ఒంగోలు: మోంథా తుపాను ప్రభావంతో మంగళవారం జిల్లా అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఆకాశానికి చిల్లుపడిందా అన్నరీతిలో కుంభవృష్టి కురిసింది.
ఒకపక్క కుండపోత...మరోపక్క ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో జిల్లా అంతా భయం గుప్పెట్లో చిక్కుకుంది.
ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అలలతో సాగర తీరం అల్లకల్లోలంగా మారింది. తుపాను నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.


