భారత మహిళా క్రికెట్ జట్టు సారధిగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) తొలిసారి ఐసీసీ మహిళల ప్రపంచకప్ ట్రోఫీ అందుకొని చరిత్ర సృష్టించారు. అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్‌గా ప్రతిభ కనబర్చి ప్రపంచ అత్యుత్తమ మహిళ క్రికెటర్లలో నిలవడమే కాదు, ప్రపంచకప్‌ను సాధించిన కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోయిన పేరు. ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ మ్యాచ్ తరువాత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ సందర్బంగా ఆమె ధరించిన రోలెక్స్ వాచ్ అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఇటీవలి లెక్కల ప్రకారం భారత రిచెస్ట్ మహిళా క్రికెటర్‌గా ఉన్న హర్మన్ ప్రీత్ కౌర్ నికర విలువ రూ. 25 కోట్లు. ఆమె ధరించి లిమిటెడ్ ఎడిషన్ వాచ్‌లను కూడా ఇష్టపడుతుంది. ది ఇండియన్ హోరాలజీ అందించిన వివరాల ప్రకారం తాజా వీడియోలో ఆమె ధరించిన వాచ్ ఐకానిక్ రోలెక్స్ డేట్‌జస్ట్‌గా గుర్తించారు.
చదవండి: జుకర్‌బర్గ్‌కే షాక్ : 22 ఏళ్లకే బిలియనీర్ క్లబ్‌లోకి
హర్మన్ ప్రీత్‌కు క్లాసీ టచ్ ఇచ్చిన ఈ రోలెక్స్ డేట్‌జస్ట్ విలువ భారతదేశంలో సుమారు రూ. 8.7 లక్షలు. 36 mm ఓస్టర్‌స్టీల్ కేసు, స్క్రూ-డౌన్ స్టీల్ క్రౌన్, రోమన్ సంఖ్యలతో కూడిన తెల్లటి డయల్ స్పెషల్ లుక్‌లో కనిపిస్తోంది. అంతేకాదు విజయానికి చిహ్నంగా, ఐకానిక్‌గా రాయల్ లుక్‌లో ప్రీమియం అనుభవాన్నిస్తుంది.
చదవండి: బెంగళూరు డాక్టర్ కేసులో ట్విస్ట్ : ప్రియురాలికి షాకింగ్ మెసేజ్
అలాగే ప్రపంచ కప్ ట్రోఫీతో ఆమె పంచుకున్న ఫోటోకూడా వైరల్‌గా మారింది. క్రికెట్ అనేది జెంటిల్ మేన్ గేమ్‌కాదు ప్రతీ ఒక్కరిదీ అని అర్థం వచ్చేలా ఉన్న టీ షర్ట్ ట్రెండింగ్‌లో ఉంది. క్రికెట్ అందరి ఆట అనేది సందేశాన్ని హర్మన్‌ప్రీత్ గట్టిగానే ఇచ్చినట్టైంది.
కాగా పంజాబ్‌కు చెందిన హర్మన్ ప్రీత్ కౌర్ క్రికెట్ ప్రయాణం పంజాబ్ నుంచే ప్రారంభమైంది.2009లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగ్రేటం చేసింది మొదలు క్రికెట్ లో అద్భుతమైన క్రీడాకారిణిగా రాణిస్తూ ఎన్నో అవార్డులు, రివార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. మహిళల క్రికెట్లో అత్యంత ప్రభావ వంతమైన క్రికెటర్లలో ఒకరిగా నిలిచారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ వరకు ప్రతీ ఫార్మాట్‌లోనూ ఆమెది ప్రత్యేకమైన ముద్ర. తాజాగా మహిళల ప్రపంచకప్ 2025 (Women's World Cup 2025) ట్రోఫిని దక్కించుకుని సూపర్ స్టార్‌గా నిలిచింది హర్మన్ ప్రీత్ కౌర్. కోట్లాది మంది క్రికెట్ అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది.


