
తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ విజన్‌తోనే ఆలోచిస్తుందని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తాము నేరుగా లబ్ధిదారుడికే పథకాలు అందించామని, 2029 వరకూ అధికారంలో ఉండి ఉంటే ఏపీ పూర్తిగా అభివృద్ధి చెందేదన్నారు. ఈరోజు(శుక్రవారం, సెప్టెంబర్ 12వ తేదీ) మీడియాతో మాట్లాడిన సజ్జల.. ప్రజల ఆకాంక్షల మేరకు తాము అధికార వికేంద్రీకరణ అన్నామన్నారు.
‘ఇప్పటికే కూటమి ప్రభుత్వం రూ. 2 లక్షల కోట్లు అప్పులు చేసింది. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని పెడితే బాగుండేది. బాబు తన జేబు, తన కోటరీ జేబులను నింపడానికే చూస్తున్నారు. అమరావతిలో లక్షల కోట్లు రూపాయలు పెడితే రాష్ట్రం భరించే స్థితిలో లేదు. అమరావతిలో రాజధాని అంటే స్టేట్‌ను ఊబిలో దింపడమే. బాబు సెన్స్‌బుల్‌గా ఆలోచించి అప్పులు పాలు కాకుండా చూడాలి. చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ అంటుంటే అనుమానాలు వస్తున్నాయి. మేం వచ్చేలోపు బాబు అప్పులు పాలు చేయకుండా ఉంటే చాలు’ అని తెలిపారు.