నాలుగు ‘వందే భారత్‌’లకు ప్రధాని మోదీ పచ్చజెండా | PM Modi Flags Off 4 New Vande Bharat Trains | Sakshi
Sakshi News home page

నాలుగు ‘వందే భారత్‌’లకు ప్రధాని మోదీ పచ్చజెండా

Nov 8 2025 9:57 AM | Updated on Nov 8 2025 10:53 AM

PM Modi Flags Off 4 New Vande Bharat Trains

వారణాసి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  తన పార్లమెంటరీ నియోజకవర్గం అయిన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుండి శనివారం నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్లలో బనారస్-ఖజురహో, లక్నో-సహరన్‌పూర్, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ, ఎర్నాకులం-బెంగళూరు  ఉన్నాయి.
 

ఈ ప్రారంభోత్సవం తర్వాత జరిగిన ప్రజా ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఈ వందే భారత్ రైళ్లు ప్రజలకు కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తాయని, అధిక సౌకర్యాలను అందిస్తాయని అన్నారు. వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ తదితర రైళ్లు నూతన తరం భారతీయ రైల్వేలకు పునాది వేస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వృద్ధిలో మౌలిక సదుపాయాలనేవి ఒక ప్రధాన అంశమని, భారతదేశం కూడా అభివృద్ధి మార్గంలో వేగంగా పయనిస్తున్నదని ప్రధాని పేర్కొన్నారు.

బనారస్-ఖజురహో వందే భారత్
ఈ రైలు వారణాసి, ప్రయాగ్‌రాజ్, చిత్రకూట్, ఖజురహోతో సహా దేశంలోని పలు సాంస్కృతిక గమ్యస్థానాలను కలుపుతుందని రైల్వేశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

లక్నో-సహరన్పూర్
ఈ రైలు లక్నో, సీతాపూర్, షాజహాన్‌పూర్, బరేలీ, మొరాదాబాద్, బిజ్నోర్, సహారన్పూర్ ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చనుంది. పవిత్ర నగరమైన హరిద్వార్‌కు మెరుగైన ప్రయాణాన్ని అందించనుంది.

ఫిరోజ్‌పూర్-ఢిల్లీ 
ఈ రైలు ఢిల్లీ, పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్, భటిండా, పాటియాలా వంటి కీలక నగరాల మధ్య కనెక్టివిటీని మరింత మెరుగుపరచనుంది.

ఎర్నాకులం-బెంగళూరు 
ఇది ప్రధాన ఐటీ, వాణిజ్య కేంద్రాలను కలుపుతుంది.నిపుణులు, విద్యార్థులు, పర్యాటకులకు వేగవంతమైన ప్రయాణ ఎంపికను అందిస్తుందని కేంద్రం తెలిపింది.

ఇది కూడా చదవండి: శీతాకాలం ఎఫెక్ట్‌: ‘ఇకపై 10కి ఆఫీసు’
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement