‘చంద్రబాబు రూల్స్ పెడతారు.. కానీ ఫాలో అవ్వరు’ | Gudivada Amarnath Fires On Chandrababu And Lokesh Over Usage Of Vehicles Amid Petrol And Diesel Issue, More Details Inside | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు రూల్స్ పెడతారు.. కానీ ఫాలో అవ్వరు’

May 15 2026 4:54 PM | Updated on May 15 2026 6:29 PM

Gudivada Amarnath Fires On Chandrababu And Lokesh

సాక్షి, విశాఖపట్నం: ‘‘చంద్రబాబు ఖర్చులు తగ్గించుకొని డబ్బు ఆదా చేస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు. చంద్రబాబు మాటలు నిజమేనని ప్రజలు నమ్మారు. చంద్రబాబు ప్రకటన చేసి 24 గంటలు గడవక ముందే చంద్రబాబు, లోకేష్ వేర్వేరు ప్రత్యేక విమానాల్లో పుట్టపర్తి వెళ్ళారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరగడానికి రెండేళ్లలో రూ.120 కోట్లు ఖర్చు చేశారు. లోకేష్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారు. చంద్రబాబు రూల్స్ పెడతారు.. కానీ ఫాలో అవరు’’ అంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ దుయ్యబట్టారు.

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తారు. ‘‘చంద్రబాబు ప్రతి ఒక్కరూ ముగ్గురు నలుగురు పిల్లలను కనాలని చెప్పారు. ఆ సూత్రం లోకేష్‌కు ఎందుకు వర్తింపు చేయలేదు. పబ్లిసిటీ మీద ప్రభుత్వాన్ని చంద్రబాబు నడుపుతున్నారు. చంద్రబాబు రూల్స్ పెట్టి.. అమలు చేయకుండా ప్రజలను మభ్య పెడుతున్నారు. ఢిల్లీలో చంద్రబాబు ఇంటి మరమ్మత్తుల కోసం రూ.6.50 కోట్లు కేటాయించారు. రెండేళ్లలో 3 లక్షల 70 వేల కోట్లు అప్పు ఈ రెండేళ్లలో చంద్రబాబు సాధించారు.

టీడీపీ వైఎస్సార్‌సీపీ బోథ్ ఆర్ నాట్ సేమ్ లోకేష్. వైఎస్సార్‌సీపీ వైఎస్ ఆశయాల నుంచి పుట్టింది. టీడీపీ వైస్రాయ్ హోటల్ నుంచి పుట్టింది. టీడీపీది బీరు బారు పార్టీ.. వైఎస్సార్‌సీపీది విద్యా వైద్య విధానం పార్టీ. వైఎస్‌ జగన్‌ను చూస్తే నరనరాన భయం చంద్రబాబు లోకేష్‌లో కనిపిస్తుంది. చంద్రబాబు ఉత్తరాంధ్ర మొత్తానికి గుండు కొట్టిస్తున్నారు. ఎక్కడ ఏ కొండ కనిపించిన గుండు కొడుతున్నారు. కూటమి భూ అక్రమాలు మీద వైఎస్సార్ సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. అవసమైతే వైఎస్ జగన్ ఈ పోరాటంలో పాల్గొంటారు. గతంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర పెంచితే ఆ భారం ప్రజలు మీద పడకుండా వైఎస్సార్ నిర్ణయం తీసుకున్నారు’’ అని గుడివాడ అమర్నాథ్‌ గుర్తు చేశారు.

చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి.. కుప్పలు..కుప్పలుగా పెరిగిపోతున్న అప్పు

Advertisement
 
Advertisement
Advertisement