13 నెలల్లోనే రూ.1.75 లక్షల కోట్ల అప్పా? | YS Jagan slams Chandrababu Naidus coalition government | Sakshi
Sakshi News home page

13 నెలల్లోనే రూ.1.75 లక్షల కోట్ల అప్పా?

Jul 17 2025 4:56 AM | Updated on Jul 17 2025 11:06 AM

YS Jagan slams Chandrababu Naidus coalition government

ఒక్క పథకమూ అమలు చేయలేదు.. మరి డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లింది? 

నాడు రాష్ట్రం శ్రీలంక అవుతుందన్నారు.. మరి ఇప్పుడేమైంది? 

చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్‌ జగన్‌ 

కోవిడ్‌ పరిస్థితుల్లో ఐదేళ్లలో మేం చేసిన అప్పు రూ.3.32 లక్షల కోట్లే 

మా ఐదేళ్ల హయాంలో చేసిన అప్పులో 52.43% ఈ ఒక్క ఏడాదిలోనే..

కరెంట్‌ చార్జీలు తగ్గించడం కాదు.. పెంచారు

అమూల్‌ మూత పడుతోంది.. హెరిటేజ్‌ పాల రేట్లు మాత్రం పెరిగాయ్‌ 

మెడికల్‌ కాలేజీలు, హత్యలు, అత్యాచారాలు, హామీలపైనా మాట్లాడకూడదట  

ప్రతీ మహిళకు రూ.18 వేలు ఏమైంది? ఉచిత బస్సు ఎక్కడ? 

రైతు భరోసా, గ్యాస్‌ సిలిండర్లు, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకు పింఛన్, ఉద్యోగులకు కొత్త పీఆర్సీ, డీఏల బకాయిల మాటేమిటి?

ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు కేసులు 

సాక్షి, అమరావతి: ‘రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నామని మా మీద బండలు వేశారు. మా ప్రభుత్వం ఐదేళ్లలో కోవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ.. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ.. నాడు–నేడు కింద రూపు రేఖలు మార్చేలా పాఠశాలలను అభివృద్ధి చేస్తూ.. కొత్తగా మూడు పోర్టులు నిర్మిస్తూ.. గొప్పగా డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలు చేస్తూనే మేము చేసిన అప్పులు రూ.3,32,671 కోట్లు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ 13–14 నెలల కాలంలోనే చేసిన అప్పులు రూ.1,75,112 కోట్లు. అంటే మా ఐదేళ్లలో మేము చేసిన అప్పుల్లో 52.43 శాతం తొలి ఏడాదిలోనే చంద్రబాబు చేసేశాడు. 

ఏ ఒక్కరికీ ఒక్క స్కీమ్‌ ఇచ్చింది లేదు.. ఒక్క హామీ అమలు చేసిందీ లేదు. మరి ఈ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి పోతున్నాయి?’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ధ్వజమెత్తారు. తాడే­పల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు ఎన్ని తప్పులు చేసినా, ఎవరూ ప్రశ్నించకూడదట.. ఎందుకిలా చేశారని అడగ­రాదట.. అలా ఎవరైనా అడిగితే వారిపై కక్షగట్టి తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారు’ అని మండిపడ్డారు. 

‘కరెంట్‌ చార్జీలు తగ్గించడం మాట దేవుడెరుగు.. ఇష్టమొచ్చినట్టు పెంచేశారు. విద్యుత్‌ చార్జీలకు వ్యతిరేకంగా మేము ఉద్యమం చేసినప్పుడు రూ.15 వేల కోట్లు ఉండగా, ఈరోజుకు అది రూ.18,272.05 కోట్లకు ఎగబాకింది. ఫ్యూయిల్‌ అండ్‌ పవర్‌ పర్చేజ్‌ కాస్ట్‌ ఎడ్జెస్ట్‌మెంట్‌ కింద ఆయన బాదుడే బాదుడు. అయినా ఎవరూ మాట్లాడకూడదు. మాట్లాడితే గొంతు నొక్కడమే’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

అమరావతిలో ఏమైనా బంగారంతో కడుతున్నారా? అమాంతం కాంట్రాక్టు రేట్లు పెంచేసి, రాజధాని ప్రాంతంలో చదరపు అడుగుæ రూ.9 వేలు, రూ.10 వేలు పెట్టి నిర్మాణాలు చేపడుతున్నారు. ఏమైనా బంగారంతో కడుతున్నారేమో అర్థం కావడం లేదు. ఇంతకు ముందు లేనిది మొబలైజేషన్‌ అడ్వాన్స్‌లు ఇవ్వడం. 10 శాతం ఇవ్వడం.. 8 శాతం నొక్కడం. నాణ్యత లేని పనులు జరుగుతున్నా ఎవరూ మాట్లాడకూడదు. లూలూ, ఉర్సా లాంటి సంస్థలకు రూపాయికే కారుచౌకగా భూములు ఇస్తున్నా ఎవరూ మాట్లాడ కూడదు. 

మేము యూనిట్‌ రూ.2.49 చొప్పున గతంలో ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రానికి మంచి చేస్తూ పీపీఏలు చేస్తే నానా యాగీ చేసిన వీళ్లు నేడు రూ.4.60తో పీపీఏలు చేసుకుంటున్నా ఎవరూ మాట్లాడ కూడదు. ప్రశ్నించకూడదు. రాష్ట్ర వ్యాప్తం­గా హత్యలు, హత్యాయత్నాలు, దౌర్జన్యాలు, ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నా మాట్లాడకూడదు. ప్రశ్నించకూడదు.

పరిశ్రమలను వెళ్లగొట్టడమే లక్ష్యం 
కరేడు రైతుల విషయంలో కూడా అంతే. గతంలో ఇండోసోల్‌ సంస్థ డబ్బు రూ.500 కోట్లతో చేవూరు, రేవూరు గ్రామాల్లో 5 వేల ఎకరాలు భూ సేకరణ పూర్తి చేసి ఆ కంపెనీకి అప్పగించాం. అందులో 114 ఎకరాల్లో రూ.1,200 కోట్లతో వన్‌ గిగా బైట్‌కు సంబంధించిన ప్రాజెక్టు ప్రారంభమైంది. అక్కడ రైతులు సంతోషంగా ఉన్నారు. 8 వేల ఉద్యోగాలు వస్తున్నాయి. అక్కడ సంతోషంగా జరుగుతున్న దాన్ని.. ఆ సంస్థకు పొగపెట్టి వెళ్లిపోమన్నట్టుగా వాళ్ల కోసం సేకరించిన భూములను వాళ్లకు ఇవ్వకుండా కరేడు ప్రాంతానికి వెళ్లమన్నారు. ఎక్కడైతే రెండు పంటలు పండే భూములు­న్నాయో.. ఎక్కడైతే రైతులు వ్యతిరేకిస్తున్నారో అక్కడ భూములు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. 

అక్కడ భూములు అడగడం ధర్మం కాదు. ఇలాంటప్పుడు ఆ ఫ్యాక్టరీ రాకూడదనే కదా.. పొగబెట్టి వెళ్లిపొమ్మ­నడమే కదా? 42 వేల కోట్ల పెట్టుబ­డులు, 8 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకా­శాలు లేకుండా చేçస్తున్నారు. ప్రాజెక్టులు రావాలని చూస్తు­న్నారా? రాకూడదని చూస్తు­న్నారా? ఇదే బీపీసీ­ఎల్‌కు భూమి ఇవ్వాలనుకుంటే వేరే ల్యాండ్‌ లేదా? గవ­ర్నమెంట్‌ ల్యాండ్‌ అదే జిల్లాలోనూ, పక్క జిల్లా­­లోనూ ఉంది. ఇదే కృష్ణ­పట్నంలోనే ఈనాడు రామో­జీరావుకు సమీప బంధువుకు 10 వేల ఎకరాల భూములు­న్నాయి. ఇవ్వొచ్చు కదా.. ప్రకాశం జిల్లాలో ప్రభు­త్వానికి వేల ఎకరాలున్నాయి. అక్కడ ఇవ్వొచ్చు కదా.. అక్కడ బీపీసీఎల్‌కు భూమి ఇవ్వకుండా వాళ్లను తీసుకొచ్చి, ఇండోసోల్‌కు సేక­రించిన భూము­­లను కేటాయించడం, ఇండో­సోల్‌ను వివా­దా­స్ప­­ద­మైన చోటుకు పంపాలను­కోవడం ఎంత­వరకు సమంజసం?

 జూలై 13న ప్రభుత్వం మరో నోటిఫికే­షన్‌ ఇచ్చి దాని ప్రకారం 20 వేల ఎకరాలు ఈ రెండేళ్లలో ఏపీఐఐసీ ద్వారా కానీ, మారిటైమ్‌ బోర్డు ద్వారా సేకరించాలని జీవో ఇచ్చారు. అందుకోసం ఐదు­గురు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లతో టీమ్‌లు ఏర్పాటు చేస్తున్నారంటే.. సింగరాయకొండ నుంచి కావలి వరకు హైవే పక్కన 30 కి.మీ పొడవునా సముద్ర తీరంలో భూములన్నీ కబళించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుట్రను త్వరలోనే బయట పెడతాం. 

బ్లాక్‌ మెయిల్‌ చేసి సొమ్ములు చేసుకోవడమే
చంద్రబాబుకు పరిశ్రమలను ప్రోత్సహించడంపై దృష్టి లేదు. పారిశ్రామికవేత్తలను బెదిరించి సొమ్ము చేసు­కునేందుకే ఈ మనిషి ఉన్నాడు. ఈయన పుణ్యమా అని కుమార మంగళం బిర్లా... అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌.. కడపలో వారం పది రోజులుగా ఫ్యాక్టరీని ఆపేశారు. వీళ్లకు కావాల్సిన కాంట్రాక్టులు ఇవ్వడం లేదని అడ్డుకున్నారు. 

కర్నూలులో అల్ట్రాటెక్‌ ఫ్యాక్టరీ కడుతున్నారు. దీనికి కాంట్రాక్టు ఎవరిదంటే మంత్రి జనార్ధన్‌రెడ్డిది. వాళ్ల మంత్రికి కాంట్రాక్టు ఇవ్వకపోతే పనులు జరగవు. దాల్మియా సిమెంట్స్‌ పరిస్థితి అంతే. కాంట్రాక్టర్లందర్నీ వీళ్ల మను­షులుగా అక్కడకు తీసుకొచ్చి పెట్టారు. అలా పెడితేనే పనులు జరుగుతాయి. జిందాల్‌ వాళ్లు వెనక్కి వెళ్లిపో­యారు. అరబిందో వాళ్లు నమస్కారం పెడుతున్నారు. బెదిరించడం.. సొమ్ములు చేసుకోవడానికే చంద్రబాబు ఉన్నాడు. పరిశ్రమలు రావాలని, వాటి ద్వారా ఉద్యోగాలు రావాలనే ఉద్దేశం చంద్రబాబుకు ఎక్కడా లేదు.

వీటి గురించి ఎవరూ మాట్లాడకూడదట!
షాక్‌ కొట్టేలా కరెంట్‌ చార్జీలు.. మూత పడే స్థితికి అమూల్‌.. పాడి రైతులకు తగ్గిన గిట్టుబాటు ధరలు.. మార్కెట్‌లో పెరిగిన హెరిటేజ్‌ పాల ధరలు.. అమాంతంగా పెరిగిన స్కూల్‌ ఫీజులు.. స్కూళ్లలో, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిలిచిన నాడు–నేడు పనులు.. స్కామ్‌లు చేస్తూ తమ వాళ్లకు తెగనమ్మడానికి సిద్ధమైన ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు.. అమ్మకానికి పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు.. ఇసుక మాఫియా ఇష్టారాజ్యం.. బెల్టుషాపు­లు, లిక్కర్‌ మాఫియా.. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి పింఛన్లు ఎగరగొట్టడం.. గతేడాది ఎగ్గొట్టిన రైతు భరోసా.. ఈ ఏడాది జూన్‌ 21న రైతు భరోసా ఇస్తామని చెప్పినా ఇంత వరకు అతీగతి లేకపోవడం.. 

ప్రతి మహిళకు నెలకు రూ.1,500, ఏడాదికి రూ.18 వేలు చొప్పున ఇస్తామని గతేడాది ఎగ్గొట్టడం.. ఈ ఏడాది ఇచ్చే పరిస్థితి లేకపోవడం.. ఏటా 3 ఉచిత సిలెండర్లు.. గతేడాది రెండు సిలెండర్లు ఎగ్గొట్టడం.. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికీ రూ.15 వేలు ఇస్తానని.. రూ.13 వేలే అనడం.. అదీ 30 లక్షల మందికి ఎగ్గొట్టడం.. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు చొప్పున గత ఏడాదికి రూ.36 వేలు భృతి ఇవ్వక పోవడం.. ఈ ఏడాదీ అతీగతీ లేక పోవడం.. 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్‌.. గత ఏడాది రూ.48 వేలు ఎగవేత.. ఈ ఏడాదీ ఎగ్గొట్టే కార్యక్రమం.. ఇలా వీటన్నింటి గురించి ఎవరూ అడక్కూడదు.. ఎవరూ ప్రశ్నించకూడదు.

ఉచిత బస్సు రానంటోంది..
ఎన్నికలప్పుడు మహిళలకు ఉచిత బస్సు అన్నాడు. రాయలసీమ వాళ్లు వైజాగ్‌కు షికారుకు పోవచ్చన్నాడు. శ్రీకాకుళం వాళ్లు తిరుపతి పోవచ్చన్నాడు. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చ­న్నాడు. ఈరోజు ఫ్రీ బస్సు హామీ కాస్తా గాలికిపోయింది. పండుగులు వచ్చి పోతున్నాయి కానీ ఉచిత బస్సు మాత్రం రావడం లేదు. అయినా ఏ ఒక్కరూ మాట్లాడకూడదు. చంద్రబాబు పుణ్యమా అని 6 త్రైమాసికాలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.4,200 కోట్లు పెండింగ్‌లో ఉంది. వసతి దీవెన కింద ప్రతి ఏప్రిల్‌లో రూ.1,100 కోట్లు ఇవ్వాలి. రెండు ఏప్రిల్‌లు గడిచిపోయాయి. రూ.2,200 కోట్లు ఇవ్వాలి. ఈ రెండు కలిపితే రూ.6,400 కోట్లు బకాయిలు. కానీ ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు మాత్రమే. వీటి గురించి కూడా ఎవరూ  ప్రశ్నించకూడదు. 

ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కింద బకాయిలు రూ.4,500 కోట్లు దాటాయి. నెట్‌వర్క్‌ ఆస్పత్రులు చేతులెత్తేసిన పరిస్థితి కన్పిస్తుంది. ఇళ్ల నిర్మాణంతో సహా ఆయన ఇచ్చిన 143 హామీల కోసం ఎవరూ నిలదీయకూడదు. 2.66 లక్షల మంది వలంటీర్లను మోసం చేసి ఎన్నికలప్పుడు వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్డుపాల్జేశాడు. బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో మరో 15 వేల మందిని రోడ్డున పడేశాడు. 

ఇంటింటికి రేషన్‌ అందిస్తూ ఎండీయూలపై ఆధారపడి జీవించే మరో 20 వేల మందిని రోడ్డున పడేశాడు. ఇలా 3 లక్షల మందిని రోడ్డున పడేసినా ఎవరూ ప్రశ్నించకూడదు. ప్రభుత్వ ఉద్యోగులకు వస్తూనే ఐఆర్‌ అన్నాడు. ఎగర గొట్టేశాడు. అంతవరకు ఉన్న పీఆర్సీని రద్దు చేశాడు. కొత్త పీఆర్సీని ఇప్పటి వరకు వేయలేదు. నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. అధికారంలోకి వస్తూనే జీపీఎస్‌ను తీసేసి ఓపీఎస్‌ను తీసుకొస్తా అన్నాడు. అదీ మోసమే. ఉద్యోగస్తుల బకాయిలే దాదాపు రూ.20 వేల కోట్లు దాటాయి. 

గ్రామ, వార్డు సచివాలయాలు నిర్వీర్యమైపోయాయి. 24 గంటల్లో ధాన్యం కొనుగోలు డబ్బులు ఇస్తామన్నారు. ఏప్రిల్‌ నుంచి రూ.1,000 కోట్లకు పైగా బకాయిలున్నాయి. కాదు.. కూడదని ఎవరైనా వీటి గురించి మాట్లాడితే, వీటి గురించి ప్రశ్నిస్తే చంద్రబాబు అండ్‌ గ్యాంగ్‌కు కోపమొస్తుంది. ఫలితంగా తప్పుడు కేసులు.. తప్పుడు వాంగ్మూలాలు.. తప్పుడు సాక్ష్యాలు.. తుదకు జైలుకు పంపడాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement