
గడ్చిరోలి/కటిహార్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా అభ్యంతరకరమైన పోస్ట్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశారన్న ఆరోపణలపై బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌పై మహారాష్ట్రలో కేసు నమోదైంది. గడ్చిరోలి బీజేపీ ఎమ్మెల్యే మిలింద్ నరొటే ఫిర్యాదు మేరకు బీఎన్‌ఎస్‌లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు శుక్రవారం చెప్పారు.
ఈ పరిణామంపై తాజా తేజస్వీ యాదవ్ స్పందించారు. ‘కేసులను చూసి భయపడను, ఇకపైనా నిజమే మాట్లాడుతా’అని ఆయన ప్రకటించారు. శుక్రవారం ప్రధాని మోదీ.. బీహార్ పర్యటన వేళ తేజస్వీ యాదవ్ ‘ఎక్స్’లో బీహార్ ప్రజలకు మోదీ ఇచ్చిన హామీలన్నీ వట్టి భూటకమని విమర్శించారు. ఓటర్ అధికార్ యాత్రలో భాగంగా తేజస్వీ కటిహార్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రధాని హామీలను భూటకమనడం అభ్యంతరకరమైన మాటలు ఎలా అవుతాయి అంటూ ఎదురుదాడి చేశారు. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోనివ్వండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.