హైదరాబాద్‌లో సాంకేతికత, సృజనాత్మకత, యువశక్తి వినూత్న పంథాలో దూసుకుపోతోంది. వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నిర్వహిస్తున్న ‘కాన్‌వర్జెన్స్ 2కే25ఆర్ –ది హ్యాకథాన్’ దీనికి నిదర్శనంగా నిలిచింది. ‘ఎక్స్‌పీరియన్స్ ఇన్నోవేషన్’ అనే థీమ్‌తో ప్రారంభమైన ఈ 24 గంటల హ్యాకథాన్‌లో దేశం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు.
అధునాతన అంశాలను ప్రదర్శించి తమ ఆలోచనలను వాస్తవ రూపంలోకి తీసుకురావడంలో వీరు సక్సెస్ అయ్యారు. రోబోటిక్స్, హెల్త్‌కేర్ టెక్, గ్రీన్ ఎనర్జీ, ఫిన్‌టెక్ వంటి ఎనిమిది విభాగాల్లో పోటీ పడుతున్న జట్లు కేవలం టెక్ ప్రాజెక్టులకే కాదు, బాధ్యతతో కూడిన భవిష్యత్తుకు కూడా ఒక మార్గదర్శకత్వాన్ని చూపాయి.
ఈ సందర్భంగా ఆర్‌సీఐ–డీఆర్‌డీవో శాస్త్రవేత్త డాక్టర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ విద్యార్థులు ‘భయం లేకుండా కలలు కనండి, నిజాయితీతో నూతనత్వాన్ని సృష్టించండి’ అంటూ ప్రేరేపించారు. ఈ హ్యాకథాన్‌లో భాగంగా రూ.5 లక్షల బహుమతులతో పాటు పరిశ్రమ మెంటార్‌షిప్ అవకాశాలు కూడా అందించి ఇది టెక్ ఈవెంట్ మాత్రమే కాకుండా.. ‘లైఫ్ స్టైల్ లెరి్నంగ్ ఫెస్టివల్’గా నిలిచింది.
(చదవండి: వండర్ బర్డ్స్..థండర్ కిడ్స్..)


