బాబూ.. ఏపీని ఏం చేయదలచుకున్నావ్‌..?: పేర్ని నాని | Perni Nani Fires On Chandrababu Government | Sakshi
Sakshi News home page

బాబూ.. ఏపీని ఏం చేయదలచుకున్నావ్‌..?: పేర్ని నాని

May 17 2026 1:01 PM | Updated on May 17 2026 1:40 PM

Perni Nani Fires On Chandrababu Government

సాక్షి, కృష్ణా జిల్లా: ఏపీని ఉద్దరిస్తామంటూ చంద్రబాబు మోసపూరిత మాటలు చెప్పారు.. ఇప్పుడు ప్రజలపై భారీ అప్పుల భారం మోపారంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేవలం 24 నెలల్లోనే ప్రజల నెత్తిన చంద్రబాబు అప్పుల బండ పెట్టారు. 3 లక్షల 50 వేల కోట్ల అప్పులు చేశారు. రాబోయే మూడేళ్లలో ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు ఏం చేయదలచుకున్నారు’’ అంటూ నిలదీశారు.

‘‘అప్పుల్లో, నేరాల్లో నిరుద్యోగంలో దేశంలో ఏపీనే ముందు ఉంది. ఇప్పుడు ఆర్టీసీని అమ్మకానికి పెట్టారు. ఆర్టీసీని అమ్మేయడానికి మహిళలపై నెపం పెడుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు పెట్టడం వల్ల ఆర్టీసీ ఇబ్బందుల్లోకి వచ్చిందంటున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రజల ఆస్తులకు ప్రమాదం పొంచి ఉంది. 2004లో వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యుండకపోతే అప్పుడే చంద్రబాబు ఆర్టీసీని అమ్మేసేవారు. 2014 నుంచి 2019 వరకూ జయము జయము చంద్రన్న అని ఆర్టీసీని వాడుకున్నారు. ఆర్టీసీ టిడిపి సొత్తులాగా.. ఖర్జూర నాయుడు సంపాదించిన సొత్తులాగా అప్పనంగా వాడేశారు

..నయా పైసా ఆర్టీసీకి చంద్రబాబు జమ చేయలేదు. 2018లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరితే చంద్రబాబు కుదరదన్నారు. 2019లో జగన్ సీఎం అయిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. 54 వేల మందిని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించారు. చంద్రబాబు దిగిపోయే నాటికి ఆర్టీసీ ఆపరేషనల్ అప్పులు 6300 కోట్లు, ఎక్యుమలేటెడ్ అప్పు 3350 కోట్లు. 2020 జనవరిలో ఆర్టీసీని జగన్ ప్రభుత్వంలో విలీనం చేసింది. ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ ఏడాదికి   రూ.3600 కోట్లు జీతాలుగా చెల్లించారు

..వైఎస్‌ జగన్ దిగిపోయేనాటికి ఆర్టీసీ అప్పుల భారం 2,500  కోట్లకు తగ్గింది. వైఎస్‌ జగన్‌ చొరవతో 9 వేల కోట్ల నుంచి 2500 కోట్లకు అప్పులు తగ్గాయి. ఆర్టీసీ అప్పులు తగ్గించిన ఘనత వైఎస్‌ జగన్‌ది. ఎలక్ట్రికల్ బస్సులు కొనడం ఆర్టీసీ వల్ల కాదని ఇప్పుడు కథలు చెబుతున్నారు. ప్రజారవాణాలో ఎలక్ట్రికల్ బస్సులు కొంటే కేంద్రం 40 లక్షలు సబ్సిడీ ఇస్తుంది. 2014-19 లో చంద్రబాబు ఒక్క ఎలక్ట్రికల్ బస్సైనా కొన్నాడా?. 2019-24 లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 100 ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేసింది. తిరుపతిలో ఆ బస్సులను అందుబాటులోకి తెచ్చింది.

..తిరుపతిలో ఎలక్ట్రికల్ బస్సులు నడిపేది ఆర్టీసీ డ్రైవర్లే. ఆర్టీసీ డ్రైవర్లకు వైఎస్‌ జగన్‌ ట్రైనింగ్ ఇప్పించారు. వైఎస్‌ జగన్‌ అప్పులు తీర్చి.. ఉద్యోగులకు జీతాలు చెల్లించినప్పుడు మీరెందుకు చేయలేరు?. ఆర్టీసీని మీరు సర్వనాశనం చేశారు కాబట్టి బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదు. మీరు ఆర్టీసీని దోచుకుతినడానికి రాష్ట్ర ప్రజలకు వేసిన ఎర మహిళలకు ఉచిత బస్సు స్కీమ్. మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వడం వల్లే ఆర్టీసీ కుదేలైపోయిందని చంద్రబాబు చెప్పించాడు. స్త్రీ శక్తి హామీ ఎవరిది?. ఆర్టీసీకి ఎందుకు ఇంత కష్టం వచ్చింది. ఉచిత మహిళ పథకం ఇస్తున్నప్పుడు ఆర్టీసీకి ప్రభుత్వం ఎందుకు డబ్బులు కట్టడం లేదు?  

..ఆర్టీసీలో ఉన్న 10 వేల బస్సులను ప్రైవేట్ పరం చేసేస్తామంటున్నారు. మీ మనుషులు , మీ బ్రోకర్లకు ఆర్టీసీని కట్టబెట్టడమేనా మీ సంపద సృష్టి. ఆర్టీసీని సర్వనాశనం చేసి.. మహిళలపై నెపం వేస్తున్నారు. రాష్ట్రంలోని మహిళలకు పంగనామాలు పెట్టారు. వైఎస్‌ జగన్‌ మహిళలకు రూ.24 వేల కోట్లు ఇచ్చారు. సచివాలయ ఉద్యోగాల్లో సగం మహిళలకు ఇచ్చారు. ఎలక్ట్రికల్ బస్సు కిలోమీటర్‌కు 7 రూపాయలే భారం అని చెప్పడం పచ్చిమోసం. ఎలక్ట్రికల్ బస్సుల కాంట్రాక్ట్ పినాకిల్ అనే కంపెనీకి ఇచ్చారు. పినాకిల్ సంస్థ ఎలక్ట్రికల్ బస్సులు నడిపితే కిలోమీటర్‌కు 71 రూపాయలు బిల్ వేస్తారట. 71 రూపాయల బిల్లులో 21 మోదీ ఇస్తే మిగిలిన 50 రూపాయలు మీ బాబు ఇస్తాడా?

..కరెంట్ బస్సుకు కిలోమీటర్ కు 7 రూపాయలని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పిస్తున్నాడు. పీఎంఈబస్ స్కీమ్ కింద రాబోయే రోజుల్లో బస్సులు వస్తే పేదలు, సామాన్యులు బస్సులు ఎక్కగలరా?. ఆర్టీసీలో ఉన్న 10 వేల బస్సులు పీఎంఈబస్ స్కీమ్ కింద ఎలక్ట్రికల్ బస్సులు మార్చేస్తామనడం కరెక్ట్ కాదు. పీఎంఈబస్ స్కీమ్ ప్రకారం 3 లక్షల పైబడి 40 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో మాత్రమే కరెంట్ బస్సులు తిప్పాలి. రాబోయే 750 కరెంట్ బస్సులన్నీ రాజధానిలోని 29 గ్రామాల్లో తిప్పుతారా?

..కోటి 70 లక్షల చొప్పున వైఎస్‌ జగన్‌ 100 బస్సులు కొన్నాడు కదా. ఒక్క ప్రైవేట్ వ్యక్తిని కూడా రాకుండా ఆర్టీసీ డ్రైవర్లతోనే నడిపిస్తున్నారు కదా.. ఈరోజుకీ ఆహా ఓహో అంటూ ఆ బస్సులపై వస్తున్న డబ్బులను మీరు తీసుకుంటున్నారు కదా. ఆడపిల్ల కనిపిస్తే చాలు సీటీపాట పాడినట్లు ఓట్లు అడుక్కున్నారు. మహిళలను మీ ప్రభుత్వం వచ్చాక ఏం ఉద్ధరించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి.. ఆర్టీసీని అమ్మకానికి పెట్టారు, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే ప్రజలు ఏమైపోవాలి? రాష్ట్రంలోని సంపద అంతా చంద్రబాబు, లోకేష్, పవన్, ఎమ్మెల్యేలకే.. ఇప్పటికే ఆర్టీసీలో రిక్రూట్ మెంట్ నిలిపేశారు. ఆర్టీసీ జోలికొస్తే చూస్తూ ఊరుకోం’’ అని చంద్రబాబును పేర్ని నాని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement