స్మృతి ఇరానీని కలిసిన వైఎస్సార్‌ సీపీ మహిళా ఎంపీలు

YSRCP Women MPs Meets Central Minister Smriti Irani Over Disha Bill - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  వైఎస్సార్‌ సీపీ మహిళా ఎంపీలు బుధవారం కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కలిశారు. దిశ బిల్లు అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ‘‘ హోంశాఖ, న్యాయశాఖలకు దిశ బిల్లు వివరాలు ఇప్పటికే అందజేశాం. మహిళలు, శిశువులకు రక్షణ కల్పించేలా దిశ బిల్లు రూపొందించాం. మహిళలపై నేరాలకు పాల్పడిన వారికి 21 రోజుల్లోనే శిక్షపడేలా బిల్లు ఉంది. మహిళా సంక్షేమానికి సీఎం జగన్ ఎంతగానో కృషిచేస్తున్నారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సానుకూలంగా స్పందించారు. మహిళా అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని స్మృతి ఇరానీ ప్రశంసించారు’’ అని అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top