రేపు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలు | YSRCP to Hold Statewide Protests Tomorrow Over Petrol and Diesel Price Hike | Sakshi
Sakshi News home page

రేపు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

May 17 2026 3:55 PM | Updated on May 17 2026 5:06 PM

YSRCP to Hold Statewide Protests Tomorrow Over Petrol and Diesel Price Hike

సాక్షి,తాడేపల్లి: పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై రేపు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నిరసనలు చేపట్టనున్నట్లు పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే డీజిల్, పెట్రోలు ధరలు అధికంగా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సజ్జల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..‘అధికారంలోకి వస్తే పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తామని ఎన్నికలకు ముందు కూటమి నేతలు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గించకపోగా భారీగా పెంచడం దుర్మార్గం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే ధరలు అధికంగా ఉన్నాయి. ఈ పెంపుతో సాధారణ ప్రజలపై భారీ భారం మోపారు’అని అన్నారు.

పెట్రోలు, డీజిల్ ధరల ప్రభావం రైతాంగం, రవాణా రంగం, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రంగా పడిందని ఆయన పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి ప్రజల జీవితం మరింత భారంగా మారిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రేపు అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు చేపట్టి, అనంతరం అధికారులకు వినతిపత్రాలు సమర్పించాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement