కాన్వాయ్‌ తగ్గించుకుంది.. ప్రత్యేక విమానాల్లో తిరగడానికా బాబూ..? | Chandrababu Saving Rules, Nara Lokesh Touring In Special Flights During Puttaparthi Visit, More Details Inside | Sakshi
Sakshi News home page

కాన్వాయ్‌ తగ్గించుకుంది.. ప్రత్యేక విమానాల్లో తిరగడానికా బాబూ..?

May 16 2026 7:32 AM | Updated on May 16 2026 10:37 AM

Chandrababu Saving Rules Nara Lokesh Touring In Special Flights

కాన్వాయ్‌ తగ్గించుకుంది.. నెటిజన్లు సెటైర్లు 

సాక్షి, అమరావతి: ‘ప్రజా ప్రతినిధులు కాన్వాయ్‌లను కుదించుకోవాలి. ఎక్కువ వాహనాల శ్రేణితో ప్రయాణించవద్దు.  విదేశీ పర్యటనలను తగ్గించుకోవాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు సాధ్యమైనంత వరకూ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ను వాడితే బాగుంటుంది. అవసరమైతే సైకిళ్లు వాడండి, పాదయాత్రగా వెళ్లండి..’ సీఎం చంద్రబాబు చెప్పిన పొదుపు సూత్రాలు ఇవి. కానీ ఇవి కేవలం ఇతరులకు చెప్పడం కోసమేగానీ, తనకు, తన కుమారుడు లోకేశ్‌కు మాత్రం వర్తించవని మరుక్షణమే నిరూపించేశారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి పర్యటనలో వీరి దుబారా మామూలుగా లేదు.

 విడివిడిగా ప్రత్యేక విమానాల్లో వెళ్లడమే కాకుండా, కేంద్ర మంత్రి వద్ద తమ మెహర్భానీని చూపించుకోవడం కోసం సభకు భారీగా జన సమీకరణ చేయాలని పథక రచన చేశారు. ఇందుకు ఆర్టీసీ బస్సులు ఉపయోగించుకున్నారు. వీటి ఇంధనానికి ఎంత  వృథా ఖర్చన్నది ఏమాత్రం పట్టించుకోలేదు. ఇదేం పొదుపు సూత్రం బాబూ..అంటూ సామాజిక మాధ్యమాల్లో తండ్రీ కొడుకులపై  ప్రజలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘కాన్వాయ్‌లో వాహనాలను తగ్గించుకుంటున్నామని చెబితే ఏదో అనుకున్నాం. 

తీరా చూస్తే ప్రత్యేక విమానాల్లో తిరుగడం కోసమని తర్వాత అర్థం అయ్యింది’ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తూ పోస్టులు పెడుతున్నారు. ‘చంద్రబాబు బంగ్లా సోకులకు రూ.6.5 కోట్లు మంజూరు చేయడం కూడా పొదుపులో భాగమేనా’ అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు పొదుపు మంత్రం పెద్ద డ్రామా అని తేలిపోయింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement