మంత్రుల సింగపూర్‌ పర్యటనకు రూ.95.19 లక్షలు | Rs 95. 19 Lakhs Sanctioned for Ministers Visit to Singapore | Sakshi
Sakshi News home page

మంత్రుల సింగపూర్‌ పర్యటనకు రూ.95.19 లక్షలు

May 12 2026 5:41 AM | Updated on May 12 2026 5:41 AM

Rs 95. 19 Lakhs Sanctioned for Ministers Visit to Singapore

అదనపు బడ్జెట్‌ విడుదల చేస్తూ ప్రణాళికా శాఖ ఉత్తర్వులు 

సాక్షి, అమరావతి: సింగపూర్‌ పాలన నమూనా, రాజకీయ జవాబుదారీతనం, దేశాధ్యక్ష నాయకత్వంపై శిక్షణ కోసం ఏడుగురు రాష్ట్ర మంత్రులు గతనెల 21 నుంచి 27 వరకు వారం రోజుల పాటు సింగపూర్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. 

మంత్రుల సింగపూర్‌ పర్యటన కోసం రూ.95.19 లక్షల అదనపు బడ్జెట్‌ను విడుదల చేస్తూ ప్రణాళికా శాఖ ముఖ్య­కార్యదర్శి పీయూష్‌ కుమార్‌ సోమవా­రం ఉత్తర్వులు జారీ చేశారు. ట్రెజరీ నియంత్రణను సడలించి నిధులు మంజూరు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement