పూడి శ్రీహరికి ఊరట | Kuppam Court Bail to Pudi Srihari | Sakshi
Sakshi News home page

పూడి శ్రీహరికి ఊరట

Apr 30 2026 11:40 AM | Updated on Apr 30 2026 2:55 PM

Kuppam Court Bail to Pudi Srihari

సాక్షి, చిత్తూరు: వైఎస్సార్‌సీపీ మీడియా విభాగపు ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి ఊరట లభించింది. కుప్పం కోర్టు గురువారం ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. సోషల్‌ మీడియాలో సీఎం చం‍ద్రబాబుపై అనుచిత పోస్టులు పెట్టించారంటూ ఆయన్ని కుప్పం పోలీసులు నిన్న వేకువజామున బెంగళూరులో ఆయన్ని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. 

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి గతంలో సీపీఆర్‌వోగా పూడి శ్రీహరి పని చేశారు. ప్రస్తుతం ఆయన వైఎ‍స్సార్‌సీపీలో మీడియా వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయితే సోషల్‌ మీడియాలో సీఎం చంద్రబాబుపై అభ్యంతరకర పోస్టులకు ఈయనే కారణమంటూ అక్రమ కేసులు బనాయించారు. 

ఈ క్రమంలో కేసులు కోర్టుల్లో విచారణ జరుగుతుండగానే.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బుధవారం వేకువజామున పోలీసులు అరెస్ట్‌ చేశారు. అక్కడి నుంచి విచారణ పేరుతో కుప్పం పోలీస్‌ స్టేషన్‌కు తరలించి వేధించడం ప్రారంభించారు. ఈ పరిణామాలపై వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి(లీగల్‌ సెల్‌), మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘ఉదయం 5.45 గంటలకు కుప్పం పోలీసులు పూడి శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. కానీ, రాత్రి 11.45 గంటలకు అరెస్ట్ అయినట్లు కోర్టుకు చూపించారు. చట్టంపై మాకు నమ్మకం ఉంది. మేము న్యాయపరంగా పోరాటం చేస్తాం’ అని పొన్నవోలు వ్యాఖ్యానించారు. ఆ వెంటనే న్యాయస్థానం శ్రీహరికి బెయిల్‌ మంజూరు చేయడం గమనార్హం.

పూడి పూడి శ్రీహరికి బిగ్ రిలీఫ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement