Pudi Srihari
-
Srihari Arrest: నిద్రాహారాలు మానేసి రెండు రోజుల నుంచి ఫైట్ చేస్తున్నాము
-
నాకు భయం లేదు, బాధ కూడా లేదు కేవలం ఆవేదన మాత్రమే
-
నన్ను ఎందుకు ఇలా తిప్పుతున్నారో నాకే అర్ధం కావట్లేదు.. రిలీజ్ తర్వాత శ్రీహరి రియాక్షన్
-
ప్రొద్దునుంచి పూడి శ్రీహరిని చీకటి గదిలో పెట్టి.. పొన్నవోలు షాకింగ్ నిజాలు
-
పూడి శ్రీహరి విడుదల
-
పూడి శ్రీహరికి హైకోర్టులో ఊరట
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, గుంటూరు కోర్టులలో ఊరట లభించింది. సోషల్ మీడియా పోస్టుల కేసులో అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 41ఏ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని సూచించింది. నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసు విచారణలో హైకోర్టు తాజా ఆదేశాలిచ్చింది. గుంటూరు కోర్టులోనూ పూడి శ్రీహరికి ఊరట దక్కింది. కొత్తపేట పీఎస్‌లో నమోదైన కేసులో పూడి శ్రీహరికి బెయిల్ ఇచ్చింది. నోటీసులు ఇచ్చి విచారించాలని స్పష్టం చేసింది. తనపై గుంటూరు జిల్లా నల్లపాడు, కొత్తపేట పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ శ్రీహరి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలు తేలేందత వరకు ఆ కేసుల్లో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ఆయన గురువారం పిటిషన్లు దాఖలు చేశారు. ఒకే అంశానికి సంబంధించి బహుళ ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి వీల్లేదని తెలిసినా పోలీసులు కావాలనే కేసులు పెట్టారు. ఎవరో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అందుకు నన్ను బాధ్యుడిని చేయడం తగదు’అని శ్రీహరి తన వ్యాజ్యాల్లో పేర్కొన్నారు.పూడి శ్రీహరి పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు, గుంటూరు కోర్టులు తీర్పును వెలువరించాయి. నమోదైన కేసుల్లో పూడి శ్రీహరిని అరెస్ట్ చేయొద్దని 41ఏ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని ఆదేశించాయి. -
వేధింపుల్లో బాబు కొత్త ట్రెండ్
-
వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అక్రమ అరెస్ట్
సాక్షి,అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం (గురువారం) కుప్పం కోర్టు వైఎస్సార్సీపీ మీడియా విభాగ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి బెయిల్ మంజూరు చేసింది. అయితే, బెయిల్ వచ్చిన కొద్ది గంటల వ్యవధిలోనే కొత్తపేట పోలీసులు ఆయనను మళ్లీ అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయనను కుప్పం నుంచి గుంటూరు జిల్లా కొత్తపేటకు తరలిస్తున్నారు. ఉదయం కుప్పం కోర్టు బెయిల్ ఇచ్చిన వెంటనే నోటీసులు ఇచ్చి అక్రమంగా అరెస్టు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో పూడి శ్రీహరిని నిన్న బెంగళూరు కుప్పం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను కుప్పం కోర్టులో హాజరు పరిచారు. విచారణ అనంతరం కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. కానీ, బెయిల్ వచ్చిన కొన్ని గంటలలోనే గుంటూరు పోలీసులు నోటీసులు ఇచ్చి మళ్లీ అరెస్టు చేశారు. -
పూడి శ్రీహరికి ఊరట
సాక్షి, చిత్తూరు: వైఎస్సార్సీపీ మీడియా విభాగపు ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి ఊరట లభించింది. కుప్పం కోర్టు గురువారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టులు పెట్టించారంటూ ఆయన్ని కుప్పం పోలీసులు నిన్న వేకువజామున బెంగళూరులో ఆయన్ని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి గతంలో సీపీఆర్వోగా పూడి శ్రీహరి పని చేశారు. ప్రస్తుతం ఆయన వైఎస్సార్సీపీలో మీడియా వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబుపై అభ్యంతరకర పోస్టులకు ఈయనే కారణమంటూ అక్రమ కేసులు బనాయించారు. ఈ క్రమంలో కేసులు కోర్టుల్లో విచారణ జరుగుతుండగానే.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బుధవారం వేకువజామున పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి విచారణ పేరుతో కుప్పం పోలీస్ స్టేషన్‌కు తరలించి వేధించడం ప్రారంభించారు. ఈ పరిణామాలపై వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి(లీగల్ సెల్), మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఉదయం 5.45 గంటలకు కుప్పం పోలీసులు పూడి శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. కానీ, రాత్రి 11.45 గంటలకు అరెస్ట్ అయినట్లు కోర్టుకు చూపించారు. చట్టంపై మాకు నమ్మకం ఉంది. మేము న్యాయపరంగా పోరాటం చేస్తాం’ అని పొన్నవోలు వ్యాఖ్యానించారు. ఆ వెంటనే న్యాయస్థానం శ్రీహరికి బెయిల్ మంజూరు చేయడం గమనార్హం. -
తలలో మెదడు ఉన్నోడు ఎవడైనా.. పూడి శ్రీహరి అరెస్ట్ పై పొన్నవోలు సంచలన కామెంట్స్
-
పూడి శ్రీహరిపై ఆగని వేధింపులు
చిత్తూరు జిల్లా: వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని కూటమి ప్రభుత్వం వేధించడం ఆపడం లేదు. మళ్లీ ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేయించింది. అయితే ఉన్నత న్యాయస్థానాల మార్గదర్శకాలను పట్టించుకోకుండా.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఏపీ పోలీసులు ఈ చర్యకు ఉపక్రమించినట్లు స్పష్టమవుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి గతంలో సీపీఆర్వోగా పూడి శ్రీహరి పని చేశారు. ప్రస్తుతం ఆయన వైఎస్సార్సీపీలో మీడియా వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ ఆయనపై అక్రమ కేసులు బనాయించారు. ఈ క్రమంలో హైకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతుండగానే.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బుధవారం వేకువజామున బెంగళూరులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి విచారణ పేరుతో కుప్పం పోలీస్ స్టేషన్‌కు తరలించి వేధించినట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షల నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించి.. తిరిగి కుప్పం పీఎస్‌కు తీసుకొచ్చారు. ఆ తర్వాత కుప్పం కోర్టుకు తీసుకెళ్లారు. ఆ సమయంలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి(లీగల్ సెల్), మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టు వద్దకు చేరుకున్నారు. ‘బెంగళూరులో నిన్న ఉదయం 5.45 గంటలకు కుప్పం పోలీసులు పూడి శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. కానీ, రాత్రి 11.45 గంటలకు అరెస్ట్ చూపించారు. చట్టంపై మాకు నమ్మకం ఉంది. మేము న్యాయపరంగా పోరాటం చేస్తాం’ అని పొన్నవోలు అన్నారు. -
పూడి శ్రీహరికి ప్రాణహాని..? నాగార్జున యాదవ్ సంచలన కామెంట్స్
-
పోలీసు కస్టడీలో పూడి శ్రీహరి
-
వైఎస్సార్సీపీ నేత పూడి శ్రీహరి కేసు విచారణ వాయిదా
ఢిల్లీ: సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి.. సోషల్ మీడియా పోస్టు కేసు విచారణ వాయిదా పడింది. మంగళవారం విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ కేసుపై రేపు(బుధవారం) హైకోర్టులో విచారణలో అన్ని పక్షాల వాదనలను పరిగణలోకి తీసుకోవాలని ‘సుప్రీం’ కోరింది. అలాగే రేపటి హైకోర్టు విచారణ నేపథ్యంలో మధ్యంతర ఉపశమన చర్యలకు నిరాకరించింది. సోషల్ మీడియా పోస్టు కేసులో హైకోర్టు మద్యంతర ఉత్తరులను సుప్రీంకోర్టులో శ్రీహరి సవాల్ చేశారు. ఈ కేసు తదుపరి విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. కేసు వివరాల్లోకి వెళితే సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అభ్యంతరకర యానిమేషన్ చిత్రాలు, అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేశారనే అభియోగంపై వైఎస్సార్సీపీ నేత పూడి శ్రీహరి అనే వ్యక్తిని కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు కత్తి పట్టుకున్నట్లుగా ఉన్న యానిమేషన్ వీడియోలను వైరల్ చేశారని టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో, ఏప్రిల్ 1న తాడేపల్లిలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని ల్యాప్‌టాప్, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేశారంటూ శ్రీహరి తరపున హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. తొలుత ట్రయల్ కోర్టు రిమాండ్‌ను తిరస్కరించినప్పటికీ, పోలీసులు హైకోర్టును ఆశ్రయించగా ఆ ఉత్తర్వులపై స్టే లభించింది.ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరగా, తనపై రాజకీయ కక్షసాధింపు జరుగుతోందని శ్రీహరి పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్నందున, తాము ప్రస్తుతానికి జోక్యం చేసుకోలేమని, నిందితులకు ఎలాంటి మధ్యంతర రక్షణ కల్పించలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను వెకేషన్ బెంచ్‌కు వాయిదా వేస్తూ, హైకోర్టు నిర్ణయానికే ప్రాధాన్యతనిచ్చింది. -
కుప్పం కోర్టు చీవాట్లు.. జగన్ టూర్ గ్రాండ్ సక్సెస్
-
33 గంటలు ఏం ప్రశించారంటే..?
-
రామోజీ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్న జర్నలిస్ట్ శ్రీహరి.. చెరుకూరి కిరణ్ కు తెలియదా?
-
శ్రీహరి అరెస్ట్ అయిన వెంటనే జగన్ నాకు ఫోన్ చేసి ఒకటే చెప్పారు..
-
పూడి శ్రీహరి ఫస్ట్ రియాక్షన్
-
మార్ఫింగ్ ఫోటోలతో రెచ్చిపోతున్న ఎల్లో సైకోలు
-
పోలీసులకు కుప్పం కోర్టు మొట్టికాయలు
పూడి శ్రీహరిని బుధవారం అక్రమంగా నిర్బంధించి అరెస్టు చేసిన పోలీసులు.. ఆయనను జైలులో ఉంచాలనుకున్న పాచికలు పారలేదు. అక్రమ అరెస్టుపై పోలీసులను నిలదీసిన న్యాయస్థానం పూడి శ్రీహరికి సొంత పూచీకత్తుపై గురువారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో 33 గంటల నిర్బంధం తరువాత గురువారం శ్రీహరి బయటకు వచ్చారు. పోలీసుల పైశాచికత్వం, చినబాబు రెడ్‌బుక్ రాజ్యాంగం న్యాయస్థానాల ఎదుట పనిచేయవని మరోమారు రుజువైంది. కుప్పం/కుప్పం రూరల్ : సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం) పూడి శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేయడంపై కుప్పం కోర్టు మొట్టికాయలు వేసింది. సోషల్ మీడియా కేసుల్లో అరెస్టులు సరికాదని సాక్షాత్తు సుప్రీంకోర్టు చెబుతున్నా పోలీసులు తమ పద్ధతి మార్చుకోక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు రాప్తాడుకు చెందిన గిరీష్‌ను అరెస్టు చేసిన పోలీసులు, ఆయనతో బలవంతంగా వాంగ్మూలం పేరిట శ్రీహరిపై కేసు నమోదు చేశారు. దీనికితోడు శ్రీహరిపై బీఎన్ఎస్–111 సెక్షన్‌తో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బుధవారం ఉదయం తాడేపల్లిలో అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నారు. 33 గంటల నిర్బంధం తరువాత శ్రీహరిని కోర్టులో ప్రవేశపెట్టారు.సెక్షన్–111 ప్రకారం శ్రీహరి ఆర్గనైజ్డ్ క్రైమ్‌కు పాల్పడ్డాడని, అతనికి రిమాండ్ విధిస్తే కస్టడీకు తీసుకుని విచారించాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే సెక్షన్–111 ఈ కేసులో వర్తించదని, కన్ఫెక్షన్ స్టేట్మెంట్ ప్రకారం శ్రీహరిపై అక్రమ కేసు పెట్టారని, రిమాండ్ ఇవ్వకూడదని శ్రీహరి తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. గతంలో సోషల్ మీడియా పోస్టులపై హైకోర్టు తీర్పులను సమర్పించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సెక్షన్–111 వర్తించదని స్పష్టం చేశారు. ఇతర సెక్షన్లు ఏడేళ్లలోపు శిక్ష పడేవిగా ఉన్నాయని పేర్కొన్నారు.ఇలాంటి ఘటనల్లో నోటీసులిచ్చి విచారించకుండా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. సోషల్ మీడియా పోస్టులపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను పోలీసులు పట్టించుకోవడం లేదని తప్పుపట్టారు. రూ.25 వేల రెండు బాండ్లతో సొంత పూచీకత్తుపై శ్రీహరిని విడుదల చేస్తున్నట్టు కుప్పం జూనియర్ సివిల్ జడ్జి, ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ వరుణ్‌తేజ్ ఉత్తర్వులు జారీ చేశారు.జర్నలిస్టులపై కేసులు దారుణంసీనియర్ జర్నలిస్టులపై కేసులు దారుణమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం), సీనియర్ జర్నలిస్టు పూడి శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్ మంజూరైన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తాను 25 ఏళ్లుగా విలువలతో కూడిన జర్నలిజమే చేశానని చెప్పారు. ఏనాడూ తప్పు చేయలేదని, ఇప్పటికీ తనపై ఒక్క కేసు కూడా లేదని చెప్పారు. సీఎం చంద్రబాబుపై వ్యంగ్యంగా పోస్టులు పెట్టినట్టుగా కుప్పం పోలీసులు తనపై అభియోగాలు మోపుతూ కేసులు బనాయించారన్నారు. తనకు, ఆ పోస్టుకు ఎలాంటి సంబంధం లేదన్నారు.అది ఎక్కడ తయారైందో, ఎవరో షేర్ చేశారో తనకు తెలియదన్నారు. సీనియర్ న్యాయవాది, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు మఫ్టీలో వెళ్లి పూడి శ్రీహరి కారుకు వాహనాలు అడ్డంపెట్టి తీవ్రవాది తరహాలో ఆయనను కుప్పానికి తీసుకురావడం దుర్మార్గమన్నారు. చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ.. పూడి శ్రీహరికి బెయిల్ రావడంతో న్యాయం గెలిచిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, వైఎస్సార్సీపీ కుప్పం నియోజకవర్గ పరిశీలకుడు కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు. -
ఖాకీల ‘పైశాచికత్వం’
సాక్షి టాస్క్ ఫోర్స్: వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం) పూడి శ్రీహరి అక్రమ అరెస్టు విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చినబాబు కళ్లలో ఆనందం కోసం శ్రీహరిపై కక్ష సాధింపు చర్యలకు దిగిన పోలీసులు ఎట్టకేలకు ఆయనను కోర్టులో హాజరుపరిచారు. ఆయన అరెస్టుపై వైఎస్సార్సీపీ శ్రేణుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడం.. ఇదే కేసులో అరెస్టయిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా నేత గిరీష్ ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించేందుకు న్యాయస్థానం అంగీకరించకపోవడంతో పోలీసులు ఒత్తిడికి గురయ్యారు. శ్రీహరిని ఎలాగైనా కస్టడీకి తరలించాలని భావించి రాత్రంతా కుప్పం పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. కోర్టులో హాజరుపరిచే విషయంలో కుంటిసాకులు చెబుతూ అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేశారు. చివరకు ఏం చేయాలో పాలుపోని స్థితిలో శ్రీహరిని అరెస్టు చేసిన 33 గంటల తర్వాత గురువారం సాయంత్రం కుప్పం కోర్టులో హాజరుపరచగా.. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో శ్రీహరిని విడుదల చేయక తప్పని పరిస్థితి తలెత్తింది. పత్రిక క్లిప్పింగ్‌ను పార్టీ గ్రూపులో పంచుకున్నారని.. పత్రికలో ప్రచురితమైన ఓ క్లిప్పింగును తమ పార్టీ గ్రూపులో శ్రీహరి పంచుకున్నారు. దీనిపై కుప్పం ఐ.టీడీపీ నేత నుంచి 13న రాత్రి 10 గంటలకు ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆగమేఘాలపై పరుగులు తీశారు. 14వ తేదీన రాత్రి అనంతపురం జిల్లా రాప్తాడు వెళ్లి వైఎస్సార్సీపీ సోషల్ యాక్టివిస్ట్ గిరీష్ రెడ్డిని, 15న ఉదయం గుంటూరు జిల్లా తాడేపల్లిలో పూడి శ్రీహరిని అక్రమంగా నిర్బంధించి అరెస్టు చేసిన పోలీసులు హుటాహుటిన కుప్పం తీసుకొచ్చారు. కేవలం చినబాబు కళ్లల్లో ఆనందం చూడటానికి జిల్లా పోలీసు బాస్ ప్రణాళికలో స్థానిక పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు. శ్రీహరిని ఓ తీవ్రవాదిని పట్టుకున్నట్టుగా వలపని అరెస్టు చేసిన పోలీసులు ఆయన వద్ద ఉన్న ఫోన్, ల్యాప్‌టాప్ స్వా«దీనం చేసుకున్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో తాడేపల్లి నుంచి కుప్పం తీసుకొచ్చారు. ఏ–1 నిందితుడిగా గిరీష్ కుమార్‌రెడ్డిని, ఏ–2గా శ్రీహరిని చూపించిన పోలీసులు వేధింపులే లక్ష్యంగా ముందుకెళ్లారు. తొలుత గిరీష్ ను బుధవారం రాత్రి 7.15 గంటల సమయంలో కుప్పం కోర్టులో హాజరుపర్చారు. అయితే.. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏడేళ్లలోపు శిక్షపడే కేసుల్లో రిమాండ్ ఇవ్వడం కుదరదని గిరీష్‌కు జ్యుడీషియల్ కస్టడీని న్యాయమూర్తి తిరస్కరించారు. సొంత పూచీకత్తుపై గిరీష్ ను విడుదల చేశారు. ఈ ఘటనతో పోలీసుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయ్యింది. అయితే, చినబాబు నుంచి స్పష్టమైన ఆదేశాలు అందటంతో శ్రీహరిని మానసికంగా వేధించి, స్టేషన్లో ఉంచి మరుసటి రోజు కోర్టుకు తీసుకెళ్లాలని పోలీసు బాస్ నుంచి సమాచారం అందింది. దీంతో రాత్రంతా శ్రీహరిని కుప్పం పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. ఇదిగో, అదిగో కోర్టుకు తీసుకెళుతామంటూ ఉద్దేశ్యపూరకంగా కాలయాపన చేశారు. కనీసం న్యాయవాదులను, వైఎస్సార్సీపీ నేతలను కలవడానికి కూడా ఒప్పుకోలేదు. తీరా గురువారం ఉదయం మళ్లీ కోర్టుకు తీసుకెళ్లడానికి ముందు వైద్యపరీక్షలు నిర్వహించినా.. ఆ తరువాత పోలీస్ స్టేషన్లోనే ఉంచేశారు. ఇలా గంటల కొద్దీ శ్రీహరిను స్టేషన్లో ఉంచి పైశాచిక ఆనందం పొందారు. చివరకు సాయంత్రం 4.30 గంటలకు కుప్పం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి, ఆపై సాయంత్రం 5 గంటలకు కుప్పం కోర్టులో హాజరుపరచారు. ఆ వారెంట్ల పరిస్థితి ఏమిటి?శ్రీహరి, గిరీష్‌లపై నమోదు చేసిన కేసుల్లో కనీసం 41ఏ నోటీసులు కూడా ఇవ్వని పోలీసులు వారిని అరెస్టు చేసి జైలుకు తరలించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అతి సాధారణ ఫిర్యాదు ఆధారంగా వారిద్దరిపై కక్షసాధించేందుకు యత్నించారు. అయితే, జిల్లాలో హత్యలు, దోపిడీలు, అత్యాచార కేసుల్లో నిందితులుగా ఉండి.. విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న వారిపై కోర్టులు నాన్–బెయిలబుల్ వారెంట్లు (ఎన్బీడబ్ల్యూ) జారీ చేశాయి. జిల్లాలో దాదాపు 280కి పైగా నాన్–బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వారెవరినీ కోర్టులో హాజరుపరిచేందుకు సమయం లేదని చెబుతున్న పోలీసులు.. ప్రతిపక్ష నేతలను మాత్రం అప్పటికప్పుడు అరెస్టు చేయడం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
Breaking News: పూడి శ్రీహరికి బెయిల్
-
పూడి శ్రీహరికి బెయిల్ మంజూరు
కుప్పం: అక్రమ కేసును బనాయించి అరెస్టు చేసిన వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి బెయిల్ మంజూరైంది. శ్రీహరికి కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేసింది, 33 గంటల పాటు అక్రమంగా నిర్బంధించిన తర్వాత కోర్టులో హాజరుపరిచిన పూడి శ్రీహరికి బెయిల్ మంజూరు చేసింది కుప్పం కోర్టు. నిన్న(బుధవారం, ఏప్రిల్ 15వ తేదీ) పూడి శ్రీహరిని ఉదయం 8 గంటలకు అరెస్టు చేయగా, ఈరోజు(గురువారం, ఏప్రిల్ 16వ తేదీ) ఉదయమే వైద్య పరీక్షలు చేశారు. అయితే అరెస్టు చేసిన తర్వాత 33 గంటల పాటు శ్రీహరిని కోర్టు హాజరుపరచలేదు పోలీసులు. దీనిపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో శ్రీహరిని ఎట్టకేలకు కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలోనే కోర్టులో హాజరుపరిచిన వెంటనే బెయిల్ మంజూరు అయ్యింది. -
కుప్పం కోర్టుకు పూడి శ్రీహరి
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పూడి శ్రీహరి అరెస్టుకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ శ్రేణుల ఒత్తిడితో పోలీసులు తలొగ్గారు. అరెస్టు చేసిన 33 గంటల తర్వాత పోలీసులు కోర్టుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ ఉదయం పూడి శ్రీహరికి పోలీసులు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. ఇప్పుడు కుప్పం కోర్టుకు తరలిస్తున్నారు. కాగా,తాడేపల్లిలో నిన్న ఉదయం పూడి శ్రీహరిని పోలీసులు అరెస్టు చేశారు. -
ఇంకా పోలీసుల నిర్బంధంలోనే పూడి శ్రీహరి
తిరుపతి: వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పూడి శ్రీహరి అరెస్టుకు సంబంధించి కుప్పం పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. పూడి శ్రీహరిపై అక్రమ కేసు బనాయించి అరెస్టు చేయడమే కాకుండా, ఇంకా కోర్టులో హాజరు పరచకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పూడి శ్రీహరిని అరెస్టు చేసి 30 గంటలకు పైగా దాటినా ఇంకా పోలీసుల నిర్బంధంలోనే ఉంచారు. ఈరోజు(గురువారం, ఏప్రిల్ 16వ తేదీ) ఉదయమే పూడి శ్రీహరికి వైద్య పరీక్షలు చేసినా కోర్టులో మాత్రం హాజరుపరచలేదు పోలీసులు. పూడి శ్రీహరిపై అక్రమ కేసు బనాయించిన పోలీసులు,.. ఇంకా తప్పుడు కేసులు బనాయించడానికి కుట్ర చేస్తున్నట్లు తాజా పరిణమాలను బట్టి తెలుస్తోంది. పూడి శ్రీహరిని ఇంకా కోర్టులో హాజరుపరచకపోవడంపై వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరెస్టు చేసిన తర్వాత 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాల్సి ఉన్నప్పటికీ ఇంకా ఆ పని చేయలేదు పోలీసులు. -
హిట్లర్ లాంటోళ్లే మట్టి కొట్టుకుపోయారు.. మీరెంత మీ స్థాయేంత ?
-
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది.. పూడి శ్రీహరి అక్రమ అరెస్ట్ పై పొన్నవోలు సంచలన రియాక్షన్
-
కుప్పం పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్సార్సీపీ ఆందోళన
సాక్షి, చిత్తూరు జిల్లా: చంద్రగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కుప్పం పోలీస్ స్టేషన్‌కి చేరుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అక్రమ అరెస్టు నేపథ్యంలో, ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అయితే కుప్పం డీఎస్పీ పార్ధసారధి అనుమతి ఇవ్వకపోవడంతో మోహిత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. పూడి శ్రీహరి గారు ఎలా ఉన్నారో చూడాలని అడిగితే అనుమతి ఇవ్వడం లేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి మాకు ఆందోళన కలిగిస్తోంది. పబ్లిక్ సర్వెంట్ ఇలా మాట్లాడటం బాధాకరం. తిరుచానూరు ఘటనపై కోర్టు ఇప్పటికే పోలీసు అధికారులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. చంద్రబాబు మానవ హక్కుల గురించి మాట్లాడుతారు. కానీ కుప్పం మీ ఇలాకాలో జరుగుతున్నది ఏంటి? వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులు ఆపాలి. లేని పక్షంలో కుప్పం నుంచే ఆందోళన చేస్తామని మోహిత్ రెడ్డి హెచ్చరించారు. -
శ్రీహరినే బయపెట్టాలనుకుంటున్నారా అరెస్ట్ అంబటి రియాక్షన్
-
మూడు రోజుల నుంచి రెక్కీ... YSRCP పూడి శ్రీహరి అరెస్ట్
-
పూడి శ్రీహరి అరెస్టును ఖండిస్తున్నాం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు అండ్ కో చెప్పినట్లు పోలీసు వ్యవస్థ నడుచుకుంటోందని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డీనేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అక్రమ అరెస్ట్.. నిర్బంధంపై సజ్జల బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘పూడి శ్రీహరి అరెస్టును ఖండిస్తున్నాం. సివిల్ డ్రెస్సులో వచ్చి అక్రమంగా అరెస్ట్ చేశారు. పోలీసులు సివిల్ డ్రస్‌లో వచ్చి అరెస్ట్ చేయడమేంటి?. పైగా నోటీసులు ఇవ్వకుండానే శ్రీహరిని తమ వెంట తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులతో పాటు పార్టీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. శ్రీహరి ఉగ్రవాది కాదు.. గతంలో జర్నలిస్టుగా పని చేశారు. కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్లు కూడా ఇవ్వడం లేదు. సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం పోలీసులు ధిక్కరిస్తున్నారు. చంద్రబాబు అండ్ కో చెప్పినట్లు వింటూ తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. పూడి శ్రీహరి అరెస్ట్‌పై డీజీపీ సమాధానం చెప్పాలి’’ అని సజ్జల డిమాండ్ చేశారు. ‘‘అక్రమ అరెస్టులకు భయపడేది లేదు. ఈ వ్యవహారంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్తాం. నిబంధనలు పాటించని పోలీసులపై వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటుంది. అందరినీ గుర్తు పెట్టుకుంటాం.. ఎవరూ తప్పించుకోలేరు’’ ఈ సందర్భంగా సజ్జల హెచ్చరించారు. -
వెంట్రుక కూడా పీకలేవు .. నీకు ఇక మంగళమే, బాబుకు పేర్ని నాని వార్నింగ్
-
పోలీసులా..? రౌడీలా.? పూడి శ్రీహరి అక్రమ అరెస్ట్ ని తీవ్రంగా ఖండించిన YSRCP
-
పూడి శ్రీహరి ఎక్కడ! అరెస్ట్ చేసి నిర్బంధం
-
పూడి శ్రీహరి అక్రమ అరెస్ట్.. అంబటి స్ట్రాంగ్ రియాక్షన్
-
రెక్కీ చేసి.. అక్రమ అరెస్ట్.. YSRCP పూడి శ్రీహరి ఎక్కడ..?
-
YSRCP మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అక్రమ అరెస్ట్
-
YSRCP Leaders: ప్రశ్నించే వ్యక్తులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోంది
-
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి కర్నూలు పోలీసులు
సాక్షి, తాడేపల్లి: కర్నూలు బస్సు ప్రమాదం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై వైఎస్సార్సీపీని టార్గెట్ చేసింది కూటమి ప్రభుత్వం. దీనిలో భాగంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి సైతం పోలీసులు వచ్చారు. కర్నూలు బస్సు ప్రమాదానికి మద్యం కారణమనే విషయం అందరికీ తెలిసినా.. దీనిపై పోస్టులు పెట్టిన వారిపై ఇప్పటివరకూ కేసులు పెట్టిన పోలీసులు.. ఇప్పుడు వైఎస్సార్సీపీ కార్యాలయంలోకి అడుగుపెట్టారు. ఏదో రకంగా వైఎస్సార్సీపీని వేధించాలనే లక్ష్యంతో కూటమి కనుసన్నల్లో పని చేస్తున్న పోలీసులు.. ఇవాళ(శుక్రవారం, నవంబర్ ) వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి నోటీసులు ఇచ్చారు.కర్నూలు బస్సు దగ్ధం కేసులో నోటీసులు జారీ చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరికి నోటీసులు ఇచ్చిన పోలీసులు.. బస్సు దగ్దానికి మద్యమే కారణమని ప్రచారం చేశారంటూ నోటీసులు ఇచ్చారు. ప్రచారం వెనుక వైఎస్సార్సీపీ ఉందంటూ కేసు పెట్టారు. ఇప్పటికే 27 మందిపై కేసులు నమోదు చేశారు. తాజాగా పూడి శ్రీహరిని కూడా ఈ కేసులో కర్నూలు ఖాకీలు చేర్చారు. బాబు సర్కార్.. నోటీసులతో భయపెట్టాలని చూస్తోంది: టీజేఆర్పోలీసుల నోటీసులపై వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పందిస్తూ.. ‘‘కర్నూలు బస్సు దగ్దానికి మద్యమే కారణం.. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ అదే విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టిన వారిపై కేసులు పెట్టారు. ఇప్పుడు ఏకంగా మా పార్టీ కేంద్ర కార్యాలయానికే పోలీసులు వచ్చారు. మా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీహరికి నోటీసులు ఇచ్చారు. ప్రజలు, ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ప్రభుత్వం నోటీసులతో భయపెట్టాలని చూస్తోంది’’ అంటూ ఆయన మండిపడ్డారు.ఇలాంటి నోటీసులు, కేసులకు మేము భయపడము. కర్నూలు బస్సు దగ్దానికి కారణమైన బైకర్లు మద్యం ఎక్కడ తాగారో ప్రభుత్వం ఎందుకు చెప్పటం లేదు?. మృతుని శరీరంలో ఎంత ఆల్కాహాల్ ఉందో రిపోర్టుని ఎందుకు బయట పెట్టలేదు?. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం, డ్రగ్స్ దొరుకుతోంది. విశాఖలో దొరికిన డ్రగ్స్ వివరాలు హోంమంత్రి ఎందుకు బయట పెట్టటం లేదు?. ఎవరి ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ దొరికాయో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?’’ అంటూ టీజేఆర్ ప్రశ్నించారు. -
విద్యారంగంలో జగన్ జైత్రయాత్ర
విద్యా రంగంలో వైఎస్ జగన్ చేపట్టిన కార్యక్రమాలు దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నాయడంలో ఎలాంటి సందేహం లేదు. చదువుల మీద ఒక ముఖ్యమంత్రిగా ఆయన పెడుతున్న శ్రద్ధ.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎవ్వరూ కూడా పెట్టలేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. క్షణక్షణానికీ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, ఊహించని స్థాయికి చేరుతున్న విజ్ఞానాన్ని రేపటి తరం పిల్లలు అందిపుచ్చుకోవాలన్న ఆయన సంకల్పం కొనసాగుతోంది. ఉన్నవారితో సమానంగా లేనివారి పిల్లలకూ అన్నీ అందాలన్న ఆయన దృఢ నిశ్చయం కళ్లముందు కనిపిస్తోంది. పేద కుటుంబాల తలరాతలే కాదు, ఒక ప్రజాస్వామ్య దేశంగా, ఉత్తమ విలువలతో కూడిన సమాజంగా వర్థిల్లాలంటే అది కేవలం చదువుల ద్వారానే సాధ్యమనే బలంగా విశ్వసించిన ఆయన, విద్యారంగంలో తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. చదవండి: ఎల్లో హెచ్చులు ఢిల్లీ దాకా! నిరక్షరాస్యతకు చరమాంకం: 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో అక్షరాస్యత శాతం 67.35 శాతం మాత్రమే. మహిళల అక్షరాస్యత 59.96 శాతం. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత, గత జనాభా లెక్కలు నాటికి ఆ 55 ఏళ్ల సంవత్సరాల్లో కూడా నూటికి నూరుశాతం అక్షరాస్యతను సాధించలేకపోయాం. ప్రగతికి ఇదో పెద్దలోటు. 2019లో వచ్చిన దృఢ సంకల్పంతో కూడిన రాజకీయ నాయకత్వం ఈ పరిస్థితులను మార్చడానికి కంకణం కట్టుకుంది. పుట్టిన ప్రతి పిల్లాడు కూడా బడికిపోవాలన్న సదుద్దేశంతో ‘అమ్మ ఒడి’ పథకం ప్రారంభమైంది. పిల్లల చదువుల కోసం ఏ పేదింటి తల్లీ భయపడవద్దని, కేవలం బడికి పంపితే చాలు రూ.15 వేల ఇస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని తుచ తప్పక అమలు చేస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం.. మేనిఫెస్టోలో కేవలం బడికి వెళ్లే పిల్లలకు మాత్రమేనంటూ ఈ పథకాన్ని పేర్కొన్నా తర్వాత దాన్ని ఇంటర్మీడియట్ చదువుతున్న వారికీ వర్తింపుచేశారు. 2019-2020 విద్యా సంవత్సరంలో 42,33,098 మంది తల్లులకు రూ.6,349.53 కోట్ల రూపాయలను చిత్తూరులో 2020, జనవరి 9న ముఖ్యమంత్రి బటన్ నొక్కి జమచేశారు. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి 44,48,865 మంది తల్లులకు రూ.6,673 కోట్లను నెల్లూరులో 2021,జనవరి 11న సీఎం బటన్ నొక్కి జమ చేశారు. మొదటి ఏడాదిలో పథకం అప్పుడే ప్రారంభం అయిన దృష్ట్యా వారి పిల్లలను బడికి పంపేలా తల్లులను ఉత్సాహపరిచేలా ఎలాంటి హాజరు శాతాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం లబ్ధిదారులు అందరికీ కూడా అమ్మ ఒడిని జమ చేసింది. రెండో ఏడాది కూడా కోవిడ్ కారణంగా పాఠశాలలు సక్రమంగా నిర్వహించలేని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని లబ్ధిదారులకు అందరికీ కూడా పిల్లల హాజరుతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం వర్తింపచేసింది. ఈ ఏడాది మాత్రం 75 శాతం హాజరును పరిగణలోకి తీసుకుంది. పథకం ఉద్దేశం నీరు గారకుండా, లక్ష్యాన్ని సాధించేందుకు నిర్ణయించిన హాజరు శాతాన్ని పరిగణలోకి తీసుకుని పథకాన్ని వర్తింపుచేస్తామని నేరుగా ముఖ్యమంత్రే చిత్తూరు ‘అమ్మ ఒడి’ సభలో స్పష్టం చేశారు. మొత్తంగా మూడేళ్ల కాలంలో కేవలం అమ్మ ఒడి పథకానికే రూ.19,617.53కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. కొత్తగా అమ్మ ఒడి పరిధిలోకి 5,48,329 మంది 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్తగా అమ్మఒడి పరిధిలోకి 5,48,329 మంది తల్లులు వచ్చారు. పథకం స్థిరంగా, సమగ్రంగా కొనసాగుతుందనేందుకు ఇదొక ఉదాహరణ. వీరంతా కూడా ఒకటో తరగతిలో చేరిన పిల్లల తల్లులు. 75శాతం హాజరు నిబంధనను వీరు సంతృప్తికరంగా పూర్తి చేయడం మంచి పరిణామం. మొత్తంగా 43,96,402 మంది తల్లులకు సుమారు రూ.6,595 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి బటన్‌నొక్కి జమచేయనున్నారు. తద్వారా 82,31,502 మంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు. వివక్షలేదు... అవినీతి లేదు.. అంతా పారదర్శకం: పథకాల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం చిరస్థాయిగా నిలిచిపోతుంది. రాజకీయాలకు, వర్గాలకు అతీతంగా పథకాలు అమలు చేస్తోంది. ఏ పథకం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు దరఖాస్తులు తీసుకుంటారు? ఆ దరఖాస్తులు ఎక్కడ దొరుకుతాయి? దాఖలు ఎక్కడ చేయాలి? ఇలాంటి ప్రశ్నలు గత ప్రభుత్వాల్లో కోకొల్లలు. వీటికి తావులేకుండా మొత్తం ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటోంది. కుటుంబాల వారీగా ఉన్న వాలంటీర్లు అర్హులైన వారిని గుర్తించి వారిచేత దరఖాస్తు చేయిస్తున్నారు. అర్హుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ఉంచుతున్నారు. సామాజిక తనిఖీ సమయంలో అర్హత ఉండి పేరులేకపోతే మళ్లీ అవకాశం కల్పిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా గ్రామస్థాయిలోనే కచ్చితమైన తనిఖీలతో ముందుకు సాగుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి దశలోనూ జవాబుదారీతనం కనిపిస్తోంది. అందుకనే ఇన్ని లక్షలమందికి లబ్ధి చేకూర్చే ఈ పథకం ఇంత సజావుగా అమలవుతోంది. అమ్మ ఒడి అద్భుత ఫలితాలు: పిల్లలను బడికి పంపేందుకు తీసుకున్న చర్యల కారణంగా 2018–19 నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో 37.21 లక్షలుగా ఉన్న అడ్మిషన్ల సంఖ్య దాదాపు రూ.7 లక్షలు పెరిగింది. 2021–22 నాటికి 44.30 లక్షలకు చేరుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య 2 లక్షలు పెరిగి, 72.7 లక్షలకు చేరుకుంది. మరో వైపు కోవిడ్ లాంటి విపత్తు సమయంలో పిల్లల చదువులకు అందిస్తున్న డబ్బు వారికి ఎంతగానే మేలు చేసింది. విపత్తు సమయంలో ఈ పథకాలు ఒక రక్షణ కవచంలా ఈ పథకాలు నిలిచాయనడంలో ఎలాంటి సందేహంలేదు. మనబడి-నాడు నేడు: విద్యారంగంలో వైఎస్ జగన్ జైత్రయాత్రలో మరో ఘన విజయం మనబడి నాడు-నేడు. ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలను ఈ ప్రభుత్వం సమూలంగా మార్చేస్తోంది. బ్లాక్‌బోర్డ్, లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్, టాయిలెట్లు, డ్రింకింగ్ వాటర్, కాంపౌండ్‌వాల్ ఇలా పదిరకాల సౌకర్యాలను కల్పించేందుకు భారీ మొత్తంలో ఖర్చుచేస్తున్నారు. తొలిదశలో 15,715 స్కూళ్లలో సుమారు రూ.3,669 కోట్లు ఖర్చుచేశారు. మరో 22,344 స్కూళ్లలో రూ.8 వేల కోట్ల ఖర్చుతో రెండో దశ పనులు జరుగుతున్నాయి. తల్లిదండ్రులతో ఏర్పడిన విద్యా కమిటీల భాగస్వామ్యంతో, వారి పర్యవేక్షణలో ఈ పనులన్నీ జరుగుతున్నాయి. స్కూళ్లలో పరిశుభ్రత – సమర్థ నిర్వహణ: వేల కోట్ల పెట్టి పాఠశాలల్లో సౌకర్యాలను, సదుపాయాలను కల్పించుకోవడమే కాదు.. వాటిని కాపాడుకోవడం, సమర్థవంతంగా నిర్వహించుకోవడం కూడా అందరి బాధ్యత. ఇదే వాతావరణం తర్వాత వచ్చే పిల్లలకు కూడా నిరంతరం అందేలా ఈ చర్యలు చేపట్టింది. తల్లిదండ్రుల భాగస్వామ్యంతో రెండు కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. టాయిలెట్ మెయింటినెన్స్ ఫండ్‌కు వేయి రూపాయల చొప్పున జమచేస్తున్నారు. అమ్మ ఒడి నుంచి అందించిన డబ్బు ద్వారా రూ.430 కోట్ల టాయిలెట్ మెయింటినెన్స్ నిధి సమకూరింది. తల్లిదండ్రుల కమిటీలు ద్వారా దీన్ని ఖర్చు చేస్తున్నారు. ప్రతి 300 విద్యార్థులకు ఒక ఆయా ఉండేలా చూస్తున్నారు. వీరికి నెలకు రూ.6 వేల రూపాయలు అందిస్తున్నారు. టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచడం దీని ముఖ్య ఉద్దేశం. తద్వారా ఆడపిల్లలు బడిమానేయాల్సిన పరిస్థితులకు లేకుండా చూస్తున్నారు. దీంతోపాటు స్కూళ్లను సమర్థవంతంగా నిర్వహించడానికి, ఎప్పుడు ఏ మరమ్మత్తుగా వచ్చినా వెంటనే బాగుచేసేందుకు వీలుగా స్కూలు మెయింటినెన్స్ నిధిని కూడా తల్లిదండ్రుల భాగస్వామ్యంతో నిధిని పెడుతున్నారు. అమ్మ ఒడి నుంచి వేయిరూపాయలను దీనికి జమచేస్తున్నారు. దీనిపై పర్యవేక్షణ బాధ్యత తల్లిదండ్రుల కమిటీలదే. విద్యాకానుక, ఇంగ్లిషు మీడియం, సీబీఎస్ఈ, బైజూస్: పిల్లలకు విద్యాకానుక ద్వారా ప్రతిఏటా వైఎస్.జగన్ సర్కార్ మరికొన్ని సౌకర్యాలను కల్పిస్తోంది. 3 జతల యూనిఫారంతోపాటు షూ, సాక్సులు, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్, ఇంగ్లిషు నిఘంటువు అందిస్తోంది. విద్యాకానుక కోసం 2020-21లో రూ.648.11 కోట్లు ఖర్చుచేస్తే, 2021-22లో రూ.789.21 కోట్లు ఖర్చుచేసింది. మొత్తంగా రెండేళ్లలో రూ.1,437.32 కోట్లు ఖర్చుచేసింది. ఈఏడాది కూడా భారీ ఖర్చుకు సిద్ధమైంది. మొత్తంగా మూడేళ్లలో రూ.2,324 కోట్లు ఖర్చుచేసింది. పిల్లలను బడికి రప్పించడం, వారు చక్కగా చదువుకునేలా మంచి సౌకర్యాలను, వాతావరణాన్ని కల్పించడం ఒక వైపు చేస్తుంటే... మరోవైపు నాణ్యమైన విద్యను అందించడంపైన కూడా ఈ వైయస్.జగన్ నేతృత్వంలోని ఈ ప్రభుత్వం గట్టిచర్యలు తీసుకుంది. ప్రపంచస్థాయిలో ఎదురయ్యే పోటీని ఎదుర్కొనేందుకు వీలుగా మన పిల్లలను తయారుచేసేందుకు ఇంగ్లిషు మీడియంలోనే బోధన ప్రారంభించారు. పిల్లలు అర్థంచేసుకునేందుకు వీలుగా పాఠ్యపుస్తకాలను ద్విభాషల్లో ముద్రించారు. స్కూళ్లన్నింటినీ కూడా సీబీఎస్ఈకు అనుసంధానం చేస్తున్నారు. ఇప్పుడు 8వ తరగతి చదువుతున్న పిల్లలు 2025 నాటికి సీబీఎస్ఈలో పరీక్షలు రాస్తారు. వీరిని మరింత సుశిక్షితులుగా తయారుచేయడానికి వీలుగా బైజూస్‌తో ఒప్పందం కదుర్చుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి వరకూ బైజూస్ కంటెంట్ ఉచితంగా అందుబాటులోకి వస్తోంది. సెప్టెంబరులో 4.7లక్షల మంది 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు కూడా అందుబాటులోకి వస్తాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రతి తరగతి గదిలోకూడా టీవీలు వస్తాయి. దీంతో బోధన మరింత సులభంగా ఉంటుంది. పిల్లలకూ సంగ్రహణ శక్తి పెరుగుతుంది. ఇక్కడితో జగన్ జైత్రయాత్ర ఆగిపోలేదు. జగనన్న విద్యాదీవెన (ప్రతి త్రైమాసికానికీ పూర్తి ఫీజు రియింబర్స మెంట్‌చెల్లింపు కింద రూ.7678.12 కోట్లు), జగనన్న వసతి దీవెన (వసతి, భోజన ఖర్చుల కింద పిల్లలకు రూ. 3,329.05 కోట్లు), జగనన్న గోరుముద్ద (మెరుగైన, నాణ్యమైన, రుచికరమైన మధ్యాహ్న భోజనం కింద రూ.3,087 కోట్లు), పాఠశాలల్లో నాడు–నేడు (ఇప్పటికే రూ.3,669 కోట్లు ఖర్చు చేయగా మరో రూ.8వేల కోట్లు ఖర్చుచేస్తున్నారు), వైయస్సార్ సంపూర్ణ పోషణ(రూ.4,895కోట్లు) ఈ కార్యక్రమంలో అన్నింటికింద రూ.52,600.65 కోట్లు ఖర్చుచేశారు. -పూడి శ్రీహరి, ఏపీ సీఎం సీపీఆర్వో


