కూటమి ప్రభుత్వం దుబారా ఖర్చులు.. ప్రజలకు మాత్రం పొదుపు పాఠాలు | AP Cabinet Meeting Today | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వం దుబారా ఖర్చులు.. ప్రజలకు మాత్రం పొదుపు పాఠాలు

May 14 2026 3:49 PM | Updated on May 14 2026 4:44 PM

AP Cabinet Meeting Today

సాక్షి,అమరావతి: ఏపీ కేబినెట్‌లో చంద్రబాబు కొత్త ప్రచారం ప్రారంభించారు. విచిత్రమేమిటంటే, పర్యటనల పేరుతో, ఢిల్లీలో తన ఇంటి కోసం చేస్తున్న దుబారా ఖర్చులను మరిచిపోయిన చంద్రబాబు సర్కార్‌ ప్రజలకు పొదుపు పాఠాలు చెబుతోంది. కానీ సీఎం, మంత్రుల ప్రత్యేక విమానాల ఖర్చులపై చంద్రబాబు స్పష్టత ఇవ్వలేదు. ‘నాదేశం -నా బాధ్యత’ అంటూ కొత్త ప్రచారం మొదలు పెట్టారు చంద్రబాబు. జిల్లా పర్యటనల్లో ఖర్చు తగ్గింపు చర్యలు చేపడుతున్నామని చెబుతున్న చంద్రబాబు సర్కార్‌, వారానికి ఒకరోజు ‘నో వెహికల్‌ డే’ అని ప్రకటించింది.

విచిత్రం ఏంటంటే కేబినెట్ నిర్ణయాన్ని మంత్రి నారా లోకేష్ పట్టించుకోలేదు. దుబారా తగ్గించాలంటూ కేబినెట్‌ మీటింగ్‌లో చంద్రబాబు నీతులు చెప్పారు. ఆ తర్వాత మంత్రి పార్ధసారధి సైతం ఇకపై ప్రత్యేక విమానల్లో ప్రయాణాలుండవని తెలిపారు. అలా మంత్రి పార్ధసాధి చెప్పారో లేదో కొద్ది సేపటికే  నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్‌లో చక్కెర్లు కొట్టారు. సత్యసాయి జిల్లా పర్యటనకు వీటీ- సీవీబీ స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement