వైఎస్ జగన్‌ని కలిసిన పూడి శ్రీహరి | pudi srihari meets to ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్‌ని కలిసిన పూడి శ్రీహరి

May 13 2026 7:24 PM | Updated on May 13 2026 7:24 PM

pudi srihari meets to ys jagan mohan reddy

సాక్షి,తాడేపల్లి: ప్రజల పక్షాన, ప్రజల తరఫున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్‌సీపీ, అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో వైఎస్‌ జగన్‌తో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరి కలిశారు. 

అక్రమ కేసుల్లో పోలీసుల విచారణను ఎదుర్కొన్న శ్రీహరి, విచారణ పేరుతో పోలీసులు వ్యవహరించిన తీరు, తప్పుడు కేసుల వివరాలను వైఎస్‌ జగన్‌కు తెలియజేశారు.

ఈ సందర్భంగా శ్రీహరికి అండగా నిలిచిన వైఎస్‌ జగన్.. తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. చట్టపరంగా వాటిని ఎదుర్కొందామని ఆయన స్పష్టం చేశారు. ప్రజల పక్షాన, ప్రజల తరఫున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలని, ప్రజలకు అండగా నిలవాలని వైఎస్‌ జగన్ పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement