సాక్షి,విజయవాడ: మోంథా తుపాను నివేదికపై మీడియా ప్రశ్నలకు సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘మీకు సంచలన వార్తలే కావాలి, వాస్తవం అవసరం లేదు’అంటూ ఆయన మీడియాపై ఘాటుగా స్పందించారు.
గురువారం ఏపీలో బీభత్సం సృష్టించిన మోంథా తుపాను ప్రభావంపై మీడియా ప్రతినిధులు చంద్రబాబును ప్రశ్నించారు. ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టం) ద్వారా తుపాను ప్రభావానికి సంబంధించిన సమాచారం తక్షణమే తెలుసుకున్నామని తెలిపారు.
అయితే, ‘ఆ డేటాను కేంద్రానికి పంపించారా?’ అని మీడియా ప్రశ్నించడంతో చంద్రబాబు ఆగ్రహానికి గురయ్యారు. ‘అన్నీ రియల్ టైమ్‌లో ఎలా సాధ్యమవుతాయి?’ అంటూ మీడియాకు ఎదురు ప్రశ్న వేశారు. ‘మీకు సెన్సేషన్ వార్తలు కావాలి, రియాలిటీ అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు. కేంద్రానికి ఇంకా నివేదిక పంపించలేదని, త్వరలో పంపించాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు.


