
సాక్షి,విజయవాడ: ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం మరోసారి మస్కా కొట్టింది. డీఏ జీవోలోనూ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసింది. డీఏ అరియర్స్ రిటైర్ అయ్యాక ఇస్తామంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ప్రభుత్వం డీఏ జీవో ఇచ్చింది. అయితే, డీఏ జీవో చూసి ప్రభుత్వ ఉద్యోగులు విస్తుపోతున్నారు.
2024 జనవరి డీఏ అరియర్స్ రిటైర్ అయ్యాకే ఇస్తామని కొర్రీ పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా రిటైర్డ్ అయిన పెన్షనర్లను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోంది. పెన్షనర్ల డీఏ అరియర్స్ వాయిదా వేయడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ జీవోను చూసి ఉద్యోగ సంఘాలు విస్తుపోతుంటే.. ఇచ్చిన ఒక్క డీఏకి ఇన్ని కొర్రీలా అంటూ మండిపడుతున్నారు.
