సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కోసం పేర్ని నాని ఇంటి వద్ద ఆంక్షలు విధించారు. పేర్ని నాని ఇంటికి ఎవరినీ రాకుండా పోలీసులు మోహరించారు. పేర్ని నాని ఇంట్లో పనివారిని కూడా రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పేర్ని నాని ఇంటి వద్దే కృష్ణా జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయం ఉండగా.. పార్టీ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని కూడా పోలీసులు వెళ్లనివ్వలేదు.
పేర్ని నాని ఇంటికి వెళ్లే మార్గాన్ని బారికేడ్లతో పోలీసులు మూసేశారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్‌ను పోలీసులు తోసేశారు. పోలీసుల తీరుపై పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్షన్ 30 అమలులో ఉందంటూ పోలీసులు వింత సమాధానం ఇచ్చారు. జనసేన కార్యక్రమానికి వర్తించని సెక్షన్ 30.. తమకు ఎలా వర్తిస్తుందని పోలీసులను పేర్ని నాని నిలదీశారు. సెక్షన్ 30 ఆర్డర్ చూపించమంటూ పేర్ని నాని ప్రశ్నించారు.


