
సాక్షి,విజయవాడ: భక్తులకు ముఖ్య గమనిక. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు డ్రెస్‌కోడ్ అమల్లోకి రానుంది. ఈ మేరకు విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో డ్రెస్ కోడ్‌ను అమలు చేస్తున్నట్లు ఆలయ ఈవో వీకే శీనా నాయక్ అధికారిక ప్రకటన చేశారు.
అభ్యంతరకర దుస్తులలో వచ్చే భక్తులకు దేవాలయంలోకి వచ్చేందుకు అనుమతి లేదు. భక్తులతో పాటు ఆలయ సిబ్బందికి డ్రెస్‌కోడ్ తప్పనిసరి విధించింది. ఆలయ ప్రాంగణంలోకి సెల్‌ఫోన్ తీసుకురాకుండా చర్యలు తీసుకుంది.విధి నిర్వహణలో సిబ్బంది సెల్‌ఫోన్ల వాడకంపై నిషేదం. ఈ కొత్త నిబంధనలు ఈనెల 27 నుంచి అమల్లోకి రానున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.