కుప్పం పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్సార్‌సీపీ ఆందోళన | YSRCP Leader Chevireddy Mohit Reddy Fires On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

కుప్పం పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్సార్‌సీపీ ఆందోళన

Apr 15 2026 11:45 PM | Updated on Apr 16 2026 12:01 AM

YSRCP Leader Chevireddy Mohit Reddy Fires On Chandrababu Govt

సాక్షి, చిత్తూరు జిల్లా: చంద్రగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కుప్పం పోలీస్ స్టేషన్‌కి చేరుకున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అక్రమ అరెస్టు నేపథ్యంలో, ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి ప్రయత్నించారు.  

అయితే కుప్పం డీఎస్పీ పార్ధసారధి అనుమతి ఇవ్వకపోవడంతో మోహిత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. పూడి శ్రీహరి గారు ఎలా ఉన్నారో చూడాలని అడిగితే అనుమతి ఇవ్వడం లేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి మాకు ఆందోళన కలిగిస్తోంది. పబ్లిక్ సర్వెంట్ ఇలా మాట్లాడటం బాధాకరం.  

తిరుచానూరు ఘటనపై కోర్టు ఇప్పటికే పోలీసు అధికారులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. చంద్రబాబు మానవ హక్కుల గురించి మాట్లాడుతారు. కానీ కుప్పం మీ ఇలాకాలో జరుగుతున్నది ఏంటి? వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులు ఆపాలి. లేని పక్షంలో కుప్పం నుంచే ఆందోళన చేస్తామని మోహిత్ రెడ్డి హెచ్చరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement