టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అదితి రావు హైదరీ 1978 అక్టోబర్ 28న హైదరాబాద్‌లో జన్మించింది.
తల్లి ప్రముఖ క్లాసికల్ సింగర్ విద్యా రావు, తండ్రి ఎహ్సాన్ హైదరి.
ఆమె తాత జె. రామేశ్వర రావు వనపర్తి సంస్థానానికి చెందిన రాజు, ఆమె ముత్తాత సర్ అక్బర్ హైదరి హైదరాబాద్ నిజాం ప్రధానమంత్రిగా పనిచేశారు.
2006లో మలయాళ చిత్రం “ప్రజాపతి”తో కరియర్ ప్రారంభించిన అదితి తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. పలు తెలుగు, తమిళ్ భాషల్లో నటించి మెప్పించింది.
తెలుగులో సమ్మోహనం, అంతరిక్షం, వి, మహా సముద్రం, చక్కటి పేరు తెచ్చాయి.
2007లో హిందీ నటుడు సత్యదీప్ మిశ్రాని అదితీ పెళ్లి చేసుకున్నా, ఆరేళ్లకే విడాకులు తీసుకుంది.
ఆతరువాత హీరో సిద్ధార్థ్‌ను ప్రేమించి పెళ్లాడింది.
తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల పురాతన రంగనాథస్వామి ఆలయంలో వీరి వివాహం ఘనంగా జరిగింది.


