వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అక్రమ అరెస్ట్‌ | Pudi Srihari was harassed by the Chandrababu government | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అక్రమ అరెస్ట్‌

Apr 30 2026 3:00 PM | Updated on Apr 30 2026 3:54 PM

Pudi Srihari was harassed by the Chandrababu government

సాక్షి,అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం (గురువారం) కుప్పం కోర్టు వైఎస్సార్‌సీపీ మీడియా విభాగ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి బెయిల్ మంజూరు చేసింది. అయితే, బెయిల్ వచ్చిన కొద్ది గంటల వ్యవధిలోనే కొత్తపేట పోలీసులు ఆయనను మళ్లీ అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయనను కుప్పం నుంచి గుంటూరు జిల్లా కొత్తపేటకు తరలిస్తున్నారు. ఉదయం కుప్పం కోర్టు బెయిల్ ఇచ్చిన వెంటనే నోటీసులు ఇచ్చి అక్రమంగా అరెస్టు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో పూడి శ్రీహరిని నిన్న బెంగళూరు కుప్పం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను కుప్పం కోర్టులో హాజరు పరిచారు. విచారణ అనంతరం కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. కానీ, బెయిల్ వచ్చిన కొన్ని గంటలలోనే గుంటూరు పోలీసులు నోటీసులు ఇచ్చి మళ్లీ అరెస్టు చేశారు.  

బెయిల్పై వచ్చిన వెంటనే స్టేషన్ బయటే మళ్లీ అరెస్ట్

 

Advertisement
 
Advertisement
Advertisement