
సాక్షి,అమరావతి: సీఎం చంద్రబాబుతో పాటు కూటమి ప్రభుత్వానికి అమరావతి రైతులు షాకిచ్చారు. తమను ప్రభుత్వం పట్టించుకోకపోతే పోరాటం చేపడతామని అల్టిమేటం జారీ చేశారు. ఇందులో భాగంగా అమరావతి రైతులు నాలుగు డిమాండ్లను చంద్రబాబు ప్రభుత్వం ముందు ఉంచారు. వాటిని నెరవేర్చని పక్షంలో పోరాటం దిశగా అడుగులు వేస్తూ తమ భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని హెచ్చారు. ఈ మేరకు ఆదివారం (అక్టోబర్12) అమరావతి రైతులు గుంటూరులో సమావేశయ్యారు.
ఈ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం సీఆర్‌డీఏ కార్యాలయ ప్రారంభానికి భూమి ఇచ్చిన రైతులను కూడా ఆహ్వానించ లేదని మండిపడ్డారు. సీఆర్డీఏలో అవినీతి పెరిగిపోందన్న అమరావతి రైతులు.. 15నెలలు గడుస్తున్న రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోలేదని వాపోయారు.
తమ సమస్యల్ని పరిష్కరించాలని సీఆర్‌డీఏ మున్సిపల్ శాఖ మంత్రి వద్ద మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. అందుకే తమ డిమాండ్లను నెరవేర్చకపోతే పోరాటం తప్పదని అమరావతి రైతులు చంద్రబాబు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.
👉ఇదీ చదవండి: ఎవరి అక్షయపాత్ర అమరావతి?