి పోయిన రెండుసార్లూ దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తూ తిరిగి ఆర్డినెన్సులు తీసుకొచ్చారు. రాజ్యసభలోగండం గడిచేలా లేదని గ్రహించాక ఇక దాని జోలికి పోరాదని నిర్ణయించుకున్నారు. అటుపై సాగు చట్టాల విషయంలోనూ రైతులనుంచి ఇలాంటి పరాభవమే ఎదురయ్యాక వాటినీ ఉపసంహరించుకున్నారు. ఐపీసీ, సాక్ష్యాధారాల చట్టం, సీఆర్పీసీ స్థానంలో వచ్చిన కొత్త చట్టాల తాలూకు బిల్లులపై కూడా సంబంధిత వర్గాలను సరిగా సంప్రదించలేదు. ఎన్డీయే ఏలుబడి మొదలయ్యాక చోటుచేసుకున్న వేర్వేరు ఉదంతాల పర్యవసానంగా ముస్లిం సమాజంలో ఒక రకమైన అభద్రతాభావం ఏర్పడిన నేపథ్యంలో ఈ వివాదాస్పద చర్యకు కేంద్రం ఎందుకు సిద్ధపడిందో తెలియదు. బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని ఎన్డీయే భాగస్వామ్య పక్షం జేడీ(యూ) నేత, కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అంటున్నారు. ఇది పారదర్శకత తీసుకొస్తుందని కూడా ఆయన సెలవిచ్చారు. మంచిదే. మరి ఆ వర్గంతో సంప్రదింపులు జరిగిందెక్కడ? ముస్లిం సమాజానికున్న అభ్యంతరాల సంగతలా వుంచి రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు సైతం ఇది ఎసరు పెడుతోంది. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ప్రకారం భూమి రాష్ట్రాల జాబితాలోనిది.వక్ఫ్ ఆస్తిపై కేంద్ర పెత్తనాన్ని అనుమతించటంద్వారా దాన్ని కాస్తా తాజా బిల్లు నీరుగారుస్తోంది. కనుక ముస్లిం సమాజంతో మాత్రమేకాదు...రాష్ట్రాలతో కూడా సంప్రదించాల్సిన అవసరం లేదా? హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీలకు జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ బిల్లు తెచ్చారని లోక్‌సభలో విపక్షాలు చేసిన విమర్శలు కాదని చెప్పటానికి ప్రభుత్వం దగ్గర జవాబు లేదు. తన చర్య వెనక సదుద్దేశం ఉందనుకున్నప్పుడూ, బిల్లుపై ఉన్నవన్నీ అపోహలే అని భావించి నప్పుడూ తగిన సమయం తీసుకుని సంబంధిత వర్గాలతో చర్చించటానికేమైంది? ఒకవేళ వచ్చే అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే హడావిడిగా బిల్లు తీసుకొచ్చి వుంటే అంతకన్నా తెలివి తక్కువతనం ఉండదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ మాదిరి ఎత్తుగడలను జనం ఏవగించు కున్నారని బీజేపీకి అర్థమయ్యే వుండాలి.సవరణ బిల్లు ద్వారా తీసుకొచ్చిన 44 సవరణల పర్యవసానంగా వక్ఫ్ బోర్డుల అధికారాలకు కత్తెరపడుతుందని, ప్రభుత్వ నియంత్రణ పెరుగుతుందని కనబడుతూనేవుంది. అరుదైన సంద ర్భాల్లో తప్ప కలెక్టర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటారని ఎవరూ అనుకోరు. ఫలానా ప్రార్థనాస్థలం శతాబ్దాలక్రితం తమదేనంటూ ఆందోళనలు చేయటం, దానికి ప్రభుత్వాలు వత్తాసు పలుకుతుండటం అక్కడక్కడ కనబడుతూనేవుంది. ఇంతకాలం వక్ఫ్ ట్రిబ్యున ళ్లకు ఉండే అధికారం కాస్తా కలెక్టర్లకు ఇవ్వాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.బోర్డుల్లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించటం, ఆస్తిని విరాళంగా ఇవ్వటంపై ఆంక్షలు సంశయం కలిగించేవే. మతపరమైన, ధార్మికపరమైన కార్యకలాపాల నిర్వహణ కోసం వచ్చిన ఆస్తుల్ని పర్యవేక్షించటానికి ఏర్పడిన బోర్డుల్లో వేరే మత విశ్వాసాలున్నవారిని నియమించటం ఏరకంగా చూసినా సరికాదన్న ఇంగిత జ్ఞానం ఉండొద్దా? అసలు ఒకసారి బోర్డు దేన్నయినా వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తే దాన్ని మార్చటం అసాధ్యమన్న ప్రచారం కూడా తప్పు. ఫలానా ఆస్తి బోర్డుదనుకుంటే సంబంధిత వర్గాలకు నోటీసులిచ్చి వారి వాదనలు పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలని ప్రస్తుత చట్టంలోని సెక్షన్40 చెబుతోంది. అటు తర్వాత వక్ఫ్ ట్రిబ్యునల్‌దే తుది నిర్ణయం. పైగా విరాళమిచ్చిన దాత కచ్చితంగా ఇస్లాంను పాటించే వ్యక్తే అయివుండాలని, దానంగా వచ్చే ఆస్తి కుటుంబవారసత్వ ఆస్తి కాకూడదని చట్టం నిర్దేశిస్తోంది. ఇప్పటికే ఇన్ని కట్టుదిట్టమైన నిబంధనలుండగా అందుకు భిన్నంగా ప్రచారం చేయటం సబబేనా? ఈ పరిస్థితుల్లో బిల్లు చట్టమైతే వక్ఫ్ ఆస్తుల చుట్టూ వివాదాలు ముసురుకుంటాయనుకునే అవకాశం లేదా? సంకీర్ణంలోని జేడీ(యూ), ఎల్జేపీలు బిల్లుకు మద్దతు పలకగా సభలో టీడీపీ సంకటస్థితిలో పడిన వైనం స్పష్టంగా కనబడింది. ఆ బిల్లుకు మద్దతిస్తుందట...కానీ జేపీసీకి ‘పంపితే’ వ్యతిరే కించబోదట! ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పుట్టుకొచ్చిన బాబు రెండు కళ్ల సిద్ధాంతం ఇంకా సజీవంగా ఉందన్నమాట! టీడీపీది చిత్రమైన వాదన. అలా పంపనట్టయితే వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదించబోమని చెప్పడానికి నోరెందుకు రాలేదు? ఒకపక్క బిల్లు చట్టమైతే పారదర్శకత ఏర్పడుతుందన్న ప్రభుత్వ వాదనను సమర్థిస్తూనే తమ సెక్యులర్ వేషానికి భంగం కలగకుండా ఆడిన ఈ డ్రామా రక్తి కట్టలేదు. జాతీయ మీడియా దీన్ని గమనించింది. మొత్తానికి సవరణ బిల్లు జేపీసీకి వెళ్లటం శుభ పరిణామం. ఎన్డీయే సర్కారు ఈ సంప్రదాయాన్ని మున్ముందు కూడా పాటించటం ఉత్తమం. -
వక్ఫ్ బోర్డు బిల్ పై కేంద్రం కీలక నిర్ణయం
-
Gold Scam: క్యారెట్లలో కిరికిరి.. కొనేదంతా బంగారం కాదు!
హైదరాబాద్‌లోని శ్రీనగర్‌కాలనీకి చెందిన ఒక మహిళ తన బంగారు ఆభరణాన్ని కరిగించి మరో ఆభరణం తయారు చేయించుకునేందుకు స్వర్ణకారుడి వద్దకు వెళ్లింది. ఆభరణాన్ని పరిశీలించగా అందులో 70 శాతానికి మించి బంగారం లేదు. హాల్‌మార్క్ సెంటర్‌కు పంపి పరిశీలిస్తే ఆభరణంలో రాగి 16.47 శాతం, వెండి 15.23 శాతం ఉండగా బంగారం 68.12 శాతం మాత్రమే ఉన్నట్లు తేలింది. గతంలో ఆ ఆభరణాన్ని విక్రయించిన వ్యాపారి ఇచ్చిన రసీదు అందుబాటులో లేకపోవడంతో ప్రశ్నించే అవకాశం లేకుండాపోయింది.బంగారంపై మహిళలకుండే మక్కువ అంతా ఇంతా కాదు. బంగారంతో చేసిన ఆభరణాలపై ఉండే క్రేజే వేరు. ధనం లేకున్నా, తులం బంగారం అయినా ఒంటి మీద ఉండాలని సగటు మధ్య తరగతి మహిళలు భావిస్తుంటారు. పేద, ధనిక తేడా లేకుండా ప్రతిఒక్కరూ తమ స్థాయికి తగ్గట్టు వీలైనప్పుడల్లా బంగారు ఆభరణాలు కొనేందుకు ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో కొత్త బంగారు ఆభరణాలు కొనేవారి సంఖ్య, అన్‌సీజన్‌లో పాత బంగారంతో కొత్త ఆభరణాలు చేయించేకునే వారి సంఖ్య ఇటీవలి కాలంలో అధికంగా ఉంటోంది. గతంలో పెళ్లినాడు ఏ నగలైతే పెట్టుకునేవాళ్లో వాటినే భద్రంగా కాపాడుకుంటూ శుభకార్యాల్లో ధరించేవాళ్లు. ప్రస్తుతం ట్రెండ్ మారింది.పాత నగలను ఫ్యాషన్‌కు అనుగుణంగా మార్చుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే కొనేటప్పుడు ఆ ఆభరణాన్ని మొత్తం బంగారం కిందే లెక్కించి వ్యాపారి డబ్బులు వసూలు చేస్తాడు. అదే కొంత కాలం తర్వాత కొన్న బంగారాన్ని కరిగించి మరో ఆభరణం తయారీ కోసమో, ఆర్థిక అవసరాల కోసం అమ్మడానికో వెళితే అసలు రంగు బయటపడుతుంది. క్యారెట్ల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. నాణ్యత తక్కువుందనో, వేస్టేజీ ఎక్కువుందనో పేర్కొంటూ వీలైనంత తక్కువ చెల్లించడం సర్వసాధారణం. ఇక వజ్రా భరణాల్లో మేలిమి బంగారం నేతి బీరలో నెయ్యి చందంగానే మారింది. కళ్ల ముందే బంగారం స్వచ్ఛతలో మాయ చేస్తున్నా నాణ్యత గుర్తించలేక వినియోగదారులు నష్టపోతున్నారు. సాక్షి హైదరాబాద్మోసం ఇలా..ప్రముఖ జ్యువెలరీస్, షాపింగ్ మాల్స్ నుంచి చిన్నపాటి స్వర్ణకారుడి షాపు వరకు కూడా 24 క్యారెట్ల కంటే తక్కువ నాణ్యత కలిగిన బంగారాన్నే విక్రయిస్తుంటాయి. ఆభరణంలో పటుత్వం కోసం రాగి కలుపుతారు. సాధారణంగా ఆభరణాలన్నీ 22 క్యారెట్లు లేదా కొంచెం తక్కువ నాణ్యత కలిగి ఉంటాయి. వజ్రాల నగ కేవలం 18 క్యారెట్‌తోనే ఉంటుంది. అయితే వ్యాపారులు 18 క్యారెట్ల అభరణాన్ని చేతిలో పెట్టి 22 క్యారెట్ల బిల్లు వసూలు చేయడం సర్వసాధరణంగా మారిపోయింది. 22 క్యారెట్లు 18 క్యారెట్ల ఆభరణానికి మధ్య గ్రాముకు కనీసం రూ.500 నుంచి రూ.1,000 వరకు వ్యత్యాసం ఉంటుంది. ఈ లెక్కన 10 గ్రాముల బంగారానికి దాదాపు రూ.10 వేల వరకు వినియోగదారులు మోసపోతున్నారన్నమాట.హాల్‌మార్క్ ముద్ర తప్పనిసరివంద శాతం స్వచ్ఛతతో కూడిన మేలిమి బంగారం బిస్కెట్ రూపంలో ఉంటుంది. కాగా బంగారు ఆభరణాల్లో స్వచ్ఛతను హాల్ మార్క్ ముద్ర తెలియజేస్తుంది. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) నిబంధన మేరకు బంగారం ఉంటేనే సదరు ఆభరణంపై హాల్ మార్క్ ముద్ర ఉంటుంది. 24 క్యారెట్ల బంగారంపై 999, 23 క్యారెట్లపై 958, 22 క్యారెట్లపై 916, 21 క్యారెట్లపై 875, 18 క్యారెట్లపై 750 అని ముద్ర ఉంటుంది. ఈ నంబర్ తర్వాత హాల్ మార్క్ వేసిన సెంటర్ మార్క్ ఉంటుంది. తయారైన సంవత్సరం ఇంగ్లిష్ అక్షరం కోడ్ రూపంలో ఉంటుంది. చివరిలో బీఐఎస్ ధ్రువీకరించిన ఆభరణాల తయారీదారుల గుర్తు ఉంటుంది. ఈ హాల్‌మార్క్ ముద్ర లేని ఆభరణాల కొనుగోలులోనే మోసాలకు అవకాశం ఉంటుంది.స్వచ్ఛత...క్యారెట్లలోబంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. ఇది 0 నుంచి 24 వరకు ఉంటుంది. క్యారెట్ విలువ ఎంత ఎక్కువగా ఉంటే బంగారం అంత స్వచ్ఛత లేదా నాణ్యత కలిగి ఉన్నట్టన్న మాట. ధర కూడా ఆ మేరకే ఉంటుంది. బంగారం ఎంతో సున్నితంగా పెళుసు స్వభావంతో కూడిన లోహం. కాబట్టే ఆభరణాల తయారీలో అది గట్టిగా ఉండేందుకు రాగి, నికెల్, వెండి, పల్లాడియం లాంటి లోహాలు కలుపుతారు. బంగారం, ఇతర లోహాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయనేది క్యారెట్ ద్వారా తెలుస్తోంది. అయితే వాస్తవ నిష్పత్తి, క్యారెట్ల మధ్య తేడాలు.. వ్యాపారులు, ఎప్పుడూ బంగారం కొనుగోళ్లలో మునిగి తేలేవారికి, పెట్టుబడులు పెట్టేవారికి మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది.ఆభరణంలో బంగారమెంత?కొనుగోలు చేసే బంగారు ఆభరణాలలో ఎంత బంగారం ఉందో క్యారెట్ లెక్క ద్వారా తెలుసు కోవచ్చు. ఉదాహరణకు 14 క్యారెట్ల ఉంగరాన్ని కొనుగోలు చేశారనుకోండి.. బంగారం స్వచ్ఛతను 0 నుండి 24 స్కేల్లో కొలుస్తారు కాబట్టి, 14ని 24తో భాగించాలి. అప్పుడు 0.583 వస్తుంది. అంటే మీ 14 క్యారెట్ల బంగారు ఉంగరంలో 58.3% బంగారం ఉందన్న మాట. అదేవిధంగా బంగారం స్వచ్ఛతను ఫైన్నెస్, దాని రంగును బట్టి గుర్తించొచ్చు. 24 క్యారెట్ల బంగారం మెరుస్తూ ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం మెరుపు కాస్త తక్కువగా ఉండి, 24 క్యారెట్లతో పోల్చుకుంటే కొంత ముదురు రంగులో ఉంటుంది. ఇలా ఇతర లోహాల పరిమాణం పెరిగేకొద్దీ రంగు తేలిపోతుంటుంది. బంగారం తెల్లగా ఉందంటే నికెల్ ఎక్కువగా ఉందన్నమాట. క్యారెట్లు..రకాలు24 క్యారెట్లు: పూర్తి స్థాయి స్వచ్ఛత/నాణ్యత కలిగిన బంగారం. ఇందులో ఇతర లోహాలేవీ ఉండవు. అందుకే 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారంతో పోలిస్తే ఖరీదు ఎక్కువ. ఖరీదెక్కువ, ఆభరణానికి పనికిరాదు.. మరెందుకు ఇది అంటే బంగారంలో పెట్టుబడులు పెట్టే వారికి ఇది ఎక్కువగా ఉపయోగ పడుతుంది. కొంతమంది 24 క్యారెట్ల బంగారం (బిస్కెట్) కొని ఆభరణాలు చేయించుకుంటుంటారు.22 క్యారెట్లు: ఇందులో 22 వంతులు బంగారం ఉంటే రెండొంతుల్లో రాగి, జింక్ లాంటి లోహాలు ఉంటాయి అంటే 91.6 శాతం బంగారం, 8.4 శాతం కలిపిన ఇతర లోహాలు ఉంటాయన్న మాట. ముందే చెప్పుకున్నట్లు 24 క్యారెట్ల బంగారం కంటే దీనికి మన్నిక ఎక్కువ. కాబట్టే ఆభరణాల తయారీకి ఇది అనువైనది. సాధారణంగా 22 క్యారెట్ల బంగారంతోనే ఆభరణాలు తయారు చేస్తారు. దీనినే 916 కేడీఎం గోల్డ్ లేదా 91.6 కేడీయం గోల్డ్ అని కూడా అంటారు. 18 క్యారెట్లు: ఇందులో 18 భాగాలు పసిడి ఉంటే.. ఆరు భాగాలు ఇతర మెటల్స్ ఉంటాయి. మొత్తం మీద 75 శాతం బంగారం , 25 శాతం జింక్, రాగి, నికెల్ లాంటి లోహాలు ఉంటాయి. 24, 22 క్యారెట్ల బంగారం కంటే ఇది మరింత మన్నికగా ఉంటుంది. తక్కువ ఖర్చు అవుతుందని చాలామంది ఈ ఆభరణాలు కొంటుంటారు.14 క్యారెట్లు: ఇందులో 58.3 శాతం గోల్డ్, 41.7 శాతం ఇతర మెటల్స్ ఉంటాయి. దీనికి మన్నిక ఎక్కువ కానీ ధర చాలా తక్కువ. ఇక 12 క్యారెట్లలో 50 శాతం, 10 క్యారెట్లలో 41.7 శాతానికి మించి బంగారం ఉండదు. టంచ్ మిషన్లతో ‘పంచ్’నగ నచ్చకనో, పాతబడిందనో, కొత్త మోడల్ మార్కెట్లోకి రావడంతో మార్చుకుందామనో జ్యువెలరీ దుకాణదారుని దగ్గరకు వెళతాం. అప్పుడు పాత నగను కరిగించడం ద్వారా దాంట్లో బంగారం శాతం ఎంత ఉందో తెలుసుకోవడానికి టంచ్ మిషన్‌లో పరిశీలిస్తారు. మిషన్‌లో ముందే సవరించిన రీడింగ్‌తో బంగారం శాతాన్ని నిర్ధారణ చేస్తారు. సాధారణంగా పాత నగలో ఉన్న బంగారం శాతం కంటే 5 నుంచి 10 శాతం తక్కువగా నిర్ధారణ చేస్తుంటారు. ఇది టంచ్ మిషన్లతో జరుగుతున్న మోసం. వాస్తవానికి బంగారం నాణ్యతను, పాత బంగారంలో బంగారం శాతాన్ని నిర్ణయించేందుకు బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్) సంస్థ ద్వారా అనుమతి పొందిన లైసెన్స్‌దారుడి దగ్గరే నిర్ధారణ చేయాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా ఎక్స్–రే ఫ్లోరోసెన్స్ మిషన్ (కంప్యూటర్ అనుసంధాన యంత్రాల టంచ్ మిష¯Œన్)తో బంగారం నాణ్యత ప్రమాణాలు నిర్ధారిస్తున్నారు. అధికారిక కాగితంపై కాకుండా సాధారణ పేపర్‌పైనే ప్యూరిటీ పర్సంటేజీలను వేస్తున్నారు.బంగారు పూతనే వన్ గ్రామ్వన్ గ్రామ్ గోల్డ్ పేరుతో ఆభరణాల విక్రయం ఎక్కువ జరగడం అందరికీ తెలిసిందే. ఎంతో వ్యయం చేసి ఆభరణాలు కొనేకన్నా.. పెళ్ళిళ్లు ఇతర వేడుకల్లో ఒరిజినల్ బంగారాన్ని తలదన్నేలా కన్పించే ఆకర్షణీయమైన డిజైన్లలో ఉండే వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలకు ఇటీవలి కాలంలో గిరాకీ పెరిగింది. వెండి, రాగితో చేసిన ఆభరణాలకు బంగారం పూత పూసి వీటిని తయారు చేస్తారు. అందుకే వీటిని వ¯Œన్ గ్రామ్ గోల్డ్‌గా వ్యవహరిస్తుంటారు. ఇమిటేషన్ (నకిలీ)జ్యువెలరీ కంటే వ¯Œన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు ఎక్కువ కాలం రంగు పోకుండా ఉంటాయి. అంతేకానీ ఈ ఆభరణాల్లో ఒక గ్రాము బంగారాన్ని వినియోగిస్తారని కాదు. బంగారం స్వచ్ఛత ఇలా..క్యారెట్ స్వచ్ఛత24 క్యారెట్ 99.923 క్యారెట్ 95.822 క్యారెట్ 91.621 క్యారెట్ 87.518 క్యారెట్ 75.014 క్యారెట్ 58.3బంగారం నాణ్యత పరిశీలన తప్పనిసరిబంగారం కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతపై అవగాహన అవసరం. నాణ్యత పరిశీలన తప్పనిసరి. చాలవరకు జ్యువెలరీస్, షాపింగ్ మాల్స్ నాణ్యతను తెలియజేసే క్యారెక్టరైజేష¯Œన్ మిషన్ వినియోగించడం లేదు. ప్రభుత్వ పరంగా తనిఖీలు నిర్వహించే సంబంధిత అధికారుల వద్ద కూడా నాణ్యతను పరిశీలించే మిషన్లు లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిషన్లు సరఫరా చేస్తే తనిఖీలతో వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట పడటంతో పాటు వినియోగదారులు చెల్లించే సొమ్ముకు తగిన నాణ్యతతో కూడిన బంగారం లభించే అవకాశం ఉంటుంది.వినియోదారుడు కూడ బంగారం నాణ్యతను అడిగాలి. అనుమానం ఉంటే నాణ్యతను పరీక్షించుకోవాలి. హాల్‌మార్క్ గుర్తును చూసిన తర్వాత మాత్రమే ఆభరణం కొనుగోలు చేయాలి. హాల్‌మార్క్ అనేది బంగారంపై ప్రభుత్వ హామీ. ఒక్కో ఆభరణాన్ని పరీక్షించి, హాల్ మార్క్ ఇచ్చేందుకు అయ్యే ఖర్చు చాలా తక్కువ.– భాస్కర్ కూచన, రిటైర్డ్ అసిస్టెంట్ కంట్రోలర్, లీగల్ మెట్రాలజీ, హైదరాబాద్ -
రిజర్వేషన్ల పెంపు.. బీహార్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
బీహార్‌లో రిజర్వేషన్ల పరిధిని మరింతగా పెంచుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో రిజర్వేషన్ల పరిధిని 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది.విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఇతర వెనుకబడిన తరగతులకు రాష్ట్ర ప్రభుత్వం 65 శాతం మేరకు పెంచిన రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై పట్నా హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రిజర్వేషన్ల పెంపును రద్దు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టాన్ని రద్దు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ గౌరవ్ కుమార్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను పూర్తి చేశాక, మార్చి 11న నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు. పట్నాహైకోర్టు ఈ రోజు(గురువారం) రిజర్వేషన్లపై తన తీర్పు వెలువరించింది. Patna High Court scraps 65% reservation for Backward Classes, EBCs, SCs & STs.The Court set aside the Bihar Reservation of Vacancies in Posts and Services (Amendment) Act, 2023 and The Bihar (In admission in Educational Institutions) Reservation (Amendment) Act, 2023 as ultra… pic.twitter.com/FTvY9CzvRn— ANI (@ANI) June 20, 2024 -
ఒకే బిల్లు.. చెల్లింపులు రెండు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు నిధుల కటకట ఉండగా, ప్రతీ పనికి ప్రభుత్వం ఒక వైపు ఆచితూచి ఖర్చు పెడుతుంటే.. మరోవైపు రాష్ట్ర ట్రెజరీ విభాగం మాత్రం ఒకే చెక్కుకు రెండేసి చొప్పున చెల్లింపులు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ ఒక ప్రైవేటు కంపెనీతో ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐఎఫ్ఎంఎస్) అమలు చేయిస్తోంది. దీనిపై ఐదేళ్లుగా ఉద్యోగులు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఎస్టీఓ పరిధిలో ఒకే మొత్తానికి సంబంధించి ఒక చెక్‌ను స్థానిక అధికారులు క్లియర్ చేయగా, అదే చెక్‌ను స్థానిక అధికారుల ప్రమేయం లేకుండానే ఆన్లైన్ పద్ధతిలో ఈ–కుబేర్ నుంచి చెల్లించేశారు. వివరాల్లోకి వెళితే వలిగొండ మార్కెట్ కమిటీ నుంచి గత నవంబర్ 22న వచ్చి న రూ.30,65,987 (టోకెన్ నంబర్ : 2438538332) మొత్తాన్ని ఖజానాలో సరిపోను నగదు లేని కారణంగా ఈ ఏడాది మార్చి 31న రిజెక్ట్ చేశారు. అదే మొత్తం కోసం తిరిగి ఈ ఏడాది ఏప్రిల్ 25న చెక్‌ను మళ్లీ సబ్మిట్ చేస్తే.. రామన్నపేట ఎస్టీఓ అనుమతితో మే 30న రూ.30,65,987 మొత్తాన్ని సంబంధిత అకౌంట్‌కు బదిలీ చేశారు. మళ్లీ అదే మొత్తానికి సంబంధించి మరో చెక్ (నం. 251940047) ఎస్టీఓ ప్రమేయం లేకుండానే మరో రూ.30,65,987 మొత్తాన్ని అదే అకౌంట్‌కు బదిలీ చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన రామన్నపేట సబ్‌ట్రెజరీ అధికారి (ఎస్టీఓ).. ఉన్నతాధికారులకు నివేదించి, ఆపై రామన్నపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ ఐడీ, పాస్‌వర్డ్‌లను వాడుకుని ఖాతాల నుంచి చెల్లింపులు చేస్తున్న అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని రాష్ట్ర ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఎంప్లాయీస్ గెజిటెడ్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. -
వాస్తవ ఖర్చులే ట్రూ అప్ చార్జీలు
సాక్షి, అమరావతి: ట్రూ అప్ చార్జి.. ప్రతి నెలా కరెంటు బిల్లు రాగానే అందులో ఈ చార్జీని చూసి సంబంధం లేని ఏదో చార్జీ వేసేశారని భావిస్తుంటారు. ఈ అమాయకత్వాన్నే ఆసరా చేసుకుని ప్రతిపక్షాలు, కొన్ని పచ్చ పత్రికలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయి. వాస్తవానికి ట్రూ అప్ అంటే వేరే ఖర్చులు కాదు. వినియోగదారులకు సంబంధం లేనివి అంతకన్నా కాదు. విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేసేందుకు పెట్టిన వాస్తవ ఖర్చులే అవి. అది కూడా ఆంధ్రప్రదేశ్ విదుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతించినవే.ప్రతి ఏటా విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు వినియోగదారులపై విధించే చార్జీలను ఏపీఈఆర్సీనే నిర్ణయిస్తుంది. ఆ ఏడాది యూనిట్‌కు ఎంత వసూలు చేయాలని ఈఆర్సీ చెబితే అదే రేటును డిస్కంలు వసూలు చేయాలి. కానీ, బహిరంగ మార్కెట్లో ప్రతి రోజూ కొనే విద్యుత్‌కు అదనంగా ఖర్చవుతుంటుంది. ఉదాహరణకు ఈఆర్సీ అనుమతించిన రేటు రూ.6 అయితే కొన్న రేటు రూ.8 అయితే, పైన పడిన రూ.2 భారాన్ని కొనుగోలు సమయంలో డిస్కంలు పవర్ ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పులు తెచ్చి కట్టేస్తుంటాయి. ఆ అప్పులు తీర్చడం కోసం రూ.2 తో కొన్న విద్యుత్‌ను వినియోగదారులకే అందించినందున ఆ ఖర్చును వారి నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతించాలని డిస్కంలు ఏపీఈఆర్సీని కోరుతుంటాయి. దీనినే ట్రూ అప్ చార్జీగా పిలుస్తున్నారు.ఖర్చు చేసినంతా కాదుడిస్కంలు నివేదికలో ఇచ్చిన మొత్తాన్ని యథాతధంగా ఆమోదించాలని లేదు. ఏపీఈఆర్సీ బహిరంగ విచారణ చేపట్టి, ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించి, అన్ని అంశాలనూ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది. 2014–15 నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరాలకు దాదాపు రూ.7,200 కోట్లు అదనపు వ్యయం జరిగిందని డిస్కంలు నివేదించాయి. కానీ నెట్వర్క్ ట్రూ అప్ చార్జీలను దాదాపు రూ.3,977 కోట్లుగానే ఏపీఈఆర్సీ నిర్ధారించింది. ఇందులో ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగంపై ట్రూ అప్ భారం రూ.1,066.54 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీగా భరిస్తోంది. 2021–22కు సంబంధించి ప్రతి త్రైమాసికానికి రూ.3,336.7 కోట్లకు నివేదిక సమర్పిస్తే కమిషన్ రూ.3,080 కోట్లకు అనుమతినిచ్చింది.2023–24 ఆర్థిక సంవత్సరం జూన్ నెల నుంచి నెలవారీ విద్యుత్ కొనుగోలు చార్జీల సవరింపును డిస్కంలు అమలు చేస్తున్నాయి. దీని ప్రకారం ప్రతి నెలా సర్దుబాటు తరువాత రెండో నెలలో అమల్లోకి వస్తుంది. నెలవారీ అదనపు కొనుగోలు వ్యయం, విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోవడం, మార్కెట్ ధరలు తారస్థాయికి చేరుకోవడం, థర్మల్ కేంద్రాలలో 20 శాతం నుంచి 30 శాతం వరకూ విదేశీ బొగ్గు వాడటం, తగినంత జల విద్యుత్ ఉత్పత్తి లేకపోవటం వలన యూనిట్ దాదాపు రూ.1 వరకూ పెరిగింది. అయినా ప్రస్తుతం డిస్కంలు కమిషన్ ఆదేశాల మేరకు 40 పైసలే వసూలు చేస్తున్నాయి. 2022–23కు రూ.7,300 కోట్ల ట్రూ అప్ చార్జీలను వసూలు చేసుకోవడానికి అనుమతించాలని డిస్కంలు కోరినా ఏపీఈఆర్సీ అనుమతించలేదు. అలాగే 2023–24 ఆర్థిక సంవత్సరానికి డిస్కంలు నివేదించిన రూ.10,052 కోట్ల ట్రూ అప్ చార్జీలపైనా ఏపీఈఆర్సీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.అప్పటికీ ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం2014–15 నుంచి 2018–19 మధ్య ఐదేళ్లలో గత ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీలను చెల్లించకుండా విద్యుత్ పంపిణీ సంస్థలను నష్టాల్లోకి నెట్టేసింది. సబ్సిడీ రూ.17,487 కోట్లు మంజూరు చేయగా, అందులో రూ.10,923 కోట్లు మాత్రమే చెల్లించింది. రూ.6,564 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేదు. అదే విధంగా 2014–19 మధ్య పెరిగిన విద్యుత్ కొనుగోలు, పంపిణీ వ్యయాలను బిల్లుల్లో సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని డిస్కంలకు ఇవ్వలేదు. ఏపీఈఆర్సీకి తప్పుడు నివేదికలు ఇచ్చి, విద్యుత్ సంస్థల ఆదాయం బాగానే ఉన్నట్టు చూపించారు. దీంతో 2014–19 మధ్య దాదాపు రూ.20 వేల కోట్లు డిస్కంలు నష్టపోవాల్సి వచ్చింది.ఫలితంగా రాబడికి, వ్యయానికీ మధ్య అంతరం పెరిగిపోయి, పాత అప్పులే సకాలంలో చెల్లించలేని పరిస్థితి వచ్చింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం అలా చేయడంలేదు. చెల్లించాల్సిన సబ్సిడీలను పక్కాగా చెల్లించడమే కాకుండా అదనంగా నిధులు ఇస్తూ ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. ఖర్చులు పెరిగినప్పటికీ వ్యవసాయ, బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్న ఉచిత, రాయితీ విద్యుత్ వినియోగంపై ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వమే మోస్తోంది.2020–21 ఆర్ధిక సంవత్సరంలో కోవిడ్ వల్ల విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల మార్కెట్లో విద్యుత్ కొనుగోలు ధరలు కనిష్టానికి చేరుకున్నాయి. దానివల్ల ఆదా అయిన దాదాపు రూ.4800 కోట్లను 2022–23 టారిఫ్‌లో డిస్కంలు తగ్గించాయి. వినియోగదారుల బిల్లుల్లో సర్దుబాటు చేశాయి. అంటే ఆ మేరకు వినియోగదారులపై చార్జీల భారం పడలేదు. ఇలా ఖర్చులు తగ్గినప్పుడు వినియోగదారులకు ప్రభుత్వం చొరవతో విద్యుత్ సంస్థలు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. -
అక్రమ వలసలకు చెక్.. సంచలన బిల్లు తెచ్చిన బ్రిటన్
లండన్: అక్రమ వలసల సమస్యను ఎదుర్కొంటున్న బ్రిటన్ వాటిని ఆపేందుకు సంచలన బిల్లు తీసుకువచ్చింది. మంగళవారం(ఏప్రిల్23) ‘సేఫ్టీ ఆఫ్ రువాండా’ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లుతో అక్రమ వలసదారులకు అడ్డకట్టపడనుంది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారందరినీ ఆఫ్రికా దేశం రువాండాకు తరలిస్తారు. బ్రిటన్ రాజు చార్లెస్ 3 ఆమోదం తర్వాత ఇది చట్టంగా మారుతుంది. బ్రిటన్‌కు వచ్చే అక్రమ వలసదారులను ఆపడానికి రువాండా బిల్లు తీసుకువచ్చినట్లు ప్రధాని రిషి సునాక్ తెలిపారు. దేశంలోకి చట్టవిరుద్ధంగా వచ్చేవారు నివసించడానికి ఇక నుంచి వీలులేదని చెప్పారు. అక్రమ వలసదారులను విమానాల్లో తీసుకువెళ్లి దేశం బయట వదిలేస్తామన్నారు. -
స్మోకింగ్ బ్యాన్..! రిషి సునాక్‌పై వ్యతిరేకత
లండన్: బ్రిటన్‌లో స్మోకింగ్ బ్యాన్ చట్టంపై ప్రధాని రిషి సునాక్ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. 2009 తర్వాత పుట్టిన వారికి అంటే.. 15, 15 ఏళ్లలోపు వయసు ఉన్న వారికి పొగాకు ఉత్పత్తులు అమ్మడాన్ని నిషేధించే చట్టాన్ని సునాక్ గతేడాదే ప్రతిపాదించారు. మంగళవారం (ఏప్రిల్16) ఈ చట్టాన్ని బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రవేశపెట్టారు. సునాక్ సొంత పార్టీ కన్జర్వేటివ్స్ ఎంపీల్లో కొందరు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు. మాజీ ప్రధానులు లిజ్ ట్రుస్, బొరిస్ జాన్సన్‌లు కూడా ఈ చట్టంపై వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చట్టం అమలు చేయడమంటే ప్రజల ఇష్టాఇష్టాలను నియంత్రించడమేననేది వారి వాదన. వేల కొద్ది ప్రజల ప్రాణాలు కాపాడేందుకు, ఒక జనరేషన్‌ను స్మోకింగ్ నుంచి దూరంగా ఉంచేందుకు ఈ చట్టాన్ని తీసుకువస్తున్నామని యూకే హెల్త్ సెక్రటరీ విక్టోరియా అట్కిన్స్ తెలిపారు. ఈ చట్టం దేశంలో ప్రొడక్టివిటీని పెంచడమే కాకుండా నేషనల్ హెల్త్ సర్వీస్‌పై భారాన్ని తగ్గిస్తుందన్నారు. ఇదీ చదవండి.. మే 15న పదవి నుంచి తప్పుకుంటా: లూంగ్ -
‘ఉబర్’ రైడ్‌కు కోట్లలో బిల్లు..! షాక్ అయిన కస్టమర్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నోయిడాలో దీపక్ తెంగురియా అనే వ్యక్తి రొటీన్‌గా తాను వెళ్లే రూట్లో ఉబర్ ఆటో రైడ్ బుక్ చేశాడు. రైడ్ తక్కువ దూరమే అయినందున రూ.62 బిల్లు చూపించింది. మామూలే కదా అని ఆటో ఎక్కి డెస్టినేషన్‌లో దిగి బిల్లు పే చేద్దామనుకునే సరికి దీపక్ అవాక్కయ్యాడు. ఏకంగా రూ.7.66 కోట్లు పే చేయాలని బిల్లు చూపించింది. దీంతో ఆశ్చర్యపోవడం దీపక్ వంతైంది. దీపక్‌కు ఇంత భారీ బిల్లు రావడానికి సంబంధించిన వీడియోను ఆయన స్నేహితుడు ఆశిష్ ఎక్స్(ట్విటర్)లో షేర్ చేశాడు. దీనిపై వీడియోలో స్నేహితులిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. చంద్రయాన్‌కు రైడ్ బుక్ చేసుకున్నా ఇంత బిల్లు రాదని ఇద్దరు స్నేహితులు జోకులు వేసుకున్నారు. सुबह-सुबह @Uber_India ने @TenguriyaDeepak को इतना अमीर बना दिया कि Uber की फ्रैंचाइजी लेने की सोच रहा है अगला. मस्त बात है कि अभी ट्रिप कैंसल भी नहीं हुई है. 62 रुपये में ऑटो बुक करके तुरंत बनें करोडपति कर्ज़दार. pic.twitter.com/UgbHVcg60t — Ashish Mishra (@ktakshish) March 29, 2024 అయితే అతి తక్కువ దూరం ఆటో రైడ్‌కు కోట్లలో బిల్లు రావడంపై ఉబర్ స్పందించింది. ‘భారీ బిల్లు ఇచ్చి ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణలు. మాకు కొంత సమయమిస్తే దీనిపై అప్డేట్ ఇస్తాం’అని ఉబర్ సందేశం పంపింది. ఇదీ చదవండి.. వీల్ చైర్లో వచ్చాడు.. విల్ పవర్ చూపాడు -
ఫ్రాన్స్ పార్లమెంట్లో అబార్షన్ బిల్లుకు ఆమోదం!
ఫ్రాన్స్ పార్లమెంట్లో జరిగిన సంయుక్త సమావేశంలో అబార్షన్ బిల్లుకు ఆమోదం లభించింది. ఫ్రాన్స్ రాజ్యాంగంలో మహిళలకు గర్భస్రావం చేయించుకునే హక్కును పొందుపరిచే బిల్లుకు ఫ్రెంచ్ చట్టసభ సభ్యులు ఆమోదం తెలిపారు. అబార్షన్‌ను రాజ్యాంగంలో చేర్చిన ప్రపంచంలోనే మొదటి దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. ఈ బిల్లు అత్యధిక ఓట్లతో ఆమోదం పొందిన నేపధ్యంలో ఉమ్మడి సెషన్‌లోని సభ్యులు చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేశంలో మహిళా హక్కుల కోసం పనిచేస్తున్నవారంతా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నిర్ణయాన్ని ప్రశంసించారు. ఈ బిల్లుకు చట్టపరమైన రూపం కల్పించేందుకు ఫ్రెంచ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 34ను సవరించారు. అనంతరం పార్లమెంటు ఉభయ సభల్లో అంటే జాతీయ అసెంబ్లీ,సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు మహిళలకు అబార్షన్ హక్కును కల్పిస్తుంది. ఉమ్మడి సెషన్‌ను ప్రారంభించిన దిగువ సభ స్పీకర్ యాయెల్ బ్రాన్-పివెట్ మాట్లాడుతూ మహిళకు అబార్షన్ హక్కును కల్పించిన మొదటి దేశం ఫ్రాన్స్ అని అన్నారు. ఈ బిల్లు ఆమోదానికి ముందు ఫ్రెంచ్ ప్రధాని గాబ్రియెల్ అటల్ మాట్లాడుతూ మహిళలు ఇకపై అబార్షన్ విషయంలో సొంత నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు. మరోవైపు అబార్షన్‌ను వ్యతిరేకిస్తున్న సంస్థలు, కార్యకర్తలు ఈ బిల్లును ఆమోదంపై పార్లమెంటు నిర్ణయాన్ని తప్పుబట్టారు. అధ్యక్షుడు మాక్రాన్ రాజకీయ లబ్ధి కోసం ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని వారు ఆరోపించారు. NEW: France's Parliament votes to make abortion a constitutional right, the first country in the world to do so. French PM Gabriel Attal: " We're sending a message to all women: your body belongs to you and no one can decide for you." pic.twitter.com/xI7EyZwvMv — Lewis Goodall (@lewis_goodall) March 4, 2024 -
పబ్లిక్ పరీక్షల బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే పబ్లిక్ పరీక్షల్లో అవతకవకలకు పాల్పడే వారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు–2024కు వైఎస్సార్సీపీ మద్దతు తెలిపింది. బిల్లుపై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలో వైఎస్సార్సీపీ ఎంపీ చింతా అనూరాధ మాట్లాడుతూ.. పబ్లిక్ పరీక్షలు, ఉద్యోగ నియామకాల పరీక్ష పత్రాల లీక్ కారణంగా నష్టపోయిన కోట్లాది మంది యువత ఈ తరహా బిల్లు కోసమే ఎదురు చూస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పరీక్ష పత్రాలు లీక్‌చేసే వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లలో ఓబీసీల చేర్పు అభినందనీయమని ఎంపీ చింతా అనూరాధ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ స్థానిక సంస్థల చట్టాల బిల్లుకు వైఎస్సార్సీపీ తరఫున మద్దతు ప్రకటించారు. ఏకలవ్య పాఠశాలలు అత్యవసరం గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు అత్యవసరమని వైఎస్సార్సీపీ ఎంపీ గొడ్డేటి మాధవి అన్నారు. జమ్మూ కశ్మీర్ షెడ్యూల్డ్ కులాల, తెగల ఆర్డర్ సవరణ బిల్లులు–2024కు వైఎస్సార్సీపీ తరఫున మద్దతు ప్రకటించారు. వేగివాడలో డీఎస్పీ పశ్చిమ గోదావరి జిల్లా వేగివాడలో ‘డిమాన్స్ట్రేషన్ కం సీడ్ ప్రొడక్షన్ ఫారం’ (డీఎస్పీ) ఏర్పాటు చేసినట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా తెలిపారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎంపీ బీశెట్టి వెంకట సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబిచ్చారు. విశ్వవిద్యాలయాల్లో ఫ్రీ కోచింగ్ అంబేడ్కర్ ఫౌండేషన్ (డీఏఎఫ్)’, అంబేడ్కర్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (డీఏసీఈ) ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం ఉచిత కోచింగ్ స్కీమ్ నిర్వహిస్తున్నట్టు కేంద్ర సహాయ మంత్రి ఎ.నారాయణస్వామి తెలిపారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ మార్గాని భరత్ అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు. ఏపీలో 24 కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులు వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికతలను అవలంభించేందుకు ఏపీలో 24 కృషి విజ్ఞాన కేంద్రాల(కేవీకేల)ను ఏర్పాటు చేసినట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా తెలిపారు. ఎంపీలు పీవీ మిథున్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, కోటగిరి శ్రీధర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబిస్తూ.. అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, వైఎస్సార్ జిల్లాల్లో రెండేసి చొప్పున, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకటి చొప్పున కేవీకేలు ఉన్నట్టు వివరించారు. మిల్లెట్, ఎర్రపప్పు, బెంగాల్ చిట్రా, కదిరి, వేరుశనగ వంటి పంటల ఉత్పత్తి కోసం కరువు ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు మొబైల్ సందేశాలతో రైతులకు అవగాహన కల్పిస్తున్నట్టు వివరించారు. -
అసెంబ్లీలో యూసీసీ బిల్లు.. విపక్షాల రగడ.. సభ వాయిదా!
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి డెహ్రాడూన్‌లోని రాష్ట్ర అసెంబ్లీలో యూనిఫాం సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ 2024 బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సమయంలో రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ‘వందేమాతరం, జై శ్రీరామ్’ నినాదాలు చేశారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ సమావేశాల రెండో రోజైన మంగళవారం ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి యూసీసీ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విపక్ష ఎమ్మెల్యేలు రచ్చ చేశారు. దీనిపై పలు ప్రశ్నలు సంధించారు. యూనిఫాం సివిల్ కోడ్‌పై చర్చించేందుకు సభను మధ్యాహ్నం 2:00 గంటలకు వాయిదా వేశారు. అంతకుముందు అసెంబ్లీ స్పీకర్ రీతూ ఖండూరి భూషణ్ అధ్యక్షతన జరిగిన వ్యాపార సలహా సమావేశంలో సభలో ప్రశ్నోత్తరాల సమయం ఉండదని నిర్ణయించారు. యూసీసీపై చర్చతోపాటు రాష్ట్ర ఆందోళనకారులకు రిజర్వేషన్లపై సెలెక్ట్ కమిటీ నివేదికను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. దీంతో ఆగ్రహం చెందిన ప్రతిపక్ష నేత యశ్పాల్ ఆర్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రీతమ్ సింగ్ వ్యాపార సలహా కమిటీకి రాజీనామా చేశారు. యూసీసీపై చర్చకు సమయం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత యశ్పాల్ ఆర్య మాట్లాడుతూ తాము యూసీసీ బిల్లును వ్యతిరేకించడం లేదని అన్నారు. అయితే రాజ్యాంగ ప్రక్రియ, నిబంధనల ప్రకారం సభ పనిచేయాలని కోరుకుంటున్నామన్నారు. కాగా అసెంబ్లీ సమావేశాల తొలి రోజైన సోమవారం ఆరుగురు ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేల మృతికి సభలో నివాళులర్పించారు. -
UCC Bill: నేడు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూసీసీ బిల్లు
దేశంలో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)ను అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుంది. యూసీసీపై బిల్లును తీసుకురావడానికి ఉత్తరాఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ రోజు (మంగళవారం) రెండవ రోజున అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. పోర్చుగీస్ పాలనా కాలం నుండి గోవాలో యూసీసీ అమలులో ఉంది. యూసీసీ కింద వివాహం, విడాకులు, భరణం, భూమి, ఆస్తి, వారసత్వానికి సంబంధించిన చట్టాలు రాష్ట్రంలోని పౌరులందరికీ వారి మతంతో సంబంధం లేకుండా వర్తిస్తాయి. మంగళవారం సభలో ఈ బిల్లుపై చర్చ జరగనుంది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు చర్చల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కోరారు. యూసీసీ గురించి ఇటీవల మాట్లాడిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి దీనివలన అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. బిల్లుపై సభలో సానుకూలంగా చర్చించాలని ఇతర పార్టీల సభ్యులను అభ్యర్థించారు. ఆదివారం రాష్ట్ర మంత్రివర్గం యూసీసీ ముసాయిదాను ఆమోదించి, ఫిబ్రవరి 6న బిల్లుగా సభలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది. నాలుగు సంపుటాలలో 740 పేజీలతో కూడిన ఈ ముసాయిదాను సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి రంజన్ ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ శుక్రవారం ముఖ్యమంత్రికి సమర్పించింది. 2022లో జరిగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో యూసీసీపై చట్టం చేసి, రాష్ట్రంలో దానిని అమలు చేస్తామని బీజేపీ హామీనిచ్చింది. 2000లో ఏర్పడిన ఉత్తరాఖంఢ్‌లో వరుసగా రెండోసారి బీజేపీ అధికారాన్ని దక్కించుకుంది. 2022 మార్చిలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో యూసీసీ అమలుపై హామీనిచ్చింది. కాగా మంగళవారం అసెంబ్లీలో యూసీసీపై చర్చ జరగనున్న సందర్భంగా అవాంఛనీయ పరిస్థితులు చోటు చేసుకుంటే, వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నట్లు సమాచారం. -
పేపర్ లీక్ చేస్తే కోటి ఫైన్.. లోక్‌సభలో కేంద్రం బిల్లు
న్యూఢిల్లీ: పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారికి కేంద్రం ఇక చెక్ పెట్టనుంది. ప్రశ్నాపత్రాల లీకేజీల వంటి వ్యవస్థీకృత నేరాలను అడ్డుకునేందుకు ఉద్దేశించిన పబ్లిక్ ఎగ్జామినేషన్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) బిల్లును కేంద్రం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్రమంత్రి జితేందర్‌సింగ్ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రశ్నాపత్రాల లీకేజీలో పాలు పంచుకునే అధికారులు, లీకేజీకి పాల్పడే ముఠాల ఆగడాలకు ఈ బిల్లుతో కళ్లెం వేయనున్నారు. ఈ బిల్లు చట్టంగా మారిన తర్వాత దీని కింద నేరం రుజువైన వారికి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష,రూ. కోటి వరకు జరిమానా విధించనున్నారు. రాజస్థాన్, హరియాణా, గుజరాత్, బిహార్‌లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీల కారణంగా కేంద్రం ఈ బిల్లు తీసుకువచ్చింది. ఈ బిల్లు తీసుకురానున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ఇటీవల చేసిన ప్రసంగంలోనూ ప్రస్తావించారు. ఇదీచదవండి.. పేటీఎంపై సీబీఐ,ఈడీల మౌనం దేనికి: కాంగ్రెస్ -
‘ఎక్స్’లో హాట్‌టాపిక్‌గా దోశ ధర..!
గురుగ్రామ్: ఢిల్లీలోని గురుగ్రామ్‌లోని ఓ హోటల్లో ఇచ్చిన దోశ బిల్లుపై ట్విట్టర్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గురుగ్రామ్‌లోని 32 ఎవెన్యూ ఏరియాలో కర్ణాటక కేఫ్‌లో ఆశిశ్ సింగ్ అనే యువకుడు రెండు దోశలు, ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేశాడు. 30 నిమిషాల తర్వాత ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చింది. హాయిగా దోశలు తినేసి బిల్లు చూస్తే ఆశిశ్‌కు ఒక్కసారిగా షాక్ తగిలినంత పనైంది. బిల్లు ఏకంగా వెయ్యి రూపాయలు వచ్చింది. దీంతో ఆశిష్ ఈ విషయాన్ని ఎక్స్‌లో షేర్ చేశాడు. ఆశిష్ ట్వీట్‌పై పలువురు ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘తమిళనాడులో అయితే అవే దోశలు చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. మీరు పే చేసింది ఏరియా ప్రీమియమ్’ అని ఒకాయన కామెంట్ చేశాడు. ‘వీధి టిఫిన్ బండి దగ్గర మీరు పే చేసిన ధరలో పదవ వంతుకే ఆ దోశలు వచ్చేవి’ అని మరొకతను రిప్లై ఇచ్చాడు. గురుగ్రామ్‌ను వదిలి బెంగళూరుకు రండి తక్కువ ధరలో మంచి దోశలు ఉంటాయి’ అని మరో కర్ణాటక అతను కామెంట్ పెట్టాడు. Bc gurgaon is crazy, spent 1K on two Dosa and idli after waiting for 30 min. Suggest good and reasonably priced dosa places. pic.twitter.com/HYPPK6C07U — Ashish Singh (@ashzingh) December 4, 2023 ఇదీచదవండి..రిస్క్ చేయాలేగానీ..మా తర్వాతే ఎవరైనా..! -
గేర్‌బాక్స్ రిపేర్‌కు రూ.5.8 లక్షలు - బిల్ చూసి అవాక్కయిన కారు ఓనర్..
కారులో సమస్య వచ్చినప్పుడు రిపేర్ చేసుకోవాలంటే ఖర్చు వేలల్లో ఉంటుంది, అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక సంఘటనలో గేర్‌బాక్స్‌లో సమస్యను పరిష్కరించుకోవడానికి ఏకంగా ఐదు లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సాధారణంగా కారు ఇంజిన్‌లో అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు రావడం సహజం. మెయింటెనెన్స్ సరిగ్గా లేకుంటే.. ఇలాంటి సమస్యలే తలెత్తుతూ ఉంటాయి. ఇటీవల ఫోక్స్‌వ్యాగన్ అమియో కారులోని DSG గేర్‌బాక్స్ ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో దానిని రిపేర్ చేసుకోవడానికి రూ. 5.8 లక్షలు ఖర్చు అయినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన బిల్ కూడా నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. గేర్‌బాక్స్‌లో సమస్యను పరిష్కరించుకోవడానికే.. ఇంత బిల్ వచ్చిందా అని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఫోక్స్‌వ్యాగన్ అమియో యజమాని 2వ, 3వ గేర్ మధ్య అప్‌షిఫ్ట్ చేసేటప్పుడు, డౌన్‌షిఫ్ట్ చేసేటప్పుడు ఎక్కువ శబ్దం వస్తున్నట్లు గ్రహించి సర్వీస్ సెంటర్‌కు వెళ్లి తన సమస్యను తెలియజేశాడు. డీఎస్జీ గేర్‌బాక్స్‌లో పెద్ద సమస్య ఉన్నట్లు గుర్తించి, దానిని రిపేర్ చేయడానికి రూ. 5.8 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. కానీ గేర్‌బాక్స్‌లో ఎక్కడ సమస్య ఉందనే విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పలేకపోయారు. -
బిల్లు ఎగ్గొడదామని చూశారు..కెమెరాకి చిక్కారు..
-
పైరసీకి అడ్డుకట్ట వేస్తాం
‘‘పైరసీ కారణంగా ప్రతి ఏడాది వినోద రంగానికి రూ.20 వేల కోట్లు నష్టం వాటిల్లుతోంది. ఓ సినిమా నిర్మాణానికి పడ్డ కష్టం పైరసీ వల్ల వృథాగా పోతోంది. పైరసీని అడ్డుకోవడానికి కేంద్ర ప్రసార, సమాచార మంత్రిత్వ శాఖలో నోడల్ ఆఫీసర్స్‌ను నియమించడం జరిగింది’’ అని కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఇటీవల సినిమాటోగ్రఫీ చట్టం–1952లో సవరణలు చేసి, కొత్త బిల్లును పార్లమెంట్లో ఆమోదించిన విషయం తెలిసిందే. ఇందులో పైరసీని అరకట్టడం అనేది ఓ ప్రధానాంశం. ఈ విషయమై శుక్రవారం అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ– ‘‘ ముంబైలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కార్యాలయంలో,ప్రాంతీయ కార్యాలయాల్లో పైరసీ, డిజిటల్ పైరసీల ఫిర్యాదులను స్వీకరించేందుకు అధికారులను నియమించాం. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్న పైరేటెడ్ కంటెంట్‌పై నోడల్ ఆఫీసర్స్‌కు ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారులు 48 గంటల్లో ఆ కంటెంట్‌ను ఆ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ నుంచి తొలగించేలా చర్యలు చేపడతారు’’ అని చెప్పుకొచ్చారు. -
బొగ్గు దిగుమతుల బిల్లు రూ.3.85 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: భారత్ గత ఏడాది బొగ్గు దిగుమతులపై రూ.3.85 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం.. గత ఐదేళ్లలో దేశం మొత్తం బొగ్గు వినియోగంలో దిగుమతి వాటా 26 శాతం నుండి 21 శాతానికి తగ్గింది. అయితే భారతదేశం ప్రతి సంవత్సరం 200 మిలియన్ టన్నుల (ఎంటీ) కంటే ఎక్కువ దిగుమతి చేసుకుంటోంది. ఇది దేశం నుంచి భారీ విదేశీ మారకపు ద్రవ్య ప్రవాహానికి దారితీస్తోంది. అడవుల సంరక్షణకు పెద్దపీట: బొగ్గు మంత్రిత్వశాఖ ఇదిలా ఉండగా, అడవులను సంరక్షించే అంశానికి పెద్ద పీట వేస్తున్నట్లు బొగ్గు మంత్రిత్వశాఖ పేర్కొంది. పర్యావరణ మంత్రిత్వ శాఖ సూచనలను పట్టించుకోకుండా బొగ్గు గనులను వేటినీ వేలం వేయలేదని కూడా స్పష్టం చేసింది. ఉదాహరణకు, లెమ్రు ఎలిఫెంట్ కారిడార్ పరిధిలోకి వచ్చే బొగ్గు గనులను డి–నోటిఫై చేయాలన్న ఛత్తీస్‌గఢ్ విజ్ఞప్తిని అంగీకరించినట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు లెమ్రు ఎలిఫెంట్ కారిడార్‌కు ఆవల ఉన్న ప్రాంతాలను కూడా మినహాయింపు కోసం పరిశీలించినట్లు పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌లో 10 శాతం నిల్వలు ఉన్న 40కి పైగా కొత్త బొగ్గు బ్లాకులను బొగ్గు తవ్వకాల నుంచి దూరంగా ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపింది. దట్టమైన హాస్డియో–అరాండ్ బొగ్గు క్షేత్రం పరిధిలోని తొమ్మిది బొగ్గు గనులను కూడా బొగ్గు బ్లాకుల తదుపరి రౌండ్ వేలం నుంచి దూరంగా ఉంచిన్నట్లు తెలిపింది. అదేవిధంగా, తదుపరి వేలం ప్రక్రియ నుండి మూడు లిగ్నైట్ గనులను మినహాయించాలన్న తమిళనాడు అభ్యర్థన కూడా అంగీకరించినట్లు పేర్కొంది. ‘‘బొగ్గు మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాలు... అటవీ ప్రాంతాలను వేలంలో పెట్టాలని పరిశ్రమ డిమాండ్లు ఉన్నప్పటికీ వాటిని రక్షించడం మా బాధ్యత అని మంత్రిత్వశాఖ స్పష్టంగా సూచిస్తోంది’’అని మంత్రిత్వ శాఖ తెలిపింది. -
కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త అసెంబ్లీలో బిల్ పాస్..
-
ఆస్పత్రి నుంచి అమ్మ ఒడికి..
సైదాబాద్: కుమార్తె వైద్యానికైన బిల్లు కట్టలేక.. ఆస్పత్రిలో వదిలేసి వచ్చిన తల్లిదండ్రుల చెంతకు ఆ చిన్నారి ఎట్టకేలకు చేరింది. తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ జడ్జి చొరవతో కథ సుఖాంతమైంది. ప్రేమ వివాహం చేసుకుని సింగరేణి కాలనీలో నివసిస్తున్న నితిన్, ప్రవల్లిక దంపతులకు ఈనెల7న పాప పుట్టింది. తీవ్ర అస్వస్థతకు గురైన పాప మెరుగైన వైద్యం కోసం వారు పిసల్‌బండలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆరు రోజుల చికిత్సకు రూ.లక్షా16వేల బిల్లు అయింది. వారి వద్ద కేవలం రూ.30 వేలు మాత్రమే ఉండటంతో దిక్కుతోచక పాపను ఆస్పత్రిలో వదిలేసి వచ్చేశారు. వారి నిస్సహాయస్థితిపై సాక్షి దినపత్రికలో బుధవారం ‘బిల్లు కట్టలేక బిడ్డను ఆసుపత్రిలో వదిలేశారు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దాంతో పలువురు దాతలు వారిని సంప్రదించి తోచిన సహాయం చేశారు. సాక్షి కథనంపై స్పందించిన తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ జడ్జి కళార్చన, గోవర్ధన్‌రెడ్డి గురువారం ఆస్పత్రికి చేరుకున్నారు. యాజమాన్యంతో మాట్లాడి అదే రాత్రి చిన్నారిని డిశ్చార్జి చేయించారు. తమ పరిస్థితిని వెల్లడిస్తూ కథనం ప్రచురించిన సాక్షి దినపత్రికకు, తెలంగాణ లీగల్ సెల్ అథారిటీ అధికారులకు చిన్నారి తల్లిదండ్రులు నితిన్, ప్రవల్లికలు కృతజ్ఞతలు తెలిపారు. -
మహిళా రిజర్వేషన్ బిల్లు అసంపూర్ణం: రాహుల్ గాంధీ
ఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు అసంపూర్తిగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో అత్యధిక జనాభా ఉన్న ఓబీసీలను బీజేపీ గాలికొదిలేస్తోందని ఆరోపించారు. ఇప్పుడున్న వ్యవస్థలో ఓబీసీలకు ప్రభుత్వం ఏం ప్రాధాన్యత ఇస్తుందో చెప్పాలని కేంద్రాన్ని రాహుల్ ప్రశ్నించారు. మహిళా బిల్లులో ఓబీసీ ప్రస్తావనే లేదని అన్నారు. మద్దతు ఇస్తున్నాం.. కానీ: మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాను మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్న రాహుల్ గాంధీ.. కుల గణన చేపట్టి అత్యధిక జనాభా ఉన్న వర్గాలవారికి సముచిత స్థానం కల్పించాలని కోరారు. పాత పార్లమెంట్ భవనం నుంచి కొత్త పార్లమెంట్ భవనంలోకి మారేప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఆహ్వానించకపోవడంపై రాహుల్ ప్రశ్నించారు. 90లో ముగ్గురు మాత్రమే.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన 90 సెక్రటరీల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఓబీసీ జాబితాలో ఉన్నారని రాహుల్ చెప్పారు. బడ్జెట్లో కేవలం 5 శాతం మాత్రమే వారి ఆధీనంలో ఉందని అన్నారు. కుల గణన చేయడంతోపాటు మహిళా బిల్లులో ఓబీసీలకు ప్రత్యేకంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. తక్షణమే అమలు చేయండి.. పంచాయతీ రాజ్ వ్యవస్థే మహిళలకు అధికారం ఇచ్చిందని, అన్నాళ్ల తర్వాత ప్రస్తుతం మహిళా రిజర్వేషన్ బిల్లు మరో కీలక పరిణామం అని ఆయన అన్నారు. జనాభా లెక్కలు, డీలిమిటేషన్ తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి తీసుకురావడంపై రాహుల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నేటి నుంచి ఈ బిల్లు అమలులోకి రావాలని డిమాండ్ చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ తక్షణం అమలు చేయాలని అన్నారు. ఇదీ చదవండి: కొత్త పార్లమెంటులో లోక్‌సభ స్పీకర్ స్థానంలో కూర్చున్న తొలి తెలుగు ఎంపీగా మిథున్ రెడ్డి రికార్డు. -
నారీ శక్తికి వందనం.. మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
నేడు లోక్ సభలో "నారి శక్తివందన్" బిల్లుపై చర్చ
-
ఏమిటీ మహిళా రిజర్వేషన్ల బిల్లు? .. ఆ(మె) బిల్లు వెనక
మహిళలకు చట్ట సభల్లో, ముఖ్యంగా లోక్‌సభ, అసెంబ్లీల్లో మూడో వంతు రిజర్వేషన్లు.. దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా చర్చలో ఉన్నఅంశం. అదే సమయంలో, అంతేకాలంగా విజయవంతంగా పెండింగ్‌లోనూ ఉన్న అంశం. అన్ని పార్టీలూ ఇందుకు మద్దతు తెలిపేవే. కానీ తీరా సదరు పార్లమెంటులో బిల్లు రూపంలో ప్రస్తావనకు వచ్చినప్పుడు మాత్రం ఆమోదం పొందకపోవడం, చివరికి సంబంధిత లోక్ సభ కాలపరిమితి తీరడం, దాంతో బిల్లుకు కూడా కాలదోషం పట్టడం... ఇదీ వరస! 1989లో తెరపైకి... మహిళలకు చట్ట సభల్లో మూడో వంతు రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం దివంగత ప్రధాని రాజీవ్ గాందీతో మొదలైంది. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో వారికి 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆయన హయాంలో, అంటే 1989లో పార్లమెంటులో బిల్లు పెట్టారు. అయితే అది లోక్ సభలో ఆమోదం పొందింది గానీ రాజ్యసభలో గట్టెక్కలేదు. అనంతరం తెలుగు తేజం పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా 1992, 1993లో ఈ మేరకు 72 73వ రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రవేశపెట్టారు. వాటిని ఉభయ సభలూ ఆమోదించాలి. అలా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లోని స్థానాలు, చైర్ పర్సన్ పదవుల్లో మహిళలకు 33 శాతం రిజర్వ్ అయ్యాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు స్థానిక సంస్థలకు ఎన్నికయ్యేందుకు ఇది దోహదం చేసింది. దేవేగౌడ నుంచి మన్మోహన్ దాకా.. లోక్ సభ, అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదిస్తూ తొలిసారిగా 1996లో దేవేగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ సర్కారు పార్లమెంటులో 81వ రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టింది. కానీ లోక్ సభా ఆమోదం పొందలేక అది కాలగర్భంలో కలిసిపోయింది. అనంతరం అటల్ బిహారీ వాజపేయి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం 1998, 1999ల్లోనూ, ఆ తర్వాత 2002, 2003ల్లోనూ నాలుగుసార్లు బిల్లు పెట్టినా మోక్షానికి నోచుకోలేదు. 2004లో యూపీయే ఈ అంశాన్ని తమ కనీస ఉమ్మడి ప్రణాళికలో చేర్చింది. అధికారంలోకి వచ్చాక 2008లో మన్మోహన్ సింగ్ సర్కారు ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది. అక్కడినుంచి స్టాండింగ్ కమిటీకి వెళ్ళడం, దాని నివేదికను కేంద్రం ఆమోదించడం, చివరికి రాజ్యసభ మహిళా బిల్లును ఆమోదించడం జరిగిపోయాయి. అయితే అదంతా సులువుగా ఏమీ జరగలేదు. బిల్లును వ్యతిరేకించిన పలువురు ఎంపీలను మార్షల్స్ సాయంతో బయటికి పంపి మరీ ఓటింగ్ నిర్వహించాల్సి వచ్చింది. ఇంతా చేస్తే, ఆ బిల్లు దిగువ సభ అయిన లోక్ సభ ముందుకు రానే లేదు. చివరికి 2009లో 15వ లోక్ సభ రద్దుతో అలా పెండింగులోనే ఉండిపోయింది. కాకపోతే శాశ్వత సభ అయిన రాజ్యసభ ఆమోదం పొందింది గనక నేటికీ కాలదోషం పట్టకుండా అలాగే ఉంది. ఏమిటీ మహిళా రిజర్వేషన్ల బిల్లు? లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు మూడింట ఒక వంతు,అంటే 33 శాతం స్థానాలను కేటాయించడం దీని ముఖ్యోద్దేశం. ఈ మేరకు వారికి రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకోవడం, లోక్ సభలో మంగళవారం ఈ మేరకు ప్రవేశపెట్టడం తెలిసిందే.ఆ మూడు అసెంబ్లీల్లో అత్యధికం... అసెంబ్లీలో మహిళలకు అత్యధిక ప్రాతినిధ్యం కల్పించిన ఘనత ఛత్తీస్‌గఢ్ దే! అయితే అక్కడ వారు ఎందరున్నారో తెలుసా? కేవలం 14.4 శాతం! 13.7 శాతంతో పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో, 12.35 శాతంతో జార్ఖండ్ మూడో స్థానంలో ఉన్నాయి. 15 అసెంబ్లీల్లో 10% కన్నా తక్కువ... గోవా, గుజరాత్,హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక,కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ,ఒడిశా, సిక్కిం, తమిళనాడు,ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం. 7 అసెంబ్లీల్లో 0–12% కన్నాతక్కువ... బీహార్, హరియాణా,పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ. లోక్‌సభలో 15 శాతమైనా లేరు... లోక్ సభలో ప్రస్తుతం మహిళా ఎంపీల సంఖ్య 78.మొత్తం సంఖ్య 543లో ఇది 15 శాతం కూడా కాదు. రాజ్యసభలో కూడా మహిళా ఎంపీలు 14 శాతమే ఉన్నారు. - సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎల్లుండి రాజ్యసభకు మహిళా రిజర్వేషన్ బిల్లు
-
ఆర్టీసీ ఉద్యోగులు.. ఇక ప్రభుత్వ ఉద్యోగులే
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోద ముద్ర వేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుకు గవర్నర్ గురువారం ఓకే చెప్పడంతో చట్ట బద్ధత లభించింది. దీంతో 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. టీఎస్ ఆర్టీసీ (ఉద్యో గులను ప్రభుత్వంలో విలీనం) బిల్లు–2023ను శాసనసభ గతనెలలో ఆమోదించగా, రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ బిల్లుపై సంతకం చేసినట్టు రాజ్భవ న్ తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఆర్టీసీ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే.. జూలై 31న సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే అంశానికి సంబంధించి ఆమోద ముద్ర వేయడం, ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని నిర్ణ యించిన విషయం విదితమే. అయితే ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి ముందు గవర్నర్ అనుమతి తప్పనిసరి కావడంతో, గవర్నర్ బిల్లు ను పరిశీలించి పలు అనుమానాలు వ్యక్తం చేయడం, మొద ట సంస్థ ఆస్తులు, కేంద్ర గ్రాంట్లు, వాటా, విభజన చట్టంలో 9వ షె డ్యూల్, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తారా.? వారి సీనియారిటీ, పారిశ్రామిక వి వాదాల చట్టం వర్తిస్తుందా..? ప్రభుత్వ ఉద్యోగులతో సమా నంగా పెన్షన్ వర్తిస్తుందా..?అన్ని ప్రయోజనాలు కల్పి స్తారా..? ప్రభుత్వ ఉద్యోగాల్లో కండక్టర్, కంట్రోలర్ వంటి పోస్టులు లేవు మరి వారిని ఏ విధంగా సర్దుబాటు చేస్తారు.? కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నారా.? డిపోల్లో కేటగిరి వారీగా ఉన్న ఉద్యోగుల సంఖ్య ఎంత.. కాంట్రాక్టు, క్యాజువ ల్ కార్మికుల పరిస్థితి ఏమిటీ..? ఆర్టీసీ ప్రస్తుత స్వరూపంతోనే పనిచేస్తుందా..? ఆస్తులను ప్రభుత్వం విలీనం చేసు కుంటుందా.? బస్సుల నిర్వహణ, ఆజమాయిషీ ఎవరిది లాంటి అనేక ప్రశ్నలు గవర్నర్ లేవనెత్తడం.. వాటిన్నింటికి ప్రభుత్వం సమాధానం ఇవ్వడంతోపాటు, బిల్లులో పొందుపరిచి అసెంబ్లీలో పాస్ చేసిన సంగతి విదితమే. బిల్లు వచ్చిన తర్వాత మళ్లీ న్యాయశాఖ పరిశీలనకు పంపించిన గవర్నర్.. ఈనెల 3వ తేదీన న్యాయశాఖ నుంచి బిల్లు తిరిగి వచ్చిన తర్వాత దాదాపు పదిరోజుల పరిశీలన అనంతరం బిల్లుకు ఆమోదం తెలిపారు. సీఎంకు ధన్యవాదాలు : బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులంతా రుణపడి ఉంటారని పేర్కొన్నారు. తాను సంస్థ చైర్మన్‌గా ఉన్న సమయంలో వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారడం ఆనందంగా ఉందన్నారు. -
టీఎస్ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళి సై ఆమోదం
-
బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలి
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లు ప్రవేశ పెట్టి అందులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. ఈమేరకు ఆయన శనివారం రాజకీయ పార్టీ లకు లేఖలు రాశారు. మహిళా బిల్లు, బీసీలకు ప్రత్యేక వాటా కల్పించేందుకు కేంద్ర ప్రభు త్వంపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఇందులో భాగంగా బీజేపీతో పాటు కాంగ్రెస్, జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, అన్నా డీఎంకే, ఎన్సీపీ, రాష్ట్రీయ జనతాదళ్ తదితర పార్టీల అధ్యక్షులకు కృష్ణయ్య వేర్వేరుగా లేఖలు రాశారు. ప్రస్తుతం చట్టసభల్లో మహిళలకు అతి తక్కువగా ప్రాతినిధ్యం ఉందన్నారు. బీసీలకు అన్ని రంగాల్లో జనాభా ప్రకారం వా టా ఇవ్వకపోతే తిరుగుబాటు తప్పదన్నారు. -
ఆర్టీసీ విలీనం బిల్లు ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం అంశం మరోసారి గందరగోళంగా మారుతోంది. ఆగమేఘాల మీద శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఏమైందో స్పష్టత లేకపోవటం కార్మికుల్లో ఆందోళనకు, అయోమయానికి కారణమవుతోంది. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలపడంలో జాప్యం జరిగినప్పుడు ఆర్టీసీ కార్మికులు ఏకంగా రెండు గంటలపాటు బస్సులు దిగ్బంధం చేసి రాజ్‌భవన్‌ను ముట్టడించారు. ఆ సమయంలో పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్ మరుసటి రోజు హైదరాబాద్ వచ్చిమరీ ఆమోదం తెలిపారు. అంత వేగంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో.. ఇక బిల్లు ఆమోదం, ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనానికి వీలుగా కమిటీ ఏర్పాటు కావటం, మార్గదర్శకాలు రూపొందటం, విలీన ప్రక్రియ పూర్తి కావటం కూడా అంతే వేగంగా జరుగుతుందని భావించారు. కానీ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి సరిగ్గా నెల గడిచింది. గత నెల ఆరో తేదీన శాసనసభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత అది గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు చేరింది. అయితే కొన్ని సందేహాల నివృత్తి కోసం దానిని న్యాయశాఖ కార్యదర్శికి పంపినట్టు తర్వాత గవర్నర్ ప్రకటించారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. 183 మంది ఉద్యోగులకుటుంబాలకు నిరాశ గత నెలలో పదవీ విరమణ పొందిన 183 మంది ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు నెలాఖరు వరకు ఉత్కంఠగా ఎదురుచూసి నిరాశ చెందాల్సి వచ్చింది. ఇప్పుడు మరో 200 కుటుంబాలు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. న్యాయశాఖ కార్య దర్శి కార్యాలయానికి వచ్చిన బిల్లు అప్పటినుంచి తెలంగాణ సచివాలయంలోనే ఉండిపోయిందంటూ కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. దీనిపై రాజ్‌భవన్ వర్గా లను ‘సాక్షి’వివరణ కోరగా, ఆర్టీసీ బిల్లు ఇంకా రాజ్‌భవన్‌కు చేరుకోలేదని పేర్కొన్నాయి. వేరే 3 బిల్లులు మాత్రం వచ్చాయని వివరించాయి. ఆ రెండు వేతన సవరణలు చేయాలి: కార్మిక సంఘాలు బిల్లును తిరిగి రాజ్‌భవన్‌కు పంపటంలో జాప్యం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాలు, ఇప్పుడు మరో అంశంపై పట్టుపడుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులకు 2017, 2021 వేతన సవరణలు పెండింగులో ఉన్నందున, వాటిని క్లియర్ చేయకుండా ప్రభుత్వంలో విలీనం చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని పేర్కొంటున్నాయి. విలీన ప్రక్రియ లోపే ఆ రెండు వేతన సవరణలు చేస్తే, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలను కొంత ఉన్నత స్థాయిలో స్థిరీకరించేందుకు వీలుంటుందని, లేకుంటే తక్కువ వేతన స్థాయిలోనే ఫిక్స్ అవుతాయని, ఇది కార్మికులను తీవ్రంగా నష్టపరుస్తుందని వివరిస్తున్నాయి. ఆయా అంశాలపై మరోసారి ఆందోళనకు సిద్ధమని అంటున్నాయి. ఇప్పుడు ఏ కార్యాలయాన్నిముట్టడించాలి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఆమోదం తెలియజేయడంలో జాప్యం జరిగిందంటూ రాజ్‌భవన్‌ను ముట్టడించేలా చేశారు. మరి ఇప్పుడు ప్రభుత్వమే జాప్యం చేస్తోంది. ఇప్పుడు ఏ కార్యాలయాన్ని ఆర్టీసీ కార్మికులు ముట్టడించాలి. బిల్లును ఇప్పటికీ రాజ్భవవన్కు పంపకుంటే వెంటనే పంపాలి. ఈలోపు కార్మికులకు బకాయి ఉన్న వేతన సవరణలు చేయాలి. – అశ్వత్థామరెడ్డి, ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వెంటనే రాజ్‌భవన్‌కు పంపాలి ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ సంతకం కోసం వెంటనే రాజ్‌భవన్‌కు పంపాలి. జాప్యం చేయకుండా రెండు వేతన సవరణలు జరిపి, సీసీఎస్ బకాయిలు చెల్లించి, ఆ తర్వాత విలీన ప్రక్రియ పూర్తి చేయాలి. – రాజిరెడ్డి, ఎంప్లాయీస్ యూనియన్ -
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోమహిళా బిల్లు ఆర్.కృష్ణయ్య డిమాండ్
కాచిగూడ (హైదరాబాద్): పా ర్లమెంట్ ప్రత్యేక సమావేశా లలో మహిళా బిల్లు పెట్టాల ని, మహిళా బిల్లులో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రత్యేకసభ కోటా కల్పిం చాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21వ తేదీన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రా జ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. శని వారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన కాచిగూడలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మా ట్లాడుతూ, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ పెట్టాలని అన్నారు. మహిళా బి ల్లులో బీసీ మహిళలకు ప్రాతినిథ్యం కల్పించక పోతే మహిళా బిల్లుకు సార్ధకత లేదన్నారు. మ హిళా బిల్లులో రాజకీయ రిజర్వేషన్లతోపాటు వి ద్యా, ఉద్యోగాలలో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల కు అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 50శాతం టికెట్లు ఇవ్వాలని, బీసీలకు అన్యాయం చేసే పార్టీల భరతం పడతామని హెచ్చరించారు. -
బిల్ తీసుకుంటే చాలు..కోటి రూపాయలు మీవే!
Mera Bill Mera Adhikar: అన్ని కొనుగోళ్లకు ఇన్వాయిస్లు, బిల్లులు అడిగే సంస్కృతిని ప్రోత్సహించేలాకేంద్రం కొత్త పథకాన్ని తీసు కొస్తోంది రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రభుత్వం 'మేరా బిల్ మేరా అధికార్' పేరుతో 'ఇన్వాయిస్ప్రోత్సాహక పథకాన్ని' ప్రారంభిస్తోంది. ఇందుకోసం వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రతి త్రైమాసికంలో లక్కీడ్రా నిర్వహించి, రూ.1 కోటి చొప్పున రెండు బంపర్ బహుమతులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వినియోగదారులు తాము జరిపే కొనుగోళ్లన్నింటికీ విక్రయదార్ల నుంచి రశీదును అడగడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో 'మేరా బిల్ మేరా అధికార్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. సెప్టెంబరు 1 నుంచి 12 నెలల కాలానికి ప్రయోగాత్మక పద్ధతిలో (పైలట్ ప్రాజెక్ట్) ఈ స్కీం షురూ కానుంది. ఆర్థిక శాఖ అందించిన వివరాల ప్రకారం ప్రతీ నెలా లక్కీ డ్రాలో 800 జీఎస్టీ రశీదులను ఎంపిక చేస్తారు. వీరికి రూ.10,000 చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వనుంది. లక్కీడ్రాలో ఎంపిక చేసిన మరో 10 రశీదులకు రూ.10 లక్షల చొప్పున బహుమతి అందిస్తుంది. అయితే ప్రతి మూడు నెలలకు ఒకసారి బంపర్ డ్రా ఉంటుంది. ఇందుకోసం గత మూడు నెలల నుంచి బంపర్ డ్రా నెలలో 5వ తేదీ వరకు అప్లోడ్ చేసిన రశీదుల నుంచి విజేతను ఎంపిక చేస్తారు. ఈ పథకం ప్రారంభంలో అసోం గుజరాత్ , హరియాణా, పుదుచ్చేరి, దాద్రా అండ్ నగర్ హవేలీ మరియు డామన్ & డయ్యూ కేంద్రపాలిత ప్రాంతాలలో పైలట్‌గా లాంచ్ కానుంది. డ్రా అర్హతలు, నిబంధనలు ♦ జీఎస్టీ రిజిస్టర్డ్ సప్లయ్దారులనుంచి వినియోగదార్లు తీసుకున్న రశీదులను మాత్రమే డ్రాకు పరిగణనలోకి తీసుకుంటారు. ♦ జీఎస్టీ గుర్తింపు సంఖ్య, రిసీట్ నెం, డేట్, విలువ, ప్రాంతం తదితర వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. ♦ డ్రాలో విజేతగా ఎంపికైన కస్టమర్లు, ఈ సమాచారం అందిన తేదీ నుంచి 30 రోజుల్లోగా యాప్ లేదా వెబ్‌పోర్టల్‌లో పాన్, ఆధార్, బ్యాంకు అకౌంట్ లాంటి వివరాలివ్వాలి. ♦ ఒక నెలలో గరిష్ఠంగా ఒక వ్యక్తి 25 రశీదులను అప్లోడ్ చేయవచ్చు ♦ లక్కీ డ్రాకు అర్హత పొందాలంటే రశీదు విలువ కనీసం రూ.200 ♦ బీ2సీ రశీదులన్నింటినీ నెల 5వ తేదీ(అంతుకుముందు నెలలోని బిల్లులను)లోపు అప్లోడ్ చేస్తేనే నెలవారీ డ్రాకి అర్హత ♦వీటిని 'మేరా బిల్ మేరా అధికార్' మొబైల్ అప్లికేషన్లోను, 'వెబ్ డాట్ మేరాబిల్డాట్జీఎస్టీ డాట్ జీవోవీడాట్ఇన్ అనే వెబ్‌పోర్టల్‌లోనూ అప్లోడ్ చేయాలి. -
ఆర్టీసీ బిల్లుపై న్యాయ సలహా కోరిన గవర్నర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ న్యాయసలహా కోరారు. ఈ క్రమంలో ఆర్టీసీ బిల్లుతో పాటు ఇతర బిల్లులను సైతం ఆమె న్యాయ కార్యదర్శికి పంపినట్లు సమాచారం. ఇది నిబంధనల్లో భాగంగా జరిగే ప్రక్రియే అని రాజ్‌భవన్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే.. ఆర్టీసీ బిల్లుతో పాటు గతంలో తాను వెనక్కి పంపిన మరో నాలుగు బిల్లులకు సంబంధించిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నారా? లేదా? అనే విషయాన్ని సైతం నిర్ధారించాలన్నారామె. ఈ క్రమంలో.. న్యాయకార్యదర్శి సిఫార్సుల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఆర్టీసీ బిల్లు సమయంలో దురుద్దేశంతో చేసిన అసత్య ప్రచారాలను నమ్మొద్దంటూ తెలంగాణ ప్రజలను, ఆర్టీసీ ఉద్యోగులను ఓ ప్రకటనలో ఆమె కోరారు. గవర్నర్ కావాలనే ఆపుతున్నారు ఆర్టీసీ బిల్లును గవర్నర్ కావాలనే ఆపుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. పార్లమెంటులో ఆమోదం పొందిన బిల్లులపై ఇప్పటికే రాష్ట్రపతి సంతకం చేశారని, అంతకుముందే శాసనసభ ఆమోదం పొందిన బిల్లుల ఆమోదానికి గవర్నర్ మాత్రం జాప్యం చేస్తున్నారని, ఇందుకు రాజకీయ ప్రేరేపిత కారణాలు ఉన్నాయని మండిపడ్డారాయన. నామినేటెడ్ ఎమ్మెల్సీలకు కేబినెట్ పంపిన పేర్లను కూడా ఆమోదించలేదు. తక్షణమే ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సంతకం చేయాలని డిమాండ్ చేశారాయన. ప్రత్యక్ష కార్యాచరణకు సిద్దం ఆర్టీసీ బిల్లు విషయంలో జరుగుతున్న జాప్యంపై ఆర్టీసీ ఉద్యోగులు ప్రత్యేక్ష కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రేపు(శుక్రవారం) ఉదయం మంత్రి హరీష్ రావు ను కలవనున్నారు టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి, ఇతర నేతలు. గవర్నర్ ఆర్టీసి బిల్లు పై నిర్ణయం తీసుకోకుండా పెండింగ్ లో పెట్టడం, న్యాయ సలహా అంటూ తాత్సరం చేయడం పై హరీష్ రావు ను కలిసి తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతలు చర్చించనున్నారు. అనంతరం టీఎంయూ తన భవిష్యత్తు కార్యచరణ ప్రకటించనుంది. -
శాండ్విచ్ కట్ చేసి, తినేలోపు ఊహించని షాక్.. ఈ రెస్టారెంట్‌కి వెళ్లకూడదు బాబోయ్!
సాధారణంగా రెస్టారెంట్లో తిన్నాక ఆర్డర్ చేసిన ఆహారం, జీఎస్టీ లాంటివి బిల్లో చూస్తాం. ఏ హాటల్‌కి వెళ్లినా ఇదే కనిపిస్తుంది. అయితే ఓ రెస్టారెంట్ మాత్రం వీటికి భిన్నంగా కస్టమర్లతో నడుచుకుంటోంది. అందులో మనం తిన్న ఆహారంతో పాటు, సర్వీసింగ్ మాత్రమే కాదు ప్లేట్స్‌కు కూడా బిల్ వేస్తున్నారు. ఈ వింత అనుభవాన్ని ఓ కస్టమర్ సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచుకోగా.. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. రెండు పీసులకే ఇటలీలో విహార యాత్ర ఎంజాయ్ చేస్తున్న ఓ బ్రిటీష్ టూరిస్ట్ ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లేక్ కోమో సమీపంలో ఉన్న ఓ రెస్టారెంట్‌కు తన స్నేహితుడితో కలిసి వెళ్లాడు. వెయిటర్ రాగానే శాండ్ విచ్ను ఆర్డర్ చేశాడు. అది వచ్చాక రెండు ముక్కలుగా కట్ చేసి వారిద్దరికి ఇవ్వాలని కోరాడు. తినడం పూర్తయ్యాక వెయిటర్ తీసుకువచ్చిన బిల్ చూసి ఆ టూరిస్ట్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. శాండ్ విచ్ను రెండు పీసులుగా చేసినందుకు కూడా బిల్లో చార్జీ విధించడంపై అవాక్కయ్యాడు. శాండ్ విచ్ అసలు ఖరీదు 7.50 యూరోలు కాగా కట్ చేసినందుకు 2 యూరోలు (భారత ప్రకారం రూ.180) విధించారు. సదరు కస్టమర్ రెస్టారెంట్ మేనేజర్‌తో వాదించకుండా బిల్ చెల్లించినప్పటికీ, అతను ట్రిప్ అడ్వైజర్‌లో నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడంతో పాటు ఆ బిల్లు స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశాడు. విసుగు చెందిన కస్టమర్ రివ్యూల సైట్లో రెస్టారెంట్‌కు ఒక స్టార్ మాత్రమే ఇచ్చాడు. అనంతరం ఈ విషయాన్ని నెట్టింట షేర్ చేశాడు. దీని చూసిన నెటిజన్లు.. ఇలాంటి రెస్టారెంట్లకు వెళ్లకూడదని, యాజమాన్యంపై మండిపడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా.. రెస్టారెంట్ యజామాన్యం మాత్రం తమ చర్యను సమర్థించుకుంది. దీనిపై స్పందిస్తూ.. ‘రెండు పీసులుగా చేయడం వల్ల వాటికి రెండు ప్లేట్లు వాడాలి. ఈ క్రమంలో రెండు ప్లేట్లు కడుక్కోవాలి. ఇందుకు పట్టే సమయం, శ్రమకు ఆ మాత్రం చార్జీ అవుతుంది’’ అని తెలిపింది. -
సీఈసీ నియామకంలో సీజేఐకు అధికారం లేనట్టే
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య కొలీజియంపై విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరో వివాదాస్పద బిల్లును మోదీ సర్కార్ గురువారం రాజ్యసభలో ప్రవేశ పెట్టింది. కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి, ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించింది. ఆయన స్థానంలో కేబినెట్ మంత్రికి స్థానం కల్పించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే ఎన్నికల సంఘంపై కేంద్ర ప్రభుత్వానికి మరిన్ని అధికారాలు లభిస్తాయి. కేంద్రం ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చే వరకు ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తు లతో కూడిన త్రిసభ్య కమిటీ సీఈసీ, ఇతర కమిషనర్ల నియామకాలు చేపడుతుందని గత మార్చిలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సీజేఐను తప్పించి కేబినెట్ మంత్రిని చేర్చడం వివాదానికి దారితీసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్స్ (అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీసు) బిల్లు, 2023ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో ప్రధానమంత్రి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, ప్రధాని నామినేట్ చేసిన కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. ఆ కమిటీయే సీఈసీ, ఈసీలను ఎంపిక చేస్తుంది. కాంగ్రెస్, ఆప్ ఇతర విపక్ష పార్టీ సభ్యుల ఆందోళనల మధ్య ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సుప్రీం తీర్పుని లెక్క చేయరా ? సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఉత్తర్వుల్ని నీరు కార్చేలా ఈ బిల్లు ఉందని విపక్షాలు విమర్శించాయి. కమిటీ నుంచి సీజేఐని తప్పించడం అత్యంత ప్రమాదకరమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలపై ఇది ప్రభావం చూపిస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పులేమైనా బీజేపీకి నచ్చకపోతే వాటిని లెక్క చేయదని ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం మొత్తాన్ని ప్రధాని మోదీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ఆరోపించారు. కమిటీలో ఇద్దరు బీజేపీకి చెందినవారే ఉంటే నిష్పాక్షికంగా కమిషనర్ల ఎంపిక ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఏడాది ఈసీలో ఖాళీ కేంద్ర ఎన్నికల కమిషన్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఖాళీ ఏర్పడనుంది. ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండేకి 65 ఏళ్లు నిండనుండడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న పదవీ విరమణ చేస్తారు. 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి కొద్ది రోజుల ముందే ఆయన పదవీ విరమణ చేస్తారు. ఆయన స్థానంలో కొత్త వారిని నియమించాలి. తాము చెప్పినట్టు వినే కమిషనర్‌ను నియమించుకొని ఎన్నికల కమిషన్‌ను తన గుప్పిట్లో పెట్టుకోవడానికే కేంద్రం ఇదంతా చేస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. సుప్రీం కోర్టు ఉత్తర్వుల కంటే ముందు కేంద్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లను నియమించే వారు. -
రాజ్యసభలో తీవ్ర రగడ
న్యూఢిల్లీ: మణిపూర్ అంశంతోపాటు వివాదాస్పద ముఖ్య ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల బిల్లుపై విపక్ష సభ్యులు ఆందోళన, నినాదాలతో గురువారం రాజ్యసభ అట్టుడికింది. మణిపూర్ హింసపై 267 నిబంధన కింద సభలో చర్చ చేపట్టాలని ఇన్నాళ్లూ పట్టుబట్టిన విపక్షాలు కొంత దిగొచ్చాయి. 176 నిబంధన కింద చర్చ ప్రారంభించాలని, ప్రధాని మోదీ సభకు వచ్చిన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. ప్రధానమంత్రి ఏమైనా దేవుడా? రాజ్యసభ గురువారం ఉదయం ప్రారంభం కాగానే మణిపూర్ వ్యవహారంపై 176 నిబంధన కింద చర్చ కోసం విపక్ష సభ్యులు పట్టుబట్టారు. వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. ప్రధాని మోదీని సభకు రప్పించాలని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున ఖర్గే కోరారు. దీనిపై అభ్యంతరం తెలిపిన అధికార బీజేపీ ఎంపీలపై ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రధానమంత్రి ఎందుకు రాకూడదు? ఆయన ఏమైనా దేవుడా?’ అని ప్రశ్నించారు. ఖర్గే వ్యాఖ్యలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో సభను చైర్మన్ ధన్‌ఖడ్ మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు. అనంతరం వివిధ పార్టీల సభాపక్ష నేతలతో ఆయన సమావేశమయ్యారు. సభకు సహకరించాలని కోరారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా విపక్షాల ఆందోళన ఆగలేదు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. రాజ్యసభ కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వమే అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. ఓబ్రెయిన్ తీరును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తప్పుపట్టారు. అనంతరం మల్లికార్జన ఖర్గే మాట్లాడారు. అధికార పక్షం వల్లే సభ సజావుగా సాగడం లేదని మండిపడ్డారు. బీజేపీ ఎంపీల వ్యవహార శైలిని ఆక్షేపిస్తూ ఓ కవిత వినిపించారు. ఖర్గే తీరు గురువింద గింజలా ఉందని పీయూష్ గోయల్ ఎద్దేవా చేశారు. ఖర్గే వ్యాఖ్యలను పలువురు బీజేపీ సభ్యులు ఖండించారు. మిజోరాం ఎంపీ ఒకరు మాట్లాడబోతుండగా చైర్మన్ ధన్‌ఖడ్ అనుమతించలేదు. పార్లమెంట్ సభ్యులకు దేశంలో ఏదో ఒక ప్రాంతం ముఖ్యం కాదని, దేశమంతా సమానమేనని ధన్‌ఖడ్ అన్నారు. ఫార్మసీ(సవరణ) బిల్లుకు ఆమోదం వివాదాస్పద ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అదర్ ఎలక్షన్ కమిషనర్స్(అపాయింట్మెంట్ కండీషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్) బిల్లు–2023ను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పట్ల ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం విపక్షాల ఆందోళన మధ్యే కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘పోస్ట్ ఆఫీస్ బిల్లు–2023’ను ప్రవేశపెట్టారు. ఈ తర్వాత కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి మన్సుఖ్ మాండవీయా ప్రవేశపెట్టిన ‘ఫార్మసీ(సవరణ) బిల్లు–2023’ సభలో ఆమోదం పొందింది. అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ధన్‌ఖడ్ ప్రకటించారు. -
ఢిల్లీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ఢిల్లీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం -
లోక్‌సభలో పాసైన డేటా పరిరక్షణ బిల్లు
ఢిల్లీ: దేశ పౌరుల డిజిటల్హక్కుల్ని బలోపేతం చేయడం కోసం కేంద్రం తీసుకొచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు.. లోక్‌సభలో ఎట్టకేలకు పాసైంది. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ఆగస్టు 3న లోక్‌సభలో ఈ బిల్లుని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ‘గోప్యత’ దెబ్బతింటుందన్న విపక్షాల అనుమాన ఆందోళనల నడుమే ఇవాళ బిల్లు పాస్ కావడం గమనార్హం. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్-2023 బిల్లు ప్రకారం.. ఒక వ్యక్తి వ్యక్తిగత సమాచారాన్ని ఒక సంస్థ సేకరించాలనుకున్నప్పుడు, ఆ వ్యక్తి నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. డిజిటల్ యూజర్ల డేటా గోప్యతను కాపాడలేకపోయినా, సమాచార దుర్వినియోగానికి పాల్పడినా రూ.50 కోట్ల నుంచి గరిష్టంగా 250 కోట్ల రూపాయల జరిమానా విధిస్తారని కేంద్ర ఐటీశాఖ మంత్రి(సహాయ) రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ చట్టం అమలు కోసం డేటా ప్రొటెక్షన్ బోర్డు ఆఫ్‌ఇండియాను ఏర్పాటు చేస్తారు. ఈ బిల్లులోని నిబంధనం ప్రకారం.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బోర్డు రిఫరెన్స్‌తో కేంద్రం ఏదైనా సమాచారాన్ని బ్లాక్ చేసేందుకు పర్మిషన్ ఉంటుంది. ఆన్లైన్ వేదికల్లో.. వ్యక్తుల నుంచి సమాచార దుర్వినియోగం విపరీతంగా జరుగుతుంటుంది. ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం గనుక పొందితే.. ప్రతి పౌరుడి డిజిటల్ హక్కులకు రక్షణ లభిస్తుంది అని కేంద్రం చెబుతోంది. కొత్త డేటా ప్రొటెక్షన్ బిల్లుతో సోషల్ మీడియా కంపెనీల ఇష్టారాజ్యానికి ప్రభుత్వం అడ్డుకట్ట వేయనుంది. బిల్లులోని ముఖ్యాంశాలు ► ఈ బిల్లు భారతదేశంలోని డిజిటల్ వ్యక్తిగత డేటాను ఆన్లైన్లో సేకరించిన.. ఆఫ్‌లైన్‌లో సేకరించి డిజిటలైజ్ చేయబడిన వాటి ప్రాసెసింగ్‌కు వర్తిస్తుంది. ► వ్యక్తిగత డేటా ఆ వ్యక్తి సమ్మతితో చట్టబద్ధమైన ప్రయోజనం కోసం మాత్రమే ప్రాసెస్ చేయబడుతుంది. వినియోగదారుల డేటాను ఉపయోగించడానికి కంపెనీలు ఇప్పుడు అనుమతి తీసుకోవాలి. ► డేటా విశ్వసనీయులు డేటా ఖచ్చితత్వాన్ని నిర్వహించడానికి, డేటాను సురక్షితంగా ఉంచడానికి, దాని ప్రయోజనం అందించిన తర్వాత డేటాను తొలగించడానికి బాధ్యత వహిస్తారు. ► సమాచారాన్ని స్వీకరించే, సరిదిద్దే, తొలగించే హక్కు, ఫిర్యాదులను పరిష్కరించే హక్కుతో సహా వ్యక్తులకు ఈ బిల్లు నిర్దిష్ట హక్కులను అందిస్తుంది. ► రాష్ట్ర భద్రత, పబ్లిక్ ఆర్డర్, నేరాల నిరోధం వంటి కారణాలతో బిల్లులోని నిబంధనలను అమలు చేయడం నుంచి ప్రభుత్వ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇవ్వవచ్చు. ఇదీ చదవండి: కుటుంబ పాలన.. క్విట్ ఇండియా -
గవర్నర్‌కు జ్ఞానోదయం అయినందుకు సంతోషం: సీఎం
సాక్షి, హైదరాబాద్: ‘ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్ పాపం తెలిసో తెలియకో అనవసరంగా వివాదం కొని తెచ్చుకున్నారు. ఎందుకు పని పెట్టుకున్నారో తెలియదు. 96 క్లారిఫికేషన్లు అడిగారు. ఆ అంశాలన్నింటినీ ప్రభుత్వం పరిశీలించి, పరిగణనలోకి తీసుకున్నవే. మొత్తం మీద గవర్నర్‌కు జ్ఞానోదయమై ఆదివారం మధ్యాహ్నం బిల్లుకు ఆమోదం తెలిపి పంపినందుకు సంతోషం. ప్రభుత్వం, ఆర్టీసీ ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం..’ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం అసెంబ్లీలో ఈ అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘ఆర్టీసీని పెట్టిందే ప్రజారవాణా ఉండాలని. కాలక్రమేణా సంస్థ నష్టాల్లో పడింది. నేను రవాణా మంత్రిగా అంకితభావంతో పనిచేసి రూ.14 కోట్ల నష్టంలోని సంస్థను రూ.14 కోట్ల లాభాల్లోకి తెచ్చా. శక్తిసామర్థ్యాలుంటే సంస్థ నష్టాలను పూడ్చవచ్చు. కానీ డీజిల్ ధరల పెరుగుదలతో పరిస్థితి చేయిదాటింది. తమను ప్రభుత్వంలోకి తీసుకోవాలని గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే, తగిన డబ్బిస్తామని నడిపించుకోవాలని చెప్పాం. లాభాలు తీసుకురావాలని బెస్ట్ ఐపీఎస్ అధికారిని నియమించాం. మంచి అనుభవమున్న బాజిరెడ్డి గోవర్దన్‌ను చైర్మన్‌ను చేశాం. వారు విశ్వప్రయత్నాలు చేసినా డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో నష్టాలు మరింత పెరిగాయి. డీజిల్ లీటర్ రూ. 60 నుంచి రూ.110 కావడంతో ఆమాంతంగా ఖర్చు పెరిగి రోజుకు రూ.2.5 కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో ఇటీవల కేబినెట్లో.. గతంలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో కలపొద్దని అనుకున్నామని, ఇప్పుడేం చేద్దామని చర్చించాం. ప్రజలకు రవాణా సదుపాయం కల్పించడం ఏ ప్రభుత్వానికైనా సామాజిక బాధ్యత. పైగా ఆర్టీసీని తీసేయడానికి లేదు. అది మంచి నైపుణ్యాలున్న సంస్థ. జీరో యాక్సిడెంట్‌తో ప్రయాణికులను క్షేమంగా చేరవేసే సంస్థ. కానీ అది మనుగడ సాగించే అవకాశం లేదు. దీంతో ప్రభుత్వమే సాకాలి. మరో దారిలేదు. ఇప్పటికే ఏడాదికి బడ్జెట్లో పెట్టి మరీ రూ.1,500 కోట్లు వారికి ఇస్తున్నాం. ప్రభుత్వంలో లేదన్న పేరే తప్ప గవర్నమెంటే సాదుతోంది. కాబట్టి ప్రభుత్వంలోకి తీసుకుందాం. ఉద్యోగులకు భద్రత వస్తుంది. సంస్థకు చిక్కులు పోతాయనే ఉద్దేశంతో విలీనం నిర్ణయం కేబినెట్లో తీసుకున్నాం’ అని కేసీఆర్ వివరించారు. భూములపై కన్ను అంటూ నీచంగా మాట్లాడుతున్నారు.. ‘గతంలో వద్దన్నవారే మళ్లీ ఎట్లా తీసుకున్నారని పిచ్చివాగుడు చేసే వాళ్లు ఉన్నారు. ప్రభుత్వం ఏ పనిచేసినా ఓ బాధ్యతతో, దృక్పథంతో, పరిశీలనతో చేస్తుంది. ఇక సగం సగం ఎందుకు పూర్తిగానే బాధ్యత తీసుకుందామని నిర్ణయించాం. మరో ఇద్దరు యువ ఐఏఎస్ అధికారులను పెట్టి ఆదాయం పెంచే చర్యలు తీసుకోవాలని అనుకున్నాం. కానీ ఆర్టీసీ ఆస్తులపై ప్రభుత్వం కన్నేసిందని కొందరు దుర్మార్గులు, నీచులు మాట్లాడుతున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? ఇంటి పిల్లవాడిని సాదుకోవాలి తప్ప చంపుకోలేము. మరిన్ని సౌకర్యాలు పెంచి, అవసరమైతే మరిన్ని స్థలాలు సేకరించి ప్రభుత్వ పరంగా సరీ్వసులు పెంచుతాం. ఆర్టీసీ ఉద్యోగులకూ పీఆర్సీ ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేవి వారికి కూడా వస్తాయి’ అని సీఎం తెలిపారు. -
‘విలీనానికి’ అనుమతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రతిపాదించిన ఆర్టీసీ చట్ట సవరణ బిల్లు–2023కు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర రవాణా శాఖ, ఆర్టీసీ అధికారులతో ఆదివారం రాజ్‌భవన్‌లో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం పలు సిఫారసులతో బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు అనుమతించారు. దీంతో విలీనంపై మూడురోజులుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడినట్టయ్యింది. ముగిసిన హైడ్రామా ఆర్టీసీ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ ఈ నెల 2న రాష్ట్ర ప్రభుత్వం బిల్లును రాజ్‌భవన్‌కు పంపింది. అయితే బిల్లు పరిశీలనకు సమయం కావాలని 3వ తేదీన రాజ్‌భవన్ ప్రకటించింది. ఉద్యోగుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో అదే రోజు బిల్లును పరిశీలించిన గవర్నర్ తమిళిసై 5 సందేహాలపై ప్రభుత్వ నుంచి వివరణలు కోరారు. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులు రాజ్‌భవన్‌ను ముట్టడించి ధర్నా నిర్వహించగా, ప్రభుత్వ ప్రొద్బలమే ఇందుకు కారణమని రాజ్‌భవన్ ఆరోపించింది. కాగా ప్రభుత్వం పంపిన వివరణలతో సంతృప్తి చెందని గవర్నర్.. ఈ నెల 5న రెండోసారి మరికొన్ని సందేహాలకు సమాధానాలను కోరగా, ప్రభుత్వం వెంటనే ఆ మేరకు వివరణలు పంపించింది. రవాణా శాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం ఎట్టకేలకు ఆదివారం బిల్లుకు గవర్నర్ సమ్మతి తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రభుత్వానికి పలు సిఫారసులు చేశారు. కారుణ్య నియామకాలు చేపట్టాలి ప్రభుత్వంలో ఉద్యోగుల విలీనం తర్వాత కూడా సంస్థ భూములు, ఆస్తులపై యాజమాన్య హక్కులను ఆర్టీసీ సంస్థే కలిగి ఉండాలి. సంస్థ అవసరాల కోసమే వాటిని వినియోగించాలి. ఈ మేరకు ప్రభుత్వం హామీ ఇవ్వాలి. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల పంపిణీ ప్రక్రియ పూర్తి కావాలి. ఉమ్మడి ఏపీఎస్ఆర్టీసీ నుంచి రావాల్సిన బకాయిల చెల్లింపుపై స్పష్టత ఇవ్వాలి. బకాయిల చెల్లింపు బాధ్యతను తీసుకోవాలి. విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పారితోశాకాలు, జీతభత్యాలు, పే స్కేలు, సర్విసు నిబంధనలు, బదిలీలు, పదోన్నతులు, పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలు వర్తింపజేయాలి. వైద్యపరంగా అనర్హులు(మెడికల్లీ అన్‌ఫిట్)గా మారే ఉద్యోగులు కారుణ్య నియామకం కింద తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగం కోరే సదుపాయాన్ని కల్పించాలి. అత్యంత కఠినంగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యల ప్రక్రియను సరళీకరించి మానవీయంగా మార్చాలి. అందరికీ సమాన ప్రయోజనాలు ఆర్టీసీ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగుల తరహాలో రాష్ట్ర సర్విసు నిబంధనల మేరకు సమాన ప్రయోజనాలు, జీతాలు, పీఎఫ్ చెల్లించాలి. వారి ఉద్యోగ భద్రతను పరిరక్షించి వారి సేవలను ఇతర శాఖల్లో వినియోగించుకోవాలి. ఆర్టీసీ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు సర్విసులో ఉన్నంత కాలం వారికి ఆర్టీసీ ఆస్పత్రుల్లో వైద్య సేవలు కొనసాగించాలి. ఉద్యోగుల కుటుంబ సభ్యులకు సైతం వైద్య ప్రయోజనాలు అందించాలి. బస్సుల నిర్వహణలో ఆర్టీసీ సంస్థ, యూనియన్ల పాత్రే కీలకం. ప్రజల భద్రత కోసం బస్సుల నిర్వహణను ప్రభుత్వం తీసుకుని, ఔట్సోర్సింగ్ పద్ధతిలో స్వతంత్ర సంస్థకు లేదా మరేదైనా పద్ధతిలో అప్పగించాలి. నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇవ్వాలి. -
నేనైతే సంతకం పెట్టాను.. కానీ అంతా వాళ్ల చేతిలోనే ఉంది
సాక్షి, చైన్నె : కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కేంద్రం చేతిలో ఉందని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. తన వద్దకు నివేదిక రాగానే, పరిశీలించిన సంతకం పెట్టినట్టు వివరించారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించాలన్న డిమాండ్ మార్మోగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల అసెంబ్లీలో బీజేపీ మిత్రపక్షం ఎన్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్ర హోదాకోసం తీర్మానం చేసింది. దీనిని రాజ్‌నివాస్‌కు పంపించారు. అయితే, దీనిని ఎల్జీ తమిళిసై సౌందరరాజన్ తుంగలో తొక్కేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సమాధానం ఇస్తూ ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం తీర్మానం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ తీర్మాన నివేదిక తనకు జూలై 22న అందినట్టు పేర్కొన్నారు. మరుసటిరోజే తాను పరిశీలించి సంతకం కూడా చేశానని, అదే రోజున కేంద్రం అనుమతి కోరుతూ ఢిల్లీకి పంపించినట్టు వివరించారు. నిబంధనల పరంగా ఇందులోని అంశాలను కేంద్ర ప్రభుత్వం, హోంశాఖ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. తన వరకు రాష్ట్ర హోదా ఫైల్లో సంతకం పెట్టానని, అమల్లోకి రావాలంటే కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు వెలువడాల్సి ఉంటుందన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. -
ఆర్టీసీ విలీనం డ్రాఫ్ట్ బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం
-
ఆర్టీసీ బిల్లుపై స్పందించిన గవర్నర్ తమిళిసై
-
కార్మికులకు అండగా ఉన్నా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బిల్లును హడావుడిగా ప్రవేశపెట్టడం సరికాదని, అందులోని అంశాలపై విస్తృత చర్చ కోసం భాగస్వామ్య పక్షాలకు తగిన సమయం ఇవ్వాల్సి ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు అనుమతి ఆపడం వెనక తనకు వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలేమీ లేవని.. ప్రజలు, ఆర్టీసీ ఉద్యోగులు, సంస్థ ప్రయోజనాలను రక్షించడమే తన ఉద్దేశమని చెప్పారు. తాను ఎల్లçప్పుడూ ఆర్టీసీ కార్మికుల పక్షాన ఉంటానని, గత సమ్మె సమయంలో కూడా కార్మికులకు అండగా నిలబడి అర్ధరాత్రి వారి సమస్యలను విన్నానని గుర్తు చేశారు. శనివారం ఆమె పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ, తెలంగాణ మజ్దూర్ యూనియన్ల ప్రతినిధులతో మాట్లాడారు. 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగుల భవిష్యత్తు పట్ల ఆందోళన, సానుభూతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన వివరణలు అందాక.. ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. పీఆర్సీ, గ్రాట్యుటీ చెల్లింపు ఎప్పుడు? ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణలు (పీఆర్సీలు), ఈపీఎఫ్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిల చెల్లింపు వంటివి పెండింగ్‌లో ఉండటంపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమ సహకార సొసైటీకి చెందిన రూ.3 వేల కోట్లకుపైగా నిధులను ప్రభుత్వం తీసుకుని ఇప్పటివరకు చెల్లించలేదని గుర్తు చేశారు. రాష్ట్రానికి రాజ్యాంగబద్ధ అధిపతిగా రాజ్యాంగ నియమాల పరిరక్షణతోపాటు ప్రజలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడే బాధ్యత తనపై ఉందన్నారు. ధర్నాకు మంత్రుల వ్యూహరచన: ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాలు ఎలాంటి సమ్మెకు పిలుపు ఇవ్వలేదని వీడియో కాన్ఫరెన్స్‌లో జేఏసీ ప్రతినిధులు గవర్నర్‌కు చెప్పారు. ప్రభుత్వ ప్రోద్బలంతో బలవంతంగా సమ్మె చేయించారని, మహిళా ఉద్యోగులను సైతం వదిలిపెట్టలేదని ఆరోపించారు. రాజ్‌భవన్ ముట్టడి జరపాలని తమపై ఒత్తిడి తెచ్చారని.. ధర్నాకు ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యూహరచన చేశారని పేర్కొన్నారు. -
ఆర్టీసీ కార్మికుల ‘చలో రాజ్‌భవన్’
సాక్షి, హైదరాబాద్/ పంజగుట్ట: ఆర్టీసీ కార్మికులు కదంతొక్కారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా శనివారం ఉదయం భారీ ప్రదర్శన చేపట్టారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుపైన ఆమోదం తెలపాలని, గవర్నర్ సంతకం చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది ‘చలో రాజ్‌భవన్’పేరిట భారీ ర్యాలీ నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతృత్వంలో చేపట్టిన ఈ భారీ ప్రదర్శనకు నగరంలోని అన్ని డిపోలకు చెందిన కార్మికులు తరలివచ్చారు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సిటీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఫలితంగా విద్యార్ధులు, ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు కార్మికుల భారీ ప్రదర్శనతో ఖైరతాబాద్ చౌరస్తా, రాజ్‌భవన్ తదితర మార్గాల్లో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. నాలుగైదు గంటల పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఆర్టీసీ కార్మికులు రోడ్డుపైనే బైఠాయించడంతో ఖైరతాబాద్ నుంచి రాజ్‌భవన్ వచ్చే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. దాంతో నాలుగు వైపులా విపరీతంగా ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనదారులు గంటలతరబడి రోడ్లపైనే పడిగాపులు కాయాల్సివచ్చింది. గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు రాజ్‌భవన్ వైపు వెళ్లకుండా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు దాటుకొని ఆందోళనకారులు ముందుకు వెళ్లారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘గవర్నర్ డౌన్ డౌన్’అంటూ నినదించారు. ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రదర్శనగా వెళ్లిన కార్మికులంతా రాజ్‌భవన్ ఎదుట బైఠాయించారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి అధ్యక్షతన ఐదుగురు ప్రతినిధుల బృందం రాజ్‌భవన్‌లోకి వెళ్లి గవర్నర్‌తో వీడియో కాల్ మాట్లాడిన తర్వాత నిరసనను విరమించారు. గవర్నర్ సానుకూలంగా స్పందించారు ఆ తర్వాత «థామస్ రెడ్డి మాట్లాడుతూ గవర్నర్ ఎంతో సానుకూలంగా స్పందించారని చెప్పారు. కార్మికుల ప్రయోజనాల పరిరక్షణ తనకు ఎంతో ముఖ్యమని గవర్నర్ చెప్పారని పేర్కొన్నారు. బిల్లులో కొన్ని సందేహాలు నివృత్తి కాగానే బిల్లుకు ఆమోదం తెలుపుతామన్నారని వివరించారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు కమలాకర్, ఉపాధ్యక్షులు జీపీఆర్ రెడ్డి, కోశాధికారి రాఘవరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.ఆర్.రెడ్డి, మహిళా నాయకురాలు నిర్మలా రెడ్డి, బీఆర్టీయూ అధ్యక్షులు రాంబాబు యాదవ్, ప్రధాన కార్యదర్శి పి.నారాయణ నిరసనకు నాయకత్వం వహించారు. కాగా, గవర్నర్‌తో సమావేశం అయిపోయాక అక్కడకు వచ్చిన ఆర్టీసీ జేఏసీ నాయకులను పోలీసులు రాజ్‌భవన్‌లోనికి అనుమతించకుండా వారిని తీసుకొని ఖైరతాబాద్‌లో వదిలేశారు. -
ఆర్టీసీ బిల్లు జాప్యంపై బండి సంజయ్ కామెంట్లు
సాక్షి, కరీంనగర్: ఆర్టీసీ బిల్లు విషయంలో తొందరపాటు పనికి రాదని.. గవర్నర్ భుజాలపై తుపాకీ పెట్టి కాల్చాలని చూస్తోందంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఇవాళ(శనివారం) తొలిసారి ఆయన సొంత జిల్లాలో పర్యటించారు. శంకరపట్నం మండలం కల్వల ప్రాజెక్టు వద్ద బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్ తమిళిసై భుజాలపై తుపాకీ పెట్టి ఈ ప్రభుత్వం కాల్చాలని చూస్తోంది. గవర్నర్‌ను రెండు రోజుల్లోనే పరిశీలించి ఆమోదించాలంటే ఎలా?. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల జీవితాలకు సంబంధించిన బిల్ అది. కార్మికులకు సరైన న్యాయం చేసేందుకే ఇంతలా పరిశీలన చేస్తారు. ఇలాంటి బిల్స్ లో ఏ గవర్నరైనా ఇలానే పరిశీలిస్తారు అని తెలిపారాయన. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ కానీ, తెలంగాణ గవర్నర్ తమిళిసై కానీ వ్యతిరేకం కాదని గుర్తించాలి బండి సంజయ్ కోరారు. ఆర్టీసీ కార్మికులు కొంత సంయమనంతో ఉండండి. మీకు సరైన న్యాయం జరుగుతుంది. రేపొద్దున తిరకాసు చేసి.. ఆ నెపాన్ని గవర్నర్‌పై నెట్టేసే వ్యక్తి కేసీఆర్. ఆర్టీసీ ఆస్తుల్ని అమ్మేసే కుట్ర జరగుతుందోని అని ఆరోపించారాయన. అంతకు ముందు.. మొట్టమొదటిసారిగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ కు వచ్చిన బండి సంజయ్‌కు బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. రామడుగు మండలంలో వర్షాలకు దెబ్బ తిన్న మోతె వాగు బ్రిడ్జ్, శంకరపట్నం మండలంలో దెబ్బ తిన్న కల్వల ప్రాజెక్టులను సందర్శించారాయన. ఇదీ చదవండి: హలో కేటీఆర్‌గారూ.. ఇది గుర్తుందా? -
టీఎస్ఆర్టీసీ బిల్లు రగడ: గవర్నర్ అడిగిన వివరణలపై సర్కార్ రిప్లై
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లులో ఐదు అంశాలపై గవర్నర్ తమిళిసై వివరణ కోరారు. దీనిపై రాజ్‌భవన్‌కు అధికారులు రిప్లై పంపించారు. ఇప్పటి కన్నా మెరుగైన జీతాలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. విలీనం అయిన తర్వాత విధివిధానాలో అన్ని అంశాలు ఉంటాయని, కేంద్ర ప్రభుత్వ వాటా, 9వ షెడ్యూల్ ఇష్యూ ఏపీలో ఎలా చేసిందో వాటికి అనుగుణంగా ఉంటుందని తెలంగాణ సర్కార్ తెలిపింది. కాగా, టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లులో ఐదు అంశాలపై గవర్నర్ తమిళిసై వివరణ కోరిన సంగతి తెలిసిందే. ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు లేవు. ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్ ఇస్తారా? విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లేవు. పదోన్నతులు, క్యాడర్ నార్మలైజేషన్లో న్యాయం ఎలా చేస్తారు? అన్న గవర్నర్.. ఆర్టీసీ కార్మికుల భద్రత, ప్రయోజనాలపై స్పష్టమైన హామీలను కోరారు. చదవండి: ఆర్టీసీ విలీనం: గవర్నర్, కేసీఆర్ సర్కార్ పంచాయితీ.. ‘బట్టకాల్చి మీదేస్తున్నరు’ -
మరోసారి రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్
-
రాజ్‌భవన్ వద్ద ఉద్రిక్తత.. గవర్నర్‌తో ముగిసిన ఆర్టీసీ కార్మికుల చర్చలు
►ఆర్టీసీ బిల్లులోని ఐదు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరిన గవర్నర్.. ఆ సంస్థ ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించారు. ఆర్టీసీ యూనియన్ నాయకులతో పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆర్టీసీ యూనియన్ సభ్యుల బృందం గవర్నర్‌తో గంటపాటు చర్చించారు. గవర్నర్ తమ సమస్యలు విన్నారని, సానుకూలంగా స్పందించారని ఆ సంఘం నేత థామస్‌రెడ్డి తెలిపారు. ►గవర్నర్ లేవనెత్తిన ఐదు అభ్యంతరాలపై తెలంగాణ సర్కార్ వివరణ ఇచ్చింది. ఈనేపథ్యంలో ఆర్టీసీ విలీనం బిల్లుపై గవర్నర్ తమిళిసై ఏం నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది. ►రాజ్‌భవన్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఆర్టీసీ విలీన బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ రాజ్‌భవన్ ముట్టడికి ర్యాలీగా ఆర్టీసీ ఉద్యోగులు బయలుదేరారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్టీసీ యూనియన్ నేతలను చర్చలకు గవర్నర్ ఆహ్వానించారు. ►ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కారు. గవర్నర్ తీరును నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులను బహిష్కరించారు. రెండు గంటలపాటు బస్సులను బంద్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేసే బిల్లును వెంటనే గవర్నర్ ఆమోదించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళనకు దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా డిపోల్లో బస్సులన్ని ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు బంద్ పాటించారు. రెండు గంటల పాటు ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు కాస్త ఇబ్బంది పడ్డారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని పీవీ మార్గ్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లి రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ వెంటనే అనుమతి ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల అందోళనతో బస్సులు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ ,ఉట్నూరు, బైంసా, నిర్మల్, అసిపాబాద్, మంచిర్యాల డిపోల ముందు ఆందోళన కొనసాగుతుంది. రెండు గంటల బంద్‌లో భాగంగా నల్లగొండ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు నిరసన తెలుపుతున్నారు. మరోవైపు డిపో వద్ద గురుకుల అభ్యర్థులు నిరసనకు దిగారు. పరీక్ష కోసం వెళ్లేందుకు బస్సులు లేవంటూ ఆందోళన వ్యక్తం చేశారు. బస్సు సర్వీసులు నిలిపివేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. -
నేడు ఆర్టీసీ ఉద్యోగుల రాజ్‌భవన్ ముట్టడి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం బిల్లు’ను గవర్నర్ తమిళిసై పరిశీలన కోసం ఆపడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్విసులను నిలిపివేయాలని ఉద్యోగులు, కార్మికులకు పిలుపునిచ్చాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని పీవీ మార్గ్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లి రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని ప్రకటించాయి. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ వెంటనే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశాయి. -
వచ్చి రెండు రోజులేగా అయ్యింది.. టైం పడుతుంది!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ తమిళిసై వర్సెస్ బీఆర్ఎస్ సర్కార్‌కు నడుమ మధ్య జరుగుతున్న కోల్డ్‌వార్ తెలిసిందే. ఈ క్రమంలో.. ‘బిల్లుల పెండింగ్’ అంశం కూడా హాట్ టాపిక్‌గా ఉంటోంది. అయితే తాజాగా ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్టీసీ బిల్లును ఈ దఫా అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాల్సి ఉండగా.. గవర్నర్ నుంచి అందుకు అనుమతులు రాలేదు. ఈ తరుణంలో.. రాజ్‌భవన్ స్పందించింది. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ.. ఆ సంస్థ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా బిల్లును రూపొందించింది.. ఆర్థికపరమైంది కావడంతో దానిని గవర్నర్‌కు పంపింది కూడా. అయితే రెండు రోజులు గడిచినా గవర్నర్ నుంచి అనుమతి రాలేదు. ఆమె అనుమతి ఇస్తేనే అసెంబ్లీలో దీనిపై చర్చ జరిగేది. దీంతో ప్రభుత్వ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తుండగా.. మరోవైపు ఈ పరిణామంపై రాజ్‌భవన్ వర్గాలు స్పందిస్తూ.. బుధవారం మధ్యాహ్నాం ఆర్టీసీ బిల్లు రాజ్‌భవన్‌కు చేరింది. కాబట్టి గవర్నర్ ఈ బిల్లును పరిశీలించడానికి కొంత సమయం పడుతుంది. పైగా న్యాయ సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సమయం కావాలి అని ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదీ చదవండి: ‘మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థిని నిర్ణయించేది నేనే!’ -
సినిమా అంటే హీరో ఒక్కడే కాదు: రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: సినిమా అంటే హీరో ఒక్కడే కాదని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాజ్యసభలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, బడ్జెట్లో సింహభాగం హీరోలకు వెళ్లే సంస్కృతి మారాలని అభిప్రాయపడ్డారు. సినిమా బడ్జెట్లో అధికభాగం హీరోల రెమ్యునరేషన్లేనని గుర్తుచేశారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ వంటి బడా హీరోలు రూ.200 కోట్ల వరకు తీసుకుంటున్నారని చెప్పారు. సినిమా కోసం పనిచేసిన కార్మికులకు మాత్రం నామమాత్రపు జీతాలేనని తెలిపారు విజయసాయి రెడ్డి. కష్టపడిన అందరికీ సముచిత ప్రయోజనం చేకూరాలని ఆయన కోరారు. ఈ మేరకు చట్టాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్రం అడుగులు వేయాలని విజ్ఞప్తి చేశారు. హీరో కొడుకులే హీరోలు ఎందుకు అవుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఇదీ చదవండి: బాబు బాటలో పవన్.. నమ్మినవారినే నట్టేట ముంచేశాడా? -
13 గంటలు ఆటోలో ఊరంతా తిరిగి.. డ్రైవర్ డబ్బులు అడిగేసరికి..
ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్ పరిధిలోని సైబర్ సిటీలో ఒక మహిళ హల్చల్ చేసింది. జ్యోతి అనే ఈ మహిళ మేదాంత హాస్పిటల్ సమీపంలో ఒక ఆటోను రాత్రి 10 గంటల సమయంలో బుక్ చేసుకుంది. మర్నాటి ఉదయం 11 గంటల వరకూ అదే ఆటోలో పలుచోట్ల తిరిగింది. ఈ సమయంలో ఆటోవాలా ఆమెను ఎక్కడకు వెళ్లాలో సరిగ్గా చెప్పండి.. లేదంటే డబ్బులిచ్చి, ఆటో దిగిపోండి అని అన్నాడు. ఆటో డ్రైవర్ దీపక్ డబ్బులు అడగగానే ఆమె నానా హంగామా చేసింది. డబ్బులడిగితే తప్పుడు కేసులు పెడతానని బెదిరించింది. దీంతో ఈ విషయమై ఆటో డ్రైవర్ గురుగ్రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతోనూ ఆమె వాగ్వాదానికి దిగింది. ఆటో డ్రైవర్ ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ ఒక యాప్ ద్వారా గత రాత్రి ఆమె ఆటో బుక్ చేసుకున్నదని, ఉదయం 11 గంటల వరకూ ఆటోలో ఇటునటు తిప్పాలని కోరిందన్నాడు. తరువాత ఆటో బిల్లు వెయ్యి రూపాయలు అయ్యిందని చెప్పగానే, ముందు పేటీఎం చేస్తానని చెప్పిందని, తరువాత గొడవకు దిగిందని తెలిపాడు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసుల ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: పోలీసు నిర్లక్ష్యంతోనే జాహ్నవి మృతి?.. ఆలస్యంగా ఆధారాలు వెలుగులోకి.. -
రెస్టారెంట్లో మహిళకు వింత అనుభవం.. పాటలు విన్నారని ఊహించని షాక్ ఇచ్చారు!
రెస్టారెంట్‌కు స్నేహితులతో కలిసి వెళ్లి.. టేస్టీ పుడ్‌ని లాగించేసి కాసేపు సరదాగా గడిపేసి రావడం అంటే అందరికీ ఇష్టమే. అయితే సాధారణంగా రెస్టారెంట్ అంటే బిల్ కాస్త ఖరీదుగానే ఉంటుంది కాబట్టి మనం దానికి కూడా సన్నద్ధంగానే ఉంటాం. మహా అయితే భోజనం ధరలు కాస్త ఎక్కువగా ఉండడం, సర్వీస్ ఛార్జీ వంటివి ఊహిస్తాం. అయితే బ్రిటన్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు వెయిటర్ ఇచ్చిన బిల్ చూడగానే ఊహించని షాక్ తగిలింది. బిల్లో ఇలాంటివి కూడా వేస్తారా అంటూ అసహనం వ్యక్తం చేస్తూ ఆ ఫోటోని నెట్టింట షేర్ చేసింది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌లోని ఓ మహిళ తన స్నేహితులంతా కలిసి సరదాగా రెస్టారెంట్‌కు వెళ్లింది. ఇంకేముందు చిట్ చాట్ మొదలుపెట్టిన కాసేపటి ఆర్డర్ పెట్టిన పుడ్ వచ్చేసింది. కబుర్లు చెప్పుకొంటూ వాటిని ఆరగించారు. చివర్లో వెయిటర్ తీసుకువచ్చిన బిల్ చూసి షాక్ అవ్వడం వారి వంతైంది. ఎందుకంటే ఆ రెస్టారెంట్లో లైవ్ మ్యూజిక్ కార్యక్రమం నడుస్తోంది. యాజమాన్యం ఆ పాటలు విన్నందుకు 8 పౌండ్లు బిల్లో చేర్చింది. ఏం చేయాలో తోచక వారు బిల్లు చెల్లించి బయటకు వచ్చేశారు. తరువాత తమకు ఇలాంటి అనుభవం ఎదురైందంటూ రెస్టారెంట్ నిర్వాహకులు ఇచ్చిన రసీదును సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఇలాంటివి యూకేలో మునుపెన్నడూ లేవంటూ ఈ ఫోటో చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆ బిల్లులో మరికొన్ని ఫీజులు ఉండటంతో రెస్టారెంట్ యాజమాన్యం పుడ్ లవర్స్ ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: 2,600లకు పైగా విమానాలు రద్దు.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్ విజ్ఞప్తులు -
వామ్మో.. ఈ మ్యాగీ కంటే బిర్యానీ బెటర్.. ధర చూసి షాకైన యూట్యూబర్!
న్యూఢిల్లీ: ప్రస్తుతం ట్రెండ్ మారుతోంది.. ప్రజలు భోజనాల నుంచి ఫాస్ట్‌గా రెడీ అయ్యే ఫాస్ట్పుడ్స్పై మొగ్గు చూపుతున్నారు. అందుకే హోటల్స్ అనే కాకుండా పుట్‌పాత్‌లపై కూడా ఫాస్ట్ పుడ్ సెంటర్లకి గిరాకీ పెరుగుతోంది. ఈ కేటగిరి ఆహారంలో బయట పుడ్‌కి ప్రత్యామ్నాయంగా మ్యాగీ మంచి గుర్తింపు సంపాదించుకుంది. కేవలం రెండు నిమిషాల్లోనే నోరూరించే వంటకం సిద్ధం కావడంతోపాటు దీని ధర కూడా తక్కువే. ఇంకేముంది చిన్నారుల నుంచి పెద్దల వరకు మ్యాగీని ఎగబడి తింటున్నారు. అయితే అదే మ్యాగీ ఎయిర్‌పోర్టులో కొంటే ఆ బిల్ చూసి ఓ యూట్యూబర్‌కి కళ్లు బైర్లు కమ్మాయి. వెంటనే ఆ బిల్‌ని ఫోటో తీసి నెట్టింట పెట్టి.. ఈ షాకింగ్ విషయాన్ని సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఓ యూట్యూబర్ ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో ఉండగా ఆకలేసింది. సరే ప్రయాణం కాబట్టి తీరిగ్గా తినే టైం లేదని మ్యాగీ ఆర్డర్ చేశాడు. అనుకున్నట్లుగా మ్యాగీ రావడం మనోడు కడుపునిండా తినేశాడు. అయితే చివరిలో వెయిటర్ తెచ్చిన బిల్ చూసి ఆ యూట్యూబర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ మ్యాగీ మసాలా నూడుల్స్ ధర రూ. 184గా చూపించి దానికి జీఎస్టీ రూ. 9.20 జోడించడంతో రూ. 193.20 బిల్లు అయింది. చేసేదేమిలేక ఆ వ్యక్తి బిల్లు చెల్లించి, దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ బిల్ చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ‘వామ్మో.. మరీ ఇంత ధరకు అముతున్నారా.. ఈ ధరకు బిర్యానీ వస్తుందని కొందరు కామెంట్ చేయగా... ఎయిర్‌పోర్టులో ధరలు అలానే ఉంటాయంటూ మరొకరు కామెంట్ చేశారు. చదవండి: వీడియో: బొమ్మ కాదురా నాయనా.. పామును చేతిలో పట్టుకుని.. -
బుట్టాయిగూడెంలో తమ్ముళ్ల పరువు పాయే.. పాత బిల్లుతో బొక్కబోర్లా!
ద్వారకా తిరుమల: రాష్ట్ర ప్రభుత్వంపై బురద చిమ్మాలన్న దురుద్దేశంతో లేనిది ఉన్నట్టు చూపించేందుకు ప్రయత్నాలు చేసిన టీడీపీ నాయకుడు చివరికి భంగపడ్డారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం బుట్టాయిగూడెంలో జరిగిన ఈ ఘటన వివరాలున్నాయి.. బుట్టాయిగూడేనికి చెందిన నోముల రాంబాబు పూరి గుడిసెకు 2021 అక్టోబర్ నుంచి 2022 నవంబర్ వరకు (13 నెలలకు) రూ.26,660 విద్యుత్ బిల్లు వచ్చిం ది. అతను అధికారులను సంప్రదించగా, అంత బిల్లు రావడానికి మీటరు జంప్ అవడమే కారణమని తెలుసుకున్నారు. 2022 నవంబర్ 30న రూ.16,840 బిల్లును మినహాయించి, మిగిలిన రూ.9,820 చెల్లించాలని సూచించారు. పైగా, రాంబాబుకు ఎస్సీ కోటాలో ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ ఇస్తోంది. అప్పటి నుంచి అతడికి నెలకు రూ.28 మాత్రమే బిల్లు వస్తోంది. అయితే రాంబాబు పాత బకాయితో పాటు ఆ తర్వాతి నెలల బిల్లులు కూడా చెల్లించలేదు. అతని బకాయి రూ.10,150కు చేరింది. దీంతో అధికారులు నెల క్రితం అతని ఇంటి విద్యుత్ కనెక్షన్ తొలగించారు. రాంబాబు ఈ నెల 7న రూ.2 వేలు మాత్రమే చెల్లించాడు. అయితే అధికారులు మొత్తం బిల్లు చెల్లించాలని సూచించారు. గోపాలపురం టీడీపీ ఇన్చార్జి మద్దిపాటి వెంకట్రాజు పార్టీ కార్యక్రమంలో భాగంగా గురువారం అక్కడికి వచ్చారు. ఆయనకు రాంబాబు పాత బిల్లు చూపాడు. వెంటనే ఆయన పాత బిల్లు పట్టుకొని పూరి గుడిసెకు వేలల్లో బిల్లు వచ్చిం దంటూ రోడ్డుపై బైఠాయించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నోటికొచ్చిన ఆరోపణలు చేశారు. చివరకు అది పాత బిల్లని తేలడంతో నాలుక్కరుచుకున్నారు. ప్రతి నెలా ఎస్సీ సబ్సిడీ వస్తోంది ప్రభుత్వం గతేడాది డిసెంబర్ రెండో తేదీ నుంచి రాంబాబుకు ఎస్సీ కోటాలో ప్రతి నెలా విద్యుత్ సబ్సిడీ ఇస్తోందని, అతనికి నెలకు రూ.28 మాత్రమే బిల్లు వస్తోందని భీమడోలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.గోపాలకృష్ణ తెలిపారు. పాత బిల్లు బకాయికి సంబంధించి రాంబాబు శనివారం మరో రూ.500 చెల్లించాడని, దాంతో అతడి ఇంటికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని వివరించారు. బిల్లు నెలకు రూ.26,660 వచ్చిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. -
రెస్టారెంట్లో ఖరీదైన వాటర్ బాటిల్ అంటగట్టారని.. ‘పైసా వసూల్’ పనిచేసి..
ఖరీదైన రెస్టారెంట్లలో బిల్లులు ఏ స్థాయిలో ఉంటాయో మనందరికీ తెలిసిందే. అటువంటి సందర్భాల్లో కాస్త నిట్టూరుస్తూనే బిల్లు చెల్లిస్తుంటాం. తాజాగా ఫిట్నెస్, న్యూట్రిషన్ కోచ్ రితికా బోరా రెస్టారెంట్లో తనకు ఎదురైన అనుభవాన్ని షేర్ చేశారు. ఆమె రెస్టారెంట్లో వాటర్ బాటిల్‌కు ఆర్డర్ చేయగా, దానికి ఆమె భారీగా బిల్లు చెల్లించాల్సి వచ్చింది. తన అనుభవాన్ని ట్విట్టర్లో షేర్ చేసిన ఆమె క్యాప్షన్‌లో ‘మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఈ ఫ్యాన్సీ రెస్టారెంట్‌కు స్నేహితురాలితో పాటు వెళ్లాను. అక్కడ వాటర్ బాటిల్‌కు రూ.350 చెల్లించాల్సి వచ్చిందంటే ఎవరూ నమ్మరు. అందుకే ఆ బాటిల్‌ను నాతో పాటు ఇంటికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు దీనిని తిరిగి వినియోగించవచ్చని భావించాను. ఈ విధంగా నేను మాత్రమే చేస్తున్నానా? మీరు కూడా చేస్తారా?’ అని అమె ప్రశ్నించింది. Met up with a friend at this fancy restaurant for lunch, and you won't believe they charged 350 rps for a bottle of water! So, I decided to bring the bottle home with me so that I can reuse it. Is it only me or u have done this too? pic.twitter.com/AecGPLuoV8 — Ritika Borah (@coach_ritika) July 10, 2023 ఎక్కడైనా వాటర్ బాటిల్ రూ. 20కి లభ్యమవుతుంది. అయితే ఈ రెస్టారెంట్లో ఏకంగా వాటర్‌బాటిల్‌కు రూ. 350 చెల్లించాల్సి వచ్చిందని ఆమె వాపోయింది. రితికా బోరా పోస్టును చూసిన పలువరు నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు తమకు రెస్టారెంట్లలో ఎదురైన అనుభవాలను తెలియజేయగా, మరికొందు ‘పైసా వసూల్’ పని చేశారంటూ మెచ్చుకుంటున్నారు. ఇది కూడా చదవండి: మహిళ ఆర్తనాదాలపై ఫిర్యాదు.. సంఘటనా స్థలంలో డంగైన పోలీసులు! -
మద్దతుదారులకు ట్రంప్ షాక్.. అంత పని చేశాడా?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మద్ధతుదారులకు షాక్ ఇచ్చాడా?. తాజాగా రహస్య పత్రాల వ్యవహారంలో ఫ్లోరిడా మియామీ కోర్టుకు హాజరైన ఆయన.. దారిలో లిటిల్ హవానాలోని ఓ క్యూబన్ రెస్టారెంట్‌కు వెళ్లాడు. అయితే అక్కడ జరిగిన ఓ పరిణామం గురించి సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ట్రంప్ రెస్టారెంట్‌కు వెళ్లిన సమయంలో జనం భారీ సంఖ్యలో గుమిగూడారు. అయితే వాళ్లను ఉద్దేశించి ఫుడ్ ఫర్ ఎవ్రీవన్ అంటూ బిల్లు తానే కడతానంటూ గట్టిగా అరిచి ప్రకటించాడాయన. దీంతో అక్కడున్నవాళ్లంతా ఎగబడి మరీ తిండి కోసం పోటీ పడ్డారు. అయితే కాసేపటికే అంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. పది నిమిషాల తర్వాత గప్‌చుప్‌గా ట్రంప్ అక్కడికి వెళ్లిపోవడంతో కంగుతినడం మద్దతుదారుల వంతు అయ్యింది. ట్రంప్ ఇంత పని చేస్తాడా? అని నిరాశకు లోనయ్యారంతా. ట్రంప్ ఆ రెస్టారెంట్లో పది నిమిషాలు మాత్రమే గడిపాడు. ఎలాంటి ఆర్డర్ చేయలేదని తెలుస్తోంది. అయితే.. అక్కడ నుంచి వెళ్లిన ట్రంప్ మాత్రం తన ప్రైవేట్ ప్లేన్‌లో మెక్‌డొనాల్డ్స్ ఫుడ్‌ను ఆరగించాడని స్థానిక పత్రికలు కథనాలు ప్రచురించాయి. Trump supporters left empty-handed after he promised 'food for everyone' at Miami's Versailles: report https://t.co/TxZ0I949ZA Kind of like when he left people out in the cold at one of rally’s. He had no buses to take people home he bussed in. — James Tate (@JamesTate121) June 15, 2023 JUST IN: Trump supporters left empty-handed after he promised 'food for everyone' at Miami's Versailles Idiots 😂😂😂 I guess they had to go home and drink some more kool-aid pic.twitter.com/dsK3UImpTy — CoffeyTimeNews (@CoffeyTimeNews) June 15, 2023 Mr. Generosity showed up at a restaurant and shouted "food for everybody". He then left without paying a cent. And this is the face of rhe republican party. https://t.co/6va9vvwVPR — Dan ain't Q (@dan6654) June 15, 2023 -
అమెరికాలో దీపావళికి సెలవు.. ప్రత్యేక బిల్లు!
వాషింగ్టన్: అమెరికాలో దీపావళిని ఫెడరల్ హాలీడేగా ప్రకటించాలని కోరుతూ అమెరికా చట్టసభ్యురాలు ఒకరు ప్రత్యేక బిల్లు (Diwali Day Act )ప్రవేశపెట్టారు. గ్రేస్ మెంగ్ శుక్రవారం ప్రతినిధుల సభ( House of Representatives)లో ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదనపై పలువురు చట్టసభ్యులతో పాటు భారతీయ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది. గ్రేస్ మెంగ్ వర్చువల్‌గా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మందికి దీపావళి పండుగ ఎంతో ముఖ్యమైంది. క్వీన్స్, న్యూయార్క్ లాంటి అమెరికా ప్రధాన నగరాల్లోనూ లెక్కలేనన్ని కుటుంబాలు, కమ్యూనిటీలు దీపావళిని ఘనంగా నిర్వహించుకుంటాయి. అమెరికన్ పౌరులు సైతం హుషారుగా పాల్గొనడమూ చూస్తున్నాం. ఆ వెలుగులు ప్రజల్లో కొత్త ఉత్తేజాన్ని నింపుతాయి. కాబట్టి, ఈ పండుగను ఫెడరల్ హాలీడేగా ప్రకటించాల్సిన ఆవశ్యకత ఉంది’’ అని ఆమె వివరించారు. మరో ఈ ప్రతిపాదనపై సౌత్ ఏషియా కమ్యూనిటీతో పాటు పలువురు అక్కడి చట్టసభ్యులు హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. న్యూయార్క్‌కు చెందిన మరో చట్టసభ్యురాలు జెన్నిఫర్.. దీపావళిని అధికారిక సెలవు దినంగా గుర్తించాల్సిన అవసరం కచ్చితంగా ఉందని అంటున్నారు. అమెరికాలో 40 లక్షల మంది దీపావళి వేడుకల్లో పాల్గొంటున్నారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారామె. న్యూయార్క్ సెనెటర్ జెర్మీ కూనీ, న్యూయార్క్ సిటీ కౌన్సిల్మ్యాన్ శేఖర్ కృష్ణన్ సైతం ఈ బిల్లును స్వాగతిస్తున్నారు. శేఖర్ కృష్ణన్ న్యూయార్క్ ప్రభుత్వానికి ఎన్నికైన తొలి ఇండియన్ అమెరికన్. ఇక అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్‌లోనూ దీపావళి వేడుకలు జరుగుతుండడం చూస్తున్నదే. ఈ బిల్లు తొలుత పార్లమెంట్లో పాస్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత అధ్యక్షుడు సంతకంతో చట్టం అవుతుంది. ఒకవేళ దీపావళి పండుగకు గనుక సెలవు దినంగా ఆమోద ముద్ర పడితే.. అమెరికా సంయుక్త రాష్ట్రంలో ఫెడరల్ హాలీడేస్ జాబితాలో 12వదిగా నిలుస్తుంది. అమెరికాలో పబ్లిక్ హాలీడేస్(నేషనల్ హాలీడేస్)తో పాటు ఫెడరల్ హాలీడేస్(ప్రత్యేక సెలవులు) ఉంటాయి. ఈ లిస్ట్‌లో న్యూఇయర్, మార్టిన్ లూథర్ కింగ్ జయంతోత్సవాలు, వాషింగ్టన్ బర్త్‌డే, మెమొరియల్ డే, జూన్టీన్త్ నేషనల్ ఇండిపెండెన్స్ డే, ఇండిపెండెన్స్ డే, లేబర్ డే, కొలంబస్ డే, వెటరన్స్ డే, థాంక్స్‌గివింగ్ డే, క్రిస్మస్ డేలు ఉన్నాయి. -
మధ్యవర్తిత్వంపై త్వరలో చట్టం
సాక్షి, హైదరాబాద్: మధ్యవర్తిత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలో చట్టం చేయనుందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు. ఆ బిల్లు ఆమోదం పొంది అమల్లోకి వస్తే కేసుల పరిష్కారం వేగవంతం అవుతుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ఆదివారం భారత మధ్యవర్తిత్వ దిన తొలి వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘మధ్యవర్తిత్వం ద్వారా కేసుల్ని రాజీ చేసుకొనే విధానాన్ని అనుసరిస్తేనే ఏ దేశమైనా న్యాయ వివాదాల సత్వర పరిష్కారం ద్వారా పురోగతి సాధిస్తుంది. ఎంఎన్సీ సంస్థల నుంచి సాధారణ స్థాయి సంస్థల్లో జరిగే ఒప్పందా ల్లో విదాదం ఏర్పడితే నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్ర యించకుండా తొలి దశలో మధ్యవర్తిత్వం ద్వారా ఆ వివాదం పరిష్కరించుకొనేలా ఒప్పందం ఉండాలి. హైదరాబాద్‌లో వేలాది నిర్మాణాలు జరుగుతున్నా యి. సివిల్ వివాదాలు ఏళ్ల తరబడి కోర్టుల్లో వాయిదాల మీద వాయిదాలు పడే అవకాశం ఉంది. తద్వారా అది పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది’అని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. చోళుల కాలంలోనే ‘మధ్యవర్తిత్వం’... దేశంలో చోళుల కాలం నుంచే మధ్యవర్తిత్వ ప్రయత్నాలు సాగేవని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి తెలిపారు. ‘వ్యాపార లావాదేవీల్లో వివాదాలను ఆర్బిట్రేషన్ విధానంలోనే పరిష్కరించుకొనేవారు. ఆర్బిట్రేషన్, చర్చలు, మధ్యవర్తిత్వం లోక్‌అదాలత్ ఇవన్నీ ప్రత్యామ్నాయ వివాద పరిష్కారానికి (ఏడీఆర్) విభిన్న కోణాలే. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ 2021–22 సమాచారం ప్రకారం దేశంలో 464 ఏడీఆర్ కేంద్రాలుంటే 397 పనిచేస్తున్నాయి. 570 మధ్యవర్తిత్వ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వాటిలో ఇప్పటివరకు 53 వేల కేసులు పరిష్కారం అయ్యాయి. మధ్యవర్తిత్వ బిల్లు – 2021ను త్వరలోనే పార్లమెంటు ఆమోదించే అవకాశం ఉంది. నిర్దిష్ట గడువులోగా మీడియేషన్ ప్రక్రియ పూర్తి (180 రోజుల్లో పూర్తి చేయాలి. లేనిపక్షంలో మరో 180 రోజులు పొడిగింపు), మధ్యవర్తుల నమోదుకు జాతీయ స్థాయిలో మధ్యవర్తిత్వ మండలి ఏర్పాటు, మధ్యవర్తిత్వ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకున్నాక ఉభయ పార్టీలు అందుకు కట్టుబడి ఉండాలి. మధ్యవర్తిత్వ వ్యవహారాలన్నీ గోప్యంగా ఉంచడం వంటివి ప్రతిపాదిత బిల్లులో కీలకాంశాలు. కోవిడ్ లాక్డౌన్ వేళ ఏడీఆర్ అమల్లో స్పష్టమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అవి ఆన్లైన్ వివాద పరిష్కార (ఓడీఆర్) దిశగా కేసుల సత్వర పరిష్కారానికి దోహదపడ్డాయి’అని జస్టిస్ హిమాకోహ్లి పేర్కొన్నారు. సమయం, డబ్బు ఆదా: హైదరాబాద్‌లో ఐఏఎంసీ ఏర్పాటును స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం గుజరాత్లో ఆర్బిట్రేషన్–మీడియేషన్ సెంటర్ ఏ ర్పాటుకు ఆర్థిక సాయం అందించింది. ఈ సెంటర్ల ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుంది. సింగపూర్ ఆర్బిట్రేషన్–మీడియేషన్ ఒప్పందంపై భార త్ 2019 ఆగస్టు 7న సంతకం చేసింది. శ్రీకృష్ణుడు కౌరవ, పాండవుల మధ్య రాయబారానికి ప్రయచారు. అది విఫలం కావడంతోనే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. పెను వినాశనానికి దారితీసింది. గ్రామీణ ప్రాంతాల్లో పెద్దలు రచ్చబండ విధానం ద్వారా స్థానికంగా వివాదాల్ని పరిష్కరించే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వ విధానానికి ఆదరణ లభిస్తోంది’అని జస్టిస్ ఎన్వీ రమణ వివరించారు. 33 కేసుల పరిష్కారం... ఐఏఎంసీ ఇప్పటివరకు 33 కేసుల్ని పరిష్కరించిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర్రావు వెల్లడించారు. ఆర్బిట్రేషన్ ద్వారా పది కేసులు, మీడియేషన్ ద్వారా 23 కేసుల్లో మొత్తం 700 బిలియన్ డాలర్ల విలువైన వివాదాలు పరిష్కారమయ్యాయని వివరించారు. అనంతరం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఐఏఎంసీ సీఈ వో జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, సింగపూర్ ఐఏఎంసీ చైర్మన్ జార్జి లిమ్ ప్రసంగించారు. వారికి ఐఏఎంసీ రిజిస్ట్రార్ తారిక్ స్వాగతం పలికారు. తర్వాత మధ్యవర్తిత్వంపై పలు చర్చాకార్యక్రమాలు జరిగాయి. -
ఫారిన్ ఏజెంట్ బిల్లుపై రణరంగంగా జార్జియా
తిబ్లిస్: జార్జియా ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఒక బిల్లు రణరంగానికి దారితీసింది. ఆ బిల్లుని వ్యతిరేకిస్తూ నిరసనకారులు రాజధాని తిబ్లిస్లోని పార్లమెంటు భవనాన్ని ముట్టడించారు. నిరసనకారుల్ని అడ్డుకోవడానికి పోలీసులు వాటర్ కెనాన్లు ప్రయోగించడంతో పరిస్థితులు అదుపు తప్పాయి. పోలీసులకు, నిరసనకారులకి మధ్య జరిగిన ఘర్షణలో 50 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. ప్రతిపక్ష నాయకుడు జురాబ్ జపారిడ్జ్ సహా 66 మందిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. జురాబ్ను బాగా కొట్టినట్టుగా కూడా వార్తలు వెలువడ్డాయి. జార్జియా ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లుపై స్వదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీని ప్రకారం 20 శాతానికి పైగా విదేశీ నిధులు కలిగిన స్వచ్ఛంద సంస్థలు, మీడియా సంస్థలు తమని తాము విదేశీ ఏజెంట్లుగా ప్రకటించుకోవాల్సి ఉంటుంది. అలా ప్రకటించుకోకపోతే జైలు శిక్షతో పాటుగా భారీగా జరిమానాలు విధిస్తారు. -
ఆధార్ అనుసంధానం గడువు పొడిగింపు
సాక్షి, చెన్నై: విద్యుత్ కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం గడువును ఆ శాఖ తాజాగా పొడిగించింది. శనివారం అధికారులతో జరిగిన సమావేశం అనంతరం మంత్రి సెంథిల్ బాలాజీ ఈమేరకు వివరాలను వెల్లడించారు. వివరాలు.. రాష్ట్రంలో విద్యుత్ కనెక్షన్లకు ఆధార్ నంబర్ అనుసంధానాన్ని తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఆధార్ కార్డు లింక్ చేసిన వారికే విద్యుత్ బిల్లుల చెల్లింపునకు అవకాశం కల్పిస్తామని తొలుత ప్రకటించారు. దీంతో విద్యుత్ వినియోగదారులలో ఆందోళన నెలకొంది. అదే సమయంలో సాంకేతిక సమస్యలు, ఆన్లైన్లో నమోదులో జాప్యం వంటి సమస్యలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. డిసెంబరు 31వ తేదీ వరకు వినియోగదారులకు గడువు ఇచ్చారు. అయితే శుక్రవారం నాటికి 1.63 కోట్ల మంది వినియోగదారులు మాత్రమే తమ ఆధార్‌ను అనుసంధానం చేసినట్లు వెలుగు చూసింది. దీంతో జనవరి 31వ తేదీ వరకు మరో గడువు ఇస్తున్నట్లు విద్యుత్ శాఖమంత్రి సెంథిల్ బాలాజీ ప్రకటించారు. ఇదే చివరి అవకాశం అని, ఈ నెలాఖరులోపు ఆధార్‌ను అనుసంధానించ ని పక్షంలో ఆ తదుపరి చర్యలకు వినియోగదారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. చదవండి: న్యూ ఇయర్ గిఫ్ట్ అంటూ..పాముతో కాటు వేయించుకుని మరీ చనిపోయాడు -
'ప్రేమంటే ప్రేమే!' ఆ బిల్లుపై తక్షణమే గర్వంగా సంతకం చేస్తా: జో బైడెన్
అమెరికా సెనేట్ స్వలింగ, కులాంతర వివాహాలను రక్షించడానికి సంబంధించిన కీలక బిల్లును ఆమోదించింది. ఈ బిల్లుకు 12 మంది రిపబ్లికన్లతో సహా 61 మంది సభ్యుల్లో దాదాపు 36 మంది సభ్యుల ఆమోదం లభించింది. ఈ మేరకు సెనేట్ మెజారిటీ లీడర్ చక్ షుమేర్ మాట్లాడుతూ...ఈ చట్టం చాలా కాలంగా వస్తోంది కానీ ఇప్పుడే ఆమోదం లభించింది. స్వలింగ, వర్ణాంతర వివాహాలను సమాఖ్య చట్టంలో పొందుపరిచేలా చేసింది ఈ బిల్లు. అమెరికా నిష్కళంకమైన సమానత్వం వైపు అడుగులు వేసేలా కీలకమైన బిల్లును ఆమెదించిందని అన్నారు. ఈ బిల్లు ప్రకారం యూఎస్ ఫెడరల్ ప్రభుత్వం ఇద్దరు వ్యక్తుల వివాహం చేసుకుంటే అది ఆ రాష్ట్రంలో చెల్లుబాటు అయితే కచ్చితంగా దాన్ని గుర్తించాలి. అలాగే యూఎస్ రాజ్యంగా ఆయా రాష్ట్రాల్లో జరిగిన వివాహాల గుర్తింపుకు పూర్తి హామీ ఇస్తోంది. అంతేగాక యూఎస్ రాష్ట్రాలు తమ చట్టాలకు విరుద్ధంగా వివాహా లైసెన్స్‌ను జారీ చేయాల్సిన అవసరం ఈ బిల్లుకు లేదు. ద్వైపాక్షిక ఎన్నిక ద్వారా ఈ చట్టాన్ని రూపొందించారు. అంతేగాక స్వలింగ వివాహాలను జరుపుకోవడానికి అవసరమయ్యే వస్తువులు లేదా సేవలను అందించడానికి ఇష్టపడని సంస్థలకు మతపరమైన రక్షణను అందించే సవరణ కూడా ఉంది. ఈ బిల్లు మతస్వేచ్ఛ పునరుద్ధరణ చట్టం రక్షణను తగ్గించడం లేదా రద్దు చేయడం వంటివి చేయకుండా నిరోధించే నిబంధనను కలిగి ఉంది. జూలైలో ఆమోదించిన ఈ బిల్లుపై యూఎస్ అధ్యక్షుడు జోబైడెన్ సంతకం చేసే విధంగా ఈ చట్టాన్ని రూపొందించింది. సెనేట్ నవంబర్‌లో ఎన్నికల రోజు, జనవరిలో అధికారం చేపట్టే కొత్త చట్టసభల మధ్య ఈ బిల్లును ఆమోదించింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ....ఈ ద్వైపాక్షిక ఓటును ప్రశంసించడమే కాకుండా సెనేట్ ఈ బిల్లును ఆమోందించనట్లయితే గర్వంగా ఆ బిల్లుపై సంతకం చేస్తాను. స్వలింగ సంపర్కులైన యువత తాము పూర్తి సంతోషకరమైన జీవితాలను గడిపి, స్వంత కుటుంబాలను రూపొందించుకునేలా ఈ బిల్లు చేస్తోంది. సెనేట్ రెస్పెక్ట్ ఫర్ మ్యారేజ్ యాక్ట్‌ని ఆమెదించడంతో అమెరికా ఒక ప్రాథమిక సత్యాన్ని పునరుద్ఘాటించే అంచున నిలబడి ఉంది. 'ప్రేమనేది ఎప్పటికే ప్రేమే' అమెరికన్లు తమకు నచ్చిన వారిని వివాహం చేసుకునే హక్కును కలిగి ఉండాలి. అని బైడెన్ అన్నారు. (చదవండి: చిన్నారికి అత్యవసర శస్త్ర చికిత్స...ఆ రక్తం వద్దంటూ కోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు) -
ఈ రెస్టారెంట్ బిల్ చూస్తే....వాట్? అని నోరెళ్లబెడతారు!
రెస్టారెంట్‌కి వెళ్తే బిల్ కచ్చితంగా వేలల్లోనే ఉంటుంది. ఎంతకాదనుకున్న ఒక మనిషికే ఏదో ఒక్క వైరైటీ లాగించిన.... సాధారణంగా తక్కువలో తక్కువ కనీసం రూ. 1000 నుంచి రూ. 1200ల వరకు అవుతుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే చాలా ఏళ్ల కిందట అంటే 1985ల్లోని రెస్టారెంట్ బిల్ ఒకటి నెట్టింట వైరల్ తెగ అవుతోంది. అందులో రెసిపీల ఖరీదు వింటే ఆ! అని నోరెళ్ల బెట్టకుండా ఉండరు. వివరాల్లోకెళ్తే....ఢిల్లీలో లజపతి నగర్ ప్రాంతంలో ఉన్న లాజీజ్ రెస్టారెంట్ అండ్ హోటల్ డిసెంబర్ 20, 1985 నాటి రెస్టారెంట్ బిల్‌ని ఫేస్బుక్లో షేర్ చేసింది. అందులో కస్టమర్ షాహీ పన్నీర్ , దాల్ మఖ్నీ, రైతా, కొన్ని చపాతీలు ఆర్డర్ చేశాడు. అతను ఆర్డర్‌చేసిన వాటిల్లో మొదటి రెండు రెసీపీలు రూ. 8, మిగతా రెండు రెసీపీలు ఒక్కొక్కటి రూ. 5, నుంచి రూ. 6 రూపాయాలు మాత్రమే. మొత్తం బిల్ కేవలం అక్షరాల రూ. 26\-రూపాయలే. ప్రస్తుతం ఈ ఖరీదుకి ఒక చిప్స్ పాకెట్ మాత్రమే కొనుక్కోగలం. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా అందరూ వాట్ ఇది నిజమేనా! అని షాక్ అయ్యారు. నెటజన్లంతా ఔను నాటి కాలంలో పెట్రోల్ ధర, జీతం కూడా తక్కువగానే ఉన్నా అందరూ ఎంతో సంతోషంగా ఉండేవారు అంటూ నాటి రోజులను గుర్తు తెచ్చుకున్నారు. (చదవండి: ఘోస్ట్ పేషెంట్‌తో మాట్లాడుతున్న సెక్యూరిటీ గార్డు) -
ఖరీదైన రెస్టారెంట్.. బిల్లుచూసి కళ్లు తేలేసిన నెటిజన్లు.. ఏకంగా రూ.1.3 కోట్లు!
టర్కీకి చెందిన ప్రముఖ చెఫ్ నుస్రెత్ గోక్సె.. 'సాల్ట్ బే'గా చాలామందికి సుపరిచితమే. రెస్టారెంట్లో ఆహార పదార్థాలపై మోచేతి పైనుంచి ఉప్పుచల్లే ఈయన తీరుతో బాగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు పలు దేశాల్లో రెస్టారెంట్లు కూడా నిర్వహిస్తున్నారు. వీటిలో ధర కాస్త ఎక్కువే. గతేడాది లండన్‌లో ఈయన రెస్టారెంట్‌లోని ధరలు చూసి అందరూ అవాక్కయ్యారు. మరీ ఇంత ఎక్కువా అని వాపోయారు. ఇప్పుడు అబుధాబిలోని సాల్ట్ బేకు చెందిన నుస్రే-ఈటీ రెస్టారెంట్లో ఓ బిల్లు చూసి నెటిజన్లు కంగుతిన్నారు. ఈ బిల్లు మొత్తం 6,15,065 దిర్హాంలు. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే.. అక్షరాలా రూ. కోటి 30 లక్షలు. మొత్తం 10 మంది కలిసి అబుధాబిలోని సాల్ట్ బే రెస్టారెంట్‌కు వెళ్లారు. ఎక్కువగా ఆల్కహాలే ఆర్డర్ చేశారు. అందులో చాలా ఫేమస్ అయిన పిట్రస్ వైన్ కూడా ఉంది. 2009 నాటి ఈ వైన్‌కే దాదాపు రూ.కోటి రూపాయల బిల్లు అయింది. ఇతర ఫుడ్, వ్యాట్‌తో కలిపి మొత్తం రూ.1.3 కోట్ల బిల్లు అయింది. ఈ బిల్లు రషీదును స్వయంగా తన ఇన్స్టాగ్రాం ఖాతాలో షేర్ చేశాడు సాల్ట్ బే. 'నాణ్యత ఎప్పుడూ ఖరీదైనది కాదు'ని రాసుకొచ్చాడు. దీంతో నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చింది. మరీ ఆ రేంజ్లో ధరలు ఏంటని సాల్ట్బేను కొందరు ఏకిపారేశారు. కొంతమందైతే అతడ్ని అన్‌ఫాలో కూడా చేశారు. ఎందుకంత ధర..? అయితే ఈ బిల్లులో ఫ్రెంచ్ ఫ్రైస్ ధర 45 డాలర్లు(రూ.3,600)గా ఉంది. దీంతో ఓ నెటిజన్.. బంగాళాదుంపలు ఏమైనా చంద్రుడిపై కాస్తున్నాయా? ఎందుకంత ధర అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. హైన్కీన్ బీరు ధర కూడా 55 డాలర్లుగా ఉంది. ఇది ఒక్క బీరు ధరా? లేక 12 బీర్ల ప్యాక్కా? అని ఓ యూజర్ సెటైర్లు వేశాడు. మరో నెటిజన్ అయితే.. సాల్ట్ బేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. నవ్వు పేద కుటుంబంలో పుట్టి ఎంతో కష్టపడి స్వతహాగా ఈ స్థాయికి చేరుకున్నావు. నిన్ను చాలా మంది ఆదర్శంగా తీసుకుంటారు. కానీ నీ రెస్టారెంట్లో ధరలు ఇంత ఎక్కువగా ఎందుకున్నాయి. కేవలం సంపన్నుల కోసమేనా. నువ్వు చెఫ్ కాదు చీప్ అంటూ ఫైర్ అయ్యాడు. మరోవైపు సాల్ట్ బే మాత్రం ఈ బిల్లుపై వస్తున్న విమర్శలు అసలు పట్టించుకోలేదు. తన స్టయిల్లోనే ముందుకు సాగుతున్నాడు. ఓ స్టీక్కు(కాల్చిన మాంసం ముద్ద) గోల్డ్ కోట్ చేసి ఉన్న ఫోటో షేర్ చేశాడు. ఫెడరల్ బ్యాంక్ 24 క్యారట్ల బంగారంతో ఈ స్టీక్కు కోటింగ్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో నెటిజన్లు మరోసారి షాక్ అయ్యారు. చదవండి: కిక్కిరిసిన అభిమానులు.. భయానక పరిస్థితి.. కొంచెం అటు ఇటు అయినా.. -
కొత్త డేటా ప్రైవసీ చట్టం.. ముసాయిదాలోని ముఖ్యాంశాలు ఇవే!
న్యూఢిల్లీ: వ్యక్తిగత డేటాను నిర్దిష్ట దేశాలకు బదిలీ చేసేందుకు, అక్కడ నిల్వ చేయడానికి అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త డేటా ప్రైవసీ చట్టం ముసాయిదాను ప్రవేశపెట్టింది. ఇందుకోసం భారత్‌కు వెలుపల ఏయే దేశాలు, ప్రాంతాలను ఎంచుకోవచ్చనేది నోటిఫై చేయనుంది. అలాగే సంబంధిత నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 500 కోట్ల వరకు జరిమానా విధించనుంది. శుక్రవారం ఈ మేరకు డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ (డీపీడీపీ) బిల్లు 2022 ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. దీనిపై డిసెంబర్ 17లోగా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. భారత్‌కు సంబంధించిన డేటాను దేశీయంగానే నిల్వ చేయాలంటూ గత బిల్లులో చేసిన ప్రతిపాదనలు పలు దిగ్గజ టెక్ కంపెనీల్లో ఆందోళన కలిగించిన సంగతి తెలిసిందే. తాజా మార్పులతో గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ వంటి సంస్థలకు ఊరట లభించనుంది. పార్లమెంటు ఆమో దం పొందాక ముసాయిదా బిల్లు .. చట్టంగా మారుతుంది. వ్యక్తిగత డేటా విషయంలో ఒకవైపు వ్యక్తుల హక్కులు, బాధ్యతలను మరోవైపు డేటా సేకరించే సంస్థల బాధ్యతలను స్పష్టంగా నిర్వచిస్తూ ఈ బిల్లును రూపొందించినట్లు ముసాయిదాలో పేర్కొన్నారు. చట్టబద్ధత, పారదర్శకత తదితర ఏడు సూత్రాల ప్రాతిపదికన బిల్లును తయారు చేసినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ వివరించింది. ‘పౌరుల డేటా రక్షణ, పరిశ్రమకు వ్యాపారాల నిర్వహణ సులభతరం చేయడం, దేశ భద్రత.. ప్రజా ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యాలకు అనుగుణంగా బిల్లు రూపొందింది‘ అని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. వివాదాస్పద అంశాలు తొలగించి డేటా బిల్లును సరళతరం చేశారని న్యాయ సేవల సంస్థ జేఎస్ఏ పార్ట్నర్ రూపీందర్ మాలిక్ పేర్కొన్నారు. ముసాయిదాలోని ముఖ్యాంశాలు.. ► వ్యక్తిగత డేటాను సేకరించే ముందు వ్యక్తుల సమ్మతి తీసుకోవాలి. సదరు డేటాను షేర్ చేయడం, మార్చడం, ధ్వంసం చేయడం వంటి అంశాలకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించిన పక్షంలో డేటాను సేకరించిన వ్యక్తులు, కంపెనీలపై రూ. 500 కోట్ల వరకూ జరిమానా విధించవచ్చు. 2019లో జారీ చేసిన గత ముసాయిదాలో ఈ పెనాల్టీని రూ. 15 కోట్లు లేదా కంపెనీ గ్లోబల్ టర్నోవరులో 4% (ఏది ఎక్కువైతే అది)గా ప్రతిపాదించారు. ► అలాగే ఏదైనా పత్రం, సర్వీసు, గుర్తింపు ధ్రువీకరణ లేదా చిరునామా ధ్రువీకరణ కోసం దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇచ్చే వ్యక్తులపై రూ. 10,000 జరిమానా విధించవచ్చు. ► దేశ సార్వభౌమత్వం, సమగ్రత కాపాడేందుకు రాష్ట్ర ఏజెన్సీలకు బిల్లులోని నిబంధనల నుంచి మినహాయింపునిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. ► కంపెనీలు తాము సేకరించిన డేటాను నిర్దిష్ట వ్యవధి వరకే నిల్వ చేసుకోవచ్చు. ► డేటా సేకరించే సేకరించే సంస్థలు.. నిబంధనల పాటింపు కోసం డేటా రక్షణ బోర్డును ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ల నుండి వచ్చే ఫిర్యాదులను కూడా ఈ బోర్డు వినాలి. ► యూజర్లు తమ సమ్మతిని తెలియజేసేందుకు, సమీక్షించుకునేందుకు, ఉపసంహరించుకునేందుకు ఆయా కంపెనీలు పారదర్శకమైన ప్లాట్‌ఫాంను అందుబాటులో ఉంచాలి. ► వ్యక్తిగత డేటాను సరిచేసుకునేందుకు, తొలగించేందుకు యూజర్లకు హక్కులు ఉంటాయి. ► తల్లిదండ్రుల సమ్మతి లేకుండా పిల్లల వ్యక్తిగత డేటాను సేకరించకూడదు. ప్రాసెస్ చేయకూడదు. పిల్లలను లక్ష్యంగా చేసుకునే ప్రకటనలు ఇవ్వకూడదు. ► భారీ కంపెనీలు తాము ప్రాసెస్ చేసే డేటా పరిమాణాన్ని బట్టి .. నిబంధనల పాటింపును మదింపు చేసేందుకు స్వతంత్ర డేటా ఆడిటర్‌ను నియమించుకోవాలి. ► డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసే ప్రతిపాదన ముసాయిదాలో ఉంది. ఇది నిబంధనల ఉల్లంఘన కేసులను విచారణ చేసి, తగు నిర్ణయాలు తీసుకుంటుంది. ► వ్యక్తిగత డేటాను స్వయంగా లేదా డేటా ప్రాసెసర్లతో ప్రాసెస్ చేసే డేటా ఫిడ్యుషియరీ సంస్థలకు వివిధ రకాల జరిమానాలుంటాయి. చదవండి: ‘కూతురు పుట్టిందని కోట్ల జీతం కాదన్నాడు’..మనసును హత్తుకునే ఓ తండ్రి కూతురు కథ -
గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్.. లేఖపై మంత్రి సబిత కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి గవర్నర్ నుంచి లేఖ వచ్చిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, గవర్నర్‌ను కలవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. అపాయింట్మెంట్ కోరాం.. ఇంకా ఖరారు కాలేదన్నారు. గవర్నర్‌ను కలిసి ఆమె సందేహాలను నివృత్తి చేస్తామన్నారు. కాగా, తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై లేఖ రాసిన విషయం తెలిసిందే. యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుపై రాజ్‌భవన్‌కు వచ్చి విద్యాశాఖ మంత్రి చర్చించాలని సూచించారు. ప్రభుత్వంతో పాటు యూజీసీకి కూడా గవర్నర్ లేఖ రాశారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా రిక్రూట్మెంట్ చెల్లుబాటు అవుతుందా అని యూజీసీ అభిప్రాయాన్ని గవర్నర్ కోరారు. మూడేళ్లుగా ఖాళీలు భర్తీ చేయాలని చెబుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవలేదని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త విధానంలో న్యాయపరమైన సమస్యలు వస్తే ఖాళీల భర్తీ మరింత ఆలస్యమవుతుందని గవర్నర్ పేర్కొన్నారు. చదవండి: మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు -
అసలేం జరుగుతోంది?.. ముదురుతున్న వివాదం.. సబిత వ్యాఖ్యలపై స్పందించిన రాజ్‌భవన్
సాక్షి, హైదరాబాద్: పెండింగ్ బిల్లులపై వివాదం ముదురుతోంది. యూనివర్శిటీ బిల్లు విషయంలో తనకు ఎలాంటి సమాచారం రాలేదన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలపై రాజ్‌భవన్ వర్గాలు స్పందించాయి. గవర్నర్ నుంచి లేఖ రాలేదనడం సరికాదని, యూనివర్శిటీల బిల్లు వ్యవహారంపై మెసెంజర్ ద్వారా నిన్ననే(సోమవారం) సమాచారం ఇచ్చామని రాజ్‌భవన్ పేర్కొంది. చదవండి: తెలంగాణలో పొలిటికల్ హీట్.. ప్రధాని మోదీ పర్యటనపై వివాదం కాగా, ‘తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు–2022’ విషయంలో పలు సందేహాలు ఉన్నాయని.. దీనిపై రాజ్‌భవన్‌కు వచ్చి తనతో చర్చించాలని విద్యాశాఖ మంత్రికి సోమవారం గవర్నర్ లేఖ రాశారు. వర్సిటీల్లో పోస్టుల భర్తీకి ఇప్పుడున్న విధానంలో ఇబ్బందులేమిటని.. కొత్త విధానంతో న్యాయపరమైన చిక్కులు వస్తే ఎలాగని ప్రశ్నించారు. కొంతకాలం నుంచి రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో గవర్నర్ తమిళిసై లేఖలు చర్చనీయాంశంగా మారాయి. యూనివర్సిటీల బిల్లుకు సంబంధించి విద్యా మంత్రికి రాసిన లేఖలో గవర్నర్ పలు సందేహాలు లేవనెత్తారు. ఈ క్రమంలో ప్రగతిభవన్, రాజ్‌భవన్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే పరస్పరం బహిరంగ ఆరోపణలు, విమర్శలు వినవస్తున్నాయి. ఇప్పుడీ విభేదాలు ముదిరినట్టుగా కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. గతంలో నామినేటెడ్ ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా.. గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టడంతో విభేదాలు బయటపడ్డాయి. సమ్మక్క–సారక్క జాతరకు వెళ్లేందుకు గవర్నర్ హెలికాప్టర్ కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం వివాదంగా మారింది. తర్వాత గణతంత్ర వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం రాజ్‌భవన్‌కే పరిమితం చేసి సాదాసీదాగా నిర్వహించడం పట్ల గవర్నర్ బహిరంగంగానే విమర్శలు చేశారు. -
ఏ ‘వెలుగులకు’ ఈ కొత్త చట్టం?
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత విద్యుత్ చట్టంలో మార్పులు చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది. 2014 నుంచీ జరుగుతున్న ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు బ్రేకులు పడుతున్నప్పటికీ ఈ దఫా మాత్రం 2003 నాటి విద్యుత్ చట్టంలో మార్పులు చేయాలనే పట్టుదలను కేంద్రం కనబరుస్తోంది. ప్రధానంగా విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్నాయనీ, దాని నుంచి బయటపడవేసేందుకే ఈ కొత్త చట్టమనే అభిప్రాయాన్ని కేంద్ర విద్యుత్‌శాఖ పెద్దలు చెబుతున్నారు. ఇది అంతి మంగా డిస్కంలను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసేందుకేనని ప్రతిపక్షాలు, రైతు సంఘాలు, విద్యుత్ ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్ అంశంపై కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్ బిల్లు–2022పై మరింత చర్చ జరగాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. విద్యుత్ చట్టం–2003లో మార్పులు చేస్తూ కొత్త చట్టాన్ని తెచ్చేందుకు 2014 నుంచీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై గతంలోనే కేంద్రం ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గారు. 2019లో కూడా మరోసారి ప్రయత్నం జరిగింది. మెజార్టీ రాష్ట్రాలు, విద్యుత్ ఉద్యో గులు, రైతు సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో మరోసారి కేంద్రం వెనక్కి తగ్గింది. ఇప్పుడు మాత్రం వ్యతిరేకతను లెక్క చేయకుండా చట్టం చేసేందుకు కేంద్రం ప్రయత్నించింది. మరోసారి అదే వ్యతిరేకత వచ్చిన ఫలితంగా పార్లమెంటులో ప్రవేశపెట్టిన ముసాయిదా విద్యుత్ (సవరణ) బిల్లు –2022 కాస్తా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చెంతకు చేరింది. అయినప్పటికీ గెజిట్ల జారీ ద్వారా తాను చేయాలనుకున్న మార్పులను చేస్తూ కేంద్రం ముందుకే అడుగులు వేస్తోంది. దేశంలోని డిస్కంల ఆర్థిక పరిస్థితి, విద్యుత్ ఉత్పత్తి సంస్థ (జెన్కో)లకు చెల్లించాల్సిన బకాయిల వ్యవహారం కేంద్రానికి కొత్త మార్పులకు ఊతమిస్తోందని చెప్పకతప్పదు. 1998–99 నుంచి విద్యుత్ రంగంలో తెచ్చిన కాలానుగుణ సంస్కరణలు డిస్కంలు, జెన్ కోలను కాపాడలేకపోయావనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యం. దేశ వ్యాప్తంగా 57 డిస్కంలు ఏకంగా 1.40 లక్షల కోట్ల మేర అప్పుల్లో ఉన్నాయి. ఇందులో ఆయా ప్రభుత్వాలు ఇవ్వాల్సిన సబ్సిడీ మొత్తం రూ.76 వేల కోట్లు ఉండగా... మిగిలిన 64 వేల కోట్ల మేర ఆయా ప్రభుత్వశాఖలు చెల్లించాల్సిన విద్యుత్ బిల్లుల బకాయిలు. అయితే, విద్యుత్‌ను తీసుకున్నందుకుగానూ విద్యుత్ ఉత్పత్తి సంస్థ(జెన్కో)లకు డిస్కంలు రూ.1.10 లక్ష కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. అటు డిస్కంలు, ఇటు జెన్కోలను కాపాడే ఉద్దేశ్యంతోనే ఈ కొత్త చట్టం తెస్తున్నామనేది కేంద్ర పెద్దల ఉవాచ. విద్యుత్ పంపిణీ రంగంలో కేవలం ఒకరే కాకుండా ఎక్కువ మంది ఉండాలనీ, తద్వారా డిస్కంలలో పోటీతత్వంతో పాటు వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందుతాయనీ కేంద్రం చెబుతోంది. అందుకే డిస్కంలల్లో ప్రైవేటీకరణకు తాజా చట్టం తెరలేపింది. ఇప్పటికే ఢిల్లీ, ముంబైల్లో ప్రైవేటు డిస్కంలు సేవలందిస్తు న్నాయి. ఇక ఒడిశాలో ఏకంగా 4 ప్రైవేటు డిస్కంలు విద్యుత్ పంపిణీ రంగంలో పనిచేస్తున్నాయి. అయితే, మరింత విస్తృతంగా కొత్త నెట్ వర్క్ అవసరం లేకుండానే ప్రస్తుతం ఉన్న నెట్‌వర్క్‌లోనే ప్రైవేటు డిస్కంలకు తలుపులు తెరిచేందుకే కొత్త చట్టం వస్తోందని తెలు స్తోంది. దీనితో పాటు కొత్త చట్టంలో మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయని విద్యుత్‌రంగ నిపుణులు చెబుతున్నారు. అవి: 1. విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) చైర్మన్, సభ్యుల నియామకానికి త్రిసభ్య కమిటీ స్థానంలో నలుగరు సభ్యుల కమిటీని ముసాయిదా బిల్లు ప్రతిపాదించింది. కొత్తగా కేంద్ర ప్రభుత్వ ప్రతి నిధి ఇందులో భాగస్వామ్యం కానున్నారు. తద్వారా రాష్ట్రాల హక్కుల్లో కేంద్రం తలదూర్చనుందన్న విమర్శలు వస్తున్నాయి. 2.ఒక రాష్ట్రం కాకుండా 2,3 రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్‌ను రాష్ట్రాల ఈఆర్సీలు కాకుండా కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈ ఆర్సీ) ఇవ్వనుంది. తద్వారా రాష్ట్రాల ఈఆర్సీల పాత్ర నామ మాత్రంగా మారనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 3.విద్యుత్ కొనుగోళ్లకు అయ్యే వ్యయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత సమయంలోగా చెల్లించకపోతే నేరుగా విద్యుత్ సరఫరాను నిలిపివేసే అధికారం జాతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్ఎల్డీసీ)ల చేతుల్లోకి వెళ్లనుంది. తద్వారా రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ల (ఎస్ఎల్డీసీ) అధికారం కుంచించుకుపోనుందన్న ఆందోళన నెలకొంది. 4. ప్రస్తుతం ఉన్న చట్టంలో యూనివర్సల్ సప్లై ఆబ్లిగేషన్ అనే నిబంధన ఉంది. ఒక రైతు కోసం కూడా కొత్తగా లైన్ల అవసరం ఏర్పడితే డిస్కంలు వేయా ల్సిందే. తాజా చట్టంలో ఈ ఆబ్లిగేషన్‌ను తొలగించారు. తద్వారా సామాన్య వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందన్న అభిప్రాయం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ చట్టంపై మరింత లోతైన చర్చ జరగాల్సిందేనన్న వైఎస్సార్సీపీ అభిప్రాయా నికి సానుకూల స్పందన వస్తోంది. అనుమానాలు నిజమేనా? ప్రస్తుతం అమలులో ఉన్న విద్యుత్ చట్టం–2003లో రూపొందిం చారు. కాలక్రమంలో ఈ చట్టంలో కొన్ని మార్పులు చేసినప్పటికీ పూర్తిస్థాయిలో సవరణలు చేసి కొత్త బిల్లును తెరమీదకు తెచ్చింది ఇప్పుడే. అంటే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత విద్యుత్‌రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త బిల్లు ముందుకు వచ్చిందనే భావన వ్యక్తమవుతోంది. అయినప్పటికీ బిల్లులోని కొన్ని అంశాలు కేంద్ర వైఖరిపై అనుమానం వ్యక్తం చేసే విధంగానే ఉన్నాయి. విద్యుత్ చట్టం 2003 ప్రకారం సెక్షన్ 14, 42లల్లో ఏమని పేర్కొన్నారంటే... ‘‘విద్యుత్ సరఫరా, పంపిణీ, ట్రేడింగ్ కోసం ఏ సంస్థకైనా, ఏ వ్యక్తికైనా సంబంధిత కమిషన్ లైసెన్స్‌ను జారీచేస్తుంది. డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ పొందిన సంస్థ లేదా వ్యక్తులు తమ పరిధిలోని వినియోగ దారుల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ పంపిణీ నెట్వర్క్ (విద్యుత్ లైన్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు (డీటీఆర్) వగైరా)ను సొంతంగా అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది.’’ అయితే, కొత్త బిల్లులో ఈ రెండు క్లాజ్‌లలో మార్పులు చేస్తున్నారు. ఎటువంటి లైసెన్సు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేకపోవడంతో పాటు, ఇప్పటికే ప్రభుత్వరంగ డిస్కంల పరిధిలో ఉన్న విద్యుత్ పంపిణీ నెట్‌వర్క్‌ను ఉపయోగించే వెసులుబాటును కల్పించారు. ఈ రెండు క్లాజులలో చేయనున్న మార్పులను గమనిస్తే ప్రైవేటు సంస్థలకు విద్యుత్ పంపిణీ రంగంలోకి బార్లా తలుపులు తెరుస్తున్నారన్న విమర్శ వినిపిస్తోంది. ప్రస్తుతం మునిసిపాలిటీ/ జిల్లా పరిధిలో మాత్రమే ప్రైవేటు డిస్ట్రిబ్యూషన్ లైసెన్సులకు అవకాశం ఉండేది. తాజాగా సెప్టెంబరు 8వ తేదీ కేంద్రం విడుదల చేసిన గెజిట్‌లో మాత్రం మునిసిపాలిటీ/ మూడు జిల్లాలతోపాటు ఏదైనా పేర్కొన్న చిన్న ప్రాంతంలో కూడా విద్యుత్ పంపిణీ లైసెన్సును పొందే అవకాశం ఉందని పేర్కొంది. ((తద్వారా కేంద్రం తాజా అడుగులు మరింత ఆందోళనను పెంచే విధంగానే ఉన్నాయని చెప్పకతప్పదు.)) విస్తృత చర్చ జరగాల్సిందే! ఏడవ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా 52 అంశాలు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. ఈ జాబితాలోని అంశాలపై అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రాలకూ అధికారం ఉంటుందని భారత రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. ఈ జాబితాలో విద్య, ధరల నియంత్రణ, ఫ్యాక్టరీలు, బాయిలర్స్ వంటి అంశాలతో పాటు విద్యుత్ కూడా ఒక అంశం. ఈ ఉమ్మడి జాబితాలోని అంశాలపై ఏవైనా మార్పు చేర్పు లతో పాటు కొత్త చట్టాలు చేసే సమయంలో రాష్ట్రాల అభిప్రాయం కూడా కేంద్రం తీసుకోవడం పరిపాటి. ముసాయిదా విద్యుత్ (సవ రణ) నిబంధనలు–2022 విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరుపై అనేక పార్టీలు గుర్రుమంటున్నాయి. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్ అంశంపై కొత్త చట్టం తెస్తున్న నేపథ్యంలో దీనిపై విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించింది. ప్రతిపాదించిన బిల్లులో ఉన్న లోపాలు, చేయాల్సిన మార్పులపై కూడా తన అభిప్రాయాన్ని పార్లమెంటు సాక్షిగా వెల్లడించింది. భిన్న అభిప్రాయాలు, అనుమానాల నేపథ్యం లోనే పార్లమెంటులో ఆగస్టు 8న కేంద్రం ఈ ముసాయిదాను ప్రవేశ పెట్టింది. ప్రతిపక్ష పార్టీల నుంచి వచ్చిన ఒత్తిళ్లతో చివరకు విద్యుత్‌పై పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ముందు ఉంచనున్నట్టు కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్కే సింగ్ వెల్లడించారు. దీంతో వివాదం కాస్తా తాత్కాలికంగా సద్దుమణిగింది. విశాల ప్రజానీకంలో నెలకొన్న సందే హాల నివృత్తి తర్వాతే కేంద్రం ముందుకు వెళితే ఆమోదయోగ్యంగా ఉంటుంది. – కె.జి. రాఘవేంద్రారెడ్డి సీనియర్ జర్నలిస్ట్ -
Tele-Communications Bill 2022: ఇంటర్నెట్ కాలింగ్, మెసేజింగ్ సేవలకూ లైసెన్స్
-
పౌరుల డేటా గోప్యతపై త్వరలోనే బిల్లు సిద్ధం : నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: దేశాభివృద్ధి, ఉపాధి కల్పనే కేంద్రం ముందున్న ప్రధాన లక్ష్యాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్ట చేశారు. ద్రవ్యోల్బణం దారికొస్తోందని, దీనిపై దీర్ఘకాలంపాటు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండబోదని కూడా ఈ సందర్భంగా విశ్లేషించారు. రికార్డు గరిష్ట స్థాయిల నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం దిగివస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వృద్ధి, దేశ సంపద ఫలాలు అందరికీ సమానంగా అందేలా చర్యలు తీసుకోవడమే ప్రభుత్వం ముందున్న ప్రాధాన్యతా అంశంగా పేర్కొన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీని కట్టడే లక్ష్యంగా మే నుంచి ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు–రెపోను 1.4 శాతం (ప్రస్తుతం 5.4 శాతానికి పెరుగుదల) పెంచిన నేపథ్యంలో సీతారామన్ చేసిన వ్యాఖ్యలు గమనార్హం. రెపో రేటు పెంపునకు తక్షణం ఇక ముగింపు పడినట్లేనా అన్న సందేహాలకు ఆమె ప్రకటన తావిస్తోంది. ‘ఇండియా ఐడియాస్ సమ్మిట్’లో ఈ మేరకు ఆమె చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... ►రిటైల్ ద్రవ్యోల్బణం కొద్ది నెలలుగా దిగివస్తోంది. దీనిని మనం నిర్వహించగలిగిన స్థాయికి తీసుకురాగలుగుతున్నాం. ఇప్పుడు ప్రధాన ప్రాధాన్యతలు ఉపాధి కల్పన, వృద్ధికి ఊపును అందించడం. (ఆర్బీఐ కఠిన పాలసీ విధానం, సరఫరాల సమస్య పరిష్కారానికి కేంద్రం చర్యల నేపథ్యంలో రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా రెండవనెల జూలైలోనూ తగ్గి 6.71 శాతానికి చేరింది. ఏప్రిల్‌లో 7.79 శాతం, మేలో 7.04 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో 7.01 శాతానికి దిగివచ్చింది. నిజానికి రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం లోపు ఉండాలి. అయితే ఏడు నెలలుగా 6 శాతం ఎగువనే కొనసాగుతున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.7 శాతంగా అంచనా వేయగా, వరుసగా 2,3,4 (2022 జూలై–మార్చి 2023) త్రైమాసికాల్లో 7.1 శాతం, 6.4శాతం, 5.8శాతాలుగా నమోదవుతాయని ఆర్బీఐ పాలసీ అంచనావేసింది. 2023– 24 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 5 శాతానికి ఇది దిగివస్తుందని భావించింది. ► అమెరికన్ సెంట్రల్ బ్యాంక్– ఫెడ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ దూకుడు రేట్ల పెంపు వైఖరి నుండి ఉద్భవిస్తున్న అస్థిరతను ఎదుర్కొనే విషయంలో రిజర్వ్ బ్యాంక్ తగిన చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నాం. భారత్ ద్రవ్య విధానాన్ని పెద్ద అవాంతరాలు లేదా తీవ్ర ఒడిదుడుకులు లేకుండా నిర్వహించగలమన్న ఆర్బీఐ అధికారులు విశ్వసిస్తున్నారు. ►కోవిడ్–19 కాలంలో కేంద్రం ఆర్థిక నిర్వహణ పటిష్టంగా ఉంది. లక్ష్యంతో కూడిన ఆర్థిక విధానంతో భారత్ డబ్బును ముద్రించకుండా సవాళ్లతో కూడిన సమాయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంది. ►రష్యా–ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఏర్పడిన ప్రపంచ ఇంధన సంక్షోభ వల్ల ముడి చమురు, సహజ వాయువు లభ్యతపై అనిశ్చితి కొనసాగుతోంది. ►చెల్లింపులకు సంబంధించి సాంకేతికతతో సహా అన్ని ఆర్థిక అంశాలకు సంబంధించి భారత్– అమెరికాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. భారత్, అమెరికాలు కలిసి పని చేస్తే, మనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో 30 శాతానికి చేరుకుంటాం. రాబోయే 20 సంవత్సరాలలో ప్రపంచ జీడీపీలో 30 శాతం వాటాను అందిస్తాము. ఈ పరిస్థితి భారత్–అమెరిలను ప్రపంచ వృద్ధికి ఇంజిన్‌గా మారుస్తుంది. ►భారత్ డేటా డేటా గోప్యత, రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. కేంద్రం కొత్త డేటా గోప్యతా బిల్లును త్వరలో పార్లమెంటులో ప్రవేశపెడుతుంది. ►అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో భారత్ ఈ సంవత్సరం చివర్లో జీ–20 దేశాల అధ్యక్ష బాధ్యతల ను తీసుకోనుంది. డిసెంబర్ 1నుంచి 2023 న వంబర్ 30 వరకూ నిర్వహించే ఈ బాధ్యతల స మయంలో భారత్ ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాల సవాళ్ల పరిష్కారంపై దృష్టి పెడుతుంది. ఐఎంఎఫ్ కోటా సమీక్ష సకాలంలో జరగాలి... కాగా, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థలో కోటాల 16వ సాధారణ సమీక్ష (జీఆర్‌క్యూ) సకాలంలో ముగించాల్సిన అవసరం ఉందని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడానికి ఇది ఎంతో అవసరమని సీతారామన్ పేర్కొన్నారు. ఐఎంఎఫ్ కోటా వ్యవస్థ బహుళజాతి రుణ సంస్థలో దేశాల ఓటింగ్ షేర్‌కు సంబంధించిన అంశం. ప్రస్తుతం ఐఎంఎఫ్‌లో భారతదేశ కోటా 2.75 శాతం. చైనా కోటా 6.4 శాతం కాగా, అమెరికా కోటా 17.43 శాతం. ఐఎంఎఫ్ తీర్మానం ప్రకారం, కోటాలకు సంబంధించి 16వ సాధారణ సమీక్ష 2023 డిసెంబర్ 15వ తేదీలోపు ముగియాలి. వర్థమాన దేశాల అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యత లభించేలా కోటా షేర్లలో సర్దుబాటు జరగాలని, వాటి ఓటింగ్ హక్కులు పెరగాల్సిన అవసరం ఉందని భారత్ డిమాండ్ చేస్తోంది. జీ20 బాధ్యతలు స్వీకరించనున్న భారత్‌తో పలు అంశాలపై చర్చించడానికి దేశంలో పర్యటిస్తున్న ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టాలినా జార్జివాతో సమావేశం అనంతరం కోటా అంశంపై సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. -
టాయిలెట్ బిల్లుకు జీఎస్టీ ఘటన!! ఐఆర్సీటీసీ వివరణ
ఢిల్లీ: జీఎస్టీ.. దేశంలో ఇదొక హాట్ టాపిక్ అయిపోయింది. నిత్యావసరాల మొదలు.. చాలావాటిపై కేంద్రం జీఎస్టీ వడ్డన చేయడంతో.. సోషల్‌మీడియాలోనూ విపరీతమైన విమర్శలు వినిపించాయి. తాజాగా టాయిలెట్‌కు వెళ్లినా ఫారినర్లకు భారీ బిల్లుతో పాటు అందులో జీఎస్టీ సైతం పడడంతో కంగుతిన్నారు. దేశ రాజధానిలోనే ఈ ఘటన జరిగింది. ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్లో వాష్ రూమ్‌ని వాడుకున్నందుకు ఇద్దరు విదేశీ పర్యాటకులు భారీ బిల్లు ఫ్లస్ జీఎస్టీ చెల్లించాల్సి వచ్చింది. అయితే వారిని రిసీవ్ చేసుకునేందుకు వచ్చిన గైడ్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. బ్రిటిష్ ఎంబసీ నుంచి విదేశీయులిద్దరూ గతిమాన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్లో దిగారు. వాళ్లను శ్రీవాస్తవ అనే గైడ్ రీసివ్ చేసుకున్నాడు. అయితే.. స్టేషన్లో దిగిన వెంటనే ఫ్రెష్ అవ్వాలనుకున్నారు. దీంతో స్టేషన్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లోకి తీసుకెళ్లారు శ్రీవాస్తవ. కేవలం ఐదు నిమిషాల్లో వాళ్లు వాష్‌రూమ్ నుంచి బయటకు వచ్చారు. సాధారణంగా ఐదు, పది రూపాయలు.. మహా అయితే రూ. 20 ఇవ్వాల్సి వస్తుందని శ్రీవాస్తవ భావించారు. కానీ, అక్కడి రిసెప్షనిస్ట్.. రూ. 224 బిల్లు చేతిలో పెట్టడంతో.. ఆయన షాక్ అయ్యారు. ఐదు నిమిషాల పాటు వాష్ రూం వాడుకున్నందుకు ఒక్కొక్కరి బిల్లు రూ. 100లు వేశారు. పైగా దానిపై జీఎస్టీ రూ. 12 జత చేశారు. అలా వారిద్దరికీ కలిపి రూ. 224 బిల్లు అయింది. అంత చెల్లించేందుకు మొదట వాళ్లు ఒప్పుకోలేదు. కానీ, సిబ్బంది ఒత్తిడితో చివరికి చెల్లించాల్సి వచ్చింది. ఈ ఘటనపై ఐఆర్సీటీసీ ప్రతినిధి బ్రజేష్ కుమార్ ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లోకి ప్రవేశానికి ప్రత్యేక చార్జ్ ఉందని, దానిపై జీఎస్టీ పడుతుందని చెప్పారు. అంతేకాదు లాంజ్‌లో ఉన్నంతసేపు టూరిస్టులు, ఫారినర్లు ఫ్రీగా వైఫై వాడుకోవచ్చని, కాంప్లిమెంటరీగా కాఫీ కూడా ఇస్తామని చెప్పుకొచ్చారు. అయితే దీనిపై గైడ్ శ్రీవాస్తవ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జనరల్ కోచ్‌లో ఆగ్రా నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తే టికెట్ రూ. 90 రూపాయలు మాత్రమేనని, కానీ స్టేషన్లో వాష్‌రూం వినియోగించుకున్నందుకు రూ. 112 చార్జ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతిథి దేవో భవ పిలుపును ఐఆర్సీటీసీ అవమానిస్తోందని, ఇలా చేయడం వల్ల విదేశీయులు ఇక్కడి వ్యవస్థలపై తప్పుడు అభిప్రాయం ఏర్పరుచుకునే ప్రమాదం ఉందని, ఈ వ్యవహారంపై టూరిజం శాఖలో ఫిర్యాదు చేస్తానన్నారు. ఇదీ చదవండి: గుండెల్ని పిండేస్తున్న వీడియో.. స్పందించిన గడ్కరీ కార్యాలయం -
ఆర్బిట్రేషన్ సెంటర్ బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు
సాక్షి, ఢిల్లీ: ఆర్బిట్రేషన్ సెంటర్ బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించింది. సోమవారం ఈ బిల్లుపై చర్చ సందర్భంగా.. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడారు. ఆర్బిట్రేషన్ కేవలం కార్పొరేట్ల కంపెనీలకే పరిమితం కాకూడదన్న ఆయన.. కింది స్థాయి లో కూడా ఆర్బిట్రేషన్ వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడ్డారు. కింద స్థాయిలో ఎన్నో కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్న సంగతిని వైఎస్సార్సీపీ ఎంపీ గుర్తు చేశారు.


