సాక్షి, గుంటూరు: రాయపూడి సీఆర్డీఏ కార్యాలయంలో రాజధాని రైతుల ప్లాట్ల కేటాయింపు లాటరీలో గందరగోళం నెలకొంది. రాజధాని రైతుల ప్లాట్ల కేటాయింపు లాటరీలో గందరగోళం నెలకొంది. గతంలో సీఆర్డీఏ కేటాయించిన అభ్యంతరకరమైన ప్లాట్‌లపై అధికారులు మళ్లీ లాటరీ నిర్వహించారు. ఈ లాటరీలో ఈసారి కూడా తమకు వీధి శూల ప్లాట్లు వచ్చాయంటూ రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజధానికి భూములు ఇచ్చి ప్లాట్ కోసం మీ చుట్టూ 11 ఏళ్ల నుంచి తిరుగుతున్నామని రైతులు మండిపడుతున్నారు. తాము కేటాయించిన ప్లాట్లే తీసుకోవాలని.. ఇష్టం ఉంటే తీసుకోండి.. లేకపోతే లేదని చెబుతున్నారంటూ సీఆర్డీఏ అధికారుల తీరుపై రైతులు అసహనం వ్యక్తం చేశారు. రైతుల ఆగ్రహంతో ప్లాట్ల లాటరీ నిలిచిపోయింది.


