పూడి శ్రీహరికి హైకోర్టులో ఊరట | Relief for Pudi Srihari in Andhra Pradesh High Court | Sakshi
Sakshi News home page

పూడి శ్రీహరికి హైకోర్టులో ఊరట

May 1 2026 4:16 PM | Updated on May 1 2026 4:50 PM

Relief for Pudi Srihari in Andhra Pradesh High Court

సాక్షి,అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు, గుంటూరు కోర్టులలో ఊరట లభించింది. సోషల్‌ మీడియా పోస్టుల కేసులో అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 41ఏ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని సూచించింది. నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసు విచారణలో హైకోర్టు తాజా ఆదేశాలిచ్చింది.  గుంటూరు కోర్టులోనూ పూడి శ్రీహరికి ఊరట దక్కింది. కొత్తపేట పీఎస్‌లో నమోదైన కేసులో పూడి శ్రీహరికి బెయిల్‌ ఇచ్చింది. నోటీసులు ఇచ్చి విచారించాలని స్పష్టం చేసింది. 

తనపై గుంటూరు జిల్లా నల్లపాడు, కొత్తపేట పోలీస్‌ స్టేషన్లలో నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ శ్రీహరి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలు తేలేందత వరకు ఆ కేసుల్లో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ఆయన గురువారం పిటిషన్లు దాఖలు చేశారు. ఒకే అంశానికి సంబంధించి బహుళ ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయడానికి వీల్లేదని తెలిసినా పోలీసులు కావాలనే కేసులు పెట్టారు. ఎవరో సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే అందుకు నన్ను బాధ్యుడిని చేయడం తగదు’అని శ్రీహరి తన వ్యాజ్యాల్లో పేర్కొన్నారు.

పూడి శ్రీహరి పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు, గుంటూరు కోర్టులు తీర్పును వెలువరించాయి. నమోదైన కేసుల్లో పూడి శ్రీహరిని అరెస్ట్‌ చేయొద్దని 41ఏ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని ఆదేశించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement