సర్ ఆర్థర్ కాటన్‌కు వైఎస్‌ జగన్‌ నివాళి | YSRCP Chief YS Jagan Pays Tribute To Sir Arthur Cotton, Check Out His Post Inside | Sakshi
Sakshi News home page

సర్ ఆర్థర్ కాటన్‌కు వైఎస్‌ జగన్‌ నివాళి

May 15 2026 10:09 AM | Updated on May 15 2026 11:17 AM

YS Jagan Pays Tribute To Sir Ardar Cotton

సాక్షి, తాడేపల్లి: నేడు సర్ ఆర్థర్ కాటన్ జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. సర్ ఆర్థర్ కాటన్‌కు నివాళి అర్పించారు. ఈ క్రమంలో వ్యవసాయ, నీటిపారుదల రంగానికి ఆయన చేసిన కృషిని ఎప్పటికీ మరువలేమని కొనియాడారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..‘గోదావరి జిల్లాలు నేడు పచ్చని పంట పొలాలతో అలరారుతున్నాయంటే అందుకు కారణం సర్ ఆర్థర్ కాటన్. సముద్రంలో కలిసిపోతున్న వరద నీటికి అడ్డుకట్ట వేసి రాజమహేంద్రవరం సమీపంలో ధవళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి.. లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించిన మహనీయుడు. వ్యవసాయ, నీటిపారుదల రంగానికి ఆయన చేసిన కృషిని ఎప్పటికీ మరువలేం అని’ పోస్టు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement