పూడి శ్రీహరిపై ఆగని వేధింపులు | YSRCP Leader Pudi Srihari Arrested Again In Chittoor Sparks Controversy, More Details Inside | Sakshi
Sakshi News home page

పూడి శ్రీహరిపై ఆగని వేధింపులు

Apr 30 2026 5:39 AM | Updated on Apr 30 2026 11:25 AM

YSRCP Leader Pudi Srihari Arrested Again in Chittoor

చిత్తూరు జిల్లా: వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని కూటమి ప్రభుత్వం వేధించడం ఆపడం లేదు. మళ్లీ ఆయన్ని అక్రమంగా అరెస్ట్‌ చేయించింది. అయితే ఉన్నత న్యాయస్థానాల మార్గదర్శకాలను పట్టించుకోకుండా.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఏపీ పోలీసులు ఈ చర్యకు ఉపక్రమించినట్లు స్పష్టమవుతోంది. 

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి గతంలో సీపీఆర్‌వోగా పూడి శ్రీహరి పని చేశారు. ప్రస్తుతం ఆయన వైఎ‍స్సార్‌సీపీలో మీడియా వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయితే సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ ఆయనపై అక్రమ కేసులు బనాయించారు. ఈ క్రమంలో హైకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతుండగానే.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బుధవారం వేకువజామున బెంగళూరులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి విచారణ పేరుతో కుప్పం పోలీస్‌ స్టేషన్‌కు తరలించి వేధించినట్లు తెలుస్తోంది. 

వైద్య పరీక్షల నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించి.. తిరిగి కుప్పం పీఎస్‌కు తీసుకొచ్చారు. ఆ తర్వాత కుప్పం కోర్టుకు తీసుకెళ్లారు. ఆ సమయంలో వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి(లీగల్‌ సెల్‌), మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టు వద్దకు చేరుకున్నారు. ‘బెంగళూరులో నిన్న ఉదయం 5.45 గంటలకు కుప్పం పోలీసులు పూడి శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. కానీ, రాత్రి 11.45 గంటలకు అరెస్ట్ చూపించారు. చట్టంపై మాకు నమ్మకం ఉంది. మేము న్యాయపరంగా పోరాటం చేస్తాం’ అని పొన్నవోలు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement