Johnny Depp: మాజీ భార్యపై గెలుపు, ఇండియన్‌ రెస్టారెంట్‌ పార్టీకి రూ. 49 లక్షల బిల్లు

Johnny Depp Leaves Rs 49 lakh Tip After lavish Indian Dinner in Birmingham - Sakshi

ప్రముఖ హాలీవుడ్‌ స్టార్‌ జానీ డెప్‌ తన మాజీ భార్యపై విజయం సాధించడంతో ఫుల్‌ ఖుషి ఉన్నాడు. గృహ హింస, పరువు నష్టం దావా కేసు కోర్టు ఆయనకు అనుకులంగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఆనందాన్ని ఆస్వాదిస్తున్న జానీ డేప్‌ వరుసగా యూకేలోని మ్యూజిక్‌ కన్‌సర్ట్స్‌కు హజరవుతున్నాడు. ఈ క్రమంలో గిటారిస్ట్‌ జెఫ్‌ బెక్‌తో కలిసి బ్రిటన్‌లో బర్మింగ్‌హెమ్‌లో దర్శనమిచ్చాడు. ఆదివారం సాయంత్రం అక్కడి ఇండియన్‌ రెస్టారెంట్‌లో పార్టీ చేసుకున్న జానీ డెప్‌ రెస్టారెంట్‌కు అయిదు అంకెల బిల్లు కట్టి షాకిచ్చాడు.

చదవండి: ఆ ముసలోడి కంటే నేనే నయం: నటికి పెళ్లి ప్రపోజల్‌

దీంతో జానీ కట్టిన బిల్లు న్యూయార్క్‌ పత్రికల్లో కథనంగా ప్రచురితమైంది. ఇది తెలిసి అంతా షాక్‌ అవుతున్నారు. కాగా బర్మింగ్‌హోమ్‌లోని ‘వారణాసి’ రెస్టారెంట్‌లో జానీ డెప్‌ ఆదివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి కర్రీపార్టీ చేసుకున్నాడు. ఈ పార్టీలో భారతీయ వంటకాలు, కాక్‌టెయిల్స్‌, రోజీ ‘ఆంపైయిన్‌ వంటివి ఏర్పాటు చేశారు. అక్కడి ఇండియన్‌ డిషెస్‌ టేస్ట్‌ చేసిన జానీ డెప్‌ వాటికి ఫిదా అయ్యాడట. దీంతో రెస్టారెంట్‌ వెయిటర్స్‌ని మెచ్చుకుంటూ వారితో కలిసి ఫొటోలు దిగాడు. వారితో కాసేపు సరదాగా ముచ్చటించిన జానీ చివరగా 50 వేల పౌండ్ల బిల్లు కట్టాడు. అంటే ఇండియన్‌ కరెన్సీ ప్రకారం అక్షరాల 49 లక్షల రూపాయలు.

చదవండి: రీఎంట్రీకి సిద్ధమవుతున్న కాజల్‌ అగర్వాల్‌?

దీంతో రెస్టారెంట్‌ యాజమాన్యం ఒక్కసారిగా అవాక్కయ్యింది. ఈ సందర్భంగా రెస్టారెంట్‌ యజమాని మహమ్మద్‌ హుస్సేన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఆదివారం సాయంత్రం సమయంలో తనకు ఫోన్‌ వచ్చిందని, జానీ డెప్‌ తమ రెస్టారెంట్‌లో డిన్నర్‌కు వస్తున్నట్లు చెప్పారన్నాడు. మొదట జోక్‌ అనుకున్నానని, ఆ తర్వాత ఆయన భద్రత దృష్ట్యా మొదట సిబ్బంది రెస్టారెంట్‌ అంతా తనిఖి చేశారని చెప్పాడు. దీంతో నిజమని నమ్మనన్నాడు. ఇక ఈ విందులో శిష్‌ కబాబ్‌, చికెన్‌ టిక్కా, పనీర్‌ టిక్కా, మసాలా, ట్యాంబ్‌ కరాహీ, కింగ్‌ తందూరీ ప్రాన్స్‌ వంటి వంటకాలు వడ్డించినట్లు తెలిపాడు. కాగా ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హోమ్‌లో అతిపెద్ద రెస్టారెంట్స్‌లో ఇండియన్‌ ‘వారణాసి’ రెస్టారెంట్‌ ఒకటి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top