రెస్టారెంట్‌లో ఖరీదైన వాటర్‌ బాటిల్‌ అంటగట్టారని.. ‘పైసా వసూల్‌’ పనిచేసి..

rs 350 for a bottle of water at a restaurant internet gave funny reactions - Sakshi

ఖరీదైన రెస్టారెంట్లలో బిల్లులు ఏ స్థాయిలో ఉంటాయో మనందరికీ తెలిసిందే. అటువంటి సందర్భాల్లో కాస్త నిట్టూరుస్తూనే బిల్లు చెల్లిస్తుంటాం. తాజాగా ఫిట్‌నెస్‌, న్యూట్రిషన్‌ కోచ్‌ రితికా బోరా రెస్టారెంట్‌లో తనకు  ఎదురైన అనుభవాన్ని షేర్‌ చేశారు. ఆమె రెస్టారెంట్‌లో వాటర్‌ బాటిల్‌కు ఆర్డర్‌ చేయగా, దానికి ఆమె భారీగా బిల్లు చెల్లించాల్సి వచ్చింది. 

తన అనుభవాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసిన ఆమె క్యాప్షన్‌లో ‘మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఈ ఫ్యాన్సీ రెస్టారెంట్‌కు స్నేహితురాలితో పాటు వెళ్లాను. అక్కడ వాటర్‌ బాటిల్‌కు రూ.350 చెల్లించాల్సి వచ్చిందంటే ఎవరూ నమ్మరు. అందుకే ఆ బాటిల్‌ను నాతో పాటు ఇంటికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు దీనిని తిరిగి వినియోగించవచ్చని భావించాను. ఈ విధంగా నేను మాత్రమే చేస్తున్నానా? మీరు కూడా చేస్తారా?’ అని అమె ప్రశ్నించింది.

ఎ‍క్కడైనా వాటర్‌ బాటిల్‌ రూ. 20కి లభ్యమవుతుంది. అయితే ఈ రెస్టారెంట్‌లో ఏకంగా వాటర్‌బాటిల్‌కు రూ. 350 చెల్లించాల్సి వచ్చిందని ఆమె వాపోయింది. రితికా బోరా పోస్టును చూసిన పలువరు నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు తమకు రెస్టారెంట్లలో ఎదురైన అనుభవాలను తెలియజేయగా, మరికొందు ‘పైసా వసూల్‌’ పని చేశారంటూ మెచ్చుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: మహిళ ఆర్తనాదాలపై ఫిర్యాదు.. సంఘటనా స్థలంలో డంగైన పోలీసులు!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top