పూడి శ్రీహరికి బెయిల్ మంజూరు | Bail Granted to YSRCP Leader Pudi Srihari | Sakshi
Sakshi News home page

పూడి శ్రీహరికి బెయిల్ మంజూరు

Apr 16 2026 6:36 PM | Updated on Apr 16 2026 7:04 PM

Bail Granted to YSRCP Leader Pudi Srihari

కుప్పం:  అక్రమ కేసును బనాయించి అరెస్టు చేసిన వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి బెయిల్‌ మంజూరైంది. శ్రీహరికి కుప్పం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది, 33 గంటల పాటు అక్రమంగా నిర్బంధించిన తర్వాత కోర్టులో హాజరుపరిచిన పూడి శ్రీహరికి బెయిల్‌ మంజూరు చేసింది కుప్పం కోర్టు. నిన్న(బుధవారం, ఏప్రిల్‌ 15వ తేదీ)   పూడి శ్రీహరిని ఉదయం 8 గంటలకు అరెస్టు చేయగా, ఈరోజు(గురువారం, ఏప్రిల్‌ 16వ తేదీ) ఉదయమే వైద్య పరీక్షలు చేశారు. 

అయితే  అరెస్టు చేసిన తర్వాత 33 గంటల పాటు శ్రీహరిని కోర్టు హాజరుపరచలేదు పోలీసులు. దీనిపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో శ్రీహరిని ఎట్టకేలకు కోర్టులో హాజరుపరిచారు.  ఈ క్రమంలోనే కోర్టులో హాజరుపరిచిన వెంటనే బెయిల్‌ మంజూరు అయ్యింది.

Breaking News: పూడి శ్రీహరికి బెయిల్ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement