బలహీనమైన, తీవ్ర అనారోగ్యంతో ఉన్న అకాల నవజాత శిశువులకు మద్దతుగా వేలాది మందిని ఒక చోట చేరారు. ప్రపంచ అకాల నవజాత శిశువుల వారోత్సవాన్ని గుర్తు చేస్తూ.. వార్షిక రన్ ఆదివారం జరిగింది. హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీ వర్క్స్ వద్ద జరిగిన ప్రీమిథాన్–2025లో ఈ ఏడాది 2,500 మందికి పైగా ఔత్సాహికులు రన్‌లో పాల్గొనడం విశేషం.
ఎక్స్‌ట్రా మైల్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ నితాషా బగ్గా, ఫీనిక్స్ గ్రూప్ సీఎండీ సురేష్ చుక్కపల్లి, రేయిన్‌బో చి్రల్డన్స్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ దినేష్ చిర్లా, సుఖి బిల్డర్స్ సీఎండీ సంతోష్ కెన్నడీ, బీనా కెన్నెడీ, ఎనర్జీస్ ప్రీమియర్ సీఎండీ సురేందర్‌పాల్ సలూజా, నీరస్ సీఎండీ అవ్నిష్ కుమార్, ఫ్రీడమ్ ఆయిల్ గ్రూప్ ఎండీ అక్షయ్‌చౌదరి రన్‌ని జెండా ఊపి ప్రారంభించారు. భారీ సంఖ్యలో పాల్గొన్న రన్నర్లు 3కే, 5కే, 10కే విభాగాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ప్రీమిథాన్ కేవలం పరుగు మాత్రమేకాదని, నియోనాటల్ కేర్‌కు మద్దతునిచ్చే ఉద్యమం. యేటా పెరుగుతున్న భాగస్వామ్యం, అకాల శిశువుల పట్ల పెరుగుతున్న అవగాహన, ప్రజల కరుణ వంటి లక్ష్యాలను ప్రతిబింబిస్తుందన్నారు. సమాజంలోని అనేక సమస్యలతో పాటు ఆరోగ్యం, కార్పొరేట్ సమూహాలు, నాయకులు, కుటుంబాలను ఒకే లక్ష్యం వైపు సమీకరించడమే మా ముఖ్య ఉద్దేశం. ఇందులో అందరూ భాగస్వాములు కావాలి.
– డాక్టర్ నితాషాబగ్గా, ఎక్స్‌ట్రా మైల్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు
(చదవండి: ఫ్రీలాన్స్ ఈతరం ఎంపిక..!)


