దార్శనిక పారిశ్రామికవేత్త ఇక లేరు : విషాదంలో పరిశ్రమ | Deeply saddened assing of Shri Gopichand Hindu industry mourns | Sakshi
Sakshi News home page

దార్శనిక పారిశ్రామికవేత్త ఇక లేరు : విషాదంలో పరిశ్రమ

Nov 4 2025 5:08 PM | Updated on Nov 4 2025 10:34 PM

Deeply saddened assing of Shri Gopichand Hindu industry mourns

ప్రముఖ వ్యాపార వేత్త, హిందుజా గ్రూప్‌ ఛైర్మన్‌ గోపీచంద్‌ పి హిందుజా (85)   లండన్‌లో  తుదిశ్వాస విడిచారు. వ్యాపార వర్గాల్లో జీపీగా పేరుగాంచిన  గోపీచంద్ హిందూజా బ్రిటన్‌లోని అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తలలో ఒకరు. ఆయనకు భార్య సునీత, కుమారులు సంజయ్, ధీరజ్ కుమార్తె రీటా ఉన్నారు. గోపీచంద్‌ మరణంపై  పలువురు పారిశ్రామికవేత్తలు,  వ్యాపార దిగ్గజాలు  సంతాపం ప్రకటించారు.
 

దార్శనిక పారిశ్రామికవేత్త, ప్రపంచ నాయకుడు , భారతదేశం గర్వించదగ్గ కుమారుడు  అంటూ వ్యాపారవేత్త నవీన్‌ జిందాల్‌  గోపీచంద్ హిందూజా జీ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.  అద్భుతమైన ఆయన నాయకత్వంలో హిందూజా గ్రూప్ ,  ప్రపంచ శ్రేష్ఠతకు చిహ్నంగా మారింది. ఆయన సమగ్రత, ఆవిష్కరణ ,సేవ వారసత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుదంటూ ట్వీట్‌ చేశారు. హిందూజా కుటుంబానికి హృదయపూర్వక సంతాపాన్ని వెలిబుచ్చారు.  ఇంకా ఎంబీ పాటిల్‌, మహిళా పారిశ్రామిక వేత్త ప్రీతి మహాపాత్రా  తదితరులు  ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ట్వీట్‌  చేశారు. 

గోపీచంద్ పి. హిందూజా మృతిపై వైఎస్‌ జగన్‌ సంతాపం

 గోపీచంద్ పి. హిందూజా మృతిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు,  మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్‌ ‘ఎక్స్‌’లో  ట్వీట్‌ చేశారు.

హిందూజా గ్రూప్‌ను ప్రపంచ స్థాయిలో  తీర్చిదిద్దడంలో సహాయపడిన దార్శనికుడు గోపీచంద్ పి. హిందూజా మృతి చెందారని తెలిసి చాలా చింతించాను. ఆయన కుటుంబ సభ్యులు, సహచరులుచ  హిందూజా గ్రూప్‌లోని ప్రతి ఒక్కరికీ  సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని నివాళులర్పించారు.

 

చదవండి: ప్రముఖ పారిశ్రామికవేత్త కన్నుమూత

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement