AP: ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏ చెల్లింపుల్లో మార్పులు

Andhra Pradesh Govt Issues Changes In Hra To Employees - Sakshi

సాక్షి, అమరావతి: విజయవాడ పరిసరాల్లో ఉన్న హెచ్ఓడి కార్యాలయాల్లోని ఉద్యోగుల హెచ్ఆర్‌ఏ పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  హెచ్‌ఆర్‌ఏను 8 శాతం నుంచి 16 శాతంకు పెంచుతూ ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పెంపు హైదరాబాద్ నుంచి విజయవాడ పరిసరాలకు గతంలో వచ్చిన హెచ్ఓడి  ఉద్యోగులకు వర్తించనుంది. హెచ్ఓడి అధికారుల సిఫార్సుల మేరకు హెచ్ఆర్ఏను ప్రభుత్వం సవరించింది.

(చదవండి: Indian Railways: 10 గంటలు దాటితే లైట్లు ఆర్పాల్సిందే.. లేకపోతే.. )

ఉద్యోగులు జీతాల చెల్లింపునకు ఆటంకం కలిగించిన వారిపై చర్యలు
ఏపీ ఉద్యోగుల జీతాల చెల్లింపునకు ఆటంకం కలిగించినవారిపై చర్యలు తీసుకుంటామని ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్‌ స్పష్టం చేశారు. ఇందుకుగాను ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన రావత్‌..  కొత్త పీఆర్‌సీ ప్రకారం జీతాల బిల్లులు సిద్ధం చేయాలని చెప్పినా నిర్లక్ష్యం చేయడం సీసీఏ రూల్స్‌కు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ మేరకు సీసీఏ రూల్స్‌ ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల జీతాల చెల్లింపు ప్రక్రియను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top