ఇంధన ధరల పెంపు.. నేడు వైఎస్సార్‌సీపీ నిరసనలు | YSRCP Protest Against Petrol Hike in AP Live Updates | Sakshi
Sakshi News home page

ఇంధన ధరల పెంపు.. నేడు వైఎస్సార్‌సీపీ నిరసనలు

May 18 2026 7:20 AM | Updated on May 18 2026 9:15 AM

YSRCP Protest Against Petrol Hike in AP Live Updates

సాక్షి, తాడేపల్లి: ఇంధన ధరల పెంపును నిరసిస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శాంతియుత ఆందోళనలు చేపట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ పిలుపు నిచ్చింది. ఈ సందర్బంగా వైఎస్సార్‌సీపీ నేతలు.. అన్ని జిల్లాల కలెక్టరు, ఆర్డీఓ, తహశీల్దార్లకు డిమాండ్‌ పత్రాలు అందజేయనున్నారు.

రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ నిరసన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఏపీలోనే పెట్రోలు, డీజిల్‌కు దేశంలోనే అత్యధిక ధరలు ఉండటం గమనార్హం. ఇంధన ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలు.. పేద, మధ్య తరగతి ప్రజలకు బతుకు భారం కానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement