పంట నష్టంపై వెంటనే అంచనాలు రూపొందించాలి
సీఎం చంద్రబాబు నాయుడు
సాక్షి, అమరావతి: మోంథా ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల విషయంలో క్షేత్ర స్థాయి సిబ్బంది గ్రామ, వార్డు సచివాలయాలు బేస్ క్యాంప్‌గా పని చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుపాను ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీజీఎస్ కేంద్రంగా మంగళవారం ఉదయం, సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల వద్ద 3 వేల జనరేటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యధిక వర్షపాతం
మంగళవారం సాయంత్రం వరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. వర్షం వల్ల ఇప్పటి వరకు అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, ప్రకాశం, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో 43వేల హెక్టార్లలో పంటలు నీట మునిగాయని అధికారులు తెలిపారు. పంట నష్టం వివరాలను రైతులు కూడా పంపేలా వ్యవసాయ శాఖ రూపొందించిన యాప్‌లో మార్పు, చేర్పులు చేయాలని సీఎం సూచించారు. వెంటనే పంటనష్టం అంచనాలు రూపొందించి కేంద్రానికి పంపాలని చెప్పారు.
తుపాను ప్రభావిత ప్రాంతాలకు బృందాన్ని పంపాలని ఆదేశించారు. కాగా, తుఫాను ప్రభావం ఉన్న గ్రామ,వార్డు సచివాలయాల సిబ్బందితో ఆర్టీజీఎస్ నుంచి సీఎం చంద్రబాబు మంగళవారం టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తుపాను ప్రభావంపై ఆరా తీసి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. జీఎస్ కేంద్రంగా మంగళవారం ఉదయం, సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల వద్ద 3 వేల జనరేటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


