సంక్షేమం.. ఇక సంక్షోభమే! | Family benefit card is weapon for cuts beneficiaries of Chandrababu govt schemes | Sakshi
Sakshi News home page

సంక్షేమం.. ఇక సంక్షోభమే!

May 14 2026 5:27 AM | Updated on May 14 2026 5:27 AM

Family benefit card is weapon for cuts beneficiaries of Chandrababu govt schemes

ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్లో భారీ కోతలకు ఫ్యామిలీ బెనిఫిట్‌ కార్డు అస్త్రం

కొత్త నిబంధనలతో తొలి దశలోనే ఏకంగా 94 శాతం కుటుంబాలకు అనర్హత 

చంద్రబాబు సర్కారు తీరుపై రాష్ట్రవ్యాప్తంగా అధికార వర్గాల్లో విస్మయం  

పథకాల ద్వారా కుటుంబ ప్రయోజనం నగదుపై సీలింగ్‌

ఏడాదికి రూ.48 వేల వరకే పథకాల ప్రయోజనం పరిమితం  

అది కూడా ప్రభుత్వం చెబుతున్న 15 అంశాలు వర్తించకపోతేనే.. 

వ్యవసాయ, మున్సిపల్‌ ఆస్తి ఉన్నా.. పిల్లలు ప్రైవేట్‌ స్కూల్‌లో చదువుతున్నా.. నెలకు 50 యూనిట్ల కరెంట్‌ వాడినా.. వాహనాలు కలిగి ఉన్నా.. మార్కెట్‌లో పంట అమ్ముకున్నా.. ఇలా పలు ఆంక్షలతో వేటు 

కరెంట్‌ వాడకాన్ని నిర్ధారించేందుకు ఆధార్‌తో మీటర్‌ కనెక్షన్‌ల అనుసంధానం పూర్తి 

ఈ ప్రాతిపదికన ఇప్పటికే 1.70 కోట్ల కుటుంబాలు వడపోత 

ఇందులో నుంచి కేవలం 10.2 లక్షల కుటుంబాల ఎంపిక 

ఈ కుటుంబాల నుంచి కూడా అత్యంత పేదల జాబితా తయారీకి కసరత్తు 

కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్స్‌ ద్వారా క్షేత్ర స్థాయిలో మరో సర్వే

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్ర­బాబు సర్కారు సంక్షేమంలో భారీగా కోతలు విధించడానికి ఫ్యామిలీ ప్ర­యో­జనం (బెనిఫిట్‌) కార్డును అస్త్రంగా ప్రయోగిస్తోంది. సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేయకుండా ఇప్పటికే రాష్ట్ర ప్రజానీకాన్ని నిలువునా మోసం చేసిందే కాక, ఇప్పుడు అర్హులైన లబ్ధిదారు­లను అనర్హుల పేరుతో జాబితాల నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వ పథకాలకు కొత్త నిబంధనలను రూపొందించింది. అంతే కాకు­ండా పథకాల ద్వారా లబ్ధి కలిగే ప్రయోజ­నాలకు సీలింగ్‌ విధించింది. పెద్ద కుటుంబాలను ప్రోత్స­హించే సాకుతో పథకాలకు ఎగనామం పెట్టేందుకు కుటుంబాల విభజనకు స్వస్తి పలకనుంది. సూపర్‌ సిక్స్‌తో పాటు వైఎస్‌ జగన్‌ అమలు చేసిన పథ­కా­లన్నీ మరింత మెరుగ్గా అమలు చేస్తామని ఎన్నికల­ప్పుడు ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత ఆ విషయాన్ని గాలికి వది­లేశారు. 

ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి ప్రస్తు­తం అమల్లో ఉన్న పథకాల లబ్ధిదారులను సైతం అనర్హులుగా తేల్చే పనిలో నిమగ్నమ­య్యారు. ఇందులో భాగంగానే ఫ్యామిలీ బెనిఫిట్‌ కార్డు జారీ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఫ్యామిలీ బెనిఫిట్‌ నిర్వ­హణ వ్యవస్థ బిల్లుకు రూ­ప­కల్పన చేసి చట్టం తీసుకురావా­లని ప్ర­భు­త్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్ప­టి­కే రాష్ట్రంలోని 1.70 కోట్ల కుటుంబాల డేటా (సమా­చారం) ఆధారంగా సంక్షేమ పథకాలకు అర్హు­లె­వ­రు.. అనర్హులెవరు.. అనే వడపోత కార్యక్ర­మా­న్ని పూర్తి చేసింది. తద్వారా రాష్ట్రంలో కేవలం 10.2 లక్షల కుటుంబాలు మాత్రమే అర్హమైనవిగా గుర్తించారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 7.4 లక్షల కుటుంబాలుండగా, మిగతా కుటుంబాలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నవిగా తేల్చారు. ఈ 10.2 లక్షల కుటుంబాల నుంచి కూడా అత్యంత పేద కుటుంబాల జాబితాను తయారు చేయ­ను­న్నారు. ఇందుకు కమ్యూ­నిటీ రిసోర్స్‌ పర్సన్స్‌ ద్వారా క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టను­న్నారు. అంటే తొలి దశలోనే 94 శాతం కుటుంబాలకు అర్హతే లేదని నిర్ధారించారు.  

ప్రస్తుత లబ్ధిదారుల ఏరివేత
ప్రస్తుతం అనర్హులు చాలా మంది ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌తో పాటు వివిధ రకాల ప్రభుత్వ ప్రయోజ­నాలు పొందుతున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా కొత్త నిబంధనల మేరకు ప్రస్తుత లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించి వారి పేర్లను తొలగించనుంది. వివిధ ప్రభుత్వ పథకాల నుంచి ఏడాదికి 48 వేల రూపాయలకన్నా ఎక్కువ ప్రయోజనం పొందకుండా సీలింగ్‌ విధించాలని నిర్ణయించింది. అంటే ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ ద్వారా ఏడాదికి 48 వేల రూపాయలు ప్రయోజనం పొందితే ఇక ఆ కుటుంబానికి మరే ఇతర పథకాల ప్రయోజనాలను అందించరు. అంటే పెన్షన్‌ వస్తే మిగతా ఏ పథకాలు ఆ కుటుంబానికి వర్తింప చేయరు.

రాష్ట్రంలోని 1.7 కోట్ల కుటుంబాల్లో అర్హత కలిగిన కుటుంబాలు 10.2 లక్షలే అని స్పష్టం చేస్తున్న ప్రభుత్వ డాక్యుమెంట్‌.. ఈ డాక్యుమెంట్‌లో ఉన్న అంశాల్లో ఏ ఒక్కటి వర్తించినా వారు ప్రభుత్వ పథకాలకు అర్హులు కాదని ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వ ప్రజెంటేషన్‌   

డేటా అనుసంధానం పూర్తి
విద్యుత్‌ వినియోగం ఆధారంగా అనర్హత వేటు వేసే­ందుకు ఇప్పటికే నివాసి ఆధార్‌ నెంబర్‌తో విద్యుత్‌ మీటర్‌ కనెక్షన్‌ నంబర్‌ను అనుసంధానించడాన్ని డిస్కమ్స్‌ నూటికి నూరు శాతం పూర్తి చేశాయి. పట్టణాల్లో దాదాపు 40 లక్షల పట్టణ ఆస్తి రికార్డుల్లో యజ­మా­ని ఆధార్‌తో ఆస్తి ఐడీ అనుసంధానాన్ని ధ్రువీకరించడానికి క్షేత్ర­స్థాయి కార్యక్రమాలు ప్రారంభమ­య్యా­యి. ఇప్పటికే ఏకీకృత కుటుంబ సర్వే పూర్త­య్యి­ంది. పౌరుల జనాభా వివరాలకు సంబంధించిన వ్యత్యాసాలను ధ్రువీకరించడం కూడా పూర్త­యింది. మొత్తంగా చంద్రబాబు ప్రభు­త్వం వివిధ పథకాల కోసం అనర్హుల ఏరివేతకు 15 అంశాలను ప్రామాణికంగా ఎంపిక చేసింది. ఈ 15 అంశాల్లో ఏ ఒక్కటి ఉన్నా అర్హుల జాబితా నుంచి ఆ కుటుంబాలను తొలగిస్తారు.

మంత్రుల కమిటీ సిఫారసులివీ..
ఫ్యామిలీ బెనిఫిట్‌ కార్డు, రాష్ట్ర పథకాల కోసం ‘కుటుంబం’ నిర్వచనం సిఫార్సు.
⇒ కుటుంబాలు పొందగలిగే మొత్తం ప్రయోజనాలపై గరిష్ట పరిమితి కోసం ఒక విధానం సిఫార్సు (సమర్థవంతంగా ప్రభుత్వ నిధుల వినియోగాన్ని నిర్ధారించడం)

⇒ పథకాల కోసం సవరించిన ఆర్థిక అర్హత ప్రమా­ణాల సిఫా­ర్సు. (అర్హత లేని లబ్ధిదా­రులను మినహాయించి, అవసర­మైన లబ్ధిదా­రులను చేర్చడం. ఉదా: ఎన్టీఆర్‌ భరోసా పెన్ష­న్‌). 
⇒ కుటుంబ డేటాబేస్, కుటుంబ కార్డు వినియోగాన్ని అధికారికం చేయడానికి ఫ్యామిలీ బెనిఫిట్‌ నిర్వహణ వ్యవస్థ బిల్లు రూపకల్పన (డేటాబేస్‌ను నియంత్రించడానికి, ప్రతిపాదిత కుటుంబ కార్డు వినియోగానికి అథారిటీని నియమించడం).

⇒ ప్రయోజన పథకాల రూపకల్పనలో సం­స్కరణల సిఫార్సు. (పెద్ద కుటుంబాలను ప్రోత్సహించడానికి, డేటాబేస్‌లో కృత్రి­మ కుటుంబ విభజనను నివారించడం).
⇒ ఫ్యామిలీ కార్డ్‌ను అమలు చేయడానికి ‘కుటుంబం’కు అధికారిక నిర్వచనం, ఫ్యామిలీ డేటాబేస్‌ అండ్‌ కార్డ్‌కు చట్టపరమైన మద్దతు.  

Advertisement
 
Advertisement
Advertisement