
నేషనల్ క్రష్‌గా మారిన కన్నడ కస్తూరి రష్మిక మందన్న. కన్నడ చిత్ర పరిశ్రమల్లో నటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈ భామ ఆ తర్వాత తెలుగు, తమిళం, ఇప్పుడు హిందీ అంటూ పాన్ ఇండియా కథానాయకిగా వెలిగిపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న రష్మిక ట్రోలింగ్ నుంచి తప్పించుకోలేక పోతున్నారు. ఎదిగే కొద్దీ మిత్రుల కంటే శత్రువులే ఎక్కువ అవతారన్నది పెద్దల మాట. రష్మిక మందన్న కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు.
ఈమె తన గురించి వస్తున్న ట్రోలింగ్‌ల గురించి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి ఆమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ శ్రీనేనూ భావోద్రేకాలు కలిగిన అమ్మాయినే. అయితే వాటిని నేను బయటకు వ్యక్తం చేయడానికి ఇష్టపడను. అలా చేస్తే రష్మిక కెమెరా కోసం చేస్తున్నారు అని అంటారు. ఇకపోతే నాపై ట్రోల్ చేయడానికి కొందరు డబ్బు కూడా ఇస్తున్నారు. వారు ఎందుకు అంత క్రూరంగా మారుతున్నారో అర్థం కావడం లేదు. అలా నా ఎదుగుదలను అడ్డుకుంటున్నారు.
ఇలాంటి చర్యలు చాలా బాధిస్తున్నాయి. నాపై ప్రేమ, అభిమానాలు కురిపించకపోయినా పర్వాలేదు. ప్రశాంతంగా ఉండండి చాలు అంటూ రష్మిక తన మనసులోని ఆవేదనను వ్యక్తం చేశారు. ఆమె పడుతున్న ఆవేదన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తాజాగా కుబేర చిత్రంలో నటించి విజయాన్ని అందుకోవడంతోపాటు పలువురి ప్రశంసలను అందుకున్న ఈ బ్యూటీ తెలుగు, తమిళ్ భాషల్లో నటించిన గర్ల్ ఫ్రెండ్ చిత్రం రావడానికి రెడీ అవుతుంది. అదేవిధంగా మైస అనే మరో ఉమెన్‌న్ సెంట్రిక్ కథా చిత్రంలో నటిస్తున్నారు. అదేవిధంగా తామా అనే హిందీ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు.