శ్రీనగర్: సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) 60వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బీఎస్ఎఫ్ రైడర్లు నవంబర్ 9న జమ్మూ నుండి ప్రత్యేక మోటార్ సైకిల్ యాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్ర నవంబర్ 19న గుజరాత్‌లోని భుజ్ వద్ద ముగియనుంది. మహిళా సిబ్బందితో సహా మొత్తం 60 మంది బీఎస్ఎఫ్ రైడర్లు ఈ యాత్రలో పాల్గొననున్నారు.
ధైర్యం, క్రమశిక్షణ, జాతీయ సమైక్యత స్ఫూర్తిని సూచిస్తూ బీఎస్ఎఫ్ రైడర్ల బృందం మూడు వేల కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించనుంది.ఈ యాత్ర పలు రాష్ట్రాలు, కీలక బీఎస్ఎఫ్ యూనిట్‌ల మీదుగా సాగనుంది. నవంబర్ 9న జరిగే ఈ తొలి జమ్మూ మారథాన్, బైక్ ర్యాలీని బీఎస్‌ఎఫ్ డీజీ దల్జిత్ సింగ్ చౌదరి జెండా ప్రారంభించనున్నారు. ఈ ఏడాది జరిగే మారథాన్‌లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్న ఆరువేల మందిలో ఆరుగురు విదేశీయులు ఉన్నారని బీఎస్‌ఎఫ్ ఐజీ ఆనంద్ తెలిపారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, పారా ఆర్చర్, అర్జున్ అవార్డు గ్రహీత రాకేష్ కుమార్ ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొననున్నారు.
ఇది కూడా చదవండి: నాలుగు ‘వందే భారత్’లకు ప్రధాని మోదీ పచ్చజెండా


