
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్‌లో మరో రెండు ఫార్చూనర్ కార్లను చేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు రూ.88 లక్షల నిధులను మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే సీఎం కాన్వాయ్‌లో పదుల సంఖ్యలో వాహనాలు ఉన్నప్పటికీ, తాజా ఉత్తర్వులతో మరో రెండు విలాసవంతమైన వాహనాల కొనుగోలుకు నిధులు మంజూరు చేసింది.