సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్‌కు బిగ్ షాక్ తగిలింది. సమగ్ర శిక్ష, కేజీబీవీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నేడు చలో సీఎం క్యాంపు కార్యాలయానికి పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా భారీ సంఖ్యలో ఉద్యోగులు తరలి వచ్చారు. దీంతో, క్యాంపు ఆఫీసు వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
కాగా, సమగ్ర శిక్ష, కేజీబీవీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు.. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సమ్మె సందర్బంగా రాసుకున్న మినిట్స్ అమలు చర్యలని కూడా నినాదాలు చేస్తున్నారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28000 మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉండగా.. 10 డిమాండ్లతో క్యాంపు ఆఫీసు ముట్టడికి కదిలారు. ఈ సందర్భంగా వీఎంసీ నుంచి చంద్రబాబు ఇంటి వరకు ర్యాలీకి పిలుపునిచ్చారు. అయితే, వీరి ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు.. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో, వీఎంసీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.



