Donald Trump Promises Food For Everyone At Miami Restaurant Then Leaves - Sakshi
Sakshi News home page

అందరి బిల్లు కడతానని చెప్పి మరీ చల్లగా జారుకుని.. మద్దతుదారులకు ట్రంప్‌ షాక్‌!

Jun 16 2023 4:52 PM | Updated on Jun 16 2023 5:11 PM

Trump promises food for everyone at Miami restaurant then leaves - Sakshi

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన మద్ధతుదారులకు షాక్‌ ఇచ్చాడా?. తాజాగా రహస్య పత్రాల వ్యవహారంలో ఫ్లోరిడా మియామీ కోర్టుకు హాజరైన ఆయన..  దారిలో లిటిల్‌ హవానాలోని ఓ క్యూబన్‌ రెస్టారెంట్‌కు వెళ్లాడు. అయితే అక్కడ జరిగిన ఓ పరిణామం గురించి సోషల్‌ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. 

ట్రంప్‌ రెస్టారెంట్‌కు వెళ్లిన  సమయంలో జనం భారీ సంఖ్యలో గుమిగూడారు. అయితే వాళ్లను ఉద్దేశించి ఫుడ్‌ ఫర్‌ ఎవ్రీవన్‌ అంటూ బిల్లు తానే కడతానంటూ గట్టిగా అరిచి ప్రకటించాడాయన. దీంతో అక్కడున్నవాళ్లంతా ఎగబడి మరీ తిండి కోసం పోటీ పడ్డారు. అయితే కాసేపటికే అంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.

పది నిమిషాల తర్వాత గప్‌చుప్‌గా ట్రంప్‌ అక్కడికి వెళ్లిపోవడంతో కంగుతినడం మద్దతుదారుల వంతు అయ్యింది.  ట్రంప్‌ ఇంత పని చేస్తాడా? అని నిరాశకు లోనయ్యారంతా. ట్రంప్‌ ఆ రెస్టారెంట్‌లో పది నిమిషాలు మాత్రమే గడిపాడు. ఎలాంటి ఆర్డర్‌ చేయలేదని తెలుస్తోంది. అయితే.. అక్కడ నుంచి వెళ్లిన ట్రంప్‌ మాత్రం తన ప్రైవేట్‌ ప్లేన్‌లో మెక్‌డొనాల్డ్స్‌ ఫుడ్‌ను ఆరగించాడని స్థానిక పత్రికలు కథనాలు ప్రచురించాయి.

Advertisement
 
Advertisement
Advertisement