ఇంకా పోలీసుల నిర్బంధంలోనే పూడి శ్రీహరి | Pudi Srihari Remains in Police Custody After 30 Hours | Sakshi
Sakshi News home page

ఇంకా పోలీసుల నిర్బంధంలోనే పూడి శ్రీహరి

Apr 16 2026 3:11 PM | Updated on Apr 16 2026 4:06 PM

Pudi Srihari Remains in Police Custody After 30 Hours

తిరుపతి:  వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పూడి శ్రీహరి అరెస్టుకు సంబంధించి కుప్పం పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. పూడి శ్రీహరిపై అక్రమ కేసు బనాయించి అరెస్టు చేయడమే కాకుండా, ఇంకా కోర్టులో హాజరు పరచకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పూడి శ్రీహరిని అరెస్టు చేసి 30 గంటలకు పైగా దాటినా ఇంకా పోలీసుల నిర్బంధంలోనే ఉంచారు. 

ఈరోజు(గురువారం, ఏప్రిల్‌ 16వ తేదీ) ఉదయమే పూడి శ్రీహరికి వైద్య పరీక్షలు చేసినా కోర్టులో మాత్రం హాజరుపరచలేదు పోలీసులు. పూడి శ్రీహరిపై అక్రమ కేసు బనాయించిన పోలీసులు,.. ఇంకా తప్పుడు కేసులు బనాయించడానికి కుట్ర చేస్తున్నట్లు తాజా పరిణమాలను బట్టి తెలుస్తోంది. 

 పూడి శ్రీహరిని ఇంకా కోర్టులో హాజరుపరచకపోవడంపై వైఎస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  అరెస్టు చేసిన తర్వాత 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాల్సి ఉన్నప్పటికీ ఇంకా ఆ పని చేయలేదు పోలీసులు. 

YSRCP శ్రీహరి అరెస్ట్, కుప్పం పోలీసుల తీరుపై అనుమానాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement