రాజధాని వికేంద్రీకరణతోనే సమగ్రాభివృద్ధి: బుగ్గన

AP Finance Minister Buggana Rajendranath Introduced Three Capitals Withdrawal Bill In Assembly - Sakshi

ఏపీ అభివృద్ధి చెందాలంటే అన్ని ప్రాంతాలకు భాగస్వామ్యం ఉండాలి

పలు రాష్ట్రాల్లో రాజధానిలో కాకుండా ఇతర చోట్ల కేంద్ర సంస్థల ఏర్పాటు

పరిపాలన వికేంద్రీకరణ–సమ్మిళిత అభివృద్ధి ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి 

సాక్షి, అమరావతి: వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి సాధ్యమని ఏపీ ఆర్థిక, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ స్పష్టం చేశారు. ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా æ అన్ని ప్రాంతాలకు భాగస్వామ్యం ఉండాలన్నారు. పరిపాలన వికేంద్రీకరణ–సమ్మిళిత అభివృద్ధి ఉపసంహరణ బిల్లును సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

అభివృద్ధికి ఇంజన్‌ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను పలు రాష్ట్రాలు రాజ«ధానిలో కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసి వికేంద్రీకరణతో అభి వృద్ధికి ఊతమిచ్చాయని తెలిపారు. ఉమ్మడి ఏపీలో మాత్రం అన్ని కేంద్ర సంస్థలను హైదరాబాద్‌లోనే నెల కొల్పడంతో అభివృద్ధి చెందిన ప్రాంతవాసులే విభజన ఉద్యమాన్ని నిర్వహించి సాధించుకున్నారని గుర్తు చేశారు. దీనివల్ల భాషా ప్రతిపదికన ఏర్పడిన ఏపీ 2014లో రెండు రాష్ట్రాలుగా విడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ విభజన వాదం రాకూడదంటే వికేంద్రీకరణ అవసరాన్ని శివరామకృష్ణన్‌ నివేదిక స్పష్టం చేసిందన్నారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ..

వికేంద్రీకరణ ఎంతో అవసరమన్న కమిటీ..
1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. 1956లో ఆంధ్ర ప్రదేశ్‌గా అవతరించింది. 50–60 ఏళ్లలో ఎన్నో సంఘట నలు జరిగాయి. చరిత్ర అనుభవాల నుంచి మనం నేర్చు కున్న పాఠాలను పరిపాలనలో అన్వయించాల్సిన అవస రం ఉంది. హైదరాబాద్‌ ఒక మహానగరంగా ఏర్పడినందు వల్లే వేర్పాటువాదం వచ్చిందని జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ సారాంశం. విభజన చట్టంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ఎంతో విలువైనది. రాష్ట్రానికి వికేంద్రీకరణ ఎంతో అవ సరమని, పలు ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందాలో అందులో సూచించారు. మూడు పంటలు పండే విలువైన గుంటూరు, తెనాలి భూములను అనవసరమైన వాటికి వృథా చేయవద్దని కమిటీ పేర్కొంది. 

ఆ అనుభవాల నుంచి నేర్చుకుందాం..
ఇతర రాష్ట్రా లను చూసి మనం నేర్చుకోవా ల్సింది ఎంతో ఉంది. ఉమ్మడి ఏపీలో బీహెచ్‌ఈఎల్‌ లాంటి గొప్ప సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. అదే బీహెచ్‌ఈఎల్‌ను యూపీకిస్తే హరిద్వార్‌లోని కొండ ప్రాంతంలో నెల కొల్పారు. తమిళనాడు లోనూ తిరుచ్చిలో పెట్టారు. అక్కడ సేలం అభివృద్ధి చెందడానికీ ఇదీ ఓ కారణం. హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ సంస్థను ఇస్తే హైదరాబాద్‌లో పెట్టారు. ఒడిశా దీన్ని కోరాపుట్‌లో ఏర్పాటు చేయగా మహారాష్ట్ర ప్రభుత్వం నాసిక్‌లో ఏర్పాటు చేసింది. ఇదేవిధంగా షోలా పూర్‌లో టెక్స్‌టైల్స్, కొల్లాపూర్‌లో ఫౌండ్రీలు, అహ్మద్‌ నగర్‌లో ఆటోమొబైల్‌ సంస్థలు, పుణెలో ఆటో మొబైల్, సాఫ్ట్‌వేర్‌ సంస్థలు వచ్చాయి. ముంబై కాస్మొ పాలిటన్‌ మహానగరంగా ఎదిగింది. ఇవన్నీ మనం గమనించాలి. 

మిగతా రాష్ట్రం ఏమైంది?
ఐడీపీఎల్‌ పూర్వ ఉద్యోగుల వల్ల హైదరాబాద్‌లో వివిధ ఫార్మసీ సంస్థలు ఏర్పాటయ్యాయి. కేంద్రం ఇచ్చిన ఐడీపీ ఎల్‌ను ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో నెలకొల్పితే బిహార్‌ ప్రభుత్వం ముజఫర్‌పూర్‌లో ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్‌కు ఐడీపీఎల్‌ ఇస్తే కొండ ప్రాంతం ఉన్న రిషికేశ్‌లో స్థాపించారు. హెచ్‌ఎంటీ, బీడీఎల్, ఈసీఐఎల్, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, మిథాని, ఎన్‌ఎండీసీ, ఎన్‌ఎఫ్‌సీ, ఎన్‌జీఆర్‌ఐ, ఎన్‌ఎఫ్‌డీపీ, డీఎంఆర్‌ఎల్, హెచ్‌ సీఎల్, బీఎల్‌ఆర్‌ఎల్, ఐఐసీటీ, సీసీఎంబీ, డీఆర్‌డీవో.. ఇలా అన్నీ తీసుకెళ్లి హైదరాబాద్‌లో పెట్టడం వల్ల గొప్ప నగరమైంది.

మిగతా రాష్ట్రం ఏమైంది? మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక మాదిరిగా అన్ని ప్రాంతాలు సమానంగా ఎదగలేదు. ఐఐటీ, ఐఎస్‌బీ, బిట్స్, టిస్‌ లాంటి ఉన్నతవిద్యాసంస్థలను హైదరాబాద్‌లోనే నెలకొల్పారు. అన్నీ ఒక్కచోటే కేంద్రీకరించడం వల్ల వేర్పాటువాదం ప్రారంభమైందని జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ పేర్కొంది. 2013–14లో విభజన నాటికి ఉమ్మడి రాష్ట్రంలో సాఫ్ట్‌వేర్‌ రంగం ఎగుమతుల విలువ రూ.56,500 కోట్లుగా ఉంది. ఇందులో ఒక్క హైదరాబాద్‌ నుంచే 56 వేల కోట్లు విలువైన వ్యాపారం జరిగింది. 

విభజన తర్వాతా అదే తప్పిదమా?
రాష్ట్ర విభజన తర్వాత అధికారం చేపట్టిన చంద్రబాబు మళ్లీ అభివృద్ధిని కేంద్రీకతం చేసే బాటలో నడిచారు. శివ రామకృష్ణన్‌ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. కృష్ణా జిల్లాలా శ్రీకాకుళం కూడా అభివృద్ధి చెందాలి. విజయనగరం జిల్లా గుంటూరుతో సమానంగా ఉండాలి. నెల్లూరుతో తుల తూగేలా చిత్తూరు ఉండాలనే ఆలోచన ఏ పాలకులకైనా వస్తుంది. కానీ చంద్రబాబుకు మాత్రం రాలేదు. బాహు బలి సినిమా మాదిరిగా 7,500 చదరపు కిలోమీటర్లలో రాజధాని ప్రాంతం పెట్టారు. ముంబైను గమనిస్తే థానే, కళ్యాణ్, నవీ ముంబై, ఉల్లాస్‌నగర్, మీరా అన్నీ కలిపినా 4,500 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంది.  

గత సర్కారు మిగిల్చిన భారీ అప్పులు, పెండింగ్‌ బకాయిలతోపాటు రెండేళ్లుగా కోవిడ్‌తో అల్లాడుతున్నాం. వారు (టీడీపీ) అధికారంలో ఉంటే రాజధానిని అభివృద్ధి చేసేవారట. ముంబైకి రెండింతల నగరాన్ని కడతారంట. 33 వేల ఎకరాలను అమాయకుల నుంచి తీసుకున్నది గాక వేల ఎకరాల అటవీ భూమి కూడా కావాలని ప్రతిపాదన పెట్టారు. 50 వేల ఎకరాల్లో రోడ్లు, కాల్వలు, కరెంట్‌ లాంటి కనీస వసతులకే రూ.లక్ష కోట్లు అవసరమవు తాయి.

ఇది ప్రభుత్వం చేయగల పనేనా? 2019లో అధి కారంలోకి వచ్చిన తరువాత సీఎం వైఎస్‌ జగన్‌ నిపుణుల కమిటీని నియమించి నివేదిక కోరారు. బోస్టన్‌ కన్సెల్టింగ్‌ గ్రూపుతో అధ్యయనం నిర్వహించారు. రాష్ట్రమంతా అభి వృద్ధి చెందాలని, శ్రీకాకుళంలో మారుమూల గ్రామంలోని రైతు కూడా బాగుండాలని ప్రభుత్వం కోరుకుంటోంది. 

బాబు ఆలోచన సరికాదని తేలింది..
వికేంద్రీకరణ తప్పనిసరిగా చేపట్టాలని జస్టిస్‌ శ్రీకృష్ణ, శివరామకృష్ణన్‌ కమిటీలు స్పష్టం చేశాయి. దీంతో చంద్రబాబు ఆలోచన తప్పని తేలింది. వికేంద్రీకరణలో భాగంగా లోకల్‌ జోన్లు, బోర్డులు నెలకొల్పి ఉత్తరకోస్తా, కోస్తాంధ్ర, రాయల సీమను అభివృద్ధి చేస్తూనే శాసనసభ అమరావతిలో, సచి వాలయం విశాఖలో, శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం హైకోర్టు రాయలసీమలో ఉండాలని ప్రభుత్వం భావిస్తే టీడీపీ తప్పుబడుతోంది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. అందరం కలిసి ఉండాలి. కర్నూలు నుంచి నాడు రాజ ధానిని హైదరాబాద్‌కు తరలించిన విషయాన్ని మరవద్దు.

భాగస్వాములతోనూ చర్చిస్తాం..
ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. భాగస్వాముల తోనూ చర్చిస్తాం. ఎవరైతే ఒక శాతమో, రెండు శాతమో ప్రలోభాలకు లోనయ్యారో వారి ప్రశ్నలకూ సమాధానం చెబుతాం. హేతుబద్ధంగా సమాధానమిస్తాం. అన్ని ప్రాంతాలవారు భాగస్వామ్యలయ్యేలా, రాష్ట్రాన్ని పురోభివృద్ధిలో నడిపేలా పరిపాలన వికేంద్రీకరణ– సమ్మిళిత అభివృద్ధి ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టాం.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top