
సాక్షి,అమరావతి: సింగపూర్‌తో ఒప్పందాలు పునరుద్ధరించడానికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు అక్కడ ప్రభుత్వం షాకిచ్చింది. అమరావతి సీడ్ క్యాపిటల్ నిర్మాణంలో పాల్గొనేది లేదని తేల్చి చెప్పింది.
కేవలం పట్టణాభివృద్ధి ప్రణాళికలతో పాటు సాంకేతిక సహాయం మాత్రమే అందిస్తామంటూ అమరావతిపై సింగపూర్ మంత్రి ట్రానీ లెంగ్ కీలక ప్రకటన చేశారు.
గతంలో చంద్రబాబు ప్రభుత్వంతో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ నేతృత్వంలో ఒప్పందాలు జరిగాయి. అయితే,ఇప్పుడు ఈశ్వరన్ ఒప్పందాలపై సింగపూర్ ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు. దీంతో సింగపూర్‌లో ఉండగానే చంద్రబాబుకు చుక్కెదురైంది.