ఆగని చంద్రబాబు దుబారా ఖర్చులు | Chandrababu Govt Has Sanctioned Rs 67 Lakhs For Delhi House | Sakshi
Sakshi News home page

ఆగని చంద్రబాబు దుబారా ఖర్చులు

May 13 2026 2:34 PM | Updated on May 13 2026 3:06 PM

Chandrababu Govt Has Sanctioned Rs 67 Lakhs For Delhi House

సాక్షి, విజయవాడ: సీఎం చంద్రబాబు దుబారా ఖర్చులు కొనసాగుతున్నాయి. సీఎం ఢిల్లీ ఇంటికి హంగులు కోసం రూ.67 లక్షల మంజూరుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మీటింగ్ హాల్, మైనర్ రిపేర్ల కోసం రూ.67 లక్షలు ఖర్చు పెట్టనుంది.

గతంలో ఇదే ఢిల్లీ ఇంటికి సౌకర్యాలు, హంగులు కోసం 95 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేసింది. మళ్ళీ ఇప్పుడు రూ. 67 లక్షలు మంజూరు చేస్తూ చంద్రబాబు సర్కార్‌ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కలిపి.. సీఎం చంద్రబాబు ఢిల్లీ నివాసంలో విలాసవంతమైన సదుపాయలకు ఖర్చు 1.62 కోట్లకు చేరుకుంది.

కాగా, అసెంబ్లీ నిర్మాణ వ్యయం  చంద్రబాబు సర్కార్‌ పెంచేసిన విషయం తెలిసిందే. రూ. 798 కోట్లు అసెంబ్లీ పనుల కోసం ఖర్చు చేయాలని చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయించింది. పరిపాలనా అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జ్‌ల నిర్మాణానికి నిధులు కేటాయించింది. దీంతో  అసెంబ్లీ భవనాల నిర్మాణ వ్యయం మరింత పెరగనుంది. ఇప్పటికే అత్యధిక ధరకు ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement