
సాక్షి,అమరావతి: తొలి అడుగు అంటూ ఇటీవల తమ ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా కూటమి పెద్దలు సంబరాలు నిర్వహించారు. కానీ, దీనికి విరుద్ధంగా ‘అప్పుల పాలనలో సర్కార్ అడుగులు’ అన్నట్లుగా సాగుతోంది చంద్రబాబు సర్కారు తీరు. మంగళవారం మరో రూ.5 వేల కోట్లు అప్పు చేసింది. రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం ద్వారా అప్పుల సమీకరించింది. ఈ అప్పుతో బడ్జెట్ అప్పులే ఏకంగా రూ.2లక్షల వేల కోట్లకు చేరాయి.
చంద్రబాబు సర్కార్ మంగళవారం మరో రూ.5వేల కోట్లు అప్పుగా తెచ్చింది. రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం ద్వారా అప్పులను సమీకరించింది. ఇలా 16 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం రూ.2 లక్షల 9 వేల కోట్ల అప్పు చేసింది. తద్వారా ఏపీ చరిత్రలో ఎన్నడూ లేనంత దారుణంగా అప్పులు చేసి అప్రతిష్టను మూటగట్టుకుంది.
సూపర్ సిక్స్ ప్రధాన హామీలు అమలు చేయని చంద్రబాబు..రికార్డ్ స్థాయిలో అప్పులు తీసుకొస్తుంది. అప్పుల్లో దేశంలోనే నెంబర్ వన్‌గా చంద్రబాబు ప్రభుత్వం నిలిచింది.