బెంబేలెత్తిస్తున్న క్షుద్ర పూజలు | Rayachoti Residents Alarmed After Reports Of Suspected Black Magic Rituals Near Cemetery Road And Public Health Centre Area | Sakshi
Sakshi News home page

బెంబేలెత్తిస్తున్న క్షుద్ర పూజలు

May 16 2026 11:32 AM | Updated on May 16 2026 12:56 PM

Occult worship stirs up controversy in

అన్నమయ్య : రాయచోటి పట్ణణంలోని గున్నికుంట్ల రోడ్డులో సమాధులకు దగ్గరగా ఎవరో క్షుద్ర పూజలు నిర్వహించినట్లు ఆనవాళ్లు ఉండటంతో తెల్లవారు జామున అటువైపు వెళ్లే పాదచారులు ( వాకింగ్‌) భయాందోళన చెందుతున్నారు.   ఇప్పటికే కొందరు అ దిశగా వెళ్లడం మానేశారు. ఇది ఇలా ఉండగా  రాయచోటి పట్టణంలోని పట్టణ వైద్యారోగ్య కేంద్రం ( ఐదు పైసలు బావి) దగ్గరగా గత రాత్రి ఎవరో చేతబడి చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. 

తెల్లవారి ఆ దారిలో నడిచి వెళ్లే ( వాకింగ్‌) వారికి,   క్రికెట్‌ ఆడకొనేందుకు వెళ్లే కుర్రాళ్లకు ఈ దృశ్యం కనిపించింది. దీంతో ఒక్క సారిగా భయంతో ఆ వైపు వెళ్లేందుకు జంకుతూ వెనుతిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు.   ఇలాంటి కార్యక్రమాలను చేపట్టే వారిపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి  చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement